ప్రజా నాట్యమండలి అధ్యక్షులు ,నటులు -నల్లారి వెంకటేశ్వరరావు
— అభిమానులంతా నల్లూరన్న అనిపిలిచే నల్లూరి వెంకటేశ్వర్లు రంగస్థల నటుడు, ఆంధ్ర ప్రదేశ్ ప్రజానాట్యమండలి గౌరవాధ్యక్షుడు. ప్రజా కళల ద్వారా పీడిత, తాడిత, కార్మిక, కర్షక, కూలీనాలీ జనాల్లో చైతన్యం తెచ్చి, ఉమ్మడి రాష్ట్రంలో ప్రజా సాంస్కృతిక ఉద్యమం నిద్రావస్థలోకి పోయినప్పుడు ప్రజా కళాఉద్యమానికి పునర్జీవం పోశాడు. రాష్ట్రవ్యాప్తంగా పర్యటించి పాటల శిక్షణా శిబిరాలు, వీధినాటకాలు, గొల్లసుద్దులు వంటి కళారూపాలతో ప్రజల్లో చైతన్యం రగిలించడమేకాకుండా ఎంతోమందిని ప్రజా కళాకారులుగా తయారుచేశాడు.[1]
జననం
వెంకటేశ్వర్లు 1936, జూన్ 6న సుబ్బయ్య కనకమ్మ దంపతులకు ప్రకాశం జిల్లా, మద్దిపాడు మండలం నర్సాయపాలెంలో జన్మించాడు.[2]
కళాకారుడిగా
తన ఊరికి దగ్గరలోని మారెళ్లగుంటపాలెంలో ఉండే కమ్యూనిస్టు నల్లూరి అంజయ్య పరిచయం, సాహచర్యం, ప్రభావంతో, కళలపైఉన్న ఆసక్తితో చిన్నతనంలోనే నాటకరంగ ప్రవేశం చేశాడు. భూస్వామ్య పెట్టుబడిదారీ వ్యవస్థపై జనసామాన్యంలో చైతన్యం కలిగించటానికి వెంకటేశ్వర్లు కృషి చేశాడు. ప్రజావ్యతిరేక గ్రామీణ యంత్రాంగం రద్దుకావటం గురించి… కరణం, మునసబు, పటేల్, పట్వారీ మొత్తం గ్రామ పెత్తందారీవర్గం సామాన్య మానువుణ్ణి దోపిడీ చేస్తున్న వైనాన్ని ‘భూభాగోతం’ (వంగపండు ప్రసాదరావు రచించిన నృత్య నాటిక) ను ప్రజానాట్యమండలి ద్వారా రాష్ట్ర వ్యాపితంగా వేలాది ప్రదర్శనలిచ్చాడు.
బొలినేని నాగభూషణం దర్శకత్వం వహించిన సత్య హరిశ్చంద్ర నాటకంలోని లోహితాస్యుడు పాత్రతో నటనా జీవితాన్ని ప్రారంభించిన నల్లూరి, 1974లో ప్రజానాట్య మండలి పునర్నిర్మాణంలో నాయకపాత్ర వహించి గ్రామగ్రామాన శాఖలను ఏర్పాటుచేయడంలో ప్రముఖ పాత్ర వహించాడు. సినిమారంగంలో ప్రవేశించి కొన్ని సినిమాలలో నటించి, అక్కడి వాతావరణం నచ్చక సినిమారంగానికి దూరమయ్యాడు.
నాటికానాటకాలు
తెనుగుతల్లి
అన్నా- చెల్లెలు
రుద్రవీణ
గాలివాన
పెత్తందారు
కొత్తబాట
మంచుతెర
ఛైర్మన్
పల్లెపడుచు
నల్లూరి శిష్యులు
మాదాల రంగారావు
టి. కృష్ణ
గిరిబాబు
బి. గోపాల్
నర్రా వెంకటేశ్వరరావు
ధర్మవరపు సుబ్రహ్మణ్యం
పోకూరి బాబూరావు
వందేమాతరం శ్రీనివాస్
ఎం. వి. ఎస్. హరనాథ రావు
నిర్వహించిన పదవులు
ఆంధ్రప్రదేశ్ ప్రజానాట్యమండలి కన్వీనర్, ప్రధాన కార్యదర్శి, అధ్యక్షుడు (1974-1997)
భారత కమ్యూనిస్టు పార్టీ ప్రకాశం జిల్లా కార్యదర్శి, రాష్ట్ర సమితి కార్యవర్గ సభ్యుడు
ఇఫ్టా జాతీయ ఉపాధ్యక్షుడు
పురస్కారాలు – సత్కారాలు
నందమూరి తారక రామారావు రంగస్థల పురస్కారం – నంది నాటక పరిషత్తు – 2014, 2015 డిసెంబరు 30, రాజమహేంద్రవరం[2]
మీ -గబ్బిట దుర్గా ప్రసాద్ -11-5-22-ఉయ్యూరు