మనమరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు-293
293-ప్రభుత్వ రజతపతకం ,,స్పెయిన్ అంతర్జాతీయ సినీ ప్రదర్శన యోగ్యత పొందిన ‘’నమ్మినబంటు’’ సిని నిర్మాత ,మహాదాత ,పారిశ్రామిక వేత్త ,,ఉప్పు స
త్యాగ్రహి ,కృతిభర్త ,సాహిత్య పోషకుడు ,-యార్లగడ్డ వెంకన్న
యార్లగడ్డ వెంకన్న చౌదరి (1911 – 1986) ప్రకాశం జిల్లా కారంచేడు వాస్తవ్యుడు, స్వాతంత్ర్య సమర యోధుడు, మహా దాత, పారిశ్రామిక వేత్త. గణితములో, న్యాయశాస్త్రములో మంచి ప్రవేశము గల మేధావి.
జనననం
వెంకన్న చౌదరి ప్రకాశం జిల్లా కారంచేడు గ్రామంలో యార్లగడ్డ నాయుడమ్మ, రత్నమాంబ దంపతులకు1911 లో జన్మించారు. వీరికి ఒక అక్కయ్య శ్రీమతి దగ్గుబాటి సీతమ్మ ఒక తమ్ముడు రంగనాయకులు చౌదరి ఉన్నారు. వెంకన్న చౌదరి తమ మేనమామ కూతురు రాజ్యలక్ష్మమ్మని వివాహమాడారు. వీరికి కుమారుడు శంభు ప్రసాద్. శంభు ప్రసాద్ గారి భార్య శ్రీమతి ప్రభావతి ఈమె అమరావతి రాజా వాసిరెడ్డి శ్రీనాధ్ ప్రసాద్ గారి కుమార్తె.
సమాజససేవ
ఉప్పు సత్యాగ్రహములో పాల్గొని ఒక సంవత్సరము జైలు శిక్ష అనుభవించాడు[1]. కారంచేడు గ్రామ పంచాయతీ సర్పంచ్ గా బాధ్యతలు నిర్వహించారు. మద్రాసులోని ఆంధ్ర ఛాంబర్ ఆఫ్ కామర్స్‌కు అధ్యక్షునిగా పనిచేశాడు.
సాహిత్య పోషణ
తుమ్మలపల్లి రామలింగేశ్వర రావు గారు తాళ్ళపాక అన్నమాచార్యుని జీవితంపై వ్రాసిన తొలి రచన కృతి స్వీకరించారు. కోట సోదర కవులు తమ రచన “రాజ్యలక్ష్మీ విలాసము” వీరికి అంకితమిచ్చారు.
ఆచార్య యార్లగడ్డ వెంకట రాఘవయ్య గారు తమ విశిష్ట రచన “కాకతీయ తరంగిణి”ని వెంకన్న చౌదరి గారికి అంకితమిచ్చారు.
విశేషమేమిటంటే వీరిద్దరూ జీవితంలో ఎప్పుడూ కలుసుకోలేదు. వెంకన్న చౌదరి గారి దాతృత్వ గుణాన్ని అభిమానించి, అన్నగా భావించి శ్రీ రాఘవయ్య గారు తమ రచనను వెంకన్న చౌదరి గారికి అంకితమిచ్చారు.
వెంకన్న చౌదరి గారి ప్రోద్బలంతో, నాటి ముఖ్యమంత్రి జలగం వెంగళరావు గారు, తితిదే నిర్వహణాధికారి అన్నా రావు గారు అన్నమాచార్య ప్రాజెక్ట్ ప్రారంభించారు.
సినిమా నిర్మాత
శంభూ ఫిల్మ్స్ పతాకంపై వెంకన్న నిర్మించిన ‘నమ్మిన బంటు’ (1960) అనే చలనచిత్రము భారత రాష్ట్రపతి నుండి రజత పతకము పొందింది. స్పెయిన్‌లో జరిగిన అంతర్జాతీయ చలనచిత్ర వేడుకలో ప్రదర్శించబడి పలువురి ప్రశంశలు పొందింది.
దాతృత్వత్వం
వెంకన్న చౌదరి మహా దాత. పలు పాఠశాలకు, కళాశాలలకు భూరి విరాళాలిచ్చాడు. తన తండ్రి పేరిట ‘యార్లగడ్డ నాయుడమ్మ ఓరియంటల్ విద్యాలయము’ స్థాపించాడు. తిరుపతి, తిరుత్తణి, శ్రీశైలం వంటి దేవస్థానములలో కాటేజీలు, సత్రములు నిర్మించాడు. గుంటూరు జిల్లా మంగళగిరి వద్ద కాన్సర్ ఇన్స్టిట్యూట్ నకు 30 లక్షల విరాళమిచ్చాడు.
భార్య రాజ్యలక్ష్మి పేరిట 1980 నుండి తెలుగువారిలో పేరుప్రఖ్యాతులు పొందిన వ్యక్తులకు పురస్కారములు ఇవ్వబడుచున్నవి.
మరణం
మద్రాసులో స్ధిరపడి, అశేష సంపదను సృష్టించి సమాజ శ్రేయస్సుకు వుపయోగ పెట్టిన దానశీలి వెంకన్న చౌదరి గారు1986లో పరమపదించార
మనమరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు-294
294-ఈ చరిత్ర ఏ సిరాతో ,ఈ చదువులు మాకొద్దు ,మరోమలుపు సనీ దర్శకుడు ,నందీ అవార్దీ–వేజళ్ల సత్యనారాయణ
వేజెళ్ళ సత్యనారాయణ తెలుగు సినిమా దర్శకుడు.1979నుంచి 1994 దాకా దర్శకత్వం చేబట్టాడు
సినిమలు
ఇతడు దర్శకత్వం వహించిన తెలుగు చలనచిత్రాల పాక్షిక జాబితా:
విడుదల సంవత్సరం
సినిమా పేరు
నిర్మాణ సంస్థ
నటీనటులు
1979
మా ఊరి దేవత
రామకృష్ణ ఫిలింస్
1982
ఈ చరిత్ర ఏ సిరాతో
నవతరం పిక్చర్స్
రాజేంద్ర ప్రసాద్,
శివకృష్ణ
1982
మరో మలుపు
రూబీ మూవీస్
శివకృష్ణ,
నూతన్ ప్రసాద్
1983
ఇదికాదు ముగింపు
యురేకా సినీ ఎంటర్‌ప్రైజస్
శివకృష్ణ,
నరసింహ రాజు,
జ్యోతి,
గీత
1983
ఆడవాళ్లే అలిగితే
విజయచిత్ర పిక్చర్స్
సాయిచంద్,
వనితశ్రీ
1983
ఈ పిల్లకు పెళ్ళవుతుందా
శ్రీ బాలబాలాజీ చిత్ర
రాజేంద్రప్రసాద్
1983
ఈ దేశంలో ఒకరోజు
కుమారరాజా పిక్చర్స్
సాయిచంద్,
కవిత
1984
రోజులు మారాయి
విజయసారథి ఆర్ట్ పిక్చర్స్
శివకృష్ణ,
ప్రభ
1984
ఈ చదువులు మాకొద్దు
శ్రీ వెంకటదుర్గా ఇంటర్నేషనల్
సాయిచంద్,
రాజేంద్రప్రసాద్
1984
మార్చండి మన చట్టాలు
డి.వి.యస్.ప్రొడక్షన్స్
శారద,
చంద్రమోహన్
1985
ఓటుకు విలువ ఇవ్వండి
త్రిజయ
రంగనాథ్,
రాజేంద్రప్రసాద్
1985
అపనిందలు ఆడవాళ్లకేనా?
సురేఖ ఎంటర్‌ప్రైజన్
రంగనాథ్,
శారద,
అరుణ
1989
శ్రీ తాతావతారం
సాహిత్య మూవీస్
నరేష్,
సాగరిక,
బ్రహ్మానందం
1994
కలికాలం ఆడది
పవిత్ర జ్యోతి కంబైన్స్
సాయికృష్ణ,
జ్యోతి
పురస్కారాల
· ఇతడు దర్శకత్వం వహించిన మరో మలుపు చిత్రానికి 1982 సంవత్సరానికి గాను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంచే ఉత్తమ చిత్రంగా రజత నంది లభించింది.
మనమరుపు వెనుక మన వెండి తెర మహానుభావులు-295
295-టివి ,సినీ రచయిత,సంతోషం సినీ దర్శక ఫేం-దశరధ కుమార్
కొండపల్లి దశరథ్ కుమార్ ఒక ప్రముఖ సినీ దర్శకుడు, రచయిత. సంబరం, సంతోషం, మిస్టర్ పర్ఫెక్ట్ అతను దర్శకత్వం వహించిన కొన్ని సినిమాలు
జీవిత౦
దశరథ్ నవంబరు 30, 1971 న ఖమ్మం లోని ఒక తెలుగు బ్రాహ్మణ కుటుంబంలో జన్మించాడు.[3] 2005 లో శేష సౌమ్యతో అతని వివాహం జరిగింది. వారికి కార్తీక అనే కూతురు ఉంది.[4]
కెరీర్
సినిమాల్లోకి రాక మునుపు దశరథ్ ప్రముఖ రచయిత యండమూరి వీరేంద్రనాథ్తో కలిసి టీవీ సీరియళ్ళకు సంభాషణలు రాసేవాడు. దూరదర్శన్ లో ప్రసారమైన వెన్నెల్లో ఆడపిల్ల అనే ధారావాహిక మంచి ఆదరణ పొందింది. వీరశంకర్, తేజ, వై.వి.యస్.చౌదరి లాంటి దర్శకులతో సుమారు పదేళ్ళ పాటు పనిచేశాడు. వీరశంకర్ తో హలో ఐ లవ్ యూ, వైవీయస్ చౌదరితో యువరాజు, తేజతో చిత్రం, నువ్వు నేను, ఫ్యామిలీ సర్కస్ లాంటి సినిమాలకు పనిచేశాడు.
2002 లో నాగార్జున కథానాయకుడిగా వచ్చిన సంతోషం సినిమాతో దర్శకుడిగా పేరు తెచ్చుకున్నాడు.
సినిమాలు
దర్శకుడిగా
· శౌర్య – 2016
· గ్రీకు వీరుడు – 2013
· మిస్టర్ పర్ఫెక్ట్ – 2011
· స్వాగతం – 2008
· శ్రీ – 2005
· సంబరం – 2003
· సంతోషం – 2002
రచయితగా[మార్చు]
· శుభవేళ – 2000
· చిత్రం – 2000
· ఫ్యామిలీ సర్కస్ – 2001
· నువ్వు నేను – 2001
· సంతోషం – 2002
· శ్రీ – 2005
· స్వాగతం – 2008
· సశేషం
· మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -15-5-22-ఉయ్యూరు