పేద బాలికల విద్యకోసం నోటర్ డాం సంస్థలు నిర్మించి సేవ చేసినఫ్రెంచ్ మదర్ సుపీరియర్ –సెయింట్ జూలీ బిలియర్ట్ –గబ్బిట దుర్గాప్రసాద్.

పేద బాలికల విద్యకోసం నోటర్ డాం సంస్థలు నిర్మించి సేవ చేసినఫ్రెంచ్ మదర్ సుపీరియర్ –సెయింట్ జూలీ బిలియర్ట్ –గబ్బిట దుర్గాప్రసాద్.విహంగ మహిళా వెబ్ మాసపత్రిక .జూన్
01/06/2022 గబ్బిట దుర్గాప్రసాద్
మేరీ రోజ్ జూలీ బిలియర్ట్ 12-7-1751న ఫ్రాన్స్ లోని కువిలీ లో జీన్ ఫ్రాన్సిస్ బిలియంట్ ,మేరీ లూసీ ఆంటోనెట్ దంపతులకు జన్మించి ఏడుగురు సంతానం లో ఆరవ పిల్ల .ఏడవ ఏటనే’’ కాటేచిసం ‘’కంఠతా పట్టి తన స్నేహితురాల్లను పిలిచి అప్పగింఛి ఆశ్చర్యపరచేది .ఆమె అంకుల్ తిబాల్ట్ గుల్బెర్ట్ నడిపే బడిలో ప్రాధమిక విద్య నేర్చింది .ప్రీస్ట్ ఫాదర్ డాంగి చర్చిలో ఆయన సమక్షం లో మొదటి కమ్యూనియన్ చేయగా ఆమె వయసు 9అని నిర్ధారించాడు .అయిదేళ్ళ తర్వాత ‘’చాస్టిటి’’అనే శీల ప్రవర్తనం పై ప్రతిజ్ఞ చేసింది .కుటుంబం అప్పుల పాలయి నందున టీన్ ఏజ్ లో శారీరక కష్టం చేసి సంపాదించి కుటుంబానికి సాయపడేది  .
  ఆమె పవిత్ర ,విశుద్ధ ప్రవర్తనకు అందరూ ఆశ్చర్యంతో మురిసి పోయి ‘’సెయింట్ ఆఫ్ కువిల్లీ ‘’అని గౌరవంగా సంబోధించేవారు .ఇరవై రెండేళ్ళ వయసులో  తండ్రి పై,ఆయన అజ్ఞాత విరోధి అకస్మాత్తుగా జరిపిన పిస్టల్ కాల్పులలో ఆమె కింది శరీరభాగం పాక్షిక పక్షవాతానికి గురైంది .తర్వాత కొన్నేళ్ళకే ఆమె మంచానికే పరిమితమైపోయి 30ఏళ్ళు ఉండిపోయింది .ఈకాలం లో నిత్య పవిత్ర ప్రార్ధనలతో అనుభూతులతో ,అసాధారణ ప్రార్ధనా పరురాలైంది.తర్వాత జీవితకాలమంతా చుట్టు ప్రక్కల పిల్లలను రప్పించి వారిని ‘’మొదటి కమ్యూనియన్ ‘’కు శిక్షణ ఇచ్చేది .
1789  ఫ్రెంచ్ విప్లవ కాలం లో రివాల్యూషనరి సైన్యం మత విశ్వాసమున్న వారిని గుర్తించి నిర్దాక్షిణ్యంగా చంపేది. ఆమె స్నేహితులు ఆమెను కువిలీ నుంచి ఒక గడ్డి బండి లో రహస్యంగా  అక్కడి నుంచి తప్పించారు. కా౦ పీన్  చేరి అక్కడ రోజుకో ఇంట్లో రహస్యంగా గడుపుతూ ,విపరీతమైన శారీరక బాధలను తట్టుకొంటూ గడిపింది .కొంతకాలం ఆమె కు మాటకూడా పడిపోయింది .కానీ ఈ కాలం ఆమె మానసికం గా , ఆధ్యాత్మికంగా ఎదగటానికి అద్భుతంగా ఉపయోగపడింది .ఆమెకు ఒక రోజు ఒక విజన్ కనిపించి ,ఒక అదృశ్య వాక్కు ‘’ “Behold these spiritual daughters whom I give you in an institute marked by the cross.”అని చెప్పినట్లు గ్రహించింది .
ఇలా గడపగడపకు తిరుగుతూ ప్రవాస జీవితం గడుపుతున్న జూలీ కి ఒక రోజు అరిష్టోక్రాటిక్ మహిళ ఫ్రాంకాయిస్ బ్లిన్ డీ బోర్డన్ తో పరిచయం కలిగి౦ది .జూలీ లోని   మతవిశ్వాసానికి ,బోధనా పటిమకు అబ్బురపడి ఆశ్రయమిచ్చింది  .ఇద్దరూ కలిసి ‘’ఇన్ ష్టిట్యూట్ ఆఫ్ నోటర్ డాం’’అనే పేద యువ క్రిస్టియన్ విద్యార్ధినులకు  విద్య నేర్పించే సంస్థ ను నెలకొల్పారు .ఇందులోనే వారికి కేటాక్రిస్ట్ లో శిక్షణ కూడా ఇచ్చేవారు .మొదటి ఏడాది పూర్తికాగానే మొదటి నోటర్ డాం బాచ్ సిస్టర్స్  ప్రతిజ్ఞ చేశారు . అదే కాలం లో జూలీ బిలియర్ట్ వ్యాధికూడా అకస్మాత్తుగా మాయమై ఆమె మామూలు ఆరోగ్యవంతురాలైంది.22ఏళ్ళ తర్వాత మొదటిసారిగా ఆమె నడవటం మొదలు పెట్టింది .
  జూలీ మనసంతా బీదప్రజల అవసరాలు తీర్చటం వారి విద్యపైనే ఉండేది .సమాజంలోని ఇతరులకు కూడా క్రైస్తవ బోధన అవసరమని గ్రహించింది .ఆ ధ్యేయం తో  జీవితకాలమంతా ఫ్రాన్స్ ,బెల్జియం దేశాలలో నోటర్ డాం లాంటి సంస్థలను ,స్కూల్స్ ను ఎన్నిటినో నెలకొల్పి పేదలకు విద్యాదానం చేసింది .తర్వాత జూలీ ,ఫ్రాంకాయిస్  లు మాతృ సంస్థ ను బెల్జియం లోని నెమర్ కు మార్చారు
జూలీ కి ఆమె శారీరక ఇబ్బంది ప్రజా సేవలో ఆటంకం కలిగించలేదు .టీచింగ్ ఆర్డర్ ను తీర్చి దిద్దటం పేదలకు ధనికులకు కూడా అవసరమైన విద్య అందివ్వటం లో ఆమె చేసిన కృషి అద్వితీయం .అప్పటి భయంకర పరిస్థితులలో,భీభత్స పాలనలో  ఆమె ఇంటికే పరిమితమైపోయింది .రాబెస్ పియర్రీ పతనం తర్వాత అకస్మాత్తుగా చావునుంచి తప్పించుకోగలిగింది .అప్పుడు ఈ ‘’సెయింట్ చుట్టూ అక్కడి ఉన్నత వంశపు యువతులందరూ కలిసి ఒక బృందంగా ఏర్పడగా ,వారికి భగవంతుని నమ్మి పవిత్ర జీవనం సాగించటం ,తోటి అనాధలకు సేవచేయటం నేర్పింది .వీరంతా నియామబద్ధ జీవితాలు గడుపుతూ పవిత్ర జీవితంతో లోకులకు సాయం చేస్తూ జీవితాలను ధన్యం చేసుకొన్నారు .
1803 లో ఫాదర్ వారిన్ బిపఫ్ అమీన్స్ ల ఆశీస్సులతో చాలామంది ఈ ఇద్దరు సుపీరియర్స్ కు  బిలియర్ట్ ,డీబౌర్డాన్ లకు  సహాయకులుగా ఉండటానికి స్వచ్చందంగా ముందుకు వచ్చారు .అందులో ముందుగా ఎనిమిది మంది అనాధలు ముందుకు వచ్చారు .1-6-1804న బిలియంట్ కు ఆమె సుపీరియర్స్ ప్రార్ధనల ఫలితంగా పక్షవాతం నయమైంది .అప్పుడు వీరంతా కలిసి అక్టోబర్ 15న తమ ఇంటిపేర్లను సెయింట్స్ పేర్లుగా మార్చుకొన్నారు .క్రిస్టియన్ బాలికల విద్యావ్యాప్తి చేయాలని నిర్ణయించారు .దీనికోసం అనేక కాన్వెంట్ లు నెలకొల్పి వాటిని పర్యవేక్షి౦చ టానికి సమర్ధులను నియమించారు.’సిస్టర్స్ ఆఫ్ నోటర్ డాం’’అనే సంస్థ ఇలా ఏర్పాటైంది .ఈ వ్యవహారమంతా బిలియర్ట్ చాల బ్రిలియంట్ గా నిర్వహించింది .ఆమెకు మదర్ సెయింట్ జోసెఫ్ సహాయం చేసింది .19-7-1806లో ఈ సంస్థ ఇంపీరియల్ డిక్రీ ద్వారా గుర్తింపు పొంది౦ది అప్పుడు సభ్యులు 30మంది ఉన్నారు .ఆతర్వాత ఈసంస్థలుఫ్రాన్స్ ,బెల్జియం దేశాలలో అనేక టౌన్ లలో ఏర్పాటయ్యాయి .అందులో ఘెంట్ ,నమూర్ లోని సంస్థలు బాగా  పేరుపొందాయి .మదర్ జోసెఫ్ మొదటి సుపీరియర్ అయింది వీటికి .
  ఆ సిటికమ్యూనిటి కన్ఫేషర్ వానిస్  వెళ్ళాక ది ఆబే డీ సంబూసి డీసెయింట్ ఎస్టేవ్ చాలాసమర్ధతతో నిర్వహిస్తూ ,అనేక కాంగ్రి గేషన్ లను స్థాపించి ,పురాతన సనాతన విధాలతో కలుపుతూ వాటి మధ్య గొప్ప సమన్వయము సాధించాడు .బిషప్ డేమాన్దాల్క్స్ పై గొప్ప ప్రభావం కల్గించగా ,బిలియర్ట్ కు దియోసిస్ ఆఫ్ అమీన్స్ ను విడువక తప్ప లేదు .అప్పుడు పిసాని డీలాగౌడే అనే నార్మన్ బిషప్ బిలియర్ట్ ను ఆహ్వానించి అక్కడి సెంటర్ బాధ్యతలు అప్పగింఛి నూతన విధానాలకు శ్రీకారం చుట్టమని ఆదేశించాడు .
  బిలియర్ట్ అక్కడికి వెళ్లి అక్కడి వారిని వారికీ నచ్చిన విధానం లో ఉండటానికి లేక తనను అనుసరించటానికి స్వేచ్చ నిచ్చింది .ఇలా 1809 మధ్యలో నామర్ కా  న్వెంట్ ఆ సంస్థ కు గొప్పకేంద్రమై,ఇప్పటికీ నిలిచింది .తర్వాత ఆమెను అమీన్స్ కు తిరిగి వెళ్లి అక్కడి సంస్థను పునర్నిర్మించామన్నాడు .కాని ఎన్ని రకాల ప్రయత్నాలు చేసినా ,అక్కడ డబ్బులూ లేవు ,ఆసక్తి ఉన్నవారూ లేకపోవటం తో వెంటనే నామర్ కు  తిరిగి వచ్చేసింది .
  జీవితం లో చివరి పదేళ్ళు అక్కడి డాటర్స్ ను పవిత్ర జీవనం ,ఆధ్యాత్మిక శక్తి కేంద్రాలుగా మార్చే ప్రయత్నం చేసి కృత కృత్యురాలైంది .దైవ సాన్నిధ్యం లో ప్రతిక్షణం ఉంటూ ఎందఱో పవిత్ర ఆత్మలకు మార్గదర్శి అయింది .1804-1816 మధ్య 12 ఏళ్ళు బిలియర్ట్ 15కాన్వెంట్ లను స్థాపించి ,120సార్లు అక్కడికి వెళ్లి వస్తూ ,వాటి అభి వృద్ధిని పర్యవేక్షించింది .డాటర్స్ తో ఎన్నో ఆంతరంగిక సమావేశాలు నిర్వహించి వారిని తీర్చి దిద్దింది .ఆమె రాసిన వందలాది ఉత్తరాలు మాతృ సంస్థలో ఇప్పటికీ భద్రంగా ఉన్నాయి .
  1815లో బెల్జియం నెపోలియన్ యుద్ధాలకు కేంద్రమైంది .మదర్ జనరల్ బిల్లియర్ట్ చాలా ఆందోళనకు గురైంది .దీనికి కారణ౦  ఆమె సంస్థలు చాలాభాగం అ సైన్యం వెళ్ళే మార్గం లో ఉండటమే .కానీ వారెవరికీ గాయాలు తగలలేదు .1816 జనవరిలో మదర్ కొద్దిగా జబ్బు పడింది .64వ ఏట 13-5-1816న బెల్జియం లోని మదర్ హౌస్ లో సుపీరియర్ మదర్ జూలీ బిలియర్ట్ తుది శ్వాస వదిలి ,దేవుని చేరింది .ఆమె కానో నైజేషన్ 1881లో ప్రారంభమైంది .13-5-1906లో పోప్ ప యస్-10 బ్యూటిఫై చేస్తే,1969లో ఆరవ పోప్ పాల్ కానోనైజ్ చేశాడు .లోకమంతా బిలియర్ట్ వదాన్యత ను గొప్పగా శ్లాఘించారు .ఆమె గౌరవార్ధం  వందలాది  స్కూళ్ళు నిర్మించారు .అమెరికాలో కూడా నోటర్ డాంస్కూల్స్ స్థాపించబడ్డాయి .నోటార్ డాండీ నామర్ యూని వర్సిటి ఏర్పడింది .అలాగే ఇంగ్లాండ్ లోనూ ఇవి వెలిసి ఆమె సేవలను నిత్యం స్మరిస్తున్నారు .1969లో ఇంగ్లాండ్ లోని మెర్సిసైడ్ లో ఆధునికంగా నిర్మించిన చర్చి ని ఆమెకు అంకితం చేశారు .ఆమె స్థాపించిన సంస్థలు ఇప్పటికీ నిరుపేదల విద్యకు గొప్ప సాయమందిస్తున్నాయి .’’టీచింగ్ ది చిల్ద్రెన్ వాట్ దే నీడ్ టు నో ఫర్ లైఫ్ ‘’అనే జూలీ బిలియర్ట్ స్పూర్తి ఇంకా ప్రతిధ్వనిస్తూనే ఉంది .జాలీ బిలియర్ట్ ‘మొట్టమొదటి సుపీరియర్ జనరల్ ఆఫ్ ది కాంగ్రి గేషన్ ఆఫ్ ది సిస్టర్స్ ఆఫ్ నోటార్ డాం డీ నమూర్ ‘’.
The Catholic Church holds that “all who die in God’s grace and friendship but still imperfectly purified” undergo the process of purification which the Church calls purgatory, “so as to achieve the holiness necessary to enter the joy of heaven“.
మనం ఏదైనా సాయం కోసం స్నేహితుల్ని ఇతర బంధువుల్ని కోరినట్లు ఈ సంస్థవారు మనతరఫున వారికి సాయం చేయమని దేవుడిని ప్రార్ధిస్తారు .
–గబ్బిట దుర్గాప్రసాద్
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~.

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in రచనలు. Bookmark the permalink.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.