జయశంకర ప్రసాద్ -3
చయావాదం –జయశంకర ప్రసాద్
చాయా వడ కవిత్రయం జయ శంకర ప్రసాద్ ,సూర్యకాంత త్రిపాఠీ-నిరాలా ,సుమిత్రా నందన పంత్.వీరు ఆధునిక హిందీ కవిత్వాన్ని కాంతిమయం చేశారు .ప్రసాద్ లోఆత్మ చైతన్యం ఎక్కువ .గతకాలం కూడా వర్తమానం లా మాట్లాడుతుంది ఆయన కవిత్వం లో .ఆయన గొప్ప కవితా నావికుడు .ఆయన జాతి చైతన్యానికి వ్యక్తీ చైతన్యానికి ప్రతీక .నుభూతిని సాంస్కృతిక చైతన్యం తో చెప్పాడు .ప్రధాన ప్రేరణలో వ్యక్తిగత చైతన్యం ఉంటుంది .సంవేదనా భావం సాంద్రంగా ఆయనలో ఉంది .ప్రేమానురాగాల ఐశ్వర్యం కధల్లో చూపాడు .చాయావాద యుగం లో అత్యంత ప్రతిభా సంపన్నమైన కవులున్నారు .పంత్ ‘’ఛాయా ‘’అనేకవిత్వం తో సంచలనం కలిగించాడు కనుక అది చాయావాదం అయింది .’’ప్రకృతి కరుణ కావ్యం లా ,వృక్ష పత్రాల మధు చాయలలో -రాయబడినట్లు అచలంగా ,అమృతాన్ని పోలిన నశ్వర శరీరం లో ఎవరున్నారు?’’అని జయశంకర్ రాసిన కవిత మొదటిచారణాలు .పంత్ –‘’ఓ!హరిత వసనా భూమిపై పడిన మ్లాన మణీ నువ్వెవరు ?గాలితాకిడికి విచ్చిన్నమైనలతలా ,రతి శ్రాంత బ్రజ వనితలా-వది వంచిత ఆశ్రయ రహిత జర్జర పద దళితలా-ముక్త కుంతలాల నీవు ఎవరివి ?”’ ఈ కవితల్లో వారిద్దరి భావుకత అంతర్ దృష్టి కన్పిస్తాయి .ప్రసాద్ కవితలో జీవం తోణికిసలాడితే ,వస్తువు కవికి వెలుపల చూస్తున్నట్లు ఉంది .ఈకవితలు మనసును లగ్నం చేస్తాయి .ప్రసాద్ కవితా కేంద్రం లో అనుభవ స్పందన మనం పడే పడే అనుభవిస్తాం .పంత్ కల్పనలు అనుభవం నుంచి వేరై స్వతంత్రంగా ఉన్నట్లు అనిపిస్తాయి .
ఈరకమైన కవిత్వం లో ఆత్మీయ భావన మార్మికతతో జత చేస్తుంది .ప్రసాద్ అనుభూతి స్పష్టం .ప్రసాద్ సాంకేతిక వాదం పంత్ లో విస్తరించింది .ప్రసాద్ ది’’విషాద్ ఛాయా ‘’.పంత్ లో అది ఆరోపణగా ఆహ్వానిస్తుంది .కావ్య భావనల వాదం లో చాయావాదం ఒక ముఖ్యమలుపుకుదుపు..కవిత్వాన్ని ఈ మలుపుదాకా తెచ్చిన కవి జయశంకర్ .ప్రసాద్ కు స్వంత గొంతుక ,లయ ఉన్నాయి .లయబద్ద భావావేశం నిరాలాది.ప్రసాద్ ఛందో బంధనాలు తెంచి కవిత్వానికి కొత్తనడక నేర్పాడు .పద్యాన్ని యాంత్రిక మార్గం నుంచి తప్పించాడు .ఆయన పాండిత్యం సూక్ష్మ శబ్ద భావాలు అబ్బురపరుస్తాయి .అనుభూతి శారీరక రచన చేయకుండా ఆత్మను రచిస్తుంది .ఆంశు లో ప్రయోగాలు
ఝార్నా తర్వాత ప్రసాద్ రాసిన ఆంశు కావ్యం సుదీర్ఘ కవిత ఇలాగే నిరాలా ‘’తులసీ దాస్ రాశాడు .ఆమ్షు ఒక లిరిక్ గా వృత్తాంతా కావ్యంగా ,శోక గీతిలా తాత్విక కావ్యం లా ఉంటుంది .డ్రామాటిక్ మొనోలోగ్స్ ఉన్న నాటకంకూడా కాదు ప్రపంచానికి ప్రేమ సందేశం పంచటమే లక్ష్యం .కామాయిని ఇచ్చినంత కిక్ ఇవ్వదు.ఎలిగరి రూప కావ్యం వైపు కు మొగ్గు చూపుతుంది .సముద్రం అంతరిక్షం రెండూ ఆయనకు ఇష్టమైన ప్రతీకలు –‘’లేవదుచేతనా తారంగం – .స్థిరంగా ఉంటుంది జీవన సముద్రం –సంధ్యకాని ప్రళయానికి ఉద్గమం –కలయిక అవుతుంది మళ్ళీ విచ్చేదం ‘’.ఇందులో ఆశావాదం ఉంది .కాల్రిడ్జ్ రాసిన ‘’డిజేక్షన్ ఓడ్’’కూడా ఇలానే ఉంటుంది .ప్రసాద్ ధ్యేయం ‘’మధు రేన సమాపయేత్ ‘’.కాంతి బిందువులు రాలుస్తూ రజని కనులు వర్షించాయి –తమస్సు నల్లని మోసగత్తేలు –నక్షత్రం రాలే క్షణం లో ఎందుకు ఉజ్వలంగా జీవిస్తాడు ?’’
సశేషం
మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -17-5-22-ఉయ్యూరు