మనమరుపు వెనుక మన వెండి తెరమహానుభావులు -291

  • మనమరుపు వెనుక మన వెండి తెరమహానుభావులు -291
  • 291-భాగ్యరేఖ ,దైవబలం కాడెద్దులు -ఎకరం నేల చిత్ర నిర్మాతలు -పొన్నలూరి బ్రదర్స్ 

పొన్నలూరి బ్రదర్స్ ఎన్టీఆర్ కెరీర్ లో దారుణమైన డిజాస్టర్ సినిమా-కాడెద్దులు –ఎకరం నేల

కలియుగ దైవం శ్రీ వెంటేశ్వర స్వామి పాత్రలో నటించిన శ్రీ వెంకటేశ్వర మహత్యం సినిమా కూడా అయేడాదే విడుదల అయింది.ఎన్టీఆర్ ఫాన్స్ బాగా జోష్ లో ఉన్న తరుణం లో కాడెద్దులు ఎకరంనేల సినిమా విడుదలయ్యి డిజాస్టరుగా మిగిలింది.

అంతక ముందు ఎన్టీఆర్ తో దైవ బలం చిత్రాన్ని నిర్మించిన పొన్నలూరు బ్రదర్స్ నిరించిన సినిమా కాడెద్దులు ఎకరంనేల .ఎన్టీఆర్ తోనే బట్టి విక్రమార్కుడు చిత్రాన్ని రూపొందించిన జంపనా ఈ చిత్రానికి దర్శకులు.

 సినిమాకి జనాలు అంతగా రాకపోవటం తో కొన్ని కేంద్రాలలో కేవలం ఒక్కరోజు మాత్రమే సినిమాను ఉంచి తర్వాత తీసివేయటం కూడా జరిగింది.

మద్రాస్‌లో పొన్నలూరి బ్రదర్స్ సొంత స్టూడియో నిర్మించారు. పొన్నలూరి బ్రదర్స్ బ్యానర్‌పై ఇదే స్టూడియోలో 1957లో ‘్భగ్యరేఖ’ చిత్రాన్ని యన్టీ రామారావు, జమున కాంబినేషన్‌లో రూపొందించారు. ప్రముఖ దర్శకులు బిఎన్ రెడ్డి ఆ చిత్రానికి దర్శకత్వం వహించారు. వాహినీ సంస్థ చిత్రాలకేకాక ఇతర చిత్రాల సంస్థలకూ బిఎన్ రెడ్డి పనిచేయటం ‘్భగ్యరేఖ’తోనే ప్రారంభం కావటం విశేషం. ఆ చిత్రానికి పెండ్యాల నాగేశ్వరరావు సంగీతం సమకూర్చారు. భాగ్యరేఖ చిత్రానికి రాష్టప్రతి రజిత పతకం లభించింది. తరువాత పొన్నలూరి బ్రదర్స్ -యన్టీఆర్, అంజలి, రాజసులోచనతో ‘శోభ’ (1958), యన్టీఆర్, జానకి కాంబినేషన్‌లో ‘కాడెద్దులు- ఎకరం నేల’ (1960) నిర్మించారు. ‘శోభ’ చిత్రానికి కమలాకర కామేశ్వరరావు దర్శకత్వం వహించారు. ఏఎం రాజా సంగీత దర్శకత్వం వహించారు. ప్రసిద్ధ క్యారెక్టర్ ఆర్టిస్ట్, హాస్యనటుడు, నాటక రచయిత రావి కొండలరావు ‘శోభ’ చిత్రం ద్వారానే సినీ రంగానికి పరిచయమయ్యారు. పొన్నలూరి బ్రదర్స్ బ్యానర్‌పై నిర్మాతలలో ఒకరైన వసంతకుమార్ రెడ్డి స్వీయ దర్శకత్వంలో 1959లో రూపొందించిన జానపద చిత్రం ‘దైవబలం’. తరువాత వీరు 1966లో ‘పాదుకా పట్ట్భాషేకం’, 1973లో ‘పూలమాల’ చిత్రాలు నిర్మించారు.
దైవబలం చిత్రం 1959 సెప్టెంబర్ 17న విడుదలై 60ఏళ్లు పూర్తి చేసుకుంది.
యన్టీఆర్, జయశ్రీ (జయచిత్ర తల్లి.. అసలు పేరు అమ్మాజి) కాంబినేషన్‌లో వసంత్‌కుమార్‌రెడ్డి కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వంలో ‘దైవబలం’ రూపొందింది. ఛాయాగ్రహణం: బిజె రెడ్డి
శబ్దగ్రహణం: కణ్ణన్
కళ: వాలి
సంగీతం: అశ్వద్ధామ
నేపథ్య సంగీతం: టీవీ రాజు
మాటలు, పద్యాలు: పరశురామ్
మేటి హాలాహలమ్మును మ్రింగవచ్చు/ ప్రళయ కాలాగ్నిలో బడి బ్రతుకవచ్చు/ ఎంత బలవంతుడైన.. తానెవ్వడైన/ దైవబలమును కాదనతరముగాదు. పరశురామ్ రచించిన ఈ పద్యాన్ని ఘంటసాల గానం చేశారు. ఈ పద్యంలోని సత్యాన్ని నిరూపించే కథతో రూపొందిన చిత్రం -దైవబలం.
మాళవ దేశ మహారాజు ఉగ్రసేనుడు (గుమ్మడి). అతని కుమార్తె రూప. ఆమె జాతకం చూసిన జ్యోతిష్యులు.. ఓ సామాన్యుడు ఆమెకు భర్త అవుతాడని చెబుతారు. విధి లిఖితాన్ని మార్చాలని ఉగ్రసేనుడు ప్రయత్నిస్తాడు. జ్యోతిషులను పంపించేసి, ఆ లక్షణాలుకల బాలుడు చంద్రసేనుని కనిపెడతారు. ఆ బాలుని తల్లి (మాలతి) వద్దనుంచి తెచ్చి వధించమని తలారులను మహారాజు ఆజ్ఞాపిస్తాడు. ఆ బాలుని తలారులు వదిలిపెట్టడంతో, అతడు తల్లితో కలిసి ఓ గురువు ఆశ్రయంలో ఆశ్రమవాసిగా పెరిగి సకల విద్యలు నేరుస్తాడు. ఒకనాడు రాకుమారి రూప (జయశ్రీ)ని కలిసిన చంద్రసేనుడు (యన్టీ రామారావు) ఆమె అనురాగం పొందుతాడు. రాకుమారి స్వయంవరానికి ఏర్పాటు చేసిన పోటీలలో పాల్గొని విజయం సాధిస్తాడు. అతడెవరో నిజం తెలుసుకున్న ఉగ్రసేనుడు అతన్ని భూతమందిరంలో బంధించగా, చంద్రసేనుడు అతన్ని వధించి రూప చెలికత్తె (బాల) సాయంతో తప్పించుకొని మృత్యుమందిరం చేరతారు. అక్కడ గంధర్వుని పత్ని, భర్త శాప విమోచనం కోసం సంగీత వృక్షాన్ని కోరుతుంది. కంకాక్షుడు (ముక్కామల) అనే రాక్షసరాజు వద్దనున్న సంగీత వృక్షాన్ని అతి ప్రయాసతో సాధించి, తనను ప్రేమించాననే కంకాక్షుని కుమార్తె (గిరిజ) వలపునుండి తప్పించుకుని రూపతోసహా చంద్రసేనుడు మాళవ రాజ్యం చేరతాడు. చంద్రసేన రూపలను బంధించి ఉరిశిక్ష విధించిన మహరాజు ఉగ్రసేనుడు, తన ఆలోచన మార్చుకొని ఇద్దరికీ వివాహం జరిపించి.. దైవ నిర్ణయాన్ని ఎంతటివారికైనా తప్పింపరాదన్న నిజాన్ని వెల్లడించటంతో చిత్రం ముగుస్తుంది.
ఈ చిత్రంలో చంద్రసేనుని బంధించిన వారికి రాశులలో బంగారం ఇస్తారన్న రాజు ప్రకటనతో అతన్ని బంధించటానికి యత్నించిన టక్కు, టమారాలుగా రేలంగి, రమణారెడ్డి నటించారు. యన్టీఆర్ మిత్రుడు, ఆశ్రమవాసిగా కస్తూరి శివరావు నటించగా, ప్రముఖ నటుడు శోభన్‌బాబు మృత్యుమందిరంలో (కావలివానిగా, గంధర్వుల కుమారునిగా) నటించారు. అతని తల్లిగా మోహన.. ఇంకా అనేకమంచి ఇతర పాత్రలు పోషించారు.
దర్శకులు వసంతకుమార్‌రెడ్డి కథానుగుణంగా సన్నివేశాలను తీర్చిదిద్దటంలో చాకచక్యం చూపించారు. ఓ జానపద చిత్రానికి తగిన విధంగా అన్ని అంశాలను మేళవించటం కనిపిస్తుంది. హీరో స్వయంవర పోటీల్లో అన్ని విన్యాసాల్లో పాల్గొనటం; రథాలమీద గుర్రాల మీద పోరాటాలు; భూతమందిరంలో.. తెలివిగా భూతం కాలిలోని కన్ను నొక్కి అంతం చేయటం; ఉగ్రసేనునినుంచి పారిపోయి మృత్యుమందిరం చేరిన రూపను పూవుగా మారిస్తే.. గంధర్వుని నుంచి ఆమెను రక్షించటానికి కంకాక్షుని రాజ్యంచేరిన చంద్రసేనుడు అతనితో చేసే పోరాటాలు; అక్కడ బందీకావటం; రూపతోసహా పారిపోతూ కంకాక్షునితో గుహలో జరిపిన పోరాటం; కంకాక్షుని ప్రాణంవున్న జీవిని పట్టి రూప వధించటం; హాస్యంకోసం రేలంగి, రమణారెడ్డిలపై ఓ పాట, సన్నివేశాలు, తల్లినుంచి చిన్నతనంలో చంద్రసేనుడు విడిపోయినపుడు విషాద గీతాన్ని అడవిలో తల్లీబిడ్డలపై చిత్రీకరణ -లేనే లేదా రానే రాదా బాబును చూసే భాగ్యము (తల్లి, బాలుడు చంద్రపై).. లేనే లేదా రానే రాదా అమ్మను చూసే భాగ్యము (రచన: సీనియర్ సముద్రాల, గానం: వైదేహి). చిత్రం చివరలో కూతురును బంధించిన మహారాజు ఉగ్రసేనునికి ఆమె బాల్యంలో తండ్రితో ప్రహ్లాదుని వృత్తాంతము గురించి చేసిన చర్చ గుర్తుకువచ్చి.. కూతురు రూపకోసం కారాగారం వద్దకు వచ్చి ఆమెను, చంద్రసేనుని విడిపించి, వారికి వివాహం జరుపనిశ్చయించి ‘దైవబలం’ గూర్చి వివరించటం, రాజులోని మానసిక పరివర్తన, మార్పునకు సంకేతంగా ఆ సన్నివేశాన్ని రూపొందించటం అర్ధవంతంగా నిలిచింది.
చిత్రంలో చంద్రసేనునిగా యన్టీ రామారావు పాత్రోచితం, పలు వైవిధ్య సన్నివేశానుగుణంగా నటన ప్రదర్శించారు. అతని జోడి రూపగా జయశ్రీ తన పాత్రకు తగిన నటనతో అలరించింది. చిత్రంలో వారిరువురిపై చిత్రీకరించిన నేటికీ అలరించే యుగళ గీతం -అందాల ఓ చందమామ రావోయి (గానం: పిబి శ్రీనివాస్, ఎస్ జానకి; రచన: అనిశెట్టి). హవాయిన్ గిటార్ బేస్‌తో పాట సాగుతుంది. చిత్రంలో పద్యాలు, పాటలు 14పైగా ఉన్నాయి. వాటిలో కొన్ని రమణారెడ్డి, రేలంగిలపై హాస్య గీతం -కొడితే కోస్తాలే కొట్టాలి ఒరే చిచ్చరపిడుగా (రచన: కొసరాజు, గానం: పిఠాపురం, మాధవపెద్ది). గిరిజపై చిత్రీకరించిన గీతం -జీవితం ఎంతో హాయి.. ఈ యవ్వనమే (గానం: వైదేహి, రచన: అనిశెట్టి). -చిరు చిరు నవ్వుల పువ్వుల మురిసే యుగళ గీతం యన్టీఆర్, జయశ్రీలపై (గానం: పిబి శ్రీనివాస్, ఎస్ జానకి, రచన: అనిశెట్టి), మరో గీతం -నిను వరియించి మదికరగించి (గానం: పిబి శ్రీనివాస్, జానకి; రచన: అనిశెట్టి) అశ్వద్దామ సంగీతంతో అలరించేలా రూపొందాయి.
దైవబలం చిత్రం స్క్రీన్‌ప్లే, ఫొటోగ్రఫీ, సంగీతం, నటీనటుల అభినయంపరంగా అలరించేలా రూపొందినా.. అంతగా ఆర్థిక విజయం సాధించలేదు. ‘అందాల ఓ చందమామ’ గీతం విన్నపుడల్లా మాత్రం ఈ చిత్రం గుర్తుకు రావటం.. ఓ మంచి జ్ఞాపకంగా మిగలటం హర్షణీయాంశం.

-సీవీఆర్ మాణిక్యేశ్వరి

కాడెద్దులు ఎకరం నేల
కాడెద్దులు ఎకరం నేల 1960 తెలుగు భాషా నాటక చిత్రం. పొన్నలూరు బ్రదర్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఆధ్వర్యంలో పొన్నలూరు వసంతకుమార్ రెడ్డి నిర్మించాడు[1]. ఈ సినిమాకు జంపనా దర్శకత్వం వహించాడు[2]. ఇందులో ఎన్. టి. రామారావు, షావుకారు జానకి ప్రధాన పాత్రలలో నటించగా సి. ఎం. రాజు స్వరపరిచాడు.[3]


పాటలు
చాలులే నా గులాబి మొగ్గ మానులే నీ బడాయి – ఎ.ఎం. రాజా, ?
టక్కుటమారం తుక్కు దుమారం ఎక్కడ చూసిన – ?
తీయని పాటలు మాయని మాటలు మాసిపోవు – ఎస్. జానకి
యుగాలు మారినా జగాలు మారినా మారదు పేదల గాధా – పిఠాపురం
యాడుంటివే పిల్లా నీ జాడా జవాబు లేక చూస్తింటి – ?


కథ
ఈ చిత్రం ఒక గ్రామంలో ప్రారంభమవుతుంది, అక్కడ రాముడు (ఎన్. టి. రామారావు) ఒక యువకుడైన శక్తివంతుడు. తన 1 ఎకరా భూమి తో పాటు రెండు ఎద్దులతో సొంతంగా వ్యవసాయం చేసుకుంటూ సంతోషంగా నివసిస్తున్నాడు. అతను తన మామయ్య సూరయ్య (పెరుమాళ్ళు) కుమార్తె సీతను (షావుకారు జానకి) ప్రేమిస్తాడు. షావుకారు వెంకయ్య (రేలంగి) డబ్బు అప్పులు ఇచ్చేవాడు. అధిక వడ్డీకి రుణాలు ఇవ్వడం ద్వారా మొత్తం గ్రామాన్ని బాధించే దిర్మార్గుడు. సూరయ్య అతని దుశ్చర్యలకు మద్దతు ఇస్తాడు. రాముడు ఎల్లప్పుడూ అతనిపై పోరాటం చేస్తాడు. ఇంతలో, గ్రామంలో ఎన్నికలు ప్రకటించబడతాయి. షావుకర్ పోటీ చేస్తాడు. రాముడు తెలివైన వ్యక్తిని వీరయ్యను తన ప్రత్యర్థిగా నిలబెట్టి విజయం సాధిస్తాడు. ఈ కారణంగా షావుకర్ రాముడుపై పగ పెంచుకుంటాడు. అతను ఇప్పటికే చెల్లించిన తన రుణాన్ని తిరిగి చెల్లించలేదని అతనిపై తప్పుడు కేసు పెట్టాడు. కానీ దురదృష్టవశాత్తు రాముడు వద్ద ఎటువంటి ఋజువులు లేవు. కాబట్టి, రాముడు షావుకరు రుణాన్ని 3 నెలల్లోపు తిరిగి చెల్లించవలసి ఉంటుందని కోర్టు తీర్పు ఇస్తుంది, లేకపోతే అతని ఆస్తి సీలు చేయబడుతుంది అని చెబుతుంది. ఇప్పుడు రాముడు తన భూమిని తిరిగి పొందాలని నిర్ణయించుకుంటాడు, అందువల్ల, అతను తన తమ్ముడు గోపి (మాస్టర్ వెంకటేశ్వరులు) తో కలిసి నగరానికి వెళ్తాడు, అక్కడ అతను రేయింబవళ్ళూ శ్రమించి అవసరమైన మొత్తాన్ని సంపాదించే పనిలో ఉంటాడు. గ్రామంలో, సూరయ్య సీతకు మరో సంబంధాన్ని సూస్తాడు. కాబట్టి, ఆమె తప్పించుకుని రాముడును వెతుక్కుంటూ నగరానికి చేరుకుంటుంది.

రాముడు హత్య కేసులో చిక్కుకుంటాడు, గోపీ సహాయంతో సీత అతన్ని రక్షిస్తుంది. వారందరూ గ్రామానికి తిరిగి వస్తారు. రుణం తిరిగి చెల్లించినప్పటికీ ఇక్కడ షావుకరు భూమిని రాముడుకు ఇవ్వడానికి నిరాకరించాడు. ఇప్పుడు సూరయ్యతో సహా గ్రామస్తులంతా కలిసి నిలబడి షావుకరుకు వ్యతిరేకంగా నిరసనలు చేస్తారు. చివరికి, షావుకారు అనుచరులు సూరయ్యను వెనక్కి నెట్టినపుడు రాముడు తనకు రక్షణకు వచ్చినప్పుడు అతని ఇంటిని దోచుకోవడానికి ప్రయత్నిస్తారు. చివరికి, షావుకరు తన తప్పును గ్రహించి తన ఆస్తిని గ్రామస్తులకు పంపిణీ చేస్తాడు. చివరగా, ఈ చిత్రం రాముడు, సీత వివాహం తో సంతోషకరమైన నోట్ తో ముగుస్తుంది.

తారాగణం
ఎన్. టి. రామారావు రాముడుగా
షావుకారు జానకి సీతగా
రేలంగి వెంకటరమయ్య షావుకారు వెంకయ్యగా
రమణా రెడ్డి గోవిందయ్యగా
వంగర షావుకరు బావమరిది
సురయ్యగా పెరుమాళ్ళు
నామలుగా సీతారాం
కాంతిగా సూరబి బాలసరస్వతి
రాముడు తల్లిగా లక్ష్మీకాంతమ్మ
నిర్మలమ్మ సురయ్య భార్యగా
గోపిగా మాస్టర్ వెంకటేశ్వరులు

  నేను స్నేహితులతో ఈ సినిమా కు వెళ్లి మధ్యలో పారి పోయొచ్చాం .నా జీవితం లో అంతటి బోరింగ్ సినిమా చూడనే లేదు అప్పటి నుంచి ఇప్పటికి .


  • మనమరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు-285
  • 285-మెలోడి కి శ్రీకారం చుట్టి ,సంప్రదాయ సంగీతానికి నవ్యత కూర్చి 500పాటలు పాడిన సంగీత దర్శకుడు.లేతమనసులు ,మంచి చేసు సినీ ఫేం – –ఎం.ఎ
  • స్.విశ్వనాధన్-2

సంగీ‌త‌మ‌నేది మాన‌వు‌డికి భగ‌వం‌తుడు ప్రసా‌దిం‌చిన వరం.‌ ఆనందం, బాధ, కోపం, ప్రేమ, విరహం వంటి ఎలాంటి భావా‌ల‌కైనా అద్దం‌ప‌ట్టేది సంగీ‌తమే.‌ వేదాలు కూడా సంగీత స్వరాలే.‌ రాళ్లను కూడా కరి‌గించే గాంధర్వం సంగీతం.‌ సంగీతం సాధిం‌చ‌లే‌నిది ఏదీ లేదు.‌ ఎందు‌కంటే స్వరాల ప్రభావం అమోఘం కనుక.‌ రాగం, తాళం, స్వరం సమ్మి‌ళి‌త‌మై‌న‌ప్పుడు శ్రావ్య‌మైన సంగీతం ఉద్భ‌వి‌స్తుంది.‌ అటు‌వంటి సంగీ‌తా‌నికి శాశ్వ‌త‌త్వాన్ని అందిం‌చిన స్వర్ణ‌యు‌గపు సంగీత సామ్రాట్‌ ‌‘‌‘ఎమ్మెస్‌’‌’‌ అని అభి‌మా‌నంగా పిలి‌పిం‌చు‌కున్న కళా‌మ‌తల్లి కంఠా‌భ‌రణం ఎమ్మెస్‌ విశ్వ‌నా‌థన్‌.‌ జూన్‌ 24, 1928న కేర‌ళలో జన్మిం‌చిన ఎమ్మెస్‌ పన్నెండు వందల సిని‌మా‌లకు పైగా అద్భు‌త‌మైన సంగీ‌తాన్ని అందిం‌చిన కలై‌మా‌మణి.‌ ఇవాళ ఎమ్మెస్‌ జయంతి.

విశ్వ‌నా‌థన్‌ సంగీ‌తంలో కని‌పిం‌చని ఆక‌ర్షణ ఏదో వుంది.‌ కాలం‌తో‌బాటు ఎమ్మెస్‌ తన సంగీత పంథా కూడా మార్చు‌కు‌న్నారు.‌ యువ‌త‌రాన్ని ఆక‌ర్షిం‌చ‌గ‌లి‌గారు.‌ అలా‌గని క్లాసి‌కల్‌ టచ్‌ని విడ‌నా‌డ‌లేదు.‌ తెలుగు సినీ రంగ విష‌యా‌నికి వస్తే 1955లో విశ్వ‌నా‌థన్‌ ‌‘సంతోషం’‌ సిని‌మాకు సంగీతం సమ‌కూ‌ర్చారు.‌ స్వతంత్ర నిర్దే‌శ‌కు‌నిగా అనేక విజ‌య‌వం‌త‌మైన తెలుగు సిని‌మా‌లకు సంగీతం అందిం‌చారు.‌ ఆయన చేసిన సంగీ‌తా‌నికి సింహ‌భాగం పాటలు రాసింది ఆచార్య ఆత్రేయ.‌ ఎమ్మెస్‌ ప్రజా‌ద‌రణ పొందిన పాటలు తెలు‌గులో కోకొ‌ల్లలు.‌ ‌‘తనువు కెన్ని గాయా‌లైనా’, ‌‘బుజ్జి‌బుజ్జి పాపాయి’‌ (ఆడ‌బ్రతుకు), ‌‘రేపంటి రూపం కంటీ’‌ (మంచి −‌ చెడు), ‌‘తల‌చి‌నదే జరి‌గి‌నదా’‌ (మనసే మందిరం), ‌‘అందాల ఓ చి‌లకా’, ‌‘కోడి ఒక‌కో‌నలో’‌ (లేత‌మ‌న‌సులు), ‌‘నన్ను ఎవరో తాకిరి’‌ (సత్తె‌కా‌ల‌పు సత్తెయ్య), ‌‘ఏమం‌టు‌న్నది ఈ గాలి’‌ (మేమూ మను‌షు‌లమే), ‌‘తాళి‌కట్టు శుభ‌వేళా’‌ (అందు‌లేని కథ), ‌‘ఏ తీగ పూవునో’‌ (మరో చరిత్ర), ‌‘సన్న‌జా‌జు‌లోయ్‌’‌ (సింహ‌బ‌లుడు), ‘అటు‌ఇటు కాని హృద‌యము తోటి’ (ఇది కథ‌కాదు), ‌‘నువ్వేనా సంపంగి పువ్వుల’‌ (గుప్పె‌డు‌మ‌నసు), ‌‘కుర్రా‌ళ్ళోయ్‌ కుర్రాళ్ళు’‌ (అంద‌మైన అను‌భవం), ‌‘కన్నె పిల్ల‌వని కన్ను‌లు‌న్న‌వని’‌ (ఆక‌లి‌రాజ్యం), ‌‘కదిలే మేఘమా’‌ (లైలా), ‌‘పల్ల‌వించవా నా గొంతులో’‌ (కోకి‌లమ్మ) పాటలు ఉదా‌హ‌ర‌ణకు కొన్ని మాత్రమే.‌ ఎమ్మెస్‌ కొన్ని మల‌యాళ సిని‌మాల్లో నటిం‌చారు‌ కూడా.‌

చెన్నైలో ఎంఎస్ విశ్వనాథన్ మృతి సినీ పరిశ్రమ అశ్రు నివాళి

 తన అసమాన ప్రతిభతో సంగీత కళామతల్లిని ఓలలాడించిన ముద్దుబిడ్డ ఎంఎస్ విశ్వనాథన్ తనను వదలి తిరిగిరాని లోకాలకు వెల్లడంతో ఆ సంగీత కళామతల్లి కంటతడి పెట్టింది. ప్రఖ్యాత సంగీత దర్శకుడు ఎంఎస్ విశ్వనాథన్ మంగళవారం తెల్లవారుజామున 4.30 గంటల ప్రాంతంలో చెన్నై అడయారులోని ప్రైవేటు ఆసుపత్రిలో కన్నుమూశారు. 87 ఏళ్ల ఈ కురువృద్ధుడు మరణానికి సినీలోకం అశువులు బాసింది. నెల రోజుల క్రితం శ్వాసకోశ సంబంధిత సమస్యతో ఆసుపత్రిలో చేరిన ఎంఎస్ విశ్వనాథన్ చికిత్స పొందుతూ మంగళవారం తుది శ్వాస విడిచారు.     

భారతీయ సినిమా అపర సంగీత చాణుక్యుడు ఎం ఎస్ విశ్వనాథన్. ఎం అంటే మహా ఎస్ అంటే సంగీతం. విశ్వనాథన్ సొంతం. 70 వసంతాలకు పైగా సంగీత కళామతల్లి ఒడిలో ఓలలాడుతూ సరిగమలతో జతులుకడుతూ తాను ఎదుగుతూ సంగీత మాధుర్యాన్ని ఇతరులకు పంచుతూ సంగీత కుటుంబాన్ని పెంచుతూ సంగీత రారాజుగా మన్ననలను అందుకున్న ఎం ఎస్ విశ్వనాథన్‌ను అమరజీవి అయ్యారు. అయినా సంగీత పిపాసి చిరంజీవినే. తమిళ సినిమా సంగీత చక్రవర్తి అంటూ సాక్షాత్తూ తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితనే 2012లో బిరుదుతో సత్కరించి 60 బంగారు నాణేలతో పాటు కారును బహూకరించారు.

 

 బాల్యం : మెల్లిసై మన్నర్ (ది కింగ్ ఆఫ్ లైట్ మ్యూజిక్) బిరుదాంకితుడైన ఎం ఎస్ విశ్వనాథన్ 1928 జూన్ 24న కేరళ రాష్ట్రం పాలక్కాడు సమీపంలోని ఎలపుల్లి గ్రామంలో జన్మించారు. మనయాంగల్ సుబ్రమణియన్, నారాయణి కుట్టి తల్లిదండ్రులు. నాలుగేళ్ల వయసులోనే ఎంఎస్‌కు పితృయోగం కలిగింది. దీంతో విరక్తి చెందిన తల్లి ఎంఎస్‌ను చంపి తన జీవితాన్ని చాలించాలని ప్రయత్నించారు. ఆ సమయంలో ఎంఎస్ తాత సంరక్షణ బాధ్యతలు తీసుకున్నారు.

ఎంఎస్‌కు చదువుల తల్లి దగ్గరవ్వలేదు. సంగీతంపై ఆసక్తి కనబరచడంతో నీలకంఠం భాగవతార్ వద్దకు పంపారు. ఆయన వద్ద మూడేళ్లు సంగీతంలో సాధన చేశారు. అలా 13 ఏళ్ల వయసులోనే నిర్విరామ సంగీత కచేరి చేసి ప్రశంసలు అందుకున్నారు. ఎంఎస్‌కు నటనపైనా మక్కువే. తాత జైలు వార్డెన్ కావడంతో జైలు రోజున ఖైదీలతో హరిచంద్రనాటకం వేయించారు. అందులో ఎం ఎస్ లోహితుడిగా నటించి అదరగొట్టేశారు.

 మద్రాస్ పయనం: అది 1941వ సంవత్సరం విజయదశమి పర్వదినం మేనమామ సహాయంతో ఎం ఎస్ విశ్వనాథన్ మద్రాస్ మహానగరంలో కాలు మోపారు. జూపిటర్ పిక్చర్స్ అధినేతలు ఎం.సుందరం శెట్టియార్, మొహిద్దీన్ చిత్రం నిర్మించ తలపెట్టారు. అందులో ఒక పాత్ర కోసం ఎం ఎస్‌కు మేకప్ టెస్ట్ చేశారు. అయితే ఆయన ఆ పాత్రకు నప్పకపోవడంతో తరువాత చూద్దాం అంటూ చేతులు దులిపేశారు. పరిస్థితి పాలుపోని ఎంఎస్ వారిని బ్రతిమలాడుకుని వారి కార్యాలయంలోనే బాయ్‌గా చేరారు.

ఆ తరువాత ఆ సంస్థ నిర్మించిన కుబేర కుశలుఅనే చిత్రంలో సైనికుడిగా నటించారు. అయితే నటుడిగా తాను పనికి రానని గ్రహించి సంగీత రంగంపై దృష్టి సారించారు. సేలం మోడ్రన్ థియేటర్స్ సంస్థలు సంగీత దర్శకుడు కేవీ మహదేవన్ ఉన్నారని తెలిసి ఆయన్ని కలిశారు. ఎంఎస్ విశ్వనాథన్‌తో ఒక పాట పాడించుకున్న మహదేవన్ ఆయనలోని ప్రతిభను గ్రహించి సెంట్రల్ స్టూడియోకు వెళ్లు పని దొరుకుతుందని చెప్పారు. ఎంఎస్ నేరుగా సెంట్రల్ స్టూడియోలో సంగీత దర్శకుడు ఎస్‌ఎం సుబ్బయ్య నాయుడిని కలిశారు. అంతే ఆయన ట్రూప్‌లో హార్మోనిస్టుగా చేరారు. ఆ తరువాత సీఆర్ సుబ్బరాయన్ సంగీత ట్రూప్‌లో చేరారు. అక్కడ టీకేరామమూర్తితో పరిచయం ఏర్పడింది. 1952లో సీఆర్ సుబ్బరాయన్ మరణించడంతో ఆయన సంగీతాన్ని అందిస్తున్న దేవదాస్, చండీరాణి చిత్రాలను పూర్తి చేసే బాధ్యతలను ఎం ఎస్ విశ్వనాథన్, రామమూర్తి నిర్వహించారు.

 అలా ఆ చిత్రాల విజయాలతో ఎం ఎస్ విశ్వనాథన్ జెనోవా చిత్రం ద్వారా సంగీత దర్శకుడిగా పరిచయం అయ్యారు. ఈ చిత్ర కథా నాయకుడు ఎంజీఆర్ కావడం విశేషం. రామమూర్తి విశ్వనాథన్‌ల ద్వయం : ఆ తరువాత నిర్మాత టీకే కల్యాణం తన చిత్రం పణంకు రామమూర్తి విశ్వనాథన్‌లను కలిపి సంగీతం అందించమని చెప్పారు. అలా మొదలైన ఆ సంగీత ద్వయం తమిళం, తెలుగు, మలయాళం, కన్నడం, హిందీ అంటూ 700 చిత్రాల వరకు నిర్విఘ్నంగా కొనసాగింది. మొత్తం 1200 చిత్రాలకు సంగీతాన్ని అందించిన ఘనత ఎం ఎస్‌ది. ఎం ఎస్ విశ్వనాథన్ భార్య పేరు జానకి అమ్మన్. వీరికి గోపికృష్ణ, మురళీధరన్, ప్రకాష్, హరిదాస్ అనే నలుగురు కొడుకులు. లతా మోహన్, మధు ప్రసాద్, శాంతికుమార్ అనే ముగ్గురు కూతుళ్లు ఉన్నారు.

  చెన్నై శాంతోం రోడ్డులో నివసిస్తున్న ఎంఎస్ విశ్వనాథన్ కుటుంబం నివశిస్తోంది. ఎం ఎస్ విశ్వనాథన్ భౌతిక కాయానికి బుధవారం ఉదయం 10 గంటల ప్రాంతంలో బీసెంట్‌నగర్ శ్మశాన వాటికలో నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు వెల్లడించారు. నేడు ఎంఎస్ అంత్యక్రియల కారణంగా సినిమా షూటింగ్‌లు రద్దయ్యాయి.

  సీఎంల చిత్రాలకు సంగీతం : ముఖ్యమంత్రులుగా తమిళ, తెలుగు రాష్ట్రాలను పరిపాలించిన, పాలిస్తున్న ముఖ్యమంత్రులు ఎంజీఆర్, ఎన్‌టీఆర్, జయలలిత నటించిన పలు చిత్రాలకు ఎం ఎస్ విశ్వనాథన్ సంగీతం పక్క బలాన్నిచ్చింది. మాజీ ముఖ్యమంత్రి కరుణానిధితోను ఎంఎస్‌కు సన్నిహిత సంబంధాలున్నాయి.

  గాయకులకు పేరు ప్రఖ్యాతులు : ఎం ఎస్ విశ్వనాథన్ చాలామంది గాయనీ గాయకులకు పేరు ప్రఖ్యాతులు అందించారు. నేటి ప్రఖ్యాత గాయనీ గాయకులు ఎస్పీ బాలసుబ్రమణ్యం, పి.సుశీల, ఎస్.జానకి, ఎల్‌ఆర్ ఈశ్వరి, టీఎం సౌందరరాజన్, కేజే ఏసుదాస్ మొదలగు వారందరూ ఎం ఎస్ సంగీతంలో ఆలపించి ప్రశంసలందుకున్న వారే.

 నటుడు, గాయకుడు కూడా: ఎం ఎస్ గొప్ప సంగీత దర్శకుడే కాదు. గాయకుడు, నటుడు కూడా. ఆయన తన చిత్రాలతో పాటు ఇతర సంగీత దర్శకుల చిత్రాల్లోనూ పాడారు. మొత్తం 500లకు పైగా పాటలను పాడారు. ఇక చిన్నతనంలో నటుడవ్వాలన్న కోరికను ప్రముఖ సంగీత దర్శకుడైన తరువాత తీర్చుకున్నారు. కాదల్‌మన్నన్ చిత్రంలో ఎంఎస్ తొలిసారిగా హాస్యపాత్రలో అలరించారు. ఆ తరువాత కాదలా కాదలా తదితర 10 చిత్రాల్లో నటించారు.

 

 జాతీయ అవార్డులు లేవు కాని….

 ఎం ఎస్ విశ్వనాథన్ జాతీయ అవార్డులకు అలంకారం అయ్యే అవకాశాన్ని పొందలేదు గాని ఆయనికి అంతకం టే గొప్ప అవార్డులే వరించాయి. 1963 జూలై 16న గీత రచయిత కన్నదాసన్, దర్శకుడు శ్రీధర్, నటుడు జెమినీ గణేశన్, చంద్రబాబు చిత్రాలయ గోపుల సమక్షంలో శి వాజీ గణేశన్ రామమూర్తి, విశ్వనాథన్‌లకు మెల్లిసై మ న్నన్ అనే బిరుదు ఇచ్చి సత్కరించారు. కలైమామణి, ఫిలింఫేర్ లాంటి పలు బిరుదులు ఎం ఎస్‌ను వరించా యి. అన్నింటికంటే పెద్ద బిరుదు సంగీత ప్రియులు ఎం ఎస్‌ను గుండెల్లో స్థిరస్థాయిగా నింపుకున్నారు. సంగీతం ఉన్నంత కాలం ఎంఎస్ విశ్వనాథన్ చిరంజీవినే.

సినీ సంగీతంలో విశ్వ’నాదం’

ఆయన స్వర పరిచిన పాటల కోసం సంగీతాభిమానులు కన్నులు కాయలు కాచేలా ఎదురు చూస్తారు. శ్రోతల అంచనాలకు ఏ మాత్రం తగ్గకుండా ఆయన సరిగమలు పలికిస్తారు. ఆయన పాటలు విని సంగీతాభిమానులు ఆనందానికి అవధులు లేకుండా పోతాయి. తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో ఏ చిత్రానికి ఆయన సంగీతం అందించినా శ్రోతలు సంగీత సాగరంలో ఒలలాడాల్సిందే. ఆయనే సుప్రసిద్ధ సంగీత దర్శకుడు, కింగ్ ఆఫ్ లైట్ మ్యూజిక్ ఎం ఎస్ విశ్వనాథన్ (87).
చెన్నై నగరంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఎం ఎస్ విశ్వనాథన్ మంగళవారం తుది శ్వాస విడిచారు. గత కొంత కాలంగా శ్వాస కోస వ్యాధితో బాధపడుతున్న ఎం ఎస్ను కుటుంబసభ్యులు ఇటీవలే నగరంలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అయితే అక్కడ ఆయన ఆరోగ్యం గత మంగళవారం కుదుటపడింది. దాంతో ఎం ఎస్ను ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేస్తామని వైద్యులు ప్రకటించారు. ఎంఎస్ను ఇంటికి తరలించేందుకు కుటుంబ సభ్యులు ఏర్పాట్లు చేస్తున్న తరుణంలో ఆయన తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. దీంతో వైద్యులు ఆయన్ని ఐసీయూకి తరలించారు. ఆ క్రమంలో చికిత్స పొందుతూ ఎంఎస్ మరణించారు.
తెలుగు, తమిళ, మలయాళ భాషలకు చెందిన దాదాపు 750  చిత్రాలకు పైగా ఆయన సంగీత దర్శకత్వం వహించారు.1952లో శివాజీ గణేషన్ హీరోగా నటించిన పానమ్ చిత్రానికి తొలిసారిగా సంగీతాన్ని అందించారు. ఆ తర్వాత ఎం ఎస్ విశ్వనాథన్ ప్రాణ స్నేహితుడు టీకే రామ్మూర్తితో కలసి ‘విశ్వనాథన్ – రామ్మూర్తి’ పేరిట ఎన్నో హిట్స్ చిత్రాలకు సంగీతాన్ని అందించారు. ఆ తర్వాత 1965లో విశ్వనాథన్, రామ్మూర్తి ద్వయం విడిపోయింది. అనంతరం ఎం ఎస్ విశ్వనాథన్ సంగీత దర్శకత్వంలో ఎన్నో హిట్ చిత్రాలు వచ్చాయి.
తెలుగులో నిర్మించిన తెనాలి రామకృష్ణ, అంతులేని కథ, ఇది కథ కాదు, ఆకలి రాజ్యం తదితర చిత్రాలకు ఎం ఎస్ స్వర రచన చేశారు. ఎంఎస్ సంగీత దర్శకత్వంలో వచ్చిన పాటలన్నీ తెలుగు ప్రజలను ఆనందపరవశుల్ని చేశాయి. ఎం ఎస్ విశ్వనాథన్, ప్రముఖ దర్శకుడు కె.బాలచందర్ కాంబినేషన్లో వచ్చిన అన్ని చిత్రాల్లోని పాటలన్నీ సూపర్ డూపర్ హిట్లే.
ఎం ఎస్ విశ్వనాథన్ భార్య జానకీ 2012లో మరణించారు. ఆ తర్వాత ఆయన మిత్రుడు టీ కే. రామ్మూర్తి మృతి చెందారు. ఎం ఎస్ విశ్వనాథన్ సంగీత సేవలను గుర్తించిన తమిళనాడు ప్రభుత్వం కలైమామణి పురస్కారంతో సత్కరించి తనను తాను గౌరవించుకుంది. అలాగే లెక్కకు మిక్కిలి పురస్కారాలు ఎం ఎస్ విశ్వనాథన్ను వరించాయి. 1928 జూన్ 24న కేరళలోని పాలక్కడ్ సమీపంలోని  ఇలప్పుళిలో ఎంఎస్ విశ్వనాథన్ జన్మించారు.

సశేషం

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in సినిమా and tagged . Bookmark the permalink.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.