విశ్వ పుత్రిక తోరూ దత్-8
ఇంగ్లాండ్ లో తోరూ కుటుంబం
దత్తు కుటుంబం ఇంగ్లాండ్ లో లండన్ లోని చారింగ్ క్లాస్ హోటల్ లో ముందు బస చేసి ,తర్వాత బంధువు రమేష్ చందర్ మాట్లాడిఉన్చిన గ్రాస్ వెనర్ హోటల్ గదుల్లో ఉన్నారు .తర్వాత బ్రాండం లో అన్ని వసతులు ఉన్న ఇంట్లో చేరారు .సిడ్నీ ప్లేస్ ,ఆన్ స్లో స్వేర్ లో 9వ నంబర్ ఇల్లు అది .ఇక్కడే అక్కచెల్లెళ్ళు ఫ్రెంచ్ కవితల్ని ఇంగ్లీష్ లోకి అనువదించారు .గోవిన్ కుటుంబం అందరితో బాగానే పరిచయాలు పెంచుకొన్నారు .దత్ ఫామిలి ఆల్బం లో ఉన్న తనకొడుకు మరణానికి చెందినతనకవితలు నీళ్ళు నిండిన కళ్ళతో రమేష్ కు చదివి వినిపించేవాడు .దాన్ని పుస్తకంగా ప్రచురించి అతనికి ఒకకాపీ ఇచ్చాడు .మరో బంధువు అరుణ్ చందర్ దత్తు అంటే తోరూకు బాగా అభిమానం ..అతడు కేంబ్రిడ్జి కార్పస్ క్రిష్టి కాలేజి లో డిగ్రీ పొంది అక్కడే స్థిరపడ్డాడు .గొప్ప డాక్టర్ గా పేరు తెచ్చుకొని ఆంగ్ల వనితను పెళ్ళాడి సుఖంగా ఉన్నాడు .
ఇంగ్లాండ్ లో ఆరూ తొరూ లు హాయిగా కాలక్షేపం చేశారు. సర్ జార్జి మెక్ ఫర్న్,సర్ బార్టర్ ఫ్రేరీ లతో పరిచయం కలిగింది .మెక్ ఫెర్న్ భార్య వీళ్ళిద్దరికీ సంగీతం నేర్పింది .సర్ బార్టర్ 1862నుంచి 67దాకా బెంగాల్ గవర్నర్ గా ఉన్నాడు .ఫ్రేరీ దంపతులతో తొరూ వింబుల్డన్ లో చాలా రోజులు కులాసాగా గడిపింది .షేక్స్పియర్ నాటకాలను ఫ్రెంచ్ లోకి అనువాదం చేసిన,విక్టర్ హ్యూగోకు స్నేహితుడు అయిన సెవేలియర్ డి.చాటర్టన్ కూడా పరిచయమయ్యాడు .
పెద్దదైన ఆరు తోరూ కన్నా మానసికంగా చిన్నది .తోరూకున్న చొరవ లేదామెకు .ఒకరకంగా ఆరూ కు మార్గదర్శి తొరూ .ఇద్దరిమధ్య గొప్పఅనుబంధమే ఉండేది .నవలలు కాకుండా చారిత్రిక గ్రంధాలు చదవమని లార్డ్ లారెన్స్ హితవు చెప్పేవాడు .ఆమెచరిత్ర అంతా బూటకం నవల లో అంతా నిజమే ఉంటుంది అని జవాబిచ్చింది .ఆరూ పై తోరూ పెద్దరికానికి తల్లీ తండ్రీ అభ్యంతరం చెప్పలేదు .తోరూ జ్ఞాపక శక్తి అమోఘం .తాను చేసిన అనువాదాలన్నీ ఆమెకు కంఠతా వచ్చు .ఆమె గొప్పశ్రద్ధతో అధ్యయనం చేసేది .సందేహం వస్తే నిఘంటువులు విజ్ఞాన సర్వస్వాలు రిఫర్ చేసేది .ఆ వివరనలన్నీ రాసుకొని జాగ్రత్తగా ఉంచుకోనేది .తండ్రికి కూతురు కు ఈ విషయం లో అభిప్రాయ భేదం వస్తే కూతురు తోరూ మాటే నిజమయ్యేది.ఆమెదే గెలుపు అని తండ్రికూడా చెప్పేవాడు .తాను ఎప్పుడైనా తండ్రి చేతిలో ఓడిపోతే ‘’నా తెలివి తెల్లవారి నట్లుంది నువ్వు పెద్దవాడివి పూర్ణ పురుషుడవు ‘’అని బాధపడకుండా తప్పుకునేది .
దత్తు కుటుంబం అంతా1837నుంచి 43వరకు కలకత్తా సుప్రీం కోర్ట్ ప్రధాన న్యాయమూర్తి సర్ ఎడ్వర్డ్ రెయాన్ తో సన్నిహితంగా ఉండేది .డికెన్స్, ధాకరే వంటి వారికి ఆయన ముఖ్య స్నేహితుడు .ఒకసారి ఆయన ‘’మీకు ధాకరే కూతుళ్ళు తెలుసా ?మీ ప్రక్కనే ఉంటారు ‘’అని అడిగితె తెలియదని తోరూ చెప్పింది .’’ఆయన నవలల లో ఏది ఇష్టం ?అని అడిగితె ‘’అందరికి నచ్చిన పెండరిన్ .కానీ దీనికంటే గొప్ప కళాఖండం ‘’ఎస్మాండ్ ‘’‘’అన్నది తోరూ .పిల్లలిద్దరి చదువులు ఎలా సాగుతున్నాయో చూడటానికి తండ్రి శ్రీమతి లాలేన్స్ ను పర్య వేక్షకురాలుగా కుదిర్చాడు .
అసలే అంత౦త మాత్రం ఆరోగ్యాలున్న అక్క చెల్లెళ్ళకు దినచర్య చాలా భారంగా ఉండేది .ఊపిరి పీల్చుకోవటానికి కూడా వీలు౦డేదికాదు .ఇండియా వచ్చినా తొరూ ఆరోగ్యం మెరుగు పడలేదు పైపెచ్చు దినచర్య ఎక్కువగానే ఉండేది .దీన్ని గురించి ‘’ఉత్తరం రాసే తీరిక కూడా లేదు .ఉదయం ఏడున్నరకు పియానోక్లాసులు .తర్వాత టిఫిన్ చేసి బైబిల్ ఒక గంట చదవాలి .మళ్ళీ పియానో తోమ్మిదిన్నరదాకా .తర్వాత టైమ్స్ పత్రిక చదవటం .పదింటికి లాలేన్స్ వచ్చి మధ్యాహ్నం మూడున్నర దాక తోముతారు .నాలుగింటికి నాన్నతో కలిసి పఠనం.శుక్రవారం మిసెస్ మెన్ ఫారన్ వచ్చి సంగీతం నేర్పుతారు .సోమవారాలు మిస్టర్ పార్ ఇంటికి వెళ్లి సంగీతం నేర్చుకొంటాం .ఆతర్వాత మళ్ళీ పియానో ‘అని ఆమె ఒక స్నేహితురాలికి ఉత్తరం రాసింది .
ఇంగ్లాండ్ లో ఉన్నా ఫ్రెంచ్ అధ్యయనం కొనసాగించారు .ఇంట్లో ఇటాలియన్ సేవకుడు ఉండటంతో అతనితో మాట్లాడటం వలన ఫ్రెంచ్ బాగా వచ్చింది .వంటమనిషి ఇసాబెల్ కు భారతీయ వంటకాలు వండటం వీళ్ళు నేర్పారు .అప్పుడప్పుడు ‘’ఐ మీ రోబ్సర్డ్’’,’’మిడ్ సమ్మర్ నైట్స్ డ్రీం ‘’వంటి నాటకాలు వెళ్లి చూసేవారు .1871లో దత్తు కుటుంబం కేంబ్రిడ్జి లో పార్కర్స్ పీన్ కు ఎదురుగా రీజెంట్ వీధిలో ఉన్నారు .స్త్రీలకోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన సభలకు వెళ్లి ప్రసంగాలు శ్రద్ధగా వినేవారు .ఇక్కడ ఫ్రెంచ్ నేర్పటానికి బోగెల్ అనే టీచర్ కుదిరాడు .కేం బ్రిడ్జి లో తోరూకు ముఖ్య ఆకర్షణ మేరీ మార్టిన్ .తర్వాత ప్రాణప్రద స్నేహిహితురాలైంది.ఎంతో లేఖాయణం ఇద్దరిమధ్యా జరిగి, సాహిత్య చరిత్రలో స్థానం సంపాదించుకొన్నది .హరిహర దాసు రాసిన తోరూ జీవిత చరిత్రకు సహాయకారిణి మిస్ మార్టెన్ .ఆయన ఈమెను 1913లో కలకత్తాలో కల్సి విషయ సేకరణ చేశాడు .లేఖాయణం ప్రచురించటానికి ఆమె నుండి అనుమతి పొందాడు .ఆ కృతజ్ఞత ప్రకటించటానికే ఆపుస్తకాన్ని ఆమెకే అంకితమిచ్చాడు-‘’తాను చూపిన మెత్తనైన సానుభూతికి –కృతజ్ఞతతో ఎంతొప్రేమతో –తనభారతీయ స్నేహితురాలూ ,-ప్రాణం మిత్రమూ అయిన –తోరూదత్ స్మృతికావ్యం –మేరీ ఐ .ఆర్ .మార్టిన్ కు అంకితం చేయబడుతోంది ‘’అని హృదయపూర్వకంగా తెలియజేశాడు తోరూ దత్ జీవిత చరిత్ర చేసిన హరిహరదాస్ .తోరూ చనిపోయిన చాలాకానికి అంటే 1910-13మధ్య మేరీ మిషనరీ గా కలకత్తాకు వచ్చింది .
సశేషం
మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -15-6-22-ఉయ్యూరు