మన వెండి తెర మహానుభావులు-299
• 299-చిల్లర కొట్టు చిట్టెమ్మ తో సినీ ప్రవేశం చేసి ,పునాది రాళ్ళు సినిమా నటనకు స్వర్ణ నంది పొందిన –గోకిన రామారావు
• గోకిన రామారావు సహాయ నటుడు పాత్ర నుండి ప్రతినాయకుడి పాత్ర వరకూ అనేక విలక్షణ పాత్రల్లో దాదాపు 100 సినిమాలు పైగా నటించి ప్రేక్షకులను అలరించిన గోకిన రామారావు గారి సొంత ఊరు తూర్పు గోదావరి జిల్లా లోని పెద్దాపురం, పెద్దాపురం గోలి వారి వీధిలో రోడ్డు అనుకుని ఉన్న రామాలయం ఆయన స్వగృహం నటనపై చిన్న నాటి నుండి ఉన్న ఆసక్తితో చిన్న చిన్న స్టేజీ షోలతో మొదలైన ఆయన నటనా ప్రస్థానం నటనే ఒక వ్యాపకంగా మరి హైదరాబాదు వరకూ నడిపించింది. సినిమాల్లో చిన్న వేషాలు లభించాయి. ఆ తరువాత దర్శకరత్న దాసరి నారాయణ రావు గారు మంచి పాత్రకి అవకాశం ఇచ్చారు ఆయన స్వీయ దర్శకత్వంలో తీసిన చిల్లరకొట్టు చిట్టెమ్మ సినిమాతో గోకిన రామారావు గారి నట జీవితం ఊపందుకుంది. సినిమా ఆద్యంతం పెద్దాపురం లోనే చిత్రీకరించబడి అద్ద్భుత విజయం సాధించిన శివరంజనీ అనే సినిమాకు దాసరినారాయణ రావు గారికి పూర్తి సహకారం అందించారు. 1979 లో విడుదలైన మెగాస్టార్ చిరంజీవి గారి తొలిచిత్రం పునాది రాళ్ళులో పండించిన విలక్షణ నటనకు గానూ గోకిన రామారావు గారికి బంగారు నంది లభించింది. ఇటీవలే అయన 62 సంవత్సరాల వయస్సులో హైదరాబాదులో గుండె పోటుతో మరణించారు
నటించిన సినిమాలు
• లాహిరి లాహిరి లాహిరిలో (2002)
• దాదాగిరి (2001)
• రైతురాజ్యం (1999)
• కన్యాదానం (1998)
• సరదాల సంసారం (1997)
• సూరిగాడు (1992)
• సూత్రధారులు (1990)
• మనవడొస్తున్నాడు (1987)
• మంగమ్మగారి మనవడు (1984)
• దేవాంతకుడు (1984)
• పల్నాటి పులి (1984)
• జనని జన్మభూమి (1984)
• మగ మహారాజు (1983)
• అమాయక చక్రవర్తి (1983)
• బడాయి బసవయ్య (1980)
• పునాదిరాళ్ళు (1979)
• రంగూన్ రౌడీ (1979)
• శివరంజని (1978)
• చిల్లరకొట్టు చిట్టెమ్మ (1977)
• సోగ్గాడు (1975)
• మోసగాళ్ళకు మోసగాడు (1971
మంగమ్మగారి మనవడు సినిమాలో విలక్షణ నటన ప్రదర్శించాడు .
మన వెండి తెర మహానుభావులు-300
300- స్రవంతి ,సంస్థ నిర్మాత ,లేడీస్ టైలర్,క.మా.రి .డాన్స్ కంపెని ,గిల్లికజ్జాలు ,నువ్వేకావాలి సినీ నిర్మాణ ఫేం –స్రవంతి కిషోర్
స్రవంతి రవికిషోర్ తెలుగు సినీ నిర్మాత.[1] స్రవంతి మూవీస్ అనే సంస్థ ద్వారా అనేక విజయవంతమైన సినిమాలు నిర్మించాడు. రవికిషోర్ 1986లో తన మిత్రులతో కలిసి మొదటి సారిగా లేడీస్ టైలర్ అనే చిత్రాన్ని నిర్మించాడు. వంశీ, ఎస్. వి. కృష్ణారెడ్డి, కె. విజయభాస్కర్, త్రివిక్రం శ్రీనివాస్, ఎ. కరుణాకరన్ లాంటి దర్శకులతో దాదాపు 30కి పైగా సినిమాలు నిర్మించాడు. ఓ జ్యోతిష్యుడి సలహా మేరకు తన సంస్థ పేరును చంద్ర కిరణ్ మూవీస్ గా మార్చాడు.
వ్యక్తిగత జీవిత౦
ఆయన వృత్తి రీత్యా చార్టర్డ్ అకౌంటెంట్. విజయవాడలో పని చేస్తుండేవాడు.[2] గ్రాడ్యుయేషన్ పూర్తయిన తర్వాత ఎలక్ట్రానిక్స్ కు సంబంధించిన వ్యాపారం చేసేవాడు. మొదట్లో ఆయనకు సినిమాల మీద అంతగా ఆసక్తి ఉండేది కాదు. తర్వాత స్నేహితుల సలహా మేరకు సినీ నిర్మాణ రంగంలో ప్రవేశించాడు. మొదట్లో దాన్ని ఆయన పూర్తి వ్యాపార ధృక్పథంతో ఆలోచించినా నెమ్మదిగా సినిమాల మీద ఆసక్తి పెరిగింది. మంచి సినిమాలు తీయాలనే తపన కలిగింది.
సినిమాలు
ఆయన మల్లాది వెంకట కృష్ణమూర్తి రాసిన స్రవంతి అనే నవల చదివి ఆ స్ఫూర్తితో తన నిర్మాణ సంస్థకు స్రవంతి మూవీస్ అనే పేరు పెట్టాడు. తర్వాత ఓ జ్యోతిష సిద్ధాంతి సలహా మేరకు ఆ సంస్థ పేరు చంద్ర కిరణ్ మూవీస్ గా మార్చాడు. మొదట్లో దర్శకుడు వంశీతో మిత్రులు తమ్ముడు సత్యం, సాయిబాబా తో కలిసి 1986 లో లేడీస్ టైలర్ చిత్రాన్ని నిర్మించారు. తర్వాత మహర్షి, కనకమహాలక్ష్మి డాంస్ ట్రూప్, లింగబాబు లవ్ స్టోరీ లాంటి సినిమాలకు పనిచేశాడు. తరువాత ఎస్. వి. కృష్ణారెడ్డితో కలిసి మూడు సినిమాలు చేశాడు. తర్వాత కె. విజయభాస్కర్ తో కలిసి రెండు సినిమాలు చేశాడు.
నువ్వే కావాలి సినిమా కోసం మలయాళం నుంచి హక్కులు కొని అప్పటి ఆర్థిక పరిస్థితి బాగోకపోవడంతో దాన్ని ఉషాకిరణ్ మూవీస్ ఆద్వర్యంలో నిర్మించాడు.[2] ఆ సినిమా మంచి విజయం సాధించింది.
సిరివెన్నెల సీతారామ శాస్త్రి, కోటి, సుచిత్ర చంద్రబోస్, శ్రీకర్ ప్రసాద్ లాంటి సాంకేతిక నిపుణులతో ఎక్కువగా పనిచేశాడు.
పాక్షిక జాబితా
• లేడీస్ టైలర్
• మహర్షి
• శ్రీ కనకమహాలక్ష్మి రికార్డింగ్ డాంస్ ట్రూప్
• జైత్రయాత్ర
• రౌడీ మొగుడు
• మావిచిగురు
• ఎగిరే పావురమా
• గిల్లికజ్జాలు
• మనసులో మాట
• పిల్ల నచ్చింది
• నువ్వే కావాలి
• నువ్వు నాకు నచ్చావ్
• గౌరి (2004)
• గణేష్
• ఎందుకంటే ప్రేమంట
• సశేషం
• మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -17-5-22-ఉయ్యూరు
•
వీక్షకులు
- 993,985 hits
-
-
ఉసుల గూడు (బ్లాగ్) గువ్వలు (పోస్ట్)
- ఉగాది పంచాంగ శ్రవణం
- పద్మ భూషణ్ ఆచార్య మామిడి పూడి వెంకట రంగయ్య గారి జ్ఞాపకాలు.7వ.భాగం.22.3.23.
- శ్రీ అనుభవానంద స్వామి వారి సర్వ సిద్ధాంత సౌరభం.25వ భాగం. న్యాయ దర్శనం.22.3.23.
- శ్రీ శోభ కృత్ నామ సంవత్సర ఉగాది పంచాంగ శ్రవణం.
- శ్రీ యడ్లపాటి వెంకట సుబ్బారావు గారి ‘’శ్రీమదాంజనేయ శతకం ‘’-2(చివరిభాగం )
- పద్మ భూషణ్ ఆచార్య మామిడి పూడి వెంకట రంగయ్య గారి జ్ఞాపకాలు.6వ భాగం.21.3.23.
- శ్రీ అనుభవానందస్వామి వారి సర్వ సిద్ధాంత సౌరభం. వైశేషిక పూర్తి,న్యాయ దర్శనం ప్రారంభం.24వ భాగం.21.3.23
- శ్రీ యడ్లపాటి వెంకట సుబ్బారావు గారి ‘’శ్రీమదాంజనేయ శతకం ‘’
- పద్మ భూషణ్ ఆచార్య మామిడి పూడి వెంకట రంగయ్య గారి జ్ఞాపకాలు.5వ భాగం.20.9.23
- శ్రీ అనుభవా నంద స్వామి వారి సర్వ సిద్ధాంత సౌరభం.23వ భాగం.20.3.23
Archives
ఉసూల గూటి అరలు
- అనువాదాలు (24)
- అమెరికా లో (206)
- ఆ''పాత''మధురాలు (9)
- ఆరోగ్యం (4)
- ఊసుల్లో ఉయ్యూరు (77)
- కవితలు (147)
- కవి కోకిల స్వరాలు (11)
- దేవాలయం (38)
- నా డైరీ (8)
- నా దారి తీరు (135)
- నేను చూసినవ ప్రదేశాలు (107)
- పద్య రత్నములు (2)
- పుస్తకాలు (2,951)
- సమీక్ష (1,306)
- ప్రవచనం (11)
- ఫేస్బుక్ (380)
- మహానుభావులు (343)
- ముళ్ళపూడి & బాపు (61)
- రచనలు (1,072)
- రాజకీయం (65)
- రేడియో లో (55)
- వార్తా పత్రికలో (2,159)
- సభలు సమావేశాలు (334)
- సమయం – సందర్భం (844)
- సమీక్ష (25)
- సరసభారతి (10)
- సరసభారతి ఉయ్యూరు (506)
- సినిమా (366)
- సేకరణలు (315)
- సైన్స్ (46)
- English (6)
ఊసుల గూడు