జయశంకర ప్రసాద్ -5
నవలావ్యూహం
జయశంకర ప్రసాద్ రాసిన ‘’ఆ౦శూ ‘’,కామాయినీ నవలల మధ్యకాలం రచనా దృష్టిలో చాలా ఫలవంతమైన కాలం .ఈ కాలం లో గేయకావ్యాలు ,కధలు ,నవలలు నాటకాలు పండించాడు .ఆయనలో దాగి ఉన్న తర్కం కామాయినిలో విశ్వరూపం దాల్చింది .సమకాలీనత ,చారిత్రత కలిశాయి .మానవ వికాస యాత్రలో ఉత్తీర్ణుని , చేసే ప్రయత్నం జరిగింది .విజన్ ,నిర్ణయాత్మక బుద్ధి జోడు గుర్రాలస్వారీ చేశాయి .స్త్రీ పురుష సంబంధాలలో విప్లవాత్మక మార్పులు రావాలని కోరాడు .కంకాల్ నవలలోని భారత సంఘం సమాజ ఉత్క్రుష్టత కోసం తపించేది .పూర్ణ వ్యవస్థ వ్యక్తీ సజీవ ఉన్నతికి తోడ్పడాలి .ఇందులోని సమాజం ఆధునికయుగానికి చెందిన భౌతికవాదాన్ని గుడ్డిగా నమ్ముతుంది .అనాధబాలలకు ప్రసాద్ అత్యద్భుత వ్యక్తిత్వాన్ని కల్పించాడు .ప్రేమించటం ,ప్రేమించబడటం అనే ప్రాధమిక సూత్రంతో స్త్రీ బంధింప బడి ఉంటుంది .ఇందులోని సంఘటనలు ప్రయాగ ,హరిద్వార్ ,మధుర ,బృందావన్ కాశీ లలో జరగటం విశేషం .తీర్ధయాత్రికుల్ని పండాలు ,దూర్తులు దొంగలు దొంగ వేశ్యలు పట్టుకొని జలగల్లా పీడిస్తారు .సంస్కరణ వాదులైన ఆర్యసమాజం క్రిష్టియన్ మిషనరీ లు కూడా ఉన్నాయి .స్త్రీత్వం అనేది పురుషత్వం మధ్యలో ఉంటూ వికసి౦చాలన్నది ధ్యేయం .కంకాల్ నవల బెంజాన్సన్ నాటకాలను గుర్తుకు తెస్తుంది .ఇందులోని పాత్రలు రిప్రజెంతెషణ్ లు కాకుండా కారి కేచర్స్ లాగా కనిపిస్తాయి .
తితిలీ నవల గ్రామీణ వాతావరణం నేపధ్యంగా రాశాడు .అయినా ఉన్నతవర్గ నగర జీవితమూ చూపి౦చాడు.నిమ్నవర్గ పాత్రలూ ఉంటాయి .కామాయిని రాయటం పూర్తయ్యాక ఇరావతి నవల రాశాడు ప్రసాద్ .ప్రాణాంతకమైన వ్యాధిలో చిక్కుకొని ఈ చారిత్రాత్మకనవల పూర్తిచేయలేక పోయాడు .నవలకు౦డాల్సిన గొప్ప లక్షణాలన్నీ ఉన్న నవలగా ఇది గుర్తింపు పొందింది .
హిందీ అమరకదా రచయయిత మున్షీ ప్రేంచంద్’’ప్రసాద్ గారి నవలలు ,మధువా గుండా లాంటి కధలు చదవటం ఒక శుభప్రదమైన ఆశ్చర్యంగా ఉండేవి ‘’అని కీర్తించాడు .ప్రేంచంద్ పోటీతోప్రసాద్ రాయలేదు తన అనుభూతి తోనే రాశాడు .ప్రేమ చ౦ద్ రాసిన ‘’గోదాన్ ‘’వంటి నవల కఫన్ లాంటి కధ ప్రసాద్ రాయ లేడు.అలాగే మున్షీ కూడా గుండా ,ఆకాష్ దీప్ లాంటి కధలు రాయలేడు.
జయశంకర్ గేయాలలో ఆదర్శం వాదిగా ,నవలా కధలలో భావుకత తాత్వికత లతోపాటు యదార్ధవాదిగా ,అక్కడక్కడ రహస్యవాదిగా కన్పిస్తాడు .గుండా లో ఆత్మబలిదానాన్ని వర్ణించిన తీరు మహోత్క్రుష్టం .ఆదర్శ వాది అయిన ప్రేమికుడి భావం ఒక తరం యొక్క భావనగా కనిపిస్తుంది
ప్రసాద్ కధలలో పాత్రలు ఆయనకు బాగా పరిచయమైన మానవ మాత్రులు .చేతనాచేతనాలు పెనవేసుకొని నడుస్తాయి .సంపూర్ణ కళాత్మక రచనలుగా ఇవి కనిపించి ప్రేరణ కలిగిస్తాయి .జయశంకర ప్రసాద్ రాసిన 12కధలు చిరస్మరణీయాలు .
సశేషం
మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -20-5-22-ఉయ్యూరు