మనమరుపు వెనుక మన వెండి తెరమహానుభావులు -301

మనమరుపు వెనుక మన వెండి తెరమహానుభావులు -301
301-తెలుగుటాకీ రెండవరాముడు ,కళ్యాణిరాగ ‘’మాస్టర్ కల్యాణి ‘’
కల్యాణి రాగ ‘’మాస్టర్ కల్యాణి ‘’
1934లో కాకినాడ లో కృష్ణలీలలు అనే నాటకం లో వేమూరి గగ్గయ్య కంసుడుగా నటించి హడలగొడుతుంటే ,ఆయనకు దీటుగా ఒక కుర్రాడు కృష్ణుడి వేషం లో సరిసమానంగా లేక అంతకంటే ఎక్కువగా శ్రావ్యంగా భావయుక్తం గా పద్యాలు పాడుతూ నటించి మెప్పించాడు .గగ్గయ్య ను మించి పోయి నటిస్తున్నాడని కల్యాణి రాగం లో అత్యద్భుతంగా పద్యాలు పాడి మనో రంజనం కలిగిస్తున్నాడనీ ప్రేక్షక జనావళి అబ్బురపడ్డారు .వన్స్ మోర్ లతో జనం మళ్ళీ మళ్ళీ పద్యాలు పాడించు కొన్నారు .ఒక్క రోజు అను కన్న ప్రదర్శన వరుసగా అయిదు రోజులు జరిగి రసిక జన మనో రంజనం చేశాడు ఆకోత్తకుర్రాడు కృష్ణ పాత్రధారిగా .ఐదవరోజు ఆ పాత్రధారిని  ఏనుగు పై ఊరేగించి తమ ఆనందాన్ని ప్రకటించారు కాకినాడ ప్రజలు .కల్యాణి రాగం ను వశపరచుకొని అలవోకగా అద్భుతం గా కర్ణ పేయంగా పద్యాలు పాడినందుకు అతడికి ‘’మాస్టర్ కల్యాణి ‘’అనిపెరుపెట్టి సమ్మాననించి తమ సంతృప్తి ప్రకటించుకొన్నారు .అప్పటినుంచి మరణించేదాకా ఆయన మాస్టర్ కల్యాణి గానే పిలువబడ్డాడు .ఒకరకంగా అప్పుడు ఆయన నాటకరంగ సూపర్ స్టార్ .
  1934లోనే మొదటిసారి ఒక తెలుగు వాడు పివి దాసు పూర్తిగా మద్రాస్ లోనే చిత్రించిన సినిమా ‘’సీతాకల్యాణం ‘’.ఇది రామాయణం కధతో వచ్చిన రెండవ టాకీ చిత్రం .మొదటిది పాదుకా పట్టాభిషేకం .ఇందులో యడవల్లి సూర్యనారాయణ రాముడిగా నటించాడు .సీతాకల్యాణం లో రాముడిగా వేసినవాడు మాస్టర్ కల్యాణి .తెలుగు టాకీ లో రెండవరాముడు మాస్టర్ కల్యాణి .
  1970లో తూర్పు గోదావరి జిల్లా కాట్రావులపల్లి అనే పల్లెటూరి లో పానుగంటి లక్ష్మీ వెంకాయమ్మ గారి పేరుమీద ఒక ధర్మ సత్రం ఉండేది పేదలకు గొప్ప ఆసరాగా ఉండేది .అప్పుడు ఆ సత్రం లో భార్యా పిల్లలతో పూట గడవనిదిక్కుమాలిన దుర్భర దారిద్ర్యంతో మాస్టర్ కల్యాణి బస చేసి దీనంగా బతుకు ఈడుస్తున్నాడు .కల్యాణి రాగాన్ని మాస్టరీ చేసిన ఆమహానటుడు చాల హృదయ విదారకంగా .సర్వం కోల్పోయి ఆంద్ర ప్రదేశ్ నాటక ఎకాడమి ఇస్తున్న నెలకు 40రూపాయల పెన్షన్ తో కుటుంబాన్ని పోషిస్తున్నాడు .ఆ సత్రంలోనే అదే ఏడాది మాస్టర్ కల్యాణి కన్ను మూశాడు అత్యంత దుర్భర పరిస్థితులలో .రంగస్థలం పై వన్స్ మోర్లు కొట్టించుకొన్న మహా గాయక నటుడి జీవితం ఇలా అత్యంత విషాదంగా ముగిసింది .
మాస్టర్ కల్యాణి అసలు పేరు నౌడూరు వెంకటరావు .అమలాపురం లో 1914లో పుట్టాడు .తండ్రి పేరయ్య దీక్షితులు ,తల్లి సుబ్బమ్మ .ఆర్ధికంగా బలమైన కుటుంబం కాదు .అందుకే చదువుమీద శ్రద్ధ ఉండేదికాదు .కానీ పాటలు పాడటం అలవోకగా అలవాటైంది .భావరాగ యుక్తంగా పాడేగాత్ర సౌలభ్యం ఉండేది .కురుమద్దాలి రామచంద్రరావు గొప్ప హార్మోనిస్ట్ .పద్యనాటకాలకు హార్మోనియం  వాయిస్తూ, దర్శకత్వం కూడా చేసేవాడు .శ్రీకృష్ణ హాపీ క్లబ్ అనే సంస్థ స్థాపించి రామదాసు నాటకం ప్రాక్టీస్ చేయిస్తున్నాడు .అప్పుడు ఇంకా స్కూల్లో చదువుతున్న వెంకటరావు గాత్రానికి ఆకర్షితుడై ,రామదాసు లో రఘురాముడు గా నటి౦పజేశాడు .ప్రేక్షకులు విపరీతంగా మెచ్చారు వెంకటరావు ను .రావుగారే  వెంకటరావు కు పాటలు పాడటం కూడా నేర్పించాడు .రోజూ స్కూల్ అవగానే రామచంద్ర రావు ఇంటికి వెళ్లి ఆయనకున్న గ్రామఫోన్ లో అబ్దుల్ కరీ౦ఖాన్ ,గానగంధర్వ,ఓంకార నాద మొదలైన మహాగాయకుల గానం వింటూ ,తన గాత్రానికి మెరుగులు దిద్దుకొన్నాడు వెంకటరావు .చిన్న తనం లోనే ఆనాటి అగ్రనటులకు దీటుగా ,ఒక్కోసారి వారిని అధిగమించీ నటన తో, పద్యాలతో గొప్ప స్థానం సంపాదించుకొన్నాడు .
  శ్రీ కృష్ణ తులాభారం నాటకం లో మాస్టర్ కల్యాణి శ్రీకృష్ణుడిగా ,కపిలవాయి రామనాధ శాస్త్రి నారడుడుగా వేసేవారు ..మరోగ్రూపు తులాభారం లో స్థానం నరసింహారావు సత్యభామగా ,కపిలవాయి శ్రీ కృష్ణుడిగా ,మాస్టర్ కల్యాణి నారదుడిగా వేసేవారు .ఈ నాటకాలాకు కాంట్రాక్టులు ఒక సంవత్సరం ముందే బుక్ అయిపోయేవి అంత డిమాండ్ ఉండేది ఈరెండు బృందాలకు .మాస్టర్ కల్యాణి బాగా పల్లెటూర్లలో తాటాకు పందిళ్ళకిందా , నాటకాలు ఆడాడు ,అలాగే పెద్ద పెద్ద పట్టణాలలోనూ మాంచి  ఆడిటోరియం  లలోనూ  నాటకాలు వేశాడు .ఎక్కడ వేసినా అదే ప్రేక్షకాదరణ వన్స్ మోర్ లు ఉండేది .వన్స్ మోర్లు కొట్టించుకొని ప్రేక్షక సమూహాలు లేనే లేవు .కృష్ణుడు ,నారదుడు అంటే మాస్టర్ కల్యాణి అని పేరుపొందాడు మిగతావారంతా  ఈయన తర్వాతే అంతటి సూపర్ స్టార్ డం సంపాదించాడు మాస్టర్ కల్యాణి . ఆ నాటి కాంట్రాక్ట్ నాటకయుగం లో ఎదురులేని’’ నాటకరారారాజు మాస్టర్ కల్యాణి’’ .’’ఆయన గొంతెత్తి రాగం ఆలపిస్తే ఆరాగం ఆగానం ఎప్పుడు ఆగిపొతు౦దోఎవరికే తెలిసేదికాదు .అది అమరగానం .ఏఒడిదుడుకులూ లేకుండా గలగలపారే గంగా స్రవంతిలా జలజలా సాగిపోయేది .పాత్ర ఔచిత్యం తగ్గకుండా ప్రేక్షకులను ఉర్రూతలూగిస్తూ ,తన అభిమానులను సంతృప్తి పరుస్తూ వన్స్ మోర్ లు అందుకొంటూ అభినయి౦ చేవాడు .కల్యాణి రాగ గానం లో మహోన్నత స్థితి అందుకొన్న గాంధర్వ గాయకుడు మాస్టర్ కల్యాణి ‘’అనికీర్తించాడు  మరో గొప్ప నాటక సినీ నటుడు మిక్కిలినేని .
  అదేకాలం లోనే టాకీ సినిమాలు మొదలయ్యాయి ఆప్రారంభకాలం లోనే ముందే మనం చెప్పుకోన్నట్లు ఆయన సీతాకల్యాణం వగైరా లలో నటించి సుభాష్ అనిపించాడు .1937లో వచ్చిన రుక్మిణీ కల్యాణం సినిమాలో రఘురామయ్య కృష్ణుడుగా ,శాంతకుమారి రుక్మిణిగా ,మాస్టర్ కల్యాణి నారడుగా నటించి అద్భుత నటన ప్రదర్శించాడు .తర్వాత పెద్దగా సినిమా అవకాశాలు రాకపోవటం వలన మళ్ళీ నాటకరంగానికి వచ్చేసి నారదుడిగా కృష్ణుడుగా నటించాడు .ఆంధ్రగంధర్వ జొన్న విత్తుల శేషగిరిరావు మాస్టర్ కల్యాణికి ‘’ఆంద్ర బాలగంధర్వ ‘’బిరుదు ప్రదానం చేశాడు .1940లో ఏలూరులోని మోతే నారాయణ రావు అనే జమీందారు కల్యాణిని అత్యుత్తమ నటుడుగా అభిమానించి గజారోహణం తో ఏలూరు పట్టణంలో ఊరేగించి ఘన సన్మానం చేశారు .
అన్నేళ్లు గా  నాటకరంగం లో ఉన్నా ఆయన ఊరేదో పేరేదో ఎవరికీ తెలియదు .భార్యా పిల్లలతో సహా ఏవూరులో నాటకం వేస్తె అక్కడికి వెళ్ళేవాడు .అదే ఆయన ఊరు అనుకొనే వారు .స్థిరంగా ఏఊరులో ఉంటాడో తెలిసేదికాదు .నాటకం మీద వచ్చే ఆదాయమే ఆ యన కు ఆధారం .కనుక వెనకేసుకున్నది ఏమీ లేదు .దాదాపు 48సంవత్సరాలు ఇలాసంచార జీవితం గడిపేశాడు . ఆయనకుఅరవై ఏళ్ళు వచ్చేసరికి నాటకాలలో కూడా పూర్తిగా అవకాశాలు తగ్గిపోయాయి .నిరంతర ప్రయాణాలవలన ఆరోగ్యమూ బాగా దెబ్బతిన్నది .చివరికి కాట్రావులపల్లి ధర్మసత్రం లో కుటుంబంతో గడుపుతూ దీనంగా దయనీయంగా ఆమహానటుదు  ఆంద్ర  బాలగంధర్వ మాస్టర్ కల్యాణి మరణించాడు .
  శ్రీ కిరణ్ ప్రభ కు ధన్యవాదాలతో
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -19-5-22-ఉయ్యూరు

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in సినిమా and tagged . Bookmark the permalink.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.