- మన వెండి తెర మహానుభావులు-296
- 296-గాజుల కిష్టయ్య ఫేం ,ఫిలిం ఫేర్ అవార్డీ-జరీనా వహాబ్
ప్రారంభ జీవితం[
జరీనా వహాబ్ విశాఖపట్టణంలోని ఒక ముస్లిం కుటుంబంలో జన్మించింది. ఈమెకు మాతృభాష తెలుగు[1] తో పాటు ఉర్దూ, హిందీ, ఇంగ్లీషు భాషలలో ప్రావీణ్యం ఉంది. ఈమె పూణేలోని ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా(FTII)లో శిక్షణ పొందింది.[2] ఈమెకు ముగ్గురు సోదరీమణులు ఒక సోదరుడు ఉన్నారు.
వృత్తి
ఈమె సినిమాలకు పనికిరాదని సినిమా నిర్మాత రాజ్ కపూర్ తిరస్కరించగా ఈమె పట్టుదలతో తన ఆహార్యంపై దృష్టిపెట్టి మెరుగులు దిద్దుకుని సినిమా పార్టీలకు, కార్యక్రమాలకు హాజరయ్యింది. దానితో ఈమె పలువురి దృష్టిలో పడి సినిమా అవకాశాలు దక్కించుకుంది. ఈమె సాధారణంగా మధ్యతరగతి పాత్రలలో నటించేది. ఈమె 1976లో విడుదలైన “చిత్ చోర్” సినిమాలో నటించింది. ఇదే కాకుండా అమోల్ పాలేకర్ నటించిన “అగర్”, రాజ్ బబ్బర్‌తో “జజ్‌బాత్”, అరుణ్ గోవిల్‌తో “సావన్ కో ఆనే దో” విక్రంతో “రయీస్ జాదా” మొదలైన సినిమాలలో నటించింది. 1977లో విడుదలైన “ఘరండా” చిత్రంలో నటనకు ఈమె ఫిలింఫేర్ ఉత్తమ నటి పురస్కారానికి నామినేట్ అయ్యింది.[3] ఈమె హిందీ సినిమాలలోనే కాక మళయాల, తెలుగు, తమిళ, కన్నడ చిత్రాలలో కూడా నటించింది. ఈమె మళయాల చిత్రం క్యాలెండర్ (2009)తో నటిగా పునః ప్రవేశం చేసింది.[4] “మై నేమ్ ఈజ్ ఖాన్” చిత్రంలో షారూఖ్ ఖాన్ తల్లి పాత్రలో దర్శనమిచ్చింది.[5]
జరీనా వహాబ్ ప్రస్తుతం హిందీ టెలివిజన్ సీరియళ్లలో వయసు మళ్లిన పాత్రలలో నటిస్తున్నది.[6]
వ్యక్తిగత జీవితం
జరీనా సినీనటుడు ఆదిత్య పంచోలిని “కళంక్ కా టీకా” అనే సినిమా సెట్లో కలుసుకుంది.[7] పంచోలి ఈమె కన్నా 6 సంవత్సరాలు పిన్నవయస్కుడు. 1986లో వీరిద్దరూ వివాహం చేసుకున్నారు. వీరికి సన అనే కూతురు, సురజ్ అనే కొడుకు కలిగారు.[8][9] వీరి సంతానం ఇరువురూ నటీనటులే.
నట జీవితం[
ఈమె సుమారు 60 హిందీ సినిమాలలో నటించింది. ఈమె నటించిన తెలుగు సినిమాల జాబితా:
సంవత్సరం | సినిమా పేరు | పాత్ర |
1975 | గాజుల కిష్టయ్య | |
1978 | అమర ప్రేమ | జయమాల |
1980 | హేమాహేమీలు | |
2010 | రక్త చరిత్ర | జయలక్ష్మి |
2013 | విశ్వరూపం | సైకియాట్రిస్ట్ |
2021 | విరాట పర్వం | |
2022 | దసరా |
టెలివిజన్[
ఈమె అనేక టెలివిజన్ సీరియళ్లలో నటించింది. వాటిలో “క్యోంకి సాస్ భీ కభీ బహూ థీ”, “మధుబాల ఏక్ ఇష్క్ ఏక్ జునూన్”, “ఏక్ కిరణ్ రోష్నీ కీ”,”ఎఫ్.ఐ.ఆర్.”, “మేరీ ఆవాజ్ హీ పెహచాన్ హై” మొదలైన ప్రజాబాహుళ్యమైన సీరియళ్లు ఉన్నాయి.
అవార్డులు, నామినేషన్లు
· 2011 “మై నేమ్ ఈజ్ ఖాన్” చిత్రంలోని పాత్రకు గ్లోబల్ ఇండియన్ ఫిలిం అండ్ టెలివిజన్ వారి ఉత్తమ సహాయ పాత్ర పురస్కారం.
· 2011 “రక్త చరిత్ర” స్క్రీన్ అవార్డుకు ఉత్తమ సహాయనటి కేటగరీలో నామినేషన్
· 2011 “మై నేమ్ ఈజ్ ఖాన్”, “రక్త చరిత్ర” సినిమాలలోని నటనకు స్టార్ డస్ట్ అవార్డుకు ఉత్తమ సహాయనటి కేటగరీలో నామినేషన్
· 1977 “ఘరోండ” చిత్రంలో నటనకు ఫిలింఫేర్ అవార్డుకు ఉత్తమ నటి కేటగరీలో నామినేషన్.
- మన వెండి తెర మహానుభావులు-297-
- 297-గుణసుందరి ఫేం ,జీవనతరంగాలు ,క్రిష్ణలేలలు ,లైలామజ్ఞు ,అమరసందేశం నటి ,కన్నీటి కడలి నటి అనిపించిన-జూనియర్ శ్రీరంజని
రంజని (అసలు పేరు మహాలక్ష్మి) తెలుగు సినిమా నటి. వీరు గుంటూరు జిల్లా మురికిపూడి గ్రామంలో 1927 సంవత్సరం ఫిబ్రవరి 22 న జన్మించారు. శ్రీరంజని సీనియర్ గా పేరుపొందిన తెలుగు సినిమా నటి ఈమె సోదరి.
చిత్రపు నారాయణమూర్తి ప్రోత్సాహంతో మొదటిసారిగా భీష్మ (1944) చిత్రంలో నటించారు. 1949లో సుప్రసిద్ధ దర్శకులు కె.వి.రెడ్డి గారి గుణసుందరి కథలో కథానాయిక పాత్ర ధరించారు.
ఈమె 1974 సంవత్సరంలో ఏప్రిల్ 27 న మరణించింది.
నటించిన చిత్రాలు
· జీవన తరంగాలు (1973)
· నేనంటే నేనే (1968)
· బంగారు పంజరం (1965)
· శ్రీకృష్ణార్జున యుద్ధం (1963) …. రుక్మిణి
· మహాకవి కాళిదాసు (1960)
· కృష్ణ లీలలు (1959)
· ప్రేమే దైవం (1957)
· శ్రీ గౌరీ మహత్యం (1956)
· పెంకి పెళ్ళాం (1956)
· సంతానం (1955) …. లక్ష్మి
· శ్రీకృష్ణ తులాభారం (1955) …. రుక్మిణి
· చంద్రహారం (1954) …. గౌరి
· అమర సందేశం (1954)
· పెద్ద మనుషులు (1954)
· Raji En Kanmani (1954)
· బ్రతుకు తెరువు (1953)
· మానవతి (1952)
· పరాశక్తి (1952) …. కళ్యాణి
· ప్రేమ (1952) …. లత
· రాజేశ్వరి (1952)
· సంక్రాంతి (1952)
· లైలా మజ్ఞు (1949)
· గుణసుందరి కథ (1949) …. గుణసుందరి
· గీతాంజలి (1948)
· మదాలస (1948)
· గృహప్రవేశం (1946)
· భీష్మ (1944) …. సత్యవతి
- మన వెండి తెర మహానుభావులు-298
- 298-సాంఘిక నాటక నటుడు ,ముత్యాలముగ్గు ఫేం ,రియల్ ఎస్టేట్ లోనూ హీరో ,మా ఉయ్యూరు దగ్గర వాడు –శ్రీధర్
జననం
కృష్ణా జిల్లా, ఉయ్యూరు సమీపంలోని కుమ్మమూరు గ్రామంలో 1939 డిసెంబర్ 21 న ఒక దిగువ మధ్యతరగతి కుటుంబంలో జన్మించిన శ్రీధర్, తల్లా? పెళ్లామా? చిత్రంతో తెలుగు జాతి మనది అనే పాటలో విద్యార్థిగా సినీ రంగ ప్రవేశం చేశాడు.[1] మచిలీపట్నంలో ఇంటర్మీడియట్ పూర్తిచేసుకొని 1964లో హైదరాబాదుకు వచ్చి ప్రభుత్వపనుల శాఖలో గుమాస్తాగా ఉద్యోగజీవితాన్ని ప్రారంభించాడు. ఉద్యోగం చేస్తూనే సాయంత్రం కళాశాలకు వెళుతూ బి.ఏ పూర్తిచేశాడు. కళాశాల సాంస్కృతిక విభాగంలో క్రియాశీలకంగా పనిచేస్తూ కార్యదర్శి అయ్యాడు. పరీక్ష, చీకటి తెరలు, అభాగ్యులు, సాలెగూడు, మండేకొండలు మొదలైన అనేక నాటకాల్లో ప్రధాన పాత్రలు పోషించాడు. ఈయన ప్రధానపాత్ర పోషించిన మంచుతెర అనే నాటకానికి గాను ఆంధ్ర నాటక కళా పరిషత్ యొక్క ద్వితీయ బహుమతి అందుకున్నాడు.[2]
ఒకప్పుడు ఘట్టమనేని కృష్ణ నటించిన సినిమాలన్నింటిలోనూ శ్రీధర్ కనిపించేవాడు. జస్టిస్ ఛౌదరి సినిమాలో ఎన్టీ రామారావు కొడుకుగా నటించాడు. ప్రతిభావంతమైన కళాకారుడైన శ్రీధర్ ఏనాడు వేషాలకోసం అర్ధించలేదు. తనకు అవకాశం వచ్చిన సినిమాలలో నటించాడు. నటుడిగా ఉండగా ఈయన రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టిన పెట్టుబడులతో, తన చివరి దశకంలో ఆ వ్యాపార రంగంలో బిజీగా ఉన్నాడు.[3]
చివరాఖరిలో ఆయనకు టివి సీరియళ్లు అవకాశం వెతుక్కుంటూ వస్తే అందులో నటించడానికి ఇష్టపడలేదు. ఆ సీరియళ్లు నటిస్తే శ్రమ ఎక్కువ తప్పితే ఆర్థికంగా ఫలితాలు బహు తక్కువ అని తెలుసుకుని నటనకు దూరంగా ఉన్నాడు. స్వంతచిత్ర నిర్మాణాలపై ఆసక్తి కనబరచలేదు. హీరోవేషాలు వస్తున్నప్పుడు శ్రీధర్‌చే ఎన్‌టిఆర్ తనస్వంతచిత్రం శ్రీరామ పట్టాభిషేకంలో గుహుడు వేషం వేయించారు. దాంతో శ్రీధర్‌కు వచ్చే హీరోవేషాలు కూడా రాకుండా పోయాయి. అంతకుముందు ఎన్‌టిఆర్ గుహుడు వేషానికి డ్రయివర్‌రాముడులో సెకెండ్‌హీరో వేషానికి లింకుపెట్టి ఇచ్చారు. కానీ, డ్రయివర్‌రాముడు చిత్రం హిట్‌కూడా శ్రీధర్‌ను మరిన్ని చిత్రాలలో హీరోని చేయలేకపోయాయి. సహాయ పాత్రలను తెచ్చిపెట్టాయి. ఇలా శ్రీధర్‌కు తాను నటించిన హిట్‌చిత్రాలు ఎలాంటి లాభాలను చేకూర్చలేదనే చెప్పాలి. ఆయన విభిన్న పాత్రల్లో కనిపించాడు. వాటిల్లో అమెరికాఅమ్మాయి, అడవి రాముడు, జస్టిస్ చౌదరి, కరుణామయుడు, ఈనాడు, బొమ్మరిల్లు, సీతా మహాలక్ష్మీ, యశోధకృష్ణ వంటి చిత్రాలున్నాయి.[4] ఈయన కనిపించిన చివరి చిత్రం గోవిందా గోవిందా.
సినిమాల జాబితా
1. తల్లా? పెళ్లామా? (1970)
2. విశాలి (1973)
3. చక్రవాకం (1974)
4. దేవదాసు (1974)
5. మాంగల్య భాగ్యం (1974)
6. ముత్యాల ముగ్గు (1975)
7. యశోదకృష్ణ (1975)
8. శ్రీరామాంజనేయ యుద్ధం (1975)
9. అమెరికా అమ్మాయి (1976)
10. దొరలు దొంగలు (1976)
11. బంగారు మనిషి (1976)
12. భక్త కన్నప్ప (1976)
13. వెలుగుబాటలు (1976)
14. అడవి రాముడు (1977)
15. తరం మారింది (1977)
16. మనవడి కోసం (1977)
17. అంగడిబొమ్మ (1978)
18. ఇంద్రధనుస్సు (1978)
19. కరుణామయుడు (1978)
20. గోరంత దీపం (1978)
21. పల్లెసీమ (1978)
22. బొమ్మరిల్లు (1978)
23. శ్రీరామ పట్టాభిషేకం (1978)
24. సీతామాలక్ష్మి (1978)
25. జూదగాడు (1979)
26. డ్రైవర్ రాముడు (1979)
27. బొట్టు కాటుక (1979)
28. ఆడది గడప దాటితే (1980)
29. కలియుగ రావణాసురుడు (1980)
30. కోడళ్ళొస్తున్నారు జాగ్రత్త (1980)
31. పొదరిల్లు (1980)
32. బంగారు బావ (1980)
33. మంచిని పెంచాలి (1980)
34. మూగకు మాటొస్తే (1980)
35. సంధ్య (1980)
36. సంసార బంధం (1980)
37. దేవుడు మావయ్య (1981)
38. మా పెళ్ళి కథ (1981)
39. ఆపద్బాంధవులు (1982)
40. ఈనాడు (1982)
41. జస్టిస్ చౌదరి (1982)
42. డాక్టర్ మాలతి (1982)
43. కిరాయి కోటిగాడు (1983)
44. నేటి చరిత్ర (1990)
45. గోవిందా గోవిందా (1994)
మరణం
ఆయన ఊపిరితిత్తుల క్యాన్సర్ తో బాధపడుతూ, హైదరాబాదు అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా గుండెపోటుతో జూలై 11, 2007 న మరణించాడు. శ్రీధర్ కు భార్య, ముగ్గురు కుమార్తెలున్నారు.
- సశేషం
- మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -16-5-22-ఉయ్యూరు