విశ్వ పుత్రిక తోరూ దత్-9
ఇంగ్లాండ్ లో తోరూ కుటుంబం -2
కేంబ్రిడ్జి లో దత్తు కుటుంబానికి మరో స్నేహితుడు క్లిఫర్డ్ పరిచయమయాడు .దత్తు తనకుటు౦బాన్ని కేం బ్రిడ్జి నుంచి సముద్ర తీరం లో ఉన్న సెంట్ లియోనార్డ్ కు మార్చాడు .చివరిదాకా అక్కడే ఉన్నారు .తోరూకు, తండ్రికి మాస్టర్ గిరాల్ద్ ఫ్రెంచ్ చెప్పేవాడు .ఆరూ ఆరోగ్యం బాగుండక బలహీనం గా ఉండటం వలన ఫ్రెంచ్ నేర్వలేదు .ఫామిలి ఆల్బం నుంచి మూడు కవితలు ఆయన ఫ్రెంచ్ లోకి అనువదించాడు .ఆరూ తొరూ ల ఫోటో ఇక్కడ తీసిందే .19ఏళ్ళ వయసున్న ఆరూ అనారోగ్యం వలన ఇంకా పెద్ద గా కనిపించేది .తోరూ మిసమిస లాడుతూ అందంగా చలాకీ గా ఉండేది .ఆమె వయసుఅప్పుడు 17.ఆ అందం ఆకర్షణ చలాకీ తనం ఉన్న తోరూను మరో అయిదేళ్ళలో క్షయ వ్యాధి బలి తీసుకొన్నది అంటే ఎవరూ నమ్మలేరు .మరో రెండేళ్లలో ఆరూ జీవితమూ సమాప్తమౌబోతోంది.ఇద్దరూ కుచ్చులు కుచ్చులుగా ఉన్న విక్టోరియన్ గౌన్లు వేసుకొని యువ రాణీలు లాగా ఉండేవారు .వాళ్ళ ఫోటోలు చూశాక చీర కట్టుకొంటే మరెంత అందంగా ఉండేవారో అనిపిస్తుంది .
తోరూ ప్రచురించిన ‘భారత దేశపు ప్రాచీన గేయ గాధలు ‘లో ఆమె కవిత ‘నియర్ హేస్టింగ్స్ ‘’కూడా ఉంది .ఇందులో ఆరూ ఆరోగ్యం పై ఆందోళన ఉంది –సముద్రతీరాన జలకన్యల్లా తిరిగాం . దూరంగా ఏకత్వాన్ని భజించే –ఆకాశమూ భూమి –అలసటగా విసుగును మోస్తూ -మెల్లగా అక్కడ తిరిగే మేము రోగ గ్రస్తులం –ఫిర్యాదులు తెలీని అక్క అక్కడే కూర్చుండి పోయేది –మహర్షికి ఉండాల్సిన లక్షణాలన్నీ -అక్కడమాకు కనిపించిన ఆమెలో ఉన్నాయి –తల్లీ ఆ పరమేశ్వరుడు చల్లగా చూడాలి మీ ఇద్దర్నీ ‘’అని దీవిన్చినట్లనిపి౦చి౦ది’’.
గోవిన్ చందర్ 1873లో తనకుటు౦బ౦ సహా ‘’లైనర్ పెషావర్ ‘’లో ఇండియాకు ప్రయాణమయ్యాడు .
స్వదేశాగమనం
1873 సెప్టెంబర్ నుంచి 53ఉత్తరాలు మేరీకి తోరూ రాసిందని ఆమె జీవిత చరిత్రకారుడు హరదాస్ రాశాడు .వీటిలో సాహిత్యం గుబాళిం చేది విక్టోరియాయుగ రచయితల హాస్యం ప్రతి బి౦బించేది.గొప్ప సాహిత్య విమర్శలూ ఉండేవి .ఉత్తరాలు రాయటం లో అసామాన్య ప్రతిభ కనిపించేది .పెషావర్ లైనర్ లో ప్రయాణం చేస్తూ జిబ్రాల్టర్ దగ్గర మేరీ కి ఉత్తరం రాసింది .
కలకత్తాలో ఆమెజీవితం చాలా హుషారుగా గడిపింది .ఇంగ్లాండ్ నుంచి వచ్చిన ఏడాదికే ఆమెకు క్షయ సోకింది .1873 డిసెంబర్ నుంచి కలకత్తానుంచి ఉత్తరాలు రాసింది .దారిలో సింహళం లో ఒక రోజు ఆన౦ద౦ గా గడిపారు .ఇండియారాగానే బంధువులు అపూర్వ స్వాగతమిచ్చారు .విశాలమైన తోట చేపలకు చిన్న చిన్న చెరువులు ఫలవృక్షాలు అనేకరకాల పుష్పాలు చెట్లు వాటిపై కోతులు ,అనేకరంగులపిట్టలు ,సీతాకోక చిలుకలు కనువిందు చేసేవి. నాలుగేళ్ల దాకా వీటి సొందర్యమంతా వర్ణిస్తూ మేరీకి జాబులు రాసేది తొరూ .
జీవితం ప్రశాంతంగా గడిచిపోతోంది .తల్లి కమ్మగా పాటలు పాడేది .ఈ ఆనందం అంతా ‘’సీత ‘కవితలో గొప్పగా నిక్షిప్తం చేసింది .
సశేషం
మీ -గబ్బిట దుర్గాప్రసాద్ -16-6-22-ఉయ్యూరు