మనమరుపు వెనుక మన వెండి తెరమహానుభావులు -302
302-‘’ఎగిరి పొతే ఎంత బాగుంటుందో ‘’పాట ఫేం పాటల మాటల రచయిత –సాహితీ
సాహితి పేరుతో తెలుగు సినిమారంగంలో గేయ రచయితగా, సంభాషణల రచయితగా చలామణీ అవుతున్న రచయిత అసలు పేరు చెరుకుపల్లి శ్రీరామచంద్రమూర్తి. ఇతడు కృష్ణా జిల్లా, మైలవరం మండలం, వెల్వడం గ్రామంలో జన్మించాడు. ఇతడు వెల్వడం గ్రామంలో ఎస్.ఎస్.సి, వరంగల్లులో ఇంటర్మీడియట్,నూజివీడులో డిగ్రీ చదివాడు. ఆంధ్ర విశ్వవిద్యాలయం నుండి స్నాతకోత్తర పట్టా పొందాడు. ఇతడు గుడివాడలో ఒక ట్యుటోరియల్ కాలేజీలో లెక్చరర్‌గా కొంతకాలం ఉద్యోగం చేశాడు[3].
సినిమా రంగం
సినిమాలలో అవకాశం కోసం 1974లో మద్రాసుకు వెళ్లాడు. మొదట ఆత్రేయ వద్ద సహాయకునిగా చేరాడు. గురువు దగ్గర మెలకువలు నేర్చుకుంటూనే ప్రయత్నాలు మొదలు పెట్టాడు. 1979లో విజయనిర్మల దర్శకత్వంలో కృష్ణ హీరోగా తెరకెక్కిన కిలాడి కృష్ణుడు సినిమాలో తొలి పాటను రచించాడు. తరువాత ఇతనికి అనేక అవకాశాలు వెనువెంటనే వచ్చాయి. ఇతడు మూడున్నర దశాబ్దాలలో 500కు పైగా పాటలు, 100 ప్రైవేటు ఆల్బమ్స్, 30 డబ్బింగ్ సినిమాలకు పాటలను అందించాడు. కేవలం పాటలే కాక “మల్లన్న”, “జర్నీ” వంటి సినిమాలకు సంభాషణలు కూడా అందించాడు[3].
ఇతని కలం తనదైన శైలిలో పాటకు పట్టాభిషేకం చేస్తుంది. ఈయన పాటలో పదాలు స్వరాల మధ్య విసిరేసినట్టుండవు. స్వరంపై పైచేయి సాధించడానికి పోటీ పడుతున్నట్టుంటాయి. ఇతడు రాసిన “జాబిలికీ వెన్నెలకీ”, “ఎగిరిపోతే ఎంత బాగుంటుంది” పాటలు అశేష ఆదరణ పొందాయి.[4] ఇతడు సుమారు 1000 తెలుగు సినిమా పాటలు రాసాడు. ఆంధ్రప్రదేశ్ యొక్క వివిధ యాస, మాండలికాలతో జానపద గీతాలను రాసినందున సినిమా పరిశ్రమలో ప్రసిద్ది చెందాడు. ఇతను దూర ప్రాంతాలు ప్రయాణం చేసి, ప్రజలతో సంభాషించి, వారి వ్యావహారిక పదాలు, పదజాలాన్ని సేకరించి జానపద కవిత్వంలో తనకు ఒక ప్రత్యేకమైన చిహ్నాన్ని సృష్టించాడు. అతడు మొండిమొగుడు పెంకి పెళ్ళాం చిత్రంలో విజయశాంతి పాత్రకు రాసిన “లాలూ దర్వాజ లష్కర్ బోనాల్ పండుగ” పాట పెద్ద హిట్ అయింది. ఇతను అందమైన, గొప్ప యాసలను రాసాడని భావిస్తారు.[5]
సినిమాల జాబితా
గేయ రచయితగా
1. కిలాడి కృష్ణుడు (1980)
2. రామ్ రాబర్ట్ రహీమ్ (1980)
3. వాడనిమల్లి (1981)
4. అతిరధుడు (1991)
5. ఆగ్రహం (1991)
6. ఇద్దరు పెళ్లాల ముద్దుల పోలీస్ (1991)
7. అప్పుల అప్పారావు (1992)
8. వద్దు బావా తప్పు (1993)
9. ఘరానా అల్లుడు (1994)
10. అమ్మలేని పుట్టిల్లు (1995)
11. ఆంటీ (1995)
12. ఆలీబాబా అద్భుతదీపం (1995)
13. ఆడాళ్లా మజాకా? (1995)
14. అక్కుమ్ బక్కుమ్ (1996)
15. ఇల్లాలు (1997)
16. దొంగాట (1997)
17. అల్లరి పెళ్లాం (1998)
18. డాడీ డాడీ (1998)
19. ఆవిడే శ్యామల (1999)
20. ఇట్లు శ్రావణి సుబ్రమణ్యం (2001)
21. తప్పుచేసి పప్పుకూడు (2002)
22. అదృష్టం (2002)
23. వెంకీ (2004)
24. ఖుషి ఖుషీగా (2004)
25. సఖియా (2004)
26. మాస్ (2004)
27. బాస్ (2006)
28. ఆటాడిస్తా (2008)
29. భలే దొంగలు (2008)
30. బ్లేడ్ బాబ్జీ (2008)
31. సమర్ధుడు (2009)
32. వేదం (2009)
33. మిరపకాయ్ (2011)
34. ప్రేమ కావాలి (2011)
35. ఢమరుకం (2012)
36. రామయ్యా వస్తావయ్యా (2013)
37. చల్ మోహన రంగా (2018)
సంభాషణల రచయితగా[మార్చు]
1. మల్లన్న
2. జర్నీ
సశేషం
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -16-6-22-ఉయ్యూరు