ప్రఖ్యాత ఆయుర్వేద డాక్టరై ,’’కేసరి కుటీరం ‘’స్థాపించి లోధ్ర మొదలైన మందులు తయారు చేసి’’ గృహలక్ష్మి ‘’అనే వారపత్రిక ద్వారా దాదాపు అర్ధ శతాబ్ది సాహిత్య సేవ చేసి,’’స్వర్ణ కంకణాలతో ‘’ ప్రముఖ మహిళలను సత్కరించి, మద్రాస్ లో కేసరి ఉన్నత విద్యాలయం స్థాపించి విద్యాసేవ చేసిన మనం మరచిపోయిన మహానుభావుడు – కె.ఎన్. కేసరి అనే శ్రీ కోట నరసింహం గారు
కె.ఎన్.కేసరి (1875 – 1953) గా పేరు పొందిన ఈయన అసలు పేరు కోట నరసింహం. కేసరి కుటీరం అనే ఔషధశాల స్థాపకుడు. మదరాసులోని మైలాపూరులో కేసరి పాఠశాలను స్థాపించాడు. కేసరి దానశీలిగా పేరు గాంచారు. స్త్రీ జనోద్దరణకై గృహలక్ష్మి మాసపత్రికను స్థాపించాడు. కర్నాటక సంగీత విద్వాంసుడు, సినీ గాయకుడైన ఉన్ని కృష్ణన్ ఆయన మునిమనుమడు.[1]
బాల్యం
కేసరి, 1875 ఏప్రిల్ 26 న ప్రస్తుత ప్రకాశం జిల్లాలోని మద్దిపాడు మండలానికి చెందిన ఇనమనమెళ్ళూరు గ్రామంలో జన్మించాడు. ఈయన తల్లిదండ్రులకు ఒక్కడే కుమారుడు. వీరిది పేద కుటుంబం. కేసరికి ఐదేళ్ల వయసులో తండ్రి మరణించాడు. తల్లికి ఇంటి పనుల్లో సహాయం చేస్తూ ఉండటం వల్ల బడికి సరిగా వెళ్ళగలిగేవాడు కాదు. తల్లి దర్జీ పని చేస్తుండేది. తల్లి కష్టపడి తనను పెంచి పెద్ద చేస్తుండటం గమనించిన ఈయన, తన పదకొండేళ్ళ వయసులో కాలినడకనే మద్రాసు చేరుకుని అక్కడే చదువుకోవడం మొదలు పెట్టాడు. హిందూ ధార్మిక పాఠశాలలో స్కాలర్‌షిప్పు పొందాడు. కొంతకాలానికి 1889లో తల్లి కూడా మద్రాసుకు వచ్చి అతనితో ఉండసాగింది. ఆ తర్వాత కొద్దికాలానికే ఆమె జబ్బుచేసి మరణించింది. ఆయన తన చిన్ననాటి జ్ఞాపకాలను “నా చిన్ననాటి ముచ్చట్లు” అనే పుస్తకంగా ప్రచురించాడు.[2]
వైద్యవృత్తి
చదువు పూర్తి చేసుకుని పలుచోట్ల ఉద్యోగ ప్రయత్నాలు చేసినా అవేమీ సత్ఫలితాలను ఇవ్వలేదు. తర్వాత ఆయన వైద్యం నేర్చుకోవడం ప్రారంభించాడు. కోమట్ల సహాయంతో శ్రీ కన్యకాపరమేశ్వరీ ఆయుర్వేద వైద్య కళాశాలలో కొలువు సంపాదించాడు. 1900 సంవత్సరంలో మద్రాసు జార్జిటౌన్ నారాయణ మొదలి వీధిలో ఒక చిన్న బాడుగ ఇంటిలో కేసరి కుటీరము పేరుతో మందుల తయారీ సంస్థను ప్రారంభించాడు.
సామాజిక కృషి
1928లో కేసరి, సామాజిక రాజకీయ రంగాలలో మహిళను ప్రోత్సహించేందుకై గృహలక్ష్మి అనే తెలుగు వారపత్రికను స్థాపించి, దానికి వ్యవస్థాపక సంపాదకుడిగా,[3] మహిళా రచయితలను పెంపొందించాడు.[4] మహిళా రచయితలను సత్కరించేందుకు గృహలక్షి స్వర్ణకంకణమనే పురస్కారాన్ని స్థాపించాడు.[5]
1943లో కేసరి మద్రాసులోని మైలాపూరు తెలుగు ప్రాథమిక పాఠశాల యొక్క యాజమాన్యపు బాధ్యతలను తీసుకొని దానికి తగిన నిధులు సమకూర్చి, ఉన్నత పాఠశాల స్థాయికి తీసుకెళ్ళాడు[6] 1951లో తన విద్యాభివృద్ధి పనులను మరింత విస్తరించడానికి కేసరి విద్యాసంస్థ అనే ధర్మాదాయసంస్థను ఏర్పాటుచేసాడు. ఆ సంస్థ తన ఆధ్వర్యంలో ఇప్పడు అనేక పాఠశాలలను నడిపిస్తున్నది.[7]
కేసరి కుటీరం ఉత్పాదనలు
· అమృత, రక్తశుద్ధిద్రావకము
· అర్క, సర్వజ్వరనివారిణి
· కేసరి డెంటల్ క్రీం, దంతధావన నవనీతము
· కేసరి పుష్పత్రయము
· లోధ్ర
రచనలు
ఆయన జీవిత విశేషాలను చిన్ననాటి ముచ్చట్లు పేరుతో పుస్తకంగా రాశాడు.[8] పుస్తకంగా విడుదలైన తర్వాత వీరి జీవిత విశేషాలను ధారావాహికగా జగతి (పత్రిక) లో జూలై 1989 నుండి ప్రచురించబడింది.[
గృహ 20వ శతాబ్దంలో ప్రముఖ ఆయుర్వేద వైద్యనిపుణులు కె.యన్. కేసరి స్త్రీల సంక్షేమ కార్యక్రమాలు చేపట్టేరు. 1924 లో గృహలక్ష్మి మాసపత్రిక స్థాపించి స్త్రీవిద్యకీ, రచనావ్యాసంగానికి కృషి చేసేరు. 1934లో స్వర్ణకంకణము పురస్కారము ప్రారంభించి సాహిత్య, సాంస్కృతిక, తదితర రంగాలలో విశిష్టసేవ చేసిన స్త్రీలను సత్కరిస్తున్నారు. ఆధునిక యుగంలో స్త్రీలని క్రమపద్ధతిలో ఏటా సత్కరించడం ఈ స్వర్ణకంకణముతో మొదలయింది.
స్వర్ణకంకణముతో సత్కారం పొందిన మహిళలు
కనుపర్తి వరలక్ష్మమ్మ (1934)
చిలకపాటి సీతాంబ (1935)
కాంచనపల్లి కనకమ్మ (1936)
పులవర్తి కమలావతి (1937)
బాలాంత్రపు శేషమ్మ, రత్నాల కమలాబాయి (1938)
బాలాంత్రపు శేషమ్మ (1939లో పురస్కార గ్రహీత)
వి. రాధామనోహరి, చేబ్రోలు సరస్వతీదేవి (1940)
బత్తుల కామాక్షమ్మ (1941)
ఉన్నవ లక్ష్మీబాయమ్మ (1948)
బెంగుళూరు నాగరత్నమ్మ (1949)
గిడుగు లక్ష్మీకాంతమ్మ (1951)
స్థానాపతి రుక్మిణమ్మ (1952)
ఊటుకూరి లక్ష్మీకాన్తమ్మ (1953)
పొణకా కనకమ్మ(1955)
కొమ్మూరి పద్మావతీదేవి (1956)
కె. రామలక్ష్మి(1957)
దేశిరాజు భారతీదేవి(1958)
గుడిపూడి ఇందుమతీదేవి (1959)
కానుకొల్లు చంద్రమతి(1960)
ఎ. కనకదుర్గా రామచంద్రన్ (1961)
1962, 1963 సంవత్సరాలలో బహుమతులు ఇవ్వలేదు.
ఇల్లిందల సరస్వతీదేవి (1964)
తెన్నేటి హేమలత (1965)
ద్వివేదుల విశాలాక్షి (1966)
కోడూరి కౌసల్యాదేవి (1967)
ముప్పాళ్ళ రంగనాయకమ్మ (1968)
యద్దనపూడి సులోచనారాణి (1969)
ఐ.వి.యస్. అచ్యుతవల్లి (1970)
డి. కామేశ్వరి (1971)
సి. ఆనందారామం (1972)
కోడూరి లీలావతి (1974)
ద్వారక పార్థసారథి (1975)
వాసిరెడ్డి సీతాదేవి (1976)
గుళ్ళపల్లి సుందరమ్మ (1977)
మాదిరెడ్డి సులోచన (1978)
తురగా జానకీరాణి (1982)
అవసరాల (వింజమూరి) సీతాదేవి (1984)
జె.భాగ్యలక్ష్మి (1986)
నాయని కృష్ణకుమారి
వేదుల మీనాక్షీదేవి
మాలతీ చందూర్
ఉన్నవ విజయలక్ష్మి
పోలాప్రగడ రాజ్యలక్ష్మి
శారదా అశోకవర్థన్
వాసా ప్రభావతి
మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -3-6-22-ఉయ్యూరు