• మనమరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు-275
• 275-కర్నాటక ,హిందూ స్థానీ విద్వాంసుడు ,ఉర్దూ ఘజల్స్ ఫేం ,శ్రుతిలయలు సినిమాలో శ్రీ గణనాదం గీత ఫేం –పూర్ణ చంద్ర రావు
• మేఘసందేశం ‘ చిత్రం టైటిల్స్ ‘’‘’సమయంలో’’శ్రీ గణనాదం వస్తుంది. గాయకుడు పూర్ణచందర్ . ఈయన కర్నాటక సంగీతంతో బాటు హిందుస్తానీ సంగీతం కూడా గానం చేస్తారు. ఉర్దూ ఘజల్స్ పాడడంలో ప్రావీణ్యం సంపాదించారు. అనేక కచేరీలు చేసారు. గాత్రమే కాక ఆయన వయోలిన్ వాద్య కళాకారుడు కూడా ! మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారికి చాలా కచేరీలలో వయోలిన్ సహకారం అందించారు.
పూర్ణచందర్ కి బంధువు, ఒకప్పటి నటుడు ముదిగొండ లింగమూర్తి గారి ప్రోత్సాహంతో మద్రాసులో అడుగుపెట్టి, తెలుగులో చలం నిర్మించిన సన్నాయి అప్పన్న చిత్రానికి మూలమైన కన్నడ చిత్రం షనాది అప్పన్న తో చలనచిత్ర సీమలో అడుగు పెట్టారు.
జంధ్యాల దర్శకత్వంలో వచ్చిన ఆనందభైరవి చిత్రానికి ఆయన పాడిన తిల్లానా చిత్రంలో లేకపోయినా రికార్డులుగా, కాసెట్లలోను విడుదలై ఆరోజుల్లో ప్రజాదరణ పొందింది.
విశ్వనాథ్ గారి శుభలేఖ చిత్రంలో అక్కడక్కడ వినిపించే ఆలాపన కూడా పూర్ణచందర్ గానం చేసినదే ! చాలామంది ఆ గానం బాలు గారిదని భ్రమ పడ్డారు. దానికి బాలు గారు అప్పట్లో పత్రికా ముఖంగా వివరణ ఇచ్చారు కూడా !
విశ్వనాథ్ గారి శృతిలయలు చిత్రంలో కూడా కొన్ని పాటలు పాడారు
•
• బడేగులాం అలీ ఖాన్
పాకిస్తాన్ ఏర్పడ్డాక ఉస్తాద్‌గారికి అక్కడ ఉండడం నచ్చలేదు. స్వభావంలో తాను హిందువునే నని ఆయన ప్రకటించుకున్నాడు. పహాడీలో “హరిఓం తత్సత్”, భూపాలీ (మోహన)లో ” మహాదేవ మహేశ్వర” వగైరా గీతాల్ని అద్భుతంగా రచించి పాడాడాయన. ఆయన అభిమానులంతా భారతదేశంలో ఉండడం వల్ల మన రేడియోలోనూ, కచేరీల్లోనూ పాడటానికి ఇబ్బందులు పడి తరుచుగా రావలసివచ్చేది. విదేశీయుడని ఏవో అర్థంలేని నిబంధనల కారణంగా ఆయన రేడియో కచేరీలు రికార్డు చెయ్యరాదనే ఆంక్ష ఉండటం వల్ల అమూల్యమైన ఆయన ఆలిండియా రేడియోలో పాడిన సంగీతంలో కొంతభాగం పత్తాలేకుండా పోయింది. ఆయనకు బొంబాయిలో ఇల్లు ఏర్పాటు చేసినది అప్పటి ముఖ్యమంత్రి మొరార్జీ దేశాయి. ఆ తరవాత ఆయన ఇండియాలో స్థిరపడి కలకత్తాలోనూ, చివరి రోజుల్లో (1968) హైదరాబాద్‌లోనూ ఉన్నారు. హైదరాబాద్‌లో ఆయన నవాబ్ జహీర్‌యావర్ జంగ్కు అతిథిగా బషీర్‌బాగ్ పాలెస్లో ఉన్నప్పుడు వయొలిన్ కళాకారుడు పూర్ణచందర్ ఆయన వద్ద ఠుమ్రీ వగైరాలు నేర్చుకున్నాడు. నండూరి పార్థసారథి తదితరులు వెళ్ళి కలుసుకున్నారు కూడా. అభిమానులని ఆప్యాయంగా పలకరించి, కోరగానే పాట వినిపించడం ఆయన పెద్ద మనసుకూ,నిరాడంబరతకూ నిదర్శనం.
•
• అన్నమయ్య
బ్రహ్మ కడిగిన పాదము అన్నమయ్య కీర్తన పూర్ణచందర్, శ్రీరామ్, కె.ఎస్.చిత్ర, అనురాధ
• —
సశేషం
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -5-5-22-ఉయ్యూరు