విశ్వ పుత్రిక తోరూ దత్-10
స్వదేశాగమనం -2
రాం బగత్ లో ఉన్న పుస్తకాలన్నీ బాగ్ మరీ కి తరలించటం వలన తోరూకు చేతినిండా పుస్తకాలు దొరికాయి చదవటానికి .జీవితాలు ప్రశాంతంగా సాగుతున్నందున తాను అనేక పుస్తకాలు చదవగలిగానని తోరూ చెప్పింది .భోజనం టిఫిన్ టెన్నిస్ విహారాలకు సమయం బాగా తగ్గించి పుస్తకాలే చదివి పుస్తకాల పురుగుయింది .లండన్ నుంచి ‘’మండేస్ రివ్యు ‘’తెప్పించుకోనేది .హాటర్ దంపతులు లండన్ నుంచి ఇంగ్లీష్ ఫ్రెంచ్ పుస్తకాలు పంపేవారు .సమకాలిక రచనలన్నీ చదివే అదృష్టం కలిగింది .ప్రముఖ కవులు రచయితలైన కార్లైల్, బ్రాంటి సిస్టర్స్ ,బైరన్ ,ధాకరే ,కాల్రిడ్జ్, టెన్నిసన్ ,బ్రౌనింగ్ ,ఇలియట్ ,లిట్టన్ పేర్లు ఆమె తరచుగా పెర్కొనేది .ఫ్రెంచ్ పుస్తకాలనీ లోతుగా అధ్యయనం చేసేది .మోలియర్ హాస్యనాటకాలు ,మిగేట్ విప్లవ చరిత్ర ,రోసేల్ వ్యాసాలూ హ్యూగో రచనలు ,టైన్ యాత్రా విశేషాలు ,సెస్ టైన్ రచనలు అన్నీ చదివేది .ఫ్రెంచ్ కాల్పనిక సాహిత్యాన్ని కూడా ఔపోసనపట్టింది ..తోరూ అతి నాజూకుగా సగం విచ్చిన గులాబి మొగ్గ .హిందూ గృహ కుటుంబం లో సువాసనలు వెదజల్లే మనోహర ముకుళం’’అన్నాడు ఆమె జీవిత చరిత్రకారుడు హరిహరదాస్ .చిన్నా ,పెద్దా అంతా తొరూ ను ‘’దీదీ’’అంటూ ఆప్యాయంగా పిలిచేవారు .కళ్ళలో కారుణ్యం తొణికిస లాడేది.డాక్టర్ హంటర్ ఆమెకు ఎన్నో ఉత్తరాలు రాసేవాడు .
తోరూ జీవితావసరాలు చాలా చిన్నవి .ఒక దోమ తెర,పొద్దున్నే తన గుర్రాల్ని చూడటం ,తురాయి చెట్టు చూస్తూ మురిసిపోవటం ,తల్లి పాట,చివరకు తానూ మృత్యు ముఖాన ఉన్నప్పుడు తన చేతిలో ఇమిడిపోయిన తండ్రి స్పర్శ తో తన అల్పాయుష్క జీవితాన్ని అనుభవించింది .’’తోరూ ఉత్తరాలలో నిష్కాపట్య౦ ,,అర్ధవత్వం ,మనసును ఆకర్షించే మంచితనం ,సరళత ,అన్నీ పరిపూర్ణంగా ఉండి,ఆమె ను నా దగ్గరగా తెచ్చి నన్ను ఆకర్షించాయి ‘’అని రాసుకుంది బాదేర్.
అకాల మరణం
దత్తు కుటుంబం ఇండియాకు తిరిగి వచ్చాక ఆరూ తోరూ ల ఫ్రెంచ్ కవితల అనువాదాలను సేకరించి బెంగాల్ పత్రిక లో ప్రచురణకు ఇవ్వటం తో సమయం గడిచిపోయింది .తోరూ అనువాదాలు సీరియల్ వచ్చాయి. ఆరు తక్కువే రాసింది .1874 ప్రారంభం నుంచి వీరి కవితలు బెంగాల్ పత్రికలో సీరియల్గా వచ్చాయి. బుద్ధి శ్రమా ఎక్కువై తోరూ కలలలో తేలిపోయి ఉద్రేకంలో ఊగిపోయింది .బలహీన ఆరోగ్యంతో అయిదు నెలల భరించరాని ఏకాంతవాసం లో ఆమె సాధించిన ఫలితం ,ఆ బలహీన శరీరం ఎందుకింత త్వరగా నిర్జీవమై పోయిందో అర్ధమౌతుంది .
1874మొదట్లో ఆరు తోరూ లిద్దరికీ జబ్బు చేసింది .తోరూలో క్షయ చిహ్నాలు కనిపించాయి .మార్చిలో కొద్దిగా కోలుకున్నది .వేసవిలో కొంత ఉల్లాసంగా ఉంది కానీ ఆరు ఆరోగ్యం మాత్రం బాగుపడలేదు .ఉన్నట్టుండి ఆరూ చనిపోయి ఇంట్లో తీవ్ర విషాదాన్ని నింపేసింది. భగవంతుడిని నమ్మటం తప్ప ఎవరూ ఏమీ చేయలేకపోయారు ..తనకూ అదే గతి అని తొరూ తెలుసుకొన్నది. ఆరూ లేని ఒంటరితనాన్ని భరించ లేకుండా ఉన్నానని ‘’మేరీ కి బాధా తప్త హృదయంతో రాసింది .అనారోగ్యంతో బాధపడుతున్నా ,సాహిత్యవ్యాసంగంలో అక్కా చెల్లెలు బాగానే గడిపేవారు .ఆరూ రాసిన 7కవితలు ‘’షీఫ్’’బెంగాలీ పత్రికలో ప్రచురితాలయ్యాయి .ఆరూ అనువదించిన విక్టర్ హ్యూగో రచన 1974 ఏప్రిల్ లో ‘మార్నింగ్ సెనేరేడ్’’లో ప్రచురితమైంది. దీనిపై ఎక్సామినర్ పత్రికలో విమర్శరాస్తూ ఎడ్మండ్ గాస్ అది తోరూ రచన అని పొరబాటు పడ్డాడు ‘నీ అందమంతా –నీ కళ్ళకోసమే కదూ –ఊరికే నిద్రపోకు –జాగ్రత్తగా విను –పదేపదే రోదిస్తున్నాను నేను –ఇంతకీ ఎక్కడున్నావు నీవు?’’.ఇది చిన్నదేకాని అత్యుత్తం శ్రేణికవిత. ఆరూ చనిపోయే ముందు తొరూ కూడా బెంగాల్ పత్రికకు 7కవితలు పంపింది .అక్క చెల్లెళ్ళు ఇద్దరూ ఈ పత్రికకు 14కవితలు రాశారు .అందులో ఆర్నాల్డ్ కవిత ‘’ది లీఫ్ ‘’కు తోరూ చేసిన అనువాదం చాలామందిని ఆకర్షించింది –‘’రోజాలకైనా –నాజూకు రేకలు రాలక తప్పదు –మరి నాకెందుకు అంటి పెట్టుకు ఉండాలనే తపన’’ ?,
సశేషం
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -17-6-22-ఉయ్యూరు
వీక్షకులు
- 1,009,733 hits
-
-
ఉసుల గూడు (బ్లాగ్) గువ్వలు (పోస్ట్)
- గ్రంథాలయోద్యమ పితామహ శ్రీ అయ్యం కి వెంకట రమణయ్య గారు.5 వ భాగం.5.6.23.
- మురారి అన ర్ఘ రాఘవం.8 వ భాగం.5.6.23.
- గీర్వాణ కవుల కవితా గీర్వాణ0.4 వ భాగం.4.6.23.
- గ్రంథాలయోగ్రంథాలయోద్యమ పితామహ శ్రీ అయ్య0 కి వెంకట రమణయ్య గారు.4 వ భాగం.4.6.23..ద్యమ పితామహ శ్రీ అయ్య0 కి వెంకట రమణయ్య గారు.4 వ భాగం.4.6.23..
- మురారి అన ర్ఘ రాఘవం 7 వ భాగం.4.6.23.
- తొలి ముస్లిం మహిళా మంత్రి ,జాతీయ మహిళా సంస్థ అధ్యక్షురాలు,రెడ్ క్రాస్ సేవకురాలు శ్రీమతి మసూమా బేగం(వ్యాసం)-గబ్బిట దుర్గాప్రసాద్-విహంగ -జూన్
- గీర్వాణ కవుల కవితా గీర్వాణ0.3 వ భాగం.3.6.23
- అనేక మలుపులు తిరిగి గమ్యస్థానం చేరిన ‘’అనుకోని ప్రయాణం ‘’.
- గ్రంథాలయోద్యమ పితా మహ శ్రీ అయ్యంకీ వెంకట రమణయ్య గారు.3 వ భాగం.3.6.23.
- మురారి అన ర్ఘ రాఘవం.6 వ భాగం.3.6.23.
Archives
ఉసూల గూటి అరలు
- అనువాదాలు (24)
- అమెరికా లో (206)
- ఆ''పాత''మధురాలు (9)
- ఆరోగ్యం (4)
- ఊసుల్లో ఉయ్యూరు (77)
- కవితలు (147)
- కవి కోకిల స్వరాలు (11)
- దేవాలయం (38)
- నా డైరీ (8)
- నా దారి తీరు (135)
- నేను చూసినవ ప్రదేశాలు (107)
- పద్య రత్నములు (2)
- పుస్తకాలు (2,978)
- సమీక్ష (1,333)
- ప్రవచనం (11)
- ఫేస్బుక్ (510)
- మహానుభావులు (346)
- ముళ్ళపూడి & బాపు (61)
- రచనలు (1,078)
- రాజకీయం (65)
- రేడియో లో (55)
- వార్తా పత్రికలో (2,159)
- సభలు సమావేశాలు (334)
- సమయం – సందర్భం (844)
- సమీక్ష (25)
- సరసభారతి (10)
- సరసభారతి ఉయ్యూరు (516)
- సినిమా (376)
- సేకరణలు (315)
- సైన్స్ (46)
- English (6)
ఊసుల గూడు