మనమరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు-281
• 281-సాధనా సంస్థ అధినేత ,లత పాడిన తోలి తెలుగు పాట ,అక్కినేని తొలిచిత్రం సంసారం సినిమా ఫేం-రంగనాథదాస్
నెల్లూరు జిల్లా వెంకటగిరి చెందినరంగ నాథ దాస్ ‘సంసారం’ సినిమాతో నిర్మాతగా తెలుగు చిత్రీసీమకి పరిచయమయ్యారు. ఇందులో ఎన్టీ రామారావు, అక్కినేని నాగేశ్వరరావు హీరోలు. ఎల్వీ ప్రసాద్ దర్శకులు. అక్కినేనికి ఇదే తొలి సాంఘిక చిత్రం కావడం విశేషం. మహానటి అనిపించుకున్న సావిత్రి ‘సంసారం’లో చిన్న పాత్రలో కనిపిస్తారు. ప్రముఖ గాయని లతా మంగేష్కర్ తెలుగులో పాడిన తొలి గీతం ‘నిదురపోరా తమ్ముడా’. ఇది దాస్ తీసిన ‘సంతానం’ సినిమాలోనిదే.
తొలి ప్రయత్నం విజయవంతం కావడంతో దాస్ ఆ తరవాత దర్శకత్వం వైపు అడుగులు వేశారు. ఎన్టీఆర్ నటించిన ‘దాసి’ చిత్రానికి దర్శకత్వం వహించారాయన. ఆపైన స్వీయ దర్శకత్వంలో ‘సంతానం’, ‘తోబుట్టువులు’, ‘సంకల్పం’ నిర్మించారు. అన్నీ విజయవంతమయ్యాయి. ‘సంకల్పం’ తరవాత ఆయన చిత్రసీమకు దూరమై ఇతర వ్యాపారాల్లో నిమగ్నమయ్యారు.
ప్రసిద్ధ గాయనీమణి లతామంగేష్కర్‌తో తెలుగులో తొలి పాట పాడించిన ఘనత రంగనాథ్‌దాస్‌దే. ‘సంతానం’ సినిమా కోసం సుసర్ల దక్షిణామూర్తి స్వరకల్పన చేసిన ‘నిదురపోరా తమ్ముడా..’ పాటను ఆలపించారు లతా. అలాగే సావిత్రిని వెండితెరకు పరిచయం చేసినది కూడా రంగనాథ్‌దాస్. సాధన ప్రొడక్షన్స్ పతాకంపై తోబుట్టువులు, సంకల్పంలాంటి పలు చిత్రాలు నిర్మించారు. వాటిలో రజతోత్సవాలు జరుపుకున్న చిత్రాలు ఎక్కువ. 1960తోనే రంగనాథ్‌దాస్ సినీ జీవితం పూర్తయిందని చెప్పాలి. ఆ తర్వాత ఆయన చిత్ర పరిశ్రమకు దూరమయ్యారు. ఆయనకు ముగ్గురు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు.
‘సంసారం’, ‘సంతానం’, ‘తోబుట్టువులు’ లాంటి చిత్రాలు తీసిన నిర్మాత సి.వి.రంగనాథ్ దాస్. ఆయన బుధవారం ఉదయం హైదరాబాద్‌లో కన్నుమూశారు. వయసు 87 సంవత్సరాలు. గత కొంత కాలంగా దాస్ అస్వస్థతతో ఉన్నారు. ఆయనకు ఒక కుమారుడు, ముగ్గురు కుమార్తెలు. బుధవారం సాయంత్రం హైదరాబాద్‌లో అంత్యక్రియలు నిర్వహించారు.
• సశేషం
• మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -11-5-22-ఉయ్యూరు
• మనమరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు-282
• 282-పద్మిని పిక్చర్స్ అధినేత ,తమిళ తెలుగు హిందీ చిత్ర నిర్మాత దర్శకుడు కృష్ణ దేవరాయ ఫేంనటుడు కట్టబొమ్మన ,బడిపంతులు దర్శకత్వ ఫేం –బి.ఆర్ .పంతులు
బి.ఆర్.పంతులు (బడగూర్ రామకృష్ణయ్య పంతులు) ప్రముఖ సినీ నిర్మాత, దర్శకుడు, నటుడు. ఆయన తెలుగు, తమిళ, కన్నడ, హిందీ సినీ రంగాల్లో పలు సినిమాలకు నిర్మాణం, దర్శకత్వం వహించారు. ఆనాటి మైసూరు రాజ్యంలో నేటి కర్ణాటక-ఆంధ్రప్రదేశ్-తమిళనాడు సరిహద్దు ప్రాంతమైన కుప్పంకు 11 కిలోమీటర్ల దూరంలో ఉన్న బడగూరులో జన్మించారు. గుబ్బి వీరణ్ణ ట్రూపులో నటుడిగా చేరి కన్నడ నాటక రంగంలో ప్రఖ్యాతులై, తర్వాత తమిళ చలనచిత్ర రంగంతో సినీ నిర్మాణం ప్రారంభించారు. క్రమంగా పలు భాషల్లో సినిమాల నిర్మాణం సాగించారు. పద్మినీ పిక్చర్స్ బ్యానర్‌పై తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషలలో 55 చిత్రాలను నిర్మించారు. వాటిలో కొన్ని మినహా అన్ని చిత్రాలకు దర్శకత్వం వహించారు.
లుగు సినిమా రంగ0
నిర్మాతగా/ప్రొడక్షన్ అసిస్టెంటుగా
• భక్తిమాల
• శ్రీకృష్ణదేవరాయలు
• వీరపాండ్య కట్టబ్రహ్మన
• పిల్లలు తెచ్చిన చల్లని రాజ్యం
• పెంపుడు కూతురు
• గాలిమేడలు
దర్శకుడిగా
• శ్రీకృష్ణదేవరాయలు
• బడిపంతులు
• రాణి చెన్నమ్మ
• దొంగలు దొరలు
• వీరపాండ్య కట్టబ్రహ్మన
• పిల్లలు తెచ్చిన చల్లని రాజ్యం
• కర్ణ
• విచిత్ర వీరుడు
• సెబాష్ పిల్లా
• పెంపుడు కూతురు
• గాలిమేడలు
• కథానాయకుని కథ
• రత్నగిరి రహస్యం
నటుడిగా
• శ్రీకృష్ణదేవరాయలు
• బడిపంతులు
• పిల్లలు తెచ్చిన చల్లని రాజ్యం
• అమ్మలక్కలు
• తిరుగుబాటు
• వదిన
నేపథ్య గాయకుడిగా
• భక్తిమాల
మరణం
ఇతడు హృద్రోగం వల్ల బెంగళూరులో 1974, అక్టోబర్ 8న మరణించాడు
పంతులు 6 జాతీయ అవార్డ్ లను 1963నుంచి 1958 ల మధ్యకాలం లో పొందాడు .
సశేషం
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -11-5-22-ఉయ్యూరు
•