మనమరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు-267

• మనమరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు-267
• 267-నాటక నట గాయక దర్శకుడు ,సినీ నారద ,మార్కండేయ ,మైరావణ ఫేం –త్రిపురారి భట్ల రామకృష్ణ శాస్త్రి
• త్రిపురారిభట్ల రామకృష్ణశాస్త్రి (ఏప్రిల్ 10, 1914 – మే 21, 1998) రంగస్థల, సినిమా నటుడు, గాయకుడు. రామకృష్ణశాస్త్రి 1920, 1930వ దశకాల్లో చెందిన గాయకుడు. ఈయన తెనాలి శ్రీరామ విలాస సభలో దర్శకుడిగా పనిచేశాడు.[1]
జననం
రామకృష్ణ శాస్త్రి 1914, ఏప్రిల్ 10వ తేదిన రాఘవయ్య, కామేశ్వరమ్మ దంపతులకు గుంటూరు జిల్లా తెనాలి తాలూకాలోని పెదరావూరు గ్రామంలో జన్మించాడు.
నాటకరంగం
వంశ పారంపర్యముగా వచ్చిన ‘తరంగ గానం’ను చిన్నవయసులోనే నేర్చుకన్నాడు. 9వ ఏట తెనాలి రామవిలాస సభలో బాలనటుడిగా చేరి అనేక నాటకాల్లో నటించాడు.[2] ఈయన కొన్ని గ్రామోఫోను రికార్డుల్లో కూడా పాడాడు. 1926లో గుంటూరులో బాలమిత్ర సభను ప్రారంభించి, బాలనటులతో ఒక బృందాన్ని తయారుచేసిన దంటు వెంకటకృష్ణయ్య ఆహ్వానం మేరకు రామకృష్ణ శాస్త్రి ఆ సమాజంలోకి చేరి ‘రోషనార’లో శివాజీ, ‘కృష్ణలీలలు’ లో యశోద, ‘రామదాసు’ లో రామదాసు పాత్రలు పోషించాడు. పువ్వుల సూరిబాబు, కళ్యాణి, నాగలింగం వంటి నటులు కూడా ఆ సంస్థలో ఉన్నారు.
నాటక సమాజాలు మూతపడిపోయినకాలంలో స్థానం నరసింహారావు, సి.యస్.ఆర్. ఆంజనేయులు లతో కలసి ఊరురా తిరిగి ‘తులాభారం’ నాటకంలో నారదుడుగా నటించి మెప్పించాడు. సినిమారంగంలో ఉంటూనే కలియుగ ఆంజనేయ బిరుదాంకితుడైన బేతా వెంకటరావు ‘రామాంజనేయ యుద్ధం నాటకంలో నారదుని పాత్రలో అనేక ప్రదర్శనలిచ్చాడు. ఇతర నాటక సమాజాలు ప్రదర్శించిన నాటకాలలో బిల్వమంగలుడు, శివయోగి, రామదాసు, కబీరు, నారదుడు పాత్రలలో నటించాడు.[3]
సినిమారంగ౦ ]
నారదుడిగా రామకృష్ణ శాస్త్రి నటనను చూసిన దర్శకుడు చిత్రపు నరసింహారావు 1937లో తాన దర్శకత్వం వహించిన ‘మోహిని రుక్మాంగద’ సినిమాలో నారద పాత్రకు శాస్త్రిని ఎంపిక చేశాడు. అలా దాదాపు 12 సినిమాలలో నటించాడు.[4]
నటించిన చిత్రాలు
• 1937: మోహిని రుక్మాంగద – నారదుడు
• 1938: భక్త మార్కండేయ
• 1940: మైరావణ
• 1941: దక్షయజ్ఞం
• 1942: ప్రహ్లాద
• 1942: సుమతి
• 1943: గరుడ గర్వభంగం
• మనమరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు-268
• 268-షూటింగ్ లో ఫస్ట్,షిప్ యార్డ్ ఉద్యోగి ,సినీసహాయనటుడు –వంకాయల సత్యనారాయణ మూర్తి
• వంకాయల సత్యనారాయణ ఒక తెలుగు నటుడు.[1] సహాయ నటుడిగా దాదాపు 180 తెలుగు సినిమాలలో నటించాడు.[2]
జీవిత విశేషాలు
ఈయన 1940 డిసెంబరు 28న విశాఖపట్నంలో జన్మించాడు. బి. కాం లో బంగారు పతకం సాధించాడు. 1960 లో షూటింగ్‌ పోటీలో భారతదేశంలోనే మొదటి స్థానం పొందాడు. చదువు, క్రీడల్లో ప్రతిభ ఆధారంగా ఆయనకు హిందుస్థాన్ షిప్ యార్డులో ఉద్యోగం వచ్చింది. 1970 లో నాటకరంగంలోకి ప్రవేశించాడు. 1976 లో నీడ లేని ఆడది సినిమాతో సినీరంగ ప్రవేశం చేశాడు. దాదాపు 180కి పైగా సినిమాల్లో ఎక్కువగా సహాయ నటుడి పాత్రలు పోషించాడు. సీతాకోక చిలుక, సూత్రధారులు, సీతామాలక్ష్మి, దొంగకోళ్ళు, ఊరికిచ్చిన మాట, విజేత, స్టేషన్ మాస్టర్, మావి చిగురు లాంటి సినిమాల్లో ఆయన చెప్పుకోదగ్గ పాత్రలు పోషించాడు. పలు టెలివిజన్ ధారావాహికల్లో కూడా కనిపించాడు. ఆయన చివరి సినిమా కారం దోసె.
ఆయన భార్య శకుంతల. వీరికి ఇద్దరు కుమార్తెలు.
సినిమాల జాబితా
ఈయన నటించిన తెలుగు సినిమాల పాక్షిక జాబితా:
1. అయినవాళ్ళు (1976)
2. అర్ధాంగి (1977)
3. సీతామాలక్ష్మి (1978)
4. కమలమ్మ కమతం (1979)
5. కుక్క కాటుకు చెప్పు దెబ్బ (1979)
6. మా ఊళ్ళో మహాశివుడు (1979)
7. రతీమన్మథ (1979)
8. ఊరికిచ్చిన మాట (1981)
9. శుభలేఖ (1982)
10. శివుడు శివుడు శివుడు (1983)
11. నవమోహిని (1984)
12. మంత్ర దండం (1985)
13. విజేత (1985)
14. ఊరేగింపు (1988)
15. జానకిరాముడు (1988)
16. మహారాజశ్రీ మాయగాడు (1988)
17. సూత్రధారులు (1990)
18. అత్తింట్లో అద్దెమొగుడు (1991)
19. ఆశయం (1993)
20. రుక్మిణి (1997)
21. కారందోశ (2016)[3]
ఇతర విశేషాలు
• 1958లో కొచ్చిన్‌లో ఎన్‌సిసి క్యాడెట్లకు జరిగిన పోటీలలో ఆలిండియా ఉత్తమ జూనియర్‌ క్యాడెట్‌గా నిలిచారు.
• 1958లో కొచ్చిన్‌లో ఎన్‌సిసి క్యాడెట్లకు జరిగిన పోటీలలో ఆలిండియా ఛాలెంజ్‌ బోట్‌ రోయర్‌ బహుమతిని గెలుచుకున్నారు.
• 1960లో ఢిల్లీ రిపబ్లిక్‌ డే కవాతులో పాల్గొన్నారు.
• 1960 ఆగస్టులో షూటింగ్‌ కాంపిటీషన్‌లో భారతదేశంలోనే మొదటి స్థానం పొందారు.
• బి.కాంలో బంగారు పతకం అందుకున్నారు.
• జిల్లాస్థాయి కందుకూరి పురస్కారం – ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, 30 ఏప్రిల్ 2017.[4]
మరణం
కొంతకాలంగా శ్వాస సంబంధిత వ్యాధితో బాధ పడుతున్న వంకాయల సత్యనారాయణమూర్తి 2018 మార్చి 12 న మరణించారు.[5][6]
• సీతామహాలక్ష్మి ,శ్రుతిలయలు సినిమాలలో చిరస్మరణీయ నటన ప్రదర్శించాడు .
• మనమరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు-269
• 269-భాషా పరిశోధకుడు ,వ్యావహారిక భాషోద్యమనాయకుడు ,ఆంద్ర విజ్ఞాన సర్వస్వం లో విలువైన వ్యాసరచయిత ,సాహిత్య అకాడెమి అవార్డీ,గిడుగు వారి పుత్రుడు ,రైతుబిడ్డ స్వర్గసీమ సినీ ఫేం –గిడుగు సీతాపతి
• గిడుగు వెంకట సీతాపతి (జనవరి 28, 1885 – ఏప్రిల్ 19, 1969) ప్రసిద్ధ భాషా పరిశోధకుడు. విజ్ఞాన సర్వస్వ నిర్మాత. పలు గేయాలను పిల్లలకోసం రాసిన సాహిత్యవేత్త. ఇతని బాలసాహిత్యంలో ప్రాచుర్యం పొందినది చిలకమ్మపెళ్ళి.
జననం
వీరు జనవరి 28, 1885 సంవత్సరంలో విశాఖపట్నం జిల్లా భీమునిపట్నంలో తెలుగు వ్యావహారిక భాషోద్యమ సారథి అయిన గిడుగు వెంకట రామమూర్తి దంపతులకు జన్మించారు.
మద్రాసు క్రైస్తవ కళాశాలలో చరిత్రలో పట్టభద్రులై కొంతకాలం పర్లాకిమిడిలో చరిత్రోపన్యాసకులుగా పనిచేశారు. వ్యావహారిక భాషోద్యమంలోను, సవర భాషోద్ధరణలోను తండ్రికి కుడిభుజంగా నిలిచి విశేషానుభవం గడించారు. రైతుబిడ్డ, స్వర్గసీమ, పల్నాటి యుద్ధం, భక్తిమాల వంటి కొన్ని చలనచిత్రాలలోను, కొన్ని నాటకాలలోను నటించారు.
1945లో మాగంటి బాపినీడు సంపాదకత్వంలో వెలువడిన ఆంధ్ర సర్వస్వముకు అనేక వ్యాసాలు రచించి విశేషంగా తోడ్పడ్డారు. 1949లో తెలుగు భాషా సమితి ఏర్పడినపుడు తెలుగు విజ్ఞాన సర్వస్వపు ప్రధాన సంగ్రాహకులుగా నియమితులయ్యారు. చరిత్ర-రాజనీతి సంపుటం సంపాదక వర్గంలో ప్రముఖపాత్ర వహించారు. సూర్యరాయాంధ్ర నిఘంటువుకు చివరిదశలో వీరు గౌరవ సంపాదకులుగా పనిచేశారు. కేంద్ర సాహిత్య అకాడమీ సంకలితం చేసిన భారతీయ గ్రంథసూచిలో తెలుగు విభాగానికి వీరు సంపాదకత్వం వహించారు.
వీరు రచించిన తెలుగు కావ్యాలలో ముఖ్యమైనవి: ‘భారతీ శతకము’, ‘సరస్వతీ విలాసము’, ‘కొద్ది మొర్ర’. వీరు రాసిన ‘బాలానందము’ వంటి బాల సాహిత్య రచనలు విశేష ప్రజాదరణ పొందాయి. వీరు బైబిల్ లోని మూడు సువార్తలను సవర భాషలోకి అనువదించారు. కేంద్ర సాహిత్య అకాడమీ వారి అభ్యర్ధనపై తెలుగు సాహిత్య చరిత్రను ఇంగ్లీషులోకి అనువదించారు. వీరు రచించిన ‘తెలుగులో ఛందోరీతులు’ అనే గ్రంథానికి ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ పురస్కారం లభించింది.
వీరి కుటుంబం ఆంధ్రాభిమానానికి ప్రసిద్ధికెక్కింది. పర్లాకిమిడి తాలూకాను ఒడిషా రాష్ట్రంలో చేర్చడానికి జరిగిన ప్రయత్నాన్ని వీరు, వీరి తండ్రి రామమూర్తి తీవ్రంగా ప్రతిఘటించారు. తెలుగువారి పక్షాన వాదించడానికి 1933లో వీరు లండన్ వెళ్ళి, శామ్యూల్ హోర్ మొదలైన వారి ఎదుట యుక్తిగా వాదించారు. అయినా 1936లో పర్లాకిమిడి తాలూకా ఒడిషా రాష్ట్రంలో భాగంగా ఏర్పడింది.
తండ్రి అనంతరం రాజమండ్రి చేరిన సీతాపతి రాజకీయాలలో పాల్గొని జిల్లా బోర్డు, మునిసిపల్ కౌన్సిల్, సెనేట్ మొదలగు సంస్థలలో సభ్యులుగాను, అధ్యక్షులుగాను పనిచేశారు.
వీరికి ఆంధ్రవిశ్వకళాపరిషత్ కళాప్రపూర్ణ ఇచ్చి గౌరవించింది. వీరి ఇంగ్లీషు రచనలలోని విశిష్టతను గుర్తించి వాషింగ్టన్ లోని అంతర్జాతీయ అకాడమీ వీరికి డి.లిట్. గౌరవం ఇచ్చింది.
మరణం
వీరు ఏప్రిల్ 19, 1969లో హైదరాబాదులో పరమపదించారు.
నటించిన సినిమాలు
• పల్నాటి యుద్ధం(1947) ……కొమ్మరాజు
• భక్తిమాల(1941) …..రామానుజాచారి
• రైతుబిడ్డ(1939) ….జమీందార్
• పంతులమ్మ(1943) …..గూడవల్లి రామభ్రహ్మం
• మాలపిల్ల(1938) ……..గూడవల్లి రామభ్రహ్మం
• మనమరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు-270
• 270-ఏకపాత్రాభినయ ,నాటక ఫేం ,నంది రఘుపతి వెంకయ్య అవార్డ్ గ్రహీత ,’’మా’’ప్రధాన కార్యదర్శి ,బట్టలసత్యం గా హాస్య సినీ గుర్తింపు .మాండలికం లో దిట్ట –మల్లికార్జున రావు
• మల్లికార్జునరావు (అక్టోబర్ 10, 1960 – జూన్ 24, 2008) తెలుగు సినీ, రంగ స్థల హాస్య నటులు.[1] ఆయన పూర్తి పేరు పీలా కాశీ మల్లికార్జునరావు. పాఠశాల దశనుంచే నాటకాల్లో నటించే వారు. 50 నుంచి 60 నాటకాలూ, ఏకపాత్రాభినయం పాత్రలూ ఆయనకు నటన మీద మంచి పట్టు లభించేదానికి దోహదపడ్డాయి.
తొలి జీవితం
భమిడిపాటి రాధాకృష్ణ రాసిన లెక్కలు తెచ్చిన చిక్కులు ఆయన తొలి నాటకం. ఆయన్ని రంగస్థలంపై నటుడిగా నిలబెట్టింది పలుకే బంగారమాయె. ఇందులో నిర్మాత వేషం మల్లికార్జునరావుకి ఎంతో గుర్తింపు నిచ్చింది. అనకాపల్లిలోనే ఎ.ఎమ్‌.వి.ఎమ్‌. ఆసుపత్రిలో కొన్నాళ్లు ఉద్యోగం చేశారు. అక్కడి ట్రేడ్‌ యూనియన్‌కి నాయకత్వం వహించారు. ఆయనకు భార్య, ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు.
సినీ ప్రస్థానం
దివంగత నటులు రావు గోపాలరావు సహకారంతో చిత్రసీమలోకి ప్రవేశించారు. 1972లో తులసి అనే చిత్రంలో చిన్నవేషం వేశారు. ఆ సమయంలోనే పార్వతీ పరమేశ్వరులు చిత్రానికి సహాయ దర్శకుడిగా పనిచేశారు. తరువాత నాగమల్లి లాంటి కొన్ని చిత్రాల్లో నటించారు. వంశీతో ఏర్పడ్డ పరిచయం ఆయన సినీజీవితాన్ని మలుపు తిప్పింది.
వంశీ మొదటిచిత్రం మంచు పల్లకీలో చిన్న పాత్ర పోషించారు. అన్వేషణలో పులిరాజుగా మల్లికార్జునరావు నటన చిత్రసీమను ఆకట్టుకొంది. అదే సమయంలో తన తండ్రి అస్వస్థతకు లోనైతే అనకాపల్లి వెళ్లడం వల్ల అవకాశాలు కోల్పోయారు. ‘లేడీస్‌ టైలర్‌’లో బట్టల సత్యం పాత్ర తరువాత వెనక్కి తిరిగి చూసుకోలేదు. 350కి పైగా సినిమాల్లో నటించారు. తమ్ముడు సినిమాకు ఉత్తమ సహాయ నటుడిగా రాష్ట్ర ప్రభుత్వ నంది అవార్డును పొందారు. ఏప్రిల్‌ ఒకటి విడుదల, కనకమాలక్ష్మి రికార్డింగ్‌ డ్యాన్స్‌ట్రూపు, హలో బ్రదర్, ఆలీబాబా అరడజను దొంగలు, ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు, బద్రి, ఔను వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు, ఎవడి గోల వాడిది, మా ఆయన సుందరయ్య (2001) లాంటి చిత్రాలు ఆయనకెంతో పేరు తీసుకొచ్చాయి. మల్లికార్జునరావు నటనలో తనకంటూ ఓ పంథాను ఏర్పరచుకొన్నారు. తొలినాళ్లలో రావుగోపాలరావు ప్రభావం ఉండేది. తన సంభాషణ శైలిలో ఉత్తరాంధ్ర యాసని మేళవించడంతో జనాన్ని సులభంగా ఆకట్టుకోగలిగారు. ఆ యాసనీ, మాండలికాన్నీ సాధికారికంగా మాట్లాడగలిగిన నటుడిగా గుర్తింపు పొందారు. అలాగే గ్రామీణ నేపథ్యం ఉన్న పాత్రలకు జీవంపోసే నటుల్లో ఆయన ముందుండే వారు. చివరిగా ఆయన నటించిన చిత్రం మహా నగరంలో.
నటించిన చిత్రాలు
• దాసన్నా (2010)
• అతడెవరు (2007)
• 143[2][3]
• ప్రేమించుకున్నాం పెళ్ళికి రండి (2004)
• 6 టీన్స్ (2001)
• ప్రేమసందడి (2001)
• సాంబయ్య (1999)
• పవిత్ర ప్రేమ (1998)
• ఆలీబాబా అరడజను దొంగలు (1994)
పురస్కారాలు
• తమ్ముడు సినిమాకు ఉత్తమ సహాయ నటుడిగా ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ నంది అవార్డు.[4]
• రఘుపతి వెంకయ్య బంగారు పతకం (ప్రముఖ నటుడు గుమ్మడి స్థాపించారు)
పదవులు
• తెలుగుదేశం పార్టీతో సాంస్కృతిక విభాగానికి రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా[1] ఆయనకు సన్నిహిత సంబంధాలున్నాయి.
• మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌కు ప్రధాన కార్యదర్శిగా మూడు సార్లు ఎంపికయ్యారు.
తుదిశ్వాస
57 సంవత్సరాల వయస్సులో మంగళవారం 24 జూన్, 2008 ఉదయం 10.30 ని.లకు రక్త కేన్సర్‌ (లుకేమియా) వ్యాధితో తుదిశ్వాస విడిచారు.[1]
మల్లికార్జునరావు కనిపిస్తే చాలు హాస్యం పొంగుతుంది .ఏపాత్రలోనైనా ఒదిగి జీవంపోశాడు .మామంచినటుడు మల్లికార్జునరావు .
  సశేషం
మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -1-5-22-ఉయ్యూరు

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in సినిమా and tagged . Bookmark the permalink.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.