జయశంకర ప్రసాద్ -6
ఒక గీతి అంతరాళం
జయశంకర ప్రసాద్ సంగీత కళా జ్ఞానం ఉన్న కవి .ఆయన రాసిన నాటకాలలో గేయాలు స్వతంత్రంగా పాడుకో తగినవి .కచాయీ లాటి చతుష్పదిలో కొత్త అభి వ్యక్తీ కనిపిస్తుంది .కచాయీ ,లహార్ ,కామాయినీ కావ్యాలు ఆయన వ్యక్తిత్వంతో ,క్రమవికాసం తో ముడి పడి ఉంటాయి .మొదట్లో కవితలు తర్వాత గేయాలు రాశాడు .నిరాలా లో ఈ ప్రత్యేకత అప్పటికి ఇంకారాలేదు .లహార్ కవితా సంకలనం 1935లో వచ్చింది .అప్పటికే ఉత్తమనాటకాలు నవలలు రాశాడు .చాలాకవితలు గీతి సంవేదనాత్మకాలు .ముక్త ఛందస్సులో రాసిన మూడు కవితలు కూడ ఇందులో ఉన్నాయి .చాయా అనే దీర్ఘ కవితకూడా ఉంది .ఇది నిరాలా రాస్సిన ‘శివాజీ లేఖ ‘’తో పోలుస్తారు .ప్రసాద్ గతి స్వాభావికంగా సహజం గా ఉంటుంది .ప్రసాద్ సంయమనం ,క్రమ శిక్షణతో రాశాడు .చక్కని లయతో స్వంత సంగీతంలా ఉంటాయి .’’సెలయేరులా కలకలధ్వనితో-మాధవీ లత పొదరింటి నీడలో – మంత్రం ముగ్ధ మాయలో –చేతనప్రవహిస్తోంది –సుఖ దుఖాల జీవితా౦తపు రాత –వాటితో పడుతూ లేస్తూ ఈ ప్రపంచం తిరోహితమౌతోంది –సెలయేరులో ముద్దిడినప్పుడు –నాలోని రోమరోమం పులకించింది –ఆలింగనం లోకి వచ్చినట్లే వచ్చి కనులు కప్పి పారిపోతుంది –లేలే ఓలఘులోలతరంగమా –కరుణ సరికొత్త ఆవలింతలా –మలయానిల ప్రతి బింబం లా –కాంతి లేని ఈ శరీరాన్ని వెలుగులతో నింపుమా –నర్తి౦చిన అడుగు జాడలను వదలిపోతావు –ఇసుక రేఖలు లేపి లేపి –నీ తరళ కంపనాలతో నింపి పో –జీవితపు శూన్యత్వం లో –ప్రేమ పులకరింతతో నిండి తొలుకుమా –వచ్చి నీరస పులిన ఆధరాన్నిచుంబించు ‘’.ఇందులో కవి ఆశయ మాధుర్య అవధి కనిపిస్తుంది .
సశేషం
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -21-5-22-ఉయ్యూరు