శ్రీ ద్వారకాపతి శతకం -2(చివరిభాగం )
‘నలువయి సృష్టి సల్పితి,జనార్దనుపేర బెంచుచుంటి వీ-లనరగా జంద్ర శేఖరుడ వై నశియి౦పగా బుచ్చుచుంటి వి’’నిర్మలంగా మూడు పేర్లూ నీవే .తర్వాత మత్యావతార,కూర్మ ,వరాహ నరసింహ ,వామన పరశురామ ,రామ,కృష్ణ ,బుద్ధ ,కల్కి అవతారాలు, చేసిన అద్భుతకార్యాలు వేర్వేరు పద్యాలలో వర్ణించి’వేల్పుల గిడ్డివేల్పుల నవీనపు బువ్వలబెట్టి ప్రోచు నా –వేల్పుల వేల్పు వౌదు ‘’అని తనకు శరణు ఇమ్మనికోరాడు కవి .వేద పరిపూర్ణులను చూస్తె నీకు సంతోషం ,శాస్త్ర సంవాదుల్ని చూస్తె ఆనందం ,పండిత భాషకు ఆహ్లాదం చెందుతావు ,వివాదం వస్తే కాలుదువ్వుతావు అన్నాడు , ‘’క్షాత్రవ శిక్ష సల్పగా విచక్షణ దక్షుడవౌదు .ఆ క్షాత్రపు చిహ్న లొందుచూ,విశాలయశస్సు పొందావు . ‘’గొల్ల చేడియలను వికార చేష్టలతో మోహపెట్టావు ,జార చోర బిరుదులూ పొందావుకానీ వేదాలకు ఆధారమే నీవని నాకు తెలుసు .’’వెన్న దొంగవై రంగడవన్న కీర్తిపొందావు.సిరికి మగడవైన నువ్వు మమ్మల్ని దరిద్రం లో ఉంచటం నీ మగసిరికే అవమానం .’’దారము కూర్చు పుష్పముల దండ గతిన్ వసియించి ,జీవులం దారయ నీవే యంతట మహాత్ముడవు ‘’అని చక్కగా చెప్పాడు .
శ్లేషలకు ఉబ్బిపోతారు కొందరు ,ఆడవాళ్ళుకూడా అంతే కానీ ‘’గొప్పగా మృదూక్తి పద్య సంభాషలకు లోకులు గొప్పగా ఆన౦దిస్తారు .జుట్టూ జుట్టూ ముడివెయ్యటం లో మహా నేర్పరివి .కౌరవులని చీల్చి పాండవులకు రాజ్యమిప్పించావు .అలాగే నాకోరిక తీర్చు .’’అపగత కిల్బిషు డవు,మహాత్ముడవు అలాంటి నిన్ను నా చపల కాంక్షతో నిన్ను ని౦ది౦చాను .నీభక్తినిచ్చి నన్నుకాపాడు .చరాచరాలకు నువ్వు జీవనం ,నీ విలసనం ప్రాణులకు విస్తృత తేజం ,నన్నుకాపాడు .’’ఫుల్ల సరోజనేత్ర ,పరిపూర్ణ జలా౦బుదగాత్ర ,శాంభవీ –వల్లభ మిత్ర ,లోకనుతిపాత్ర మహాఘలతాలవిత్ర స-ద్ధల్లకపత్ర చిత్రతర దామ విదర్భ సుతా కళత్ర రా –జిల్లెడుత్వత్క్రుపా రసముం జిందవె నాపయి ద్వారకాపతీ’అని పరవశంతో కవి కీర్తించాడు .
‘’సూనృత భాష ,నీల ఘన సుందరవేష,యశో విశేష సు-జ్ఞాన మనో విభూష వర కౌస్తుభన్మణి కాంతి పూషసం-ధానిత సర్వ భక్త వరదానక తోష ,యశేష లోక దు-ర్మానిత భూరిదోష ‘’అంటూ భక్తపోతనలా తేనెలు రంగరించి కవిత్వం చిలికించాడు ఈభక్తకవి . ‘’నెలకు ద్రివృష్టి నింపి ధరణిలో సస్య గో సంవృద్దిపెంచి ,సర్వజీవులు ఆనంద మయ సుఖ జీవనం చేసేట్లు చెయ్యమని ద్వారకాపతి ని వేడుకొన్నాడు .చివరి పద్యంగా చంపకమాలలో –‘’యువ యను నేటమాధవ సితో త్ప్రతిపత్ధిర వాసరా౦ మం-దవిరళ భక్తి దావక పదాంబుజ యుగ్మ సదర్చ సేయనే –ప్రవిమల పద్య పుష్పముల బాగుగనూటొకయెన్మిది౦టి మా –ధవ యిడియుంటి గొంచునను దన్పవె నీ కృప ద్వారకాపతీ’అని శతకం ముగించారు శ్రీమదాది భట్ట శ్రీరామ మూర్తి కవి .
మంచి భక్తి శతకం ,విశ్వనాథ ఆశీస్సు పొందిన కవి రచన .సర్వోత్క్రుష్టంగా సాగింది .చదివి ఆనందించి తరించాల్సిన శతకం .పరిచయం చేసే భాగ్యం నాకు దక్కింది .
మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -6-6-22-ఉయ్యూరు–