జయశంకర ప్రసాద్

జయశంకర ప్రసాద్ -9
కామాయిని కావ్య సంశ్లేషణం -3
లజ్జ అధ్యాయం తర్వాత కథ త్వరత్వరగా జరిగిపోతుంది .ఆత్మ విశ్వాసం మేల్కొన్న మనువు యజ్ఞం చేస్తాడు .కాని యజ్ఞ విధానం మర్చి పోవటంతో ఒక పురోహితుడు అవసరమై అకులి ,కులాతుడు అనే ఇద్దరు ఆసుర వచ్చి కామాయిని గారాబంగా పెంచుకొన్న జింకపిల్లను కూడా బలి ఇవ్వటానికి సిద్ధపడి,మనువును ఒప్పిస్తారు .తిరిగి వచ్చిన శ్రద్ధ ఈ దృశ్యాన్ని చూసి తట్టుకోలేక పోతుంది .ముందుముందు రాబోయే అరిష్టాలు తలచుకొని కుమిలి పోయి మనువును నిందిస్తుంది .అతడేవొఆదర్శాలు వల్లిస్తే ,తీవ్రంగా ఖండిస్తుంది .సృష్టి అనేది భగవంతుడు నిరాఘాటంగా నిరంతరంగా సాగించే యజ్ఞమని ,సృష్టి వికసనం లో మానవుడు సహభాగస్తుడనీ,మనిషి ఈ బ్రహ్మాండానికి కేంద్రం కాదని హితవు చెబుతుంది .ఆమె తర్కానికి అతని వద్ద సమాధానం లేక పోవటం తో మనువు మౌనంగా ఉంటాడు .ఆమెతో ఏకీభవిస్తున్నట్లు నటించి సోమరస౦ గిన్నెను ఆమెకిస్తూ ‘’నువ్వు చెప్పినట్లే చేస్తా ‘’అంటాడు .అతడిని నమ్మి సోమరసం అమాంతంగా తాగేస్తుంది .
ఎనిమిదవ అధ్యాయం లో నాయకుడు మనస్తత్వ వేత్త అయిన ఆయన ఈర్ష .శ్రద్ధ గర్భం దాలుస్తుంది .ఆమెలో ఉండే ఆకర్షణ అందం చంచలత్వాదులు క్రమంగా తగ్గిపోయి ,అతని మనసు మారటం ప్రారంభమౌతుంది.అసుర పురోహిత ప్రభావం తో మనువు పూర్తిగా మారిపోతాడు .వేట వ్యసనం అవుతుంది .పేరాశ పెరిగి అసంతృప్తి చోటు చేసుకొంటుంది .శ్రద్ధ మాతృ సౌందర్యం అతడిని కాల్చుకు తింటుంది .గార్హస్త్యం గుది బండ అనుకొంటాడు .ఎందుకు విచ్చలవిడిగా ఉండకూడదు అని తర్కిస్తాడు .
‘’ఇడా ‘’ పేరున్న తొమ్మిదవ అధ్యాయం లో సారస్వత దేశం లో మనువు సరస్వతి నదిఒడ్డున ఒంటరిగా ఉంటాడు .దేవతల నాగరకతకు శంకు స్థాపన జరిగిన ప్రదేశం అది .ప్రస్తుతం ఊసర క్షేత్రం అయింది .దేవాసుర యుద్ధాలు గుర్తుకొచ్చి ,అసురులు శరీరాన్ని పూజించటం ,దేవతలు అహంకారం తో తమరినే ఆత్మగా భావించటం గుర్తుకొస్తుంది .నిజమైన ఆత్మజ్ఞానం లేకుండా దేవరాక్షసులు ఉండిపోయారు .ఇద్దరూ వంచితులై పోరాటానికి దిగారు .సంస్కార బీజాలు నిర్మూలనం కాకపోగా తిరిగి పుట్టి ,శ్రద్ధను పరిత్యజించటం దాకా సాగింది .మనువు మనసును కామభావన తొలి చేస్తూ ‘’ఆ సౌందర్య సాగరం లో నువ్వు గరళపాత్రనే ని౦పుకున్నావు ,నీ ప్రజాహితభావాలు కలుషితమయ్యాయి ,భవిష్యత్తులో కూడా కోపిష్టిగా నే ఉంటావు ,నిజమైన శ్రద్ధ రహస్యాన్ని ప్రజలు మర్చి పోతారు ,స్వర్గం ఎక్కడో లేదు .ఈ భూమి కళ్యాణ వేదిక .అది తన అతిక్రమణలో సహజ రహస్యాన్ని మరచి పరలోక వంచనకు గురౌతుంది .బుద్ధి భ్రాంతిలో కొట్టుమిట్టాడుతుంది .’’
తర్వాత మనువు బుద్ధికి ప్రతీక అయిన ‘’ఇడ’’ను కలుస్తాడు .ఆమె ఒకప్పుడు రాణిగా ఉండి పాలించిన ప్రాంతం అది .అతని వ్యధ విన్న ఆమె అతడు పరిపూర్ణుడు అని ,అతడికి కావాల్సిన సహాయమతడే చేసుకోవాలని ,,సకల ఐశ్వర్యనిలయ ప్రకృతి అతనికోసం నిరీక్షిస్తోందనీ ,కంటికి కప్పిన పొర తొలగించు కోమని ,అందర్నీ శాసిస్తూ యోగ్యతలు విస్తరించు కోమని ,అతడే నిర్ణాయకుడు ‘’అని బోధిస్తుంది ఇడ.
పదవ అధ్యాయం లో శ్రద్ధకు ఒక కలవస్తుంది .అందులో సారస్వత దేశం లో మనువు ఇడ తో కలిసి పాలిస్తున్నట్లు ,సంస్కారయుత నాగరకతను సృష్టిస్తున్నట్లు అవన్నీ చూస్తూ ఒక ఆశ్చర్యకర మహలు లో ప్రవేశించినట్లు అక్కడ సింహాసనం పై మనువు ను చూసినట్లు ,ఇడఅతనికి మధుపాత్ర అందిస్తున్నట్లు ,అతడు ఆమెతో ‘’ఇంత సుందర హర్మ్యం నిర్మించానుకానీ ఇక్కడ నా హృదయ మందిరం లో ఎవరుంటారు ?’’అని అడిగినట్లు ,జవాబుగా ఇడ’’నేను నీ ప్రజలలోని ఆర్తి ని ‘’అన్నట్లు ,కామంద మనువు ఆమెను బాహువులలో బందించినట్లు ,భయకంపితయై ఆమె అతడిని తోసేసినట్లు ,అతడి చేస్ట అక్కడ అల్లకల్లోలం సృష్టించినట్లు ,బాధిత ప్రజాసమూహం అతనివైపు విపరీతమైన కోపంతో రావటం ,ప్రజలు తిరగ బడుతున్నారనే భయంతో మనువు ప్రధాన ద్వారాన్ని మూసేయించటం ‘’కలలోస్పష్టంగా చూసింది శ్రద్ధ .
ఆమె కల నిజమే .సారస్వత దేశ ప్రజలు బాధలు పడుతూ ఉంటారు మహల్ లో మనువు ఆలోచిస్తూ ఉంటాడు .సాను సర్వాధికారినని ప్రజలకు అనేక మేళ్ళు కలిగించాననీ,అయినా వారికి విశ్వాసం లేదని అనుకొంటాడు . ఇడఅక్కడికి వచ్చి ‘’శాసనం చేసినవాడే ఉల్లంఘిస్తే వాడికిసర్వనాశనం తప్పదు .ఏప్రజాపతీ ఇప్పటిదాకా హద్దు లేని అధికారం అనుభవించలేదు .ఇక ముందు కూడా అనుభవించడు ‘’అని స్పష్టంగా చెప్పింది –‘’రాగం తాళం పాటించిన లయను తప్పిపోనివ్వకు –తెలియకుండానే నువ్వు వివాద స్వరాన్ని వదలకు ‘’అని హెచ్చరిస్తుంది .
మనువు ప్రతిక్రియ ఉగ్రరూపం దాలుస్తుంది .ఇడను’’ మాయావి ‘’అని దూషిస్తాడు .ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తాడు .సింహద్వారం తెరుచుకొంటుంది .ప్రజలు లోపలి ప్రవేశించి ‘’నువ్వే లోభగుణాలను నేర్పావు .యంత్రాలు ప్రవేశపెట్టి మాసహజ శక్తులను ధ్వంసం చేశావు ‘’అని కోపంగా విరుచుకు పడగా తోక తొక్కిన పాములా,క్రోధం తో ఊగిపోయాడు .’’ప్రకృతి చేతిలో కీలు బొమ్మల్లారా ‘’అంటూ నిందిస్తాడు .ఆకులి, కిలాతుడు ఈతిరుగు బాటుకు నాయకత్వం వహించటం చూసి ఆశ్చర్యపోతాడు .వాళ్ళను ధరాశాయిలుగా మార్చి ఆఘర్షణలో మనువు కూడా గాయపడతాడు .
సశేషం
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -30-5-22-ఉయ్యూరు

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in పుస్తకాలు, సమీక్ష and tagged . Bookmark the permalink.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.