సరసభారతి’’ పుష్కర కాల ప్రగతి ‘’ మరియు గబ్బిటదుర్గాప్రసాద్ సాహిత్య ప్రగతి (అందరి అవగాహన కోసం )
సరసభారతి సాహిత్య సాంస్కృతిక సంస్థ –ఉయ్యూరు
స్థాపన -24-11-2009
కార్యక్రమాలు
1-ప్రతి ఏటా ఉగాది కవి సమ్మేళనం ,ఆకవితలను 1-నవకవితా వసంతం 2-మా అక్కయ్య 3-మా అన్నయ్య 4-ఆదిత్య హృదయం 5-వసుధైక కుటుంబం పుస్తకాలుగా ప్రచురణ
2-ప్రముఖ కవిపండితులకు స్వర్గీయ విద్వాన్ గబ్బిట మృత్యుంజయ శాస్త్రి శ్రీమతి భవనమ్మ గార్ల స్మారక పురస్కారాలు శ్రీ పాలపర్తి శ్యామలానంద ప్రసాద్ డా ,కోట నిత్యానందశాస్స్త్రి సశ్రీ మండలి బుద్ధప్రసాద్ ,,శ్రీనోరి సుబ్రహ్మణ్యశాస్త్రి ,బౌద్ధ భిక్షు శ్రీ అన్నపరెడ్డి వెంకటేశ్వర రెడ్డి ,ఈల విద్వాంసులు శ్రీ కొమరవోలు శివ ప్రసాద్ ,ఆధునిక పికాసో శ్రీ ఎస్ వి రామారావు ,అంతర్జాతీయ ఆర్ధిక శాస్త్రవేత్త ,అమెరికాలో ఉంటున్న ఉయ్యూరు వాసి శ్రీ ఆరిక పూడి ప్రేం చ౦ద్ గారికి ,బెజవాడ రేడియో స్టేషన్ డైరెక్టర్లు శ్రీ మంగళగిరి ఆదిత్య ప్రసాద్ ,శ్రీమతి మున్జులూరి కృష్ణకుమారి మొదలైనవారికి అందజేత .
3-39పుస్తకాల ప్రచురణ .అందులో శ్రీ గబ్బిట దుర్గా ప్రసాద్ రాసినవి 26.అన్నీ రిసెర్చ్ స్థాయి పుస్తకాలే
4-ముగ్గురు కవులచే శ్రీ సువర్చలన్జనేయ స్వామి పై మూడు శతకాలు రచి౦ప జేసిఒక్కొక్కరికి 10వేలరూపాయలు నగదు నూతన వస్త్రాలతో ఘనంగా సత్కరించటం
5-ప్రతి ఏడాది శ్రీత్యాగరాజ ఆరాధనోత్సవాలు నిర్వహించటం
6-సంగీత కచేరీలు శ్రీమతి సింగరాజు కల్యాణిశ్రీమతి కాళీ పట్నపు ఉమా ,శ్రీ గోపాలం ,శ్రీ శివప్రసాద్,శ్రీమతి చిడంబరి ల చే నిర్వహణ
7-అమెరికా లోని నార్త్ కరోలిన రాష్ట్రం షార్లెట్ లో సరసభారతి శాఖ ఏర్పరచి కార్యక్రమాలు నిర్వహించి ‘’షార్లెట్ సాహితీ మైత్రీ బంధం ‘పుస్తకాన్ని ’అక్కడా ,ఇక్కడా ఉగాదికి ఆవిష్కరించటం ,’’అణుశాస్త్ర వేత్త డా .ఆకునూరివెంకట రామయ్య’’ పుస్తకాన్ని అమెరికాలో రెండు చోట్ల ,ఇక్కడ కూడా శ్రీ వై విబి రాజేంద్ర ప్రసాద్ తో ఆవిష్కరి౦ప జేయటం
8-ప్రతి ఏడాది సెప్టెంబర్ 5 గురు పూజోత్సవం నాడు కోటగురు వరేణ్యులు స్వర్గీయ శ్రీ కోట సూర్యనారాయణ శాస్త్రి ,శ్రీమతి సీతమ్మ దంపతుల స్మారక పురస్కారాలు శ్రీమైనేని ,శ్రీ కోట గురుపుత్రుల సహకారంతో పేద ప్రతిభగల విద్యార్ధులకు ఒక్కొక్కరికి 10 వేలరూపాయలు అందించటం
9-నిరతాన్నదాత శ్రీమతి డొక్కా సీతమ్మగారి స్మారక పురస్కారాలను వారి ఇనిమనవడు శ్రీ డొక్కా రాం భద్ర గారి సహకారం తో ప్రతిభ ఉన్న పేద విద్యార్ధులకు అందించటం
10-సామూహిక సత్యనారాయణ వ్రతాలు నిర్వహించటం
11-తెలుగుభాషా దినోత్సవం జరిపి తెలుగులో కృషి చేసినవారిని సన్మానించటం
12-అంతర్జాతీయ తెలుగు బడి పురస్కారాలను కరోనా బాధిత సమయం లోనూ విద్యా బోధన చేసిన 5గురు ఉపాధ్యాయులకు అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రం ఆస్టిన్ శాఖ నిర్వహిస్తున్న శ్రీ డొక్కా రాంభద్ర గారి సౌజన్యంతో,సరసభారతి సహకారంతో ఒకొక్కరికిసుమారు 25వేల రూపాయలు అందించటం .
13-గురజాడ ,విశ్వకవి రవీంద్రుల 150వ జయంతి కాలేజీ విద్యార్ధుల సమక్షం లో జరపటం
14-సరసభారతి ముఖ్యమైన ప్రచురణలు కాలేజీ విద్యార్ధుల సమక్షం లో ఆవిష్కరింప జేయటం
15-కాలేజీ విద్యార్ధుల,హైస్కూల్ విద్యార్ధుల సమక్షం లో శ్రీ కృష్ణశాస్త్రి ,శ్రీ భరద్వాజ మొదలైన ప్రముఖులపై ప్రసిద్దులైనవారిచే ప్రేరణాత్మక ప్రసంగాలు చేయించటం
16-శతాధిక గ్రంథకర్త ,శతవృద్ధు కవిసామ్రాట్ శ్రీ చింతలపాటి నరసింహ దీక్షిత శర్మగారికి ఘన సన్మానం
17- శ్రీమైనేని గోపాలకృష్ణ గారి సహకారంతో ‘బాపు –రమణ ‘’ల స్మారక పురస్కారాలను ప్రఖ్యాత కధకులు శ్రీ వేదగిరి రాం బాబు గారికి కు ,ప్రముఖ చిత్రకారులు శ్రీ శీలా వీర్రాజు గారికి అందజేయటం
18-శ్రీ మైనేని గోపాలకృష్ణ గారి సౌజన్యంతో శ్రీ కాళీ పట్నం రామారావు గారు నిర్వహిస్తున్న ‘’కధానిలయం ‘’కు 15వేల రూపాయలు అందించటం
19- శ్రీ మైనేని గోపాలకృష్ణ గారి సౌజన్యంతో సద్గురు శ్రీ శివానంద మూర్తి గారి ‘’సనాతన చారిటబుల్ ట్రస్ట్ ‘’కు రూ 11,116 అందజేయటం
20- శ్రీ మైనేని గోపాలకృష్ణ గారి సౌజన్యంతో మచిలీ పట్నం లోని కృష్ణా యూని వర్సిటి తెలుగు శాఖ అభి వృద్ధికి 20 వేలరూపాయల విరాళం అందజేయటం మొదలైనవి
21-కరోనా రెండేళ్లలో వచ్చిన శ్రీ శార్వరి ,,శ్రీ ప్లవ ఉగాది వేడుకలను కవిసమ్మేళనం మినహా 3+2 =5పుస్తకాల ఆవిష్కరణ ,ఉగాది పురస్కారాలను కూడా శ్రీసువర్చలాన్జనేయ స్వామి దేవాలయం లో ఆ రెండేళ్ళు నిర్వహి౦చి ,సాహితీ బంధువులకు అభిమానులకు కవులకు అతిధులకు అందరికి ఆవిష్కరణల తర్వాత వెంటనే బుక్ పోస్ట్ లో పుస్తకాలు పంపి రికార్డ్ సృష్టించాం..
గబ్బిట దుర్గా ప్రసాద్ బయోడేటా
పేరు– గబ్బిట దుర్గాప్రసాద్
జననం -27-6-1940-ఉయ్యూరు -కృష్ణా జిల్లా
తలిదండ్రులు -గబ్బిట భవానమ్మ ,మృత్యుంజయ శాస్త్రి –
విద్య -ఎం ఏ ,తెలుగు ,బి.ఎస్ సి. బి.ఎడ్ .
భార్య -ప్రభావతి
ఉద్యోగం -ఫిజికల్ సైన్స్ టీచర్, పధానోపాధ్యాయుడు -కృష్ణా జిల్లా పరిషత్ (1963-1998)
సంతానం –గబ్బిట మృత్యుంజయ శాస్త్రి ,సమత
సంకల్ప్,భువన్ సాయి తేజ
లక్ష్మీ నరసింహ శర్మ ,ఇందిర
శ్రీ హర్ష సాయి ,హర్షి తాంజని
నాగ గోపాల కృష్ణ మూర్తి ,రాణి
సుస్మిత్ శ్రీ చరణ్ గౌతం ,,రమ్య
వెంకట రమణ ,మహేశ్వరి
కోమలి విజయలక్ష్మి ,సా౦బావధాని
శ్రీకేత్ ,ఆశుతోష్ ,పీయూష్
1-సాహిత్య వ్యాసంగం – అధ్యకుడు-సరభారతి సాహిత్య సాంస్కృతిక సంస్థ-ఉయ్యూరు –12ఏళ్ళలో 165 కార్యక్రమాల నిర్వహణ .ప్రతి సంవత్సరం ఉగాది వేడుకలు నిర్వహి౦ఛి ప్రముఖులను సన్మాని౦చటం ,జిల్లాలోని ప్రముఖులతో కవిసమ్మేళనం నిర్వహించటం ,పుస్తకావిష్కరణలు .
ఉయ్యూరు శ్రీ సువర్చలా౦జ నేయ దేవాలయ వంశ పారంపర్య ధర్మకర్త –స్వామి సేవలో, అనునిత్య సాహితీ వ్యాసంగం లో ధన్యత ..సరసభారతి ,శ్రీ సువర్చలాజనేయ అనే 2 బ్లాగుల నిర్వహణ .నిత్యం అంతర్జాల రచన.
2-ముద్రి౦పబడిన స్వీయ రచనలు -1-ఆంద్ర వేద శాస్త్ర విద్యాలంకారులు 2-జనవేమన 3-దర్శనీయ దేవాలయాలు 4-శ్రీ హనుమత్ కథా నిధి 5-శ్రీ ఆంజనేయ స్వామి మహాత్మ్యం 6- సిద్ధ యోగిపు౦గవులు 7-మహిళా మాణిక్యాలు 8-పూర్వాంగ్ల కవుల ముచ్చట్లు (125మంది ఇంగ్లాండ్, అమెరికా దేశాల కవుల చరిత్ర )
9- దర్శనీయ దైవ క్షేత్రాలు 10-గీర్వాణ కవుల కవితా గీర్వాణ౦-3 భాగాలు (మొదటిభాగం లో 146 మంది రెండవభాగం లో 482మంది మూడవభాగం లో 462మంది మొత్తం 1090మంది సంస్కృత కవుల జీవిత, సాహిత్య సమగ్ర విషయాలు )11-దర్శనీయ ఆంజనేయ దేవాలయాలు-2భాగాలు (మొదటిభాగం లో దేశ ,విదేశాలలోని 201 ,రెండవ భాగం లో 221-మొత్తం 422ఆంజనేయ దేవాలయాల విశేషాలు ) 4 భాగం –అంతర్జాలం లో 700 మంది కవులపై ,12-కేమోటాలాజి పిత డా.కొలచల సీతారామయ్య—తెలుగులో వచ్చిన మొట్టమొదటి పుస్తకం (ఉయ్యూరుకు చెందిన ఆయిల్ సైన్స్ శాస్త్రవేత్త .రష్యా లో స్థిరపడి ఆ దేశ శాస్త్ర సాంకేతికతకు తోడ్పడిన శాస్త్రజ్ఞుడు )13-దైవ చిత్తం (ప్రఖ్యాత శాస్త్రవేత్త –స్టీఫెన్ హాకింగ్ రాసిన –‘’ది ఆరిజిన్ ఆఫ్ టైం ‘’లోని విషయాలను మన వేద,ఉపనిషత్ ,పురాణాల లోని విషయాలతో పోల్చిన తులనాత్మకరచన 14-బ్రహ్మశ్రీ మద్దులపల్లి మాణిక్య శాస్త్రి గారి శతజయంతి కరదీపిక 15-ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు (ప్రపంచ చరిత్రను మలుపు త్రిప్పిన వివిధ రంగాలకు చెందిన 91 మంది ప్రపంచ ప్రముఖుల జీవితం ,కృషి పై 704పేజీల సమగ్ర గ్రంథం)16-షార్లెట్ సాహితీ మైత్రీ బంధం (2012,2017లలో మేము అమెరికా నార్త్ కరోలిన లోని షార్లెట్ నగర సందర్శనం -అక్కడి వ్యక్తుల ,సాహిత్య సాంస్కృతిక సంస్థల ,,సరసభారతి స్థాపన ,కార్యక్రమాల విశేషాల యాత్రా సాహిత్యం ) 17-అణుశాస్త్ర వేత్త డా.ఆకునూరి వెంకట రామయ్య- (117 వ మూలకం టెన్నిస్సిన్ –‘’Ts’’ ను ఆవిష్కరించిన ఆంద్ర అణుశాస్త్ర వేత్త) తెలుగులో వీరిపై వెలువడినతొలి పుస్తకం –అమెరికాలో రెండు చోట్ల ,ఉయ్యూరులో మూడవసారి ఆవిష్కరింపబడిన అరుదైన పుస్తకం 19-ప్రయోగాత్మక కాంతి శాస్త్ర పరిశోధన పిత –డా .పుచ్చా వెంకటేశ్వర్లు (లేజర్ కిరణాలపై అత్యద్భుత ప్రయోగాలు చేసి ,ఎందరికో మార్గదర్శి యై ,ఆలిఘర్ ముస్లిం యూని వర్సిటి ,కాన్పూర్ ఐ. ఐ .టి.,అలబామా అగ్రికల్చరల్ అండ్ మెకానికల్ యూని వర్సి టీల స్థాపన ,అభివృద్ధిలో భాగస్వామి ఐన ఆంద్ర శాస్త్ర సాంకేతిక వేత్త )-వీరిపై తెలుగులో వచ్చిన మొట్ట మొదటి పుస్తకం .
3- 22-3-20 సరసభారతి 150 వ కార్యక్రమంగా నిర్వహిస్తున్నశ్రీ శార్వరి ఉగాది వేడుకలలో ఆవిష్కరి౦పబడిన పుస్తకాలు -1-ఊసుల్లో ఉయ్యూరు ( ఉయ్యూరుతో ,అక్కడి వ్యక్తులు,సంస్థలు మొదలైనవాటితో నాకున్న 75ఏళ్ళ అనుబంధం ,జ్ఞాపకాలు అనుభవాల నాస్టాల్జియా )
2-సోమనాథ్ నుంచి కాశీ విశ్వనాథ్ దాకా (2002 నుంచి 2015 వరకు -6 రాష్ట్రాలలో మా క్షేత్ర సందర్శన విశేషాల యాత్రా సాహిత్యం)
3-ఆధునిక ఆంద్ర శాస్త్ర మాణిక్యాలు (వివిధరంగాలకు చెందిన 62మంది ఆంద్ర శాస్త్రవేత్తల జీవిత విశేషాలు, చేసిన అమోఘ కృషి )
శ్రీప్లవ ఉగాదికి ఆవిష్కరించిన పుస్తకాలు -1-వ్యాఖ్యాన చక్రవర్తి మల్లినాథ సూరి మనీష (25)02-ఆధునిక విదేశీ సంస్కృత విద్వాంసులు(26)
4- నా సంపాదకత్వం లో సరసభారతి ప్రచురించిన పుస్తకాలు
1-జ్యోతిస్సంశ్లేషణం 2-ఉయ్యూరు ఊసులు 3-నవకవితా వసంతం 4-మా అక్కయ్య 5-‘’ఆదిత్య ‘’హృదయం 6-త్యాగి పే’’రెడీలు’’7-శ్రీరామవాణి 8-మా అన్నయ్య 9-శ్రీ సువర్చలా వాయు నందన శతకం 10-శ్రీ సువర్చలా మారుతి శతకం 11-శ్రీ సువర్చలేశ్వర శతకం 12-వసుధైక కుటుంబం 13- Nucleaar Scentist Dr.Akunuri Venkata Ramayya 14-సాహితీ స్రవంతి (సాహితీ మండలి తరఫున )
5- రేడియోలోసాహిత్య ధార్మిక ప్రసంగాలు
6-గత రెండేళ్లుగా సరసభారతి ఫేస్ బుక్ ద్వారా ,విద్యారణ్య స్వామి రచించిన శంకర విజయం ,వ్యాస విరచిత బ్రహ్మసూత్రాలు ,ద్వాదశ ఉపనిషత్తులు ,కాలిదాస మహాకవి ,కృష్ణ శాస్త్రి ,శ్రీపాద ,మధురాంతకం ,కేతు విశ్వనాధ రెడ్డి ,మల్లాది రామ కృష్ణ శాస్త్రి ,గంధం యాజ్ఞ వల్క్య శర్మ గంధం వేంకాస్వామి శర్మ ,గుంటూరు శేషేంద్రశర్మ ‘’షోడశి ‘’,స్వర్ణ హంస ,,సోమనాద్ నుంచి కాశీ విశ్వనాద్ దాకా ,ఆధునిక ప్రపంచ నిర్మాతలు షార్లెట్ సాహితీ మైత్రీ బంధం ,బ్రహ్మ వైవర్త పురాణం ,శివపురాణం ,శివతాండవం ,అనంతకాలం లో నేనూ ,నా దారి తీరు (స్వీయ జీవిత చరిత్ర ),మొదలైన వాటిపై , ప్రత్యక్ష ప్రసార ప్రసంగాలు .
7-5 సార్లు అమెరికా సందర్శన .ఐదవసారి నార్త్ కరోలినా షార్లెట్ కు రెండవ సారి వెళ్ళినపుడు సరసభారతి స్థాపించి 6 కార్యక్రమాల నిర్వహణ
8-అంతర్జాలం లో నేను రాసి,,గ్రంథ రూపం దాల్చని వివిధ రచనలు
1-గణిత వేదాంత తత్వ కోవిదుడు శాస్త్ర వేత్త –ఇమాన్యుల్ కాంట్ 2-సింఫనీ మాంత్రికుడు –బీథోవెన్ 3-కోన సీమ ఆహితాగ్నులు 4-వ్యాఖ్యాన చక్రవర్తి కోలాచలం మల్లినాథ సూరి మనీష 5-అలనాటి విజ్ఞాన శాస్త్ర వేత్తలు 6-యాజ్ఞ్యవల్క్య మహర్షి జీవితం 7-కాశీఖండం 8-భీమఖండం 9-గౌతమీ మహాత్మ్యం 10-నా దారి తీరు (స్వీయ చరిత్ర )11-కోరాడ రామకృష్ణయ్య గారి కోవిదత్వం 12-ప్రపంచ దేశాల సాహిత్యం 13-గానకవి రాజు –సంగీత సద్గురు త్యాగరాజ స్వామి 14-ప్రసిద్ధాంధ్ర మంత్రి పుంగవులు 15-కిరాతార్జునీయం 16-గీర్వాణకవుల కవితా గీర్వాణం-4 వ భాగం -650మంది సంస్కృత రచయితల సాహితీ విశేషాలు 17-పంచారామ క్షేత్ర విశేషాలు 18-చిత్రకళా విశ్వనాథుని కీర్తి కిరీటం లో మరో ఆభరణం –శంకరాభరణం 19-కృష్ణా జిల్లా సంస్థానాలు –సాహిత్య సేవ 20-అమరగాయకుడు ఘంటసాల 21-విరాట ఉద్యోగాదిపర్వాలలో తిక్కన పద్య సౌరభం 22-శ్రీ కృష్ణ తత్త్వం 23-సదా శివ బ్రహ్మేంద్ర కీర్తనలలో అద్వైతామృతం 24-ఫాహియాన్ సఫల యాత్ర 25-స్వామి శివానందుల ఉపనిషత్ సారం 26-కన్యాశుల్కం లో కరటక శాస్త్రి 27-దర్శనీయ శివాలయాలు 28-దర్శనీయ దేవీ ఆలయాలు 29-దర్శనీయ వినాయక దేవాలయాలు 30-కేతు విశ్వనాధ రెడ్డి కథలు 31-మధురాంతకం రాజారాం కథలు 32-గొల్లపూడి కథామారుతీరావు 33-వేలూరి శివరామ శాస్త్రిగారి కథలు34-కాళిదాసు శకుంతల 35-పుట్టపర్తివారి శివతాండవం 36-విప్లవసింహం –ఉయ్యాలవాడ నరసింహారెడ్డి 37-ప్రాచీనకాశీ నగరం 38-ముద్రా రాక్షసం లో మానవీయ ముద్ర 39-వందేళ్ళ తెలుగు కథ సామాజికాంశం 40-బ్రాహ్మణాల కథా కమామీషు 41-వీక్లీ అమెరికా 42- అమెరికా డైరి 43-వరద సాహితీ స్రవంతి 44-కొందరు హిమాలయ యోగులు 45-అలంకారిక ఆనంద నందనం 46-శ్రీ శంకరుల శివానందలహరి ఆంతర్యం 47-గాంధీజీ -21వ శతాబ్ది 48-ఇది విన్నారా కన్నారా (సంగీత జ్ఞుల విశేషాలు )49-బాపు-రమణీయం 50- ఖడ్గతిక్కన కావ్య సమీక్ష 51-దాక్షిణాత్య గానకళా తపస్సంపన్నులు (త్యాగరాజ స్వామి ,శిష్య ప్రశిష్య పరంపర ,సమకాలికులు నుంచి నేటివరకు ఆంధ్రగాయకులు ).52-మహా భక్త శిఖామణులు .53-అనుభూతికవి తిలక్ 54-అధర్వవేదం –వ్రాత్యఖండం ‘’డా సంపూర్ణానంద్ ఇంగ్లిష్ పుస్తకానికి నా అనువాదం 54-చరిత్ర కెక్కని చరితార్ధులు 55-శ్రీ శంకరుల లలి (కవి )తా సౌందర్యలహరి 56-అమెరికాలో జర్మన్ హవా 57- నాద యోగం 58-జ్ఞానదుడు నారదుడు 59-అస్వత్ధామ 60-మత్స్వప్నః –బ్రహ్మశ్రీ తాడేపల్లి రాఘవ నారాయణ శాస్త్రి గారి రచన విశేషాలు 61-మహిళా జాతి రత్నాలు
62-మన మరుపున పడిన మన వెండి తెర మహానుభావులు –శేర్ర్శికలో 300మందిని పరిచయం చేయటం 63-వీకీ పీడియ లో చోటు చేసుకొనని సుమారు 50 శతకాలను ,కవులను రచయితలను ,వివిధ రంగాలకు చెందినప్రముఖులను సుమారు 50 మంది ని పరిచయం మొదలైనవి చేశాను
9-విహంగ మహిళా వెబ్ మాసపత్రికు 2012నుంచి ఇప్పటివరకు ప్రతినెలా వివిధరంగాలలోప్రపంచ ప్రసిద్ధులైన మహిళ పై ధారావాహికంగా సుమారు 120మంది మహిళా మాణిక్యాలపై రాశాను .వారి అవార్డ్ కూడా అందుకొన్నాను .
పొందిన సాహితీ పురస్కారాలు
1 -ఆంద్ర సారస్వత సమితి –మచిలీ పట్నం వారి పురస్కారం
2-చిన్నయసూరి పురస్కారం
3-విహంగ వెబ్ మహిళా మాసపత్రిక పురస్కారం –జనవరి 2017
4-శారదా స్రవంతి-విజయవాడ ఉగాది పురస్కారం -2019ఏప్రిల్
5-సర్వేపల్లి చారిటబుల్ ట్రస్ట్ –నెల్లూరు –ఉగాది పురస్కారం –ఏప్రిల్-2019
6-శ్రీ పుట్టి వెంకటేశ్వరరావు సారక సాహితీ పురస్కారం-గుడివాడ –జూన్ -2019
7-నోరి చారిటబుల్ ట్రస్ట్ వారి –కళా సుబ్బారావు స్మారక సాహితీ పురస్కారం –త్యాగరాజ గానసభ –హైదరాబాద్
8-ఆంద్ర ప్రదేశ్ రచయితల సంఘం అందజేసిన ‘’జ్ఞానజ్యోతి ‘’పురస్కారం –నవంబర్ 2019.
9-కళా ప్రపూర్ణ బ్రహ్మశ్రీ చర్ల గణపతి శాస్త్రి శ్రీమతి సుశీల గార్ల స్మారక సాహితీ పురస్కారం జనవరి 2021
గబ్బిట దుర్గా ప్రసాద్ –19-6-22-ఉయ్యూరు
సరసభారతి అధ్యక్షుడు