సరస భారతి 165వ కార్యక్రమం గా ‘’సాహితీ పుష్కర మహోత్సవం ‘’ –(బులెటిన్ -2)
సాహితీ బంధువులకు శుభ కామనలు –
సరసభారతి స్థాపించి 12 సంవత్సరాలు అయిన సందర్భంగా ,సరసభారతి అధ్యక్షులు శ్రీ గబ్బిట దుర్గాప్రసాద్ గారి ‘’సహస్ర చంద్ర మాసోత్సవం ‘’’’సందర్భంగా
27-6-2022 సోమవారం సాయంత్రం 4 గం.లకు సరసభారతి 165వ కార్యక్రమంగా ‘’సాహితీ పుష్కరోత్సవం’’,ఉయ్యూరులోని టాక్సీ స్టాండ్ వెనుక ఉన్న ‘’శాఖా గ్రంధాలయం నందు ( A/C లైబ్రరి )నిర్వహిస్తున్నాము .ముఖ్య కార్యక్రమాలు –
1-శ్రీమతి ఏలేశ్వరపు రాధికా సుబ్రహ్మణ్యం (మచిలీ పట్నం )గారిచే ‘’సంగీత విభావరి ‘’
2-శ్రీ గబ్బిట దుర్గా ప్రసాద్ రచించిన ‘’అణుశాస్త్ర వేత్త డా.ఆకునూరి రామయ్య ‘’కు ‘’ఆంగ్లానువాద పుస్తకం ‘’ ఆవిష్కరణ –ఆవిష్కర్త శ్రీ వై విబి రాజేంద్ర ప్రసాద్ – శాసనమండలి మాజీ సభ్యులు .
3- కోరకుండానే సరసభారతి కి విరాళాలను అందించిన వదాన్యులైన శ్రీ మైనేని గోపాలకృష్ణ శ్రీమతి సత్యవతి దంపతులు (అమెరికా ) ,శ్రీ సుంకర కోటేశ్వరరావు(హైదరాబాద్ ) ,డా ఆకునూరి రామయ్య శ్రీమతి కృష్ణ మయి దంపతులు (అమెరికా )డా.రాచకొండ నరసింహ శర్మ(విశాఖ పట్నం ) ,శ్రీ వేలూరి వివేకానంద్ (హైదరాబాద్ ),శ్రీ కోమలి సా౦బావధానిశ్రీమతి విజయలక్ష్మి దంపతులు (అమెరికా )శ్రీ పువ్వుల నరసింహారావు ,శ్రీమతి కరుణానిధి దంపతులు (ఉయ్యూరు ),శ్రీ వేలూరి మృత్యుంజయ శాస్త్రి శ్రీమతి విజయ లక్ష్మి దంపతులు (అమెరికా )శ్రీ జగదీశ్ శ్రీమతి లక్ష్మి దంపతులు (అమెరికా )షార్లెట్ సరసభారతి మొదలైన వారి సౌజన్యంతో సాహితీ క్షేత్రం లో అపూర్వ సేవలు అందించిన –ఆధ్యాత్మిక ప్రవచన ప్రముఖులు బ్రహ్మశ్రీ అన్నదానం చిదంబర శాస్త్రి (చీరాల ),అవధాన రవళి శ్రీ ఆముదాల మురళి (తిరుపతి ),బాలసాహిత్య శ్రీ శ్రీ బెల్లంకొండ నాగేశ్వరరావు (చెన్నై) ,అపూర్వ కథా రచయితశ్రీ గంధం యాజ్ఞవల్క్య శర్మ (నరసరాపేట ),రమ్యభారతి సంపాదకులు ,శ్రీ చలపాక ప్రకాష్ (విజయవాడ ),64 కళల నిపుణ శ్రీ వై.కళాసాగర్ (విజయవాడ ),సోషల్ రిసెర్చ్ పయనీర్ డా .ఎన్ .భాస్కరరావు(ఢిల్లీ) వివిధ సాహిత్య ప్రక్రియల నిపుణ డా. చిల్లర భవానీ దేవి (హైదరాబాద్ ),ప్రపంచ పర్యాటకురాలు గ్రంథకర్త,క్రీడాకారిణి డా. నోముల నర్మదా రెడ్డి (హైదరాబాద్ ),ప్రముఖ సాహితీ వేత్త శ్రీమతి మైలవరపు అరుణ కుమారి(గుంటూరు ), బాలఅష్టావధాని చి.ఉప్పలధడియం భరత శర్మ(తిరుపతి ) స్థానిక చరిత్ర పరిశోధకులు శ్రీ కానూరి బదరీనాథ్ (తణుకు )గోదావరి జిల్లా రచయితల సంఘం అధ్యక్షుడు –శిష్టు సత్య రాజేష్ (అమలాపురం),సాహితీ,ఆధ్యాత్మిక వేత్త శ్రీ కంభం పాటి సుబ్రహ్మణ్యం(కుర్తాళం) మొదలైన సాహితీ ప్రముఖులకు’’సరసభారతి విశిష్టసాహితీ సేవా పురస్కారాలు’’, సాహితీ సేవా పురస్కారాల ప్రదానం .
4-‘’సరసభారతి సాహితీ పుష్కరోత్సవం ‘’ అనే అంశం పై ప్రముఖ కవులచే కవిసమ్మేళనం .
కార్యక్రమ నిర్వహణ ,పర్యవేక్షణ –ప్రముఖ కవి ,విశ్లేషకుడు శ్రీ దండి భట్ల దత్తాత్రేయ శర్మ (విజయవాడ )
సహకారం –శ్రీమతి మాది రాజు శివ లక్ష్మి –సరసభారతి కార్యదర్శి
కవులు ,కళాకారులు ,సాహితీ వేత్తలు ,అతిధులు ,సాహితీ బంధువులు విచ్చేసి జయప్రదం చేయ ప్రార్ధన .
ఆహ్వానించు వారు
జోశ్యుల శ్యామలాదేవి –సరసభారతి గౌరవాధ్యక్షురాలు
శ్రీమతి మాదిరాజు శివ లక్ష్మి –సరసభారతి కార్యదర్శి
శ్రీ గబ్బిట వెంకటరమణ –సరసభారతి కోశాధికారి
శ్రీ వి.బి.జి.రావు –సరసభారతి సాంకేతిక నిపుణులు
తెలుగులో మాట్లాడటం మన జన్మ హక్కు
కవి సమ్మేళనం లో పాల్గొనే కవుల తో సహా మరిన్ని వివరాలు ‘’బులెటిన్ -3’’ లో తర్వాత తెలియజేస్తాం .
27-5-22-ఉయ్యూరు