కాలిఫోర్నియా ఆర్కిటెక్ట్ ,విద్యావేత్త ,విద్యాసిద్ధాంత కర్త ,కరిక్యులం రిఫార్మర్ –హిడ్లా తాబా – గబ్బిట దుర్గా ప్రసాద్-విహంగ  మహిళా వెబ్ మాస పత్రిక -మే

7-12-1902న అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రం సాన్ ఫ్రాన్సిస్కో లోనిష్టోనియాలో ఉన్న చిన్న గ్రామం  కూరాట్సేలో పుట్టిన హిడ్లా తాబా ఆర్కిటెక్ట్ ,కర్రిక్యులం ధీరిస్ట్ అయిన విద్యావేత్త .తల్లి లిస్లా లేహ్ట్ .తండ్రి రాబర్ట్ తాబా స్కూల్ మాష్టర్ .కనెపి పారిష్ స్కూల్  లో చేరి హిడ్లా చదువు ప్రారంభించింది .తర్వాత వోరుస్ గర్ల్స్ గ్రామర్ స్కూల్ లో చేరి చదివి ,, తాటువా యూని వర్సిటి నుంచి ఇంగ్లీష్ ,ఫిలాసఫీ లలో అండర్ గ్రాడ్యుయేట్ డిగ్రీ పొందింది.పెన్సిల్వేనియా రాష్ట్రం బ్రియాన్ మివార్ కాలేజి లో చేరటానికి అర్హత పొంది,మాస్టర్ డిగ్రీ సాధించింది ,తర్వాత కొలంబియా యూనివర్సిటి లోని టీచర్స్ కాలేజి లో ఉద్యోగం కోసం అప్లికేషన్ పెడితే ,మహిళ కనుక తార్తు యూని వర్సిటి తిరస్కరించింది .దీనితో న్యూయార్క్ సిటి లోని డాల్టన్ స్కూల్ లో కర్రిక్యులం డైరెక్టర్ గా  చేరింది .1951లో ఇప్పుడు శాన్ఫ్రాన్సిస్కో స్టేట్ యూని వర్సిటిగా పిలువబడుతున్న సాన్ ఫ్రాన్సిస్కో స్టేట్ కాలేజి లో ప్రొఫెసర్ గా చేరమని ఆహ్వానిస్తే చేరింది .

 రచయిత

జాన్ డ్యుయి కి శిష్యురాలైన తాబా ఆయనవద్ద రిసెర్చ్ చేసి ,మొదటి పరిశోధనా పత్రం తోపాటు ఏడు పుస్తకాలు రాసి ప్రచురించింది .1932లో ఆమె సమర్పించిన ‘’డైనమిక్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ –ఎ మెధడాలజి ఆఫ్ ప్రోగ్రెసివ్ ఎడ్యుకేషనల్ ధాట్’’పరిశోధనా పత్రం తర్వాత ఆమె దృష్టి అంతావిద్యావిధాన  డెమోక్రసీ పై అవగాహన కలిగించటానికి  కేంద్రీకరించింది .ప్రజాస్వామ్య బంధాలద్వారా పిల్లలు ఒకరితో ఒకరు ఎలా కలిసి ఉండవచ్చో ఆలోచించి చెప్పింది .విద్య నేర్వటం అనేది ఎంత క్రియా శీలకంగా అంటే డైనమిక్ గా ఉండాలో,పరస్పర సంబంధంగా ,పరస్పర ఆధారకంగా ఉండాలో  తన పరిశోధనలో చర్చించింది .విద్యా ప్రణాళిక తయారు చేయటం లో విద్యావేత్తల బాధ్యతా ,ప్రాముఖ్యత వివరించింది .జాన్ డ్యుయి,బెంజమిన్ బ్లూమ్ ,రాబర్ట్ హవిగార్ట్ లలో కలిసి పనిచేయటం వలన అనుభవం పొంది ,’’కర్రిక్యులం డెవలప్ మెంట్ –ధీరీ అండ్ ప్రాక్టిస్ ‘’పుస్తకాన్ని 1962లో రాసింది . అందులో ప్రజలు ఆలోచించాల్సిన అవసరం ఉందనీ ,సమాజంలో మార్పులు అతివేగంగా వస్తాయనీ ,కనుక మూక పాత విధానాలు వదిలేయాల్సిరావచ్చని ,నిర్ణయాలు కూడా తగినట్లు చేయాలనీ చెప్పింది .కనుక వ్యక్తీ తెలివితేటలూ ,స్వయం నిర్ణయాధికారం కలిగి ఉండాలని కోరింది .

 విద్యావేత్తలుకూడా  విద్యార్ధులలో రావాల్సిన మార్పుల్ని గురించి బోధించాలనీ .విద్యా బోధన సమర్ధవంతంగా జరగాలంటే మూడు స్థాయిలలో విజ్ఞానం సముపార్జించాలి .అవే నిజాలు ,మూల భావనలు ,సూత్రాలు ,కీలకభావనలు అనే కాన్సెప్ట్స్ .గబగబా ఎన్నో విషయాలు విద్యార్ధుల మెదడులో కుక్కేప్రయత్నంవికటిస్తుంది .దీనివలన కొత్త సమాచారానికి అప్పటికే వారిలో ఉన్నదానికి లంగరు కుదరక గందరగోళం పొందుతారు .వాళ్ళు నేర్వగల దానిమీదనే ఏదైనా అందించాలి .అన్నిటిని గ్రహించి విద్యార్ధులు చివరలో సరైన భావాలను అనుసరిస్తారు అంటుంది .

 టీచర్ మీడియేటర్ గా ఉండాలే కాని లెక్చరర్ గా కాదు అని ఆమె ఖచ్చితమైన అభిప్రాయం .అరవై అయిదవ  ఏట ఆమె చనిపోయినా ,ఆమె నిర్దేశించిన సూత్రాలు ఆమె అనుచరులు చక్కగా పాటిస్తున్నారు .కాన్సెప్ట్స్ అభి వృద్ధి చేసుకోవటం ,సమాచారాన్ని విశ్లేషించటం ,కార్యరూపం లో అనువర్తనం చేయటం అంటే అప్లై చేయటం ,భావాలు ,వైఖరులు ,విలువలను అన్వయించటం లో బాగా పాటిస్తున్నారు .విద్యార్ధుల్ని ఆలోచనకు ఉన్ముఖీకరించటం తాబా చెప్పిన ముఖ్య సూత్రం .టీచర్ తనకువచ్చింది కక్కేసి వెళ్ళటం కాదు మధ్యవర్తిగా ప్రవర్తించాలి .విద్యార్ధులను ‘’మీరు ఇప్పుడు బాగా ఆలోచిస్తున్నారు ‘’,’’మీ విధానం కరెక్ట్ ‘’,’’అలాగే ముందుకు వెళ్ళండి ‘’అని వెన్నుతట్టి టీచర్ ప్రోత్సహించాలి. The teacher’s role in the discussion is to encourage the students to expand on their classmates’ ideas or to ask students to clarify their own ideas..

  హిడ్లా తాబా బోధనలు ,ఆమె రాసిన పుస్తకాలు అమెరికా విద్యా విధానానికి ఎంతగానో తోడ్పడింది .1970లో రెండు వందలమంది విద్యావేత్తలు తాబా విధానం పై శిక్షణలో పాల్గొని హిడ్లా తాబా విద్యా విధాన భావాలు చాలా నిర్దుష్టంగా ఉన్నాయనీ గొప్ప ఆదర్శంగా ఉన్నాయనే అనుమానం లేకుండా అనుసరణీయమని ముక్త కంఠం తో ప్రకటించారు . Some of the teachers even reported that Taba’s approach to teaching was “the most valuable teaching technique they had ever acquired.”

ఇంతటి విద్యావేత్త ,విద్యా ప్రణాలికా రచయిత హిడ్లా తాబా 6-7-1967 న 65వ ఏట మరణించింది .

కర్రిక్యులం రిఫార్మర్ గా ,టీచర్ ఎడ్యుకేటర్ గా సిద్ధాంత పరమైన,బోధనాపరమైన కీలక భావనలు అంటే కాన్సెప్ట్స్ ,క్లిష్టమైన ఆలోచనలో అభి వృద్ధి సాధించటానికి విశిష్టమైన  పునాది ని విద్యా వ్యవస్థలో బోధనలో తీసుకువచ్చింది హిడ్లా తాబా .విభిన్నస్వభావాలున్న విద్యార్దిలోకం లో ఆమె ఆలోచనలు విప్లవాత్మకమార్పులు తెచ్చి విద్యా వ్యవస్థ బోధనా వ్యవస్థ కొత్త లోకాలనే చూపింది .Taba’s contribution to the study was evaluation of social sensitivity, which was related to the general goal of preparing students for effective democratic participation. She tackled a challenging area of social studies curriculum, the measurement of attitudes about race, class, and ethnicity and at the same time provided authentic alternatives to paper and pencil assessment.

 -గబ్బిట దుర్గా ప్రసాద్

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in రచనలు and tagged . Bookmark the permalink.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.