మనమరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు-277

  • మనమరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు-277
  • 277-అందాల తార ,మనోహర ,చంద్రలేఖఫెం ,ఆనాటి డ్రీం గాళ్-టి.ఆర్.రాజకుమారి

ద‌క్షిణాది చిత్రపరిశ్రమలో ‘డ్రిమ్ గర్ల్’ అనిపించుకున్న అందిలతార రాజకుమారి.మనహర నాటకం ఆనాడు విరివిగా తెలుగునేలపై ప్రదర్శింపబడుతుండేది. అందులో వసంతసేనగా గరికపాటి వరలక్ష్శి నటించేది.
ఈ నాటకాన్ని ఎల్.వి.ప్రసాద్ గారి దర్శకత్వంలో వచ్చిన ‘మనోహర’ (1954) శివాజిగణేషన్, కన్నాంబా, దాసరి సదాశివరివు తదితరులు నటించిన ఈ చిత్రంలో అద్బుతంగా వసంతసేన పాత్రకు జీవం పోసారు రాజకుమారి.

1922 లో జన్మించిన ఈమె పూర్తి పేరు తంజావూరు రంగనాయకి రాజకుమారి. ఈమె పిన్ని ఎస్.పి.ఎల్.ధనలక్ష్మి (తమిళనటి) రాజకుమారిని  సినిమారంగానికి పరిచయంచేసింది. ఈమె మొదటి సినిమా ‘కుమార కుళోత్తుంగన్’ (1941)  ‘కచదేవయాని’ చిత్రంతో తారాపథానికి వెళ్ళింది. ‘మంత్రవాది’  ‘సూర్యపుత్రి’ ‘మనోన్మణి’  ‘హరిదాస్’  ‘కృష్ణభక్తి’ చిత్రాలలో నటించి నాటి కుర్రకార్లకు కలలరాణిగా వెలిగింది ఈమె.

1948 జమిని వారు నిర్మించిన భారీచిత్రం ‘చంద్రలేఖ’ చిత్రంలో ఈమె కథానాయకి. ఈ చిత్రం  తమిళ- తెలుగు నేలపై ర‌జ‌తోత్సవం జరుపుకుంది.

ఈమె అక్కగారు. నటీమణినే. ఆ అక్క కూతురు ప్రముఖ సినీ నర్తకి కుచలకుమారి. ఈమె సోదరుడు చక్రపాణి తమిళ నిర్మాత. మరోసోదరుడు సినిదర్శకుడు టి.ఆర్.రామన్న వీరిభార్యలు ప్రముఖ సినీ నటీమణులు ఇ.వి.సరోజ-బి.ఎస్.సరోజలు. రాజకుమారి చెల్లెలికూతుర్లే జ్యోతిలక్ష్మి-జయమాలినీలు.

మద్రాసు పాండీబజార్ లొ  ‘రాజకుమారి టాకీస్’ అని ఓసినిమా హలు నిర్మించింది.నేడు అక్కడ పెద్ద షాపింగ్ కాంప్లెక్స్ కట్టారు. నేటికి ఆబస్ స్టాప్ పేరు రాజకుమారి ధియోటర్ గానే పిలుస్తారు. మద్రాసు మౌట్ రోడ్డులో వీరికి పెట్రోలు బంక్ కూడ ఉండేది.


అసమాన నటనా ప్రతిభ అందము కలిగిన రాజకుమారికి చివరిరోజుల్లో భయంకరమైన చర్మ వ్యాధి సోకి తనరూపం కోల్పోయింది. తన యింటికి వచ్చిన వారితో తెరచాటున ఉండి మాట్లాడేవారు. ఈమె రూపంలో రాజసం, దర్పం, హొయలు, కవ్వించేకళ్ళు, పదే పదే చూడాలి అనిపించే స్పురద్రూపం కలిగిన ఈ అందాలరాశి తక్కువ చిత్రాలలో న‌టించి ఎక్కువ పేరు పొంది 1999/సెప్టెంబర్ /20 వ తేదిన శాశ్విత నిద్రలో ఒరిగి పోయారు.

‍‍‍-డాక్టర్. బెల్లంకొండ నాగేశ్వరరావు

  • మనమరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు-278
  • 278-రక్తకన్నీరు నాటక సినిమాఫెం ,అంతర్జాతీయ పురస్కారగ్రహీత ,నటి రాధిక తండ్రి ,ఎమ్జీఆర్ పై కాల్పులు జరిపిన కరుడుకట్టిన అగ్రశ్రేణి విలన్  –ఎం ఆర్
  •  రాదా

మద్రాసు రాజగోపాల రాధాకృష్ణన్ ప్రముఖ తమిళ సినిమా, రంగస్థల నటుడు. ప్రముఖ దక్షిణ భారతీయ నటి అయిన రాధిక తండ్రి. ఈయన 196

7లో తన సహనటుడు, ఆ తరువాత తమిళనాడు ముఖ్యమంత్రి అయిన ఎం.జి.రామచంద్రన్ పై కాల్పులు జరిపి జైలుకెళ్లాడు.

రాధ, 1907ఫిబ్రవరి 21న తిరుచ్చిలో జన్మించాడు. చిన్నతనంలోనే తినటానికి మరో చేప ముక్క ఇవ్వనందున తల్లితో గొడవపడి రాధా ఇల్లువదిలి పారిపోయాడు. రంగస్థల నటుడై 5000కు పైగా నాటక ప్రదర్శనప్రదర్శనలిచ్చాడు. 10వ ఏట ప్రారంభమైన చిన్నచితకా వేషాలేసి, చివరికి ఆయన్నే దృ

ష్టిలో పెట్టుకొని నాటకాలు వ్రాసే స్థాయికి ఎదిగాడు.

రాధా రక్త కన్నీరు నాటకం విజయవంతమవడంతో పేరు సంపాదించుకున్నాడు. ఈ నాటకాన్నే సినిమాగా తీసినప్పుడు అందులో కూడా అద్భుతం

గా నటించి అగ్రతారగా ఎదిగాడు. ఈ సినిమా ఈయనకు అంతర్జాతీయ గుర్తింపు, పురస్కారాలను సంపాదించి పెట్టింది. ఇటీవలి రక్తకన్నీరు సినిమా

ను కన్నడలో ఉపేంద్ర పునర్నిర్మించాడు. రక్తకన్నీరులో రాధా నటనను దేవానంద్, అమితాబ్ బచ్చన్ వంటి అనేక మంది నటులు భారతీయ సినీ

 చరిత్రలోనే అత్యద్భుతమైన నటనగా కొనియాడారు. ఈ నటనను మరే నటుడు అనుకరించలేడని అన్నారు.

ఎమ్‌జిఆర్‌పై కాల్పులు జరిపిన ఘటన[మార్చు]

1967 జనవరి 12 న ఎం ఆర్ రాధా, ఎమ్‌జిఆర్‌ ఇంటికి వెళ్ళి, అతడిపై తుపాకితో కాల్పులు జరిపాడు. నిర్మాత కె.ఎన్.వాసుతో కలిసి సినిమా ని

ర్మాణం గురించి మాట్లాడే ఉద్దేశంతో ఎమ్‌జిఆర్‌ ఇంటికి వెళ్ళాడు. మాట్లాడుతూ ఉండగానే హఠాత్తుగా లేచి నిలబడి, తుపాకీతో ఎమ్‌జిఆర్‌ను ఒకసారి కాల్చాడు. తూటా ఎమ్‌జిఆర్‌ ఎడమ చెవి పక్కగా గిగబడింది. ఆ వెంటనే రాధా తనను తానే రెండు సార్లు – ఒకటి కణతవద్ద, రెండోది మెడమీదా – కాల్చుకున్నాడు.[1] ఇద్దరినీ ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్చి చికిత్స చేసారు.

కేసును విచారించిన చెంగల్పట్టు సెషన్స్ కోర్టు, రాధాకు 7 సంవత్సరాల కారాగర శిక్ష విధిస్తూ 1967 నవంబరు 4న తీర్పు ఇచ్చింది. తరువాత హైకోర్టు ఆ తీర్పును ఐదేళ్ళ మూడు నెలలకు తగ్గించింది.[2]

నటించిన చిత్రాలు

·         రక్త కన్నీర్

·         ఆయిరాం రూబాయ్

·         దైకొదూత దైవం

·         పావ మన్నిప్పు

·         ఎన్‌ కడమై

·         చీఠీ

·         పుదియ పరవాయ్

·         బాలే పాండియ

·         థాయిక్కు పిన్ తారం

·         కవలై ఇల్లద మనితన్

·         కుముదం

·         కర్పగం

·         తాయై కథ తనయన్

·         పాశం

·         పాలుం పళముం

·         పట్టినాథర్

·         పడిత్తాల్ మట్టుం పోదుమా

·         నానం ఓరు పెణ్

·         కోడుథు వైథవల్

·         ఆలయమణి

·         సంతనథేవన్

·         వెలుం మయిలం థునై

·         రత్నపురి ఇళవరసి

·         థాయి సొల్లి థాథాథే

·         పెట్రాల్థన్ పిల్లయ

·         పెరియ ఇదతు పెన్న్‌

·         ఆంధ జోధి

·         ఉలగం సిరిక్కిరథు

·         పార్ మగళె పార్

·         తాయిన్ మదియిల్

·         నల్లవన్ వాళ్వాన్

మరణం

— రాధా 1979 సెప్టెంబరు 17 న, తన 72 వ ఏట, కామెర్ల కారణంగా తిరుచిరాపల్లి లోని తన స్వగృహంలో కన్నుమూసాడు.

ఎం.ఆర్‌ రాధ… తమిళంలో పాపులర్‌ నటుడు, రాజకీయ నాయకుడు. నాటక రంగం నుంచి సినిమాకు వచ్చి హీరోగా, విలన్‌గా, కమెడియన్‌గా తమిళ ప్రేక్షకులను అలరించారు. ఆయన సంతానమే రాధిక, రాధా రవి, నిరోషా. తన తండ్రికి నివాళిగా ఓ బయోపిక్‌ను రూపొందించే ఆలోచనలో ఉన్నారట రాధిక. తన నిర్మాణ సంస్థ రాడాన్‌ మీడియా వర్క్స్‌ బ్యానర్‌పై ఈ సినిమా నిర్మించనున్నారని సమాచారం. ఈ సినిమాకు రాధా రవి మనవడు ఐకీ రాధా దర్శకత్వం వహిస్తారట.

ఆర్ రాధా గురించి చాలా మందికి తెలియదు.ఆయన ఎవరు అంటే హీరోయిన్ రాధిక వాళ్ళ నాన్న ఎం.ఆర్.రాధా గురించి మాట్లాడుకోవాలంటే ఆయన చాలా సినిమాల్లో విలన్ పాత్రలు పోషించి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సాధించుకున్నారు.అందులో భాగంగానే ఆయన ఒకరోజు ఎంజీఆర్ ఉన్న ఇంటికి వెళ్లి ఆయన్ను బయటకు రమ్మని పిలిచారు.క్యాజువల్ గా మాట్లాడడానికి వచ్చాడు కావచ్చు అనుకుని ఎం జి ఆర్ ఎం ఆర్ రాధ పిలవగానే బయటికి వచ్చాడు ఎంజీఆర్ బయటకు వచ్చి ఆయనతో మాట్లాడుతుంటే ఆయన జేబులో నుంచి గన్ తీసి ఎంజీఆర్ ను కాల్చివేశాడు.  ఎం జి ఆర్ ని ఎం.ఆర్.రాధా కాల్చడం జరిగింది.తను కాల్చి పోలీస్ స్టేషన్ కి వెళ్లి ఎం జి ఆర్ ని కాల్చింది తనే అని చెప్పడం జరిగింది దాంతో కొన్ని రోజులు పాటు జైలు శిక్ష కూడా అనుభవించాడు.అలాగే ఆ తర్వాత కొన్ని రోజుల పాటు జైల్లో ఉండి వచ్చి మళ్లీ సినిమాల్లో నటించడం కూడా జరిగింది.ఆ తర్వాత ఎం.ఆర్.రాధ కూతురు అయిన రాధిక సినిమాల్లో హీరోయిన్ గా వచ్చి తనకంటూ మంచి గుర్తింపు సాధించుకొని ఇండస్ట్రీలో అగ్రహీరోయిన్ గా చాలా కాలం పాటు కొనసాగింది ప్రస్తుతం శరత్ కుమార్ ని పెళ్లి చేసుకొని తన లైఫ్ ని లీడ్ చేస్తుందని చెప్పాలి ఇలా కొన్ని సందర్భాల్లో కొంతమంది ప్రవర్తిస్తూ ఉంటారు అని చెప్పడానికి ఎం.ఆర్.రాధా గారిని ఉదాహరణగా తీసుకోవచ్చు.

  సశేషం

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -8-5-22-ఉయ్యూరు

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in సినిమా. Bookmark the permalink.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.