మనమరుపు వెనక మన వెండి తెరమహానుభావులు -288
288-కితకితలు అత్తిలి సత్తిబాబు హాస్యం ఫేం ,వ్యాఖ్యాత -లక్ష్మీ పతి
లక్ష్మీపతి ప్రముఖ తెలుగు సినీ హాస్యనటుడు. 40 కి పైగా సినిమాల్లో నటించాడు. ఇతను వర్షం సినిమాకు దర్శకత్వం వహించిన శోభన్ కు అన్న.[1] అన్నదమ్ములిద్దరూ కొద్ది రోజుల తేడాతో మరణించారు.
లక్ష్మీపతి మొదటగా టీవీ వ్యాఖ్యాతగా, హాస్యనటుడిగా తన కెరీర్ ను ప్రారంభించాడు. తరువాత శోభన్ దర్శకత్వం వహించిన బాబీ అనే సినిమాతో నటుడిగా ప్రస్థానం మొదలైంది. తరువాత అల్లరి, కితకితలు లాంటి సినిమాలో హాస్య పాత్రలు పోషించాడు.
సినిమాలు
· బాబీ
· అల్లరి
· మురారి
· నీ స్నేహం
· తొట్టి గ్యాంగ్
· జూనియర్స్
· అమ్మాయిలు అబ్బాయిలు
· విజయం (2003)
· విలన్ (2003)
· చార్మినార్
· కళ్యాణ రాముడు
· విలన్
· పెదబాబు
· దొంగ దొంగది
· అదిరిందయ్యా చంద్రం (2005)
· ఆంధ్రుడు
· నువ్వంటే నాకిష్టం
· ప్రేమికులు
· రిలాక్స్
· అదిరిందయ్యా చంద్రం
· ఎవడి గోల వాడిది
· సోగ్గాడు
· నీ నవ్వే చాలు
· డేంజర్
· అందాల రాముడు
· మహారధి
· కితకితలు
· అన్నవరం
· లక్ష్మీ కళ్యాణం
· అత్తిలి సత్తిబాబు LKG
· వియ్యాలవారి కయ్యాలు
· మంగతాయారు టిఫిన్ సెంటర్
· సుందరకాండ
· అందమైన మనసులో
· మీ ఇంటికొస్తే ఏం ఇస్తారు మా ఇంటికొస్తే ఏం తెస్తారు (2004)
మరణం
ఆయన స్నానాల గదిలో ఉండగా హఠాత్తుగా గుండెపోటు రావడంతో అక్కడే కిందపడిపోయి మరణించాడు. కొద్ది సేపటి తర్వాత కుటుంబ సభ్యులు అతని భౌతిక కాయాన్ని గుర్తించారు. [2]
మనమరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు-289
289-వర్షం బాబీ ,చంటి సినీదర్శకుడు –శోభన్
శోభన్ (1968-2008) ఒక తెలుగు సినిమా దర్శకుడు. వర్షం సినిమా దర్శకుడిగా తెలుగు ప్రేక్షకులకి సుపరిచితుడు. మహేష్ బాబు హీరోగా బాబీ అనే సినిమాకు కూడా దర్శకత్వం వహించాడు.[2] ఇతని సోదరుడు లక్ష్మీపతి సినీ నటుడు. ఇద్దరు అన్నదమ్ములూ ఒక వారం తేడాతో మరణించారు.
కెరీర్
1989 లో సినీ పరిశ్రమలో ప్రవేశించడానికి చెన్నై వెళ్ళాడు. రౌడీయిజం అనే సినిమాకు కొద్ది రోజుల పాటు పనిచేసాడు. కానీ కొన్ని కారణాల వలన 10 రోజులకు ఆ సినిమా ఆగిపోయింది. తరువాత రాంగోపాల్ వర్మ దగ్గర అనగనగా ఒక రోజు అనే సినిమాకు సహాయ దర్శకుడిగా చేరాడు. ఆయనతోనే ప్రేమకథ, దావూద్ అనే సినిమాలకు పనిచేశాడు.[1] కృష్ణవంశీ దర్శకత్వం వహించిన సింధూరం సినిమాకు రచయితగా పనిచేశాడు. క్షణ క్షణం, ఒక రాజు ఒక రాణి అనే సినిమాల్లో కూడా నటించాడు. మురారి సినిమాకు కూడా కృష్ణవంశీతో కలిసి పనిచేశాడు. ఆ సమయంలో మహేష్ బాబు తో కలిగిన పరిచయంతో బాబీ సినిమాతో దర్శకుడిగా అవకాశం వచ్చింది.[2] ఎం. ఎస్. రాజు నిర్మించగా ప్రభాస్, త్రిష హీరో హీరోయిన్లుగా నటించిన వర్షం సినిమా అతనికి దర్శకుడిగా మంచి పేరు తెచ్చిపెట్టింది. రవితేజ, ఛార్మి, అంజలి నటించిన చంటి సినిమా అతని ఆఖరి సినిమా. ఇది బాక్సాఫీసు వద్ద విజయం సాధించలేదు. దర్శకుడు కె. రాఘవేంద్రరావు కి కూడా సన్నిహితుడుగా ఉండేవాడు.[1]
మరణం
శోభన్ కథానాయిక భూమిక ఇంట్లో ఉండగా హఠాత్తుగా గుండెపోటు వచ్చి కూలబడిపోయాడు. భూమిక, ఆమె భర్త అతన్ని హైదరాబాదు మాదాపూరులోని ఇమేజ్ ఆసుపత్రికి తరలించగా అప్పటికే మరణించాడని వైద్యులు తెలియజేశారు.[3] అప్పటికి అతని వయస్సు 40 సంవత్సరాలు. భార్య సౌజన్య, ఇద్దరు కుమారులతో కలిసి నివసించేవాడు.
మనమరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు-290
290-వర్షం దర్శకుడు శోభన్ కుమారుడు ,గోల్కొండ హైస్కూల్ తో సినీఅరంగేట్ర౦చేసిన ,టివి నటుడు –సంతోష్ శోభన్
సంతోష్ శోభన్ తెలుగు సినిమా నటుడు. ఆయన తెలుగు సినీ దర్శకుడు శోభన్ కుమారుడు. సంతోష్ 2011లో గోల్కొండ హైస్కూల్ చిత్రం ద్వారా బాలనటుడిగా సినిమారంగంలోకి వచ్చాడు. సంతోష్ శోభన్ బెంగళూరులోని క్రిస్ట్ యూనివర్సిటీలో థియేటర్ ఆర్ట్స్ పూర్తి చేశాడు. సంతోష్ 2019లో “ది గ్రిల్” అనే వెబ్ సిరీస్ లో నటించాడు.[
సినీ రంగ ప్రస్థానం
సంతోష్ శోభన్ లో సంతోష్ 2011లో ‘గోల్కొండ హై స్కూల్’ చిత్రం ద్వారా బాలనటుడిగా సినిమా రంగంలోకి అడుగు పెట్టాడు. 2015లో “తను నేను” చిత్రం ద్వారా హీరోగా పరిచయమై, 2018లో ‘పేపర్ బాయ్, 2021లో ‘ఏక్ మినీ కథ’[4][5] చిత్రంలో నటించాడు.
నటించిన సినిమాలు
సంవత్సరం
సినిమా
పాత్ర
దర్శకుడి పేరు
మూలాలు
2011
గోల్కొండ హైస్కూల్
ఇంద్రగంటి మోహనకృష్ణ
బాల నటుడిగా
2015
తను నేను
కిరణ్
పి.రామ్మోహన్
[6]
2018
పేపర్ బాయ్
వి.జయశంకర్
[7]
2021
ఏక్ మినీ కథ
సంతోష్
కార్తీక్ రాపోలు
మంచి రోజులు వచ్చాయి
సంతోష్ “సంతు”
మారుతి
[8]
2022
ప్రేమ్ కుమార్
ప్రేమ్ కుమార్
అభిషేక్ మహర్షి
[9]
అన్ని మంచి శకునములే
నందినీ రెడ్డి
[10]
శ్రీదేవి శోభన్ బాబు
ప్రశాంత్‌కుమార్ దిమ్మల
[11]
టెలివిజన్
సంవత్సరం
పేరు
పాత్ర పేరు
నెట్వర్క్
మూలాలు
2019
ది గ్రిల్
అర్జున్
వియూ
[12]
2021
ది బేకర్ అండ్ ది బ్యూటీ
విజయ్ కృష్ణ దాసరిపల్లె
ఆహా
సశేషం
మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -12-5-22-ఉయ్యూరు