గ్రామీణ ప్రజల సంక్షేమం కోసం పోరాడిన అమృత బజార్ పత్రిక స్థాపకుడు,స్వాతంత్రోద్యమకారుడు -మోతీలాల్ ఘోష్ -2
1757ప్లాసీ యుద్ధం తర్వాత ఈస్ట్ ఇండియా కంపెనీ ఇండియాలో తమపాలన మొదలు పెట్టేనాటికి తూర్పు భారతమంతా అరాచకంగా ఉంది .శాంతి భద్రతలు లేవు .ఇది 19వ శతాబ్ది ప్రారంభందాకా కొనసాగింది .డబ్బుకు న్యాయం అమ్ముడు పోయింది .బ్రిటిష్ వారికి జీతాలేక్కువ ఇండియన్ లకుచాలా తక్కువ .దేశీయులు కూడా విదేశీయులతో పాటు అవినీతి లంచ గొండి తనానికి కేరాఫ్ అడ్రస్ అయ్యారు .ఎకనామిక్ హిస్టరీ ఆఫ్ ఇండియా లో ఆర్ .సి దత్ ఇలా రాశాడు -‘’బెంగాల్ లో అప్పుడు దోపిడీ దొంగలు బందిపోట్లు అందలమేక్కారు .వారిని మేజిస్ట్రేట్లు కూడా ఏమీ చేయలేకపోయారు .కారణం పోలీసుల జీతాలు అతి తక్కువకనుక లంచాలకు అలవాటు పడ్డారు .వీరి సహకారం సరిగ్గా మేజిస్ట్రేట్ లకు దక్కలేదు .పెద్ద పట్టణాలు వ్యాపారకేంద్రాల్లో బందిపోట్ల దాడులు తీవ్రంగా ఉండేవి .గ్రామాలు భయంతో కంపించేవి .బందిపోటు నాయకులు మారినప్పుడల్లా వారిని ప్రసన్నం చేసుకోవటానికి మూల్యం చెల్లించాల్సి వచ్చేది .1800 నుంచి పదేళ్ళు దేశం విపత్కర పరిస్థితులలో కొట్టు మిట్టాడింది .బజార్లలో మార్కెట్ లలో ‘’బెంగాల్ రాజ్ రాయ్ ‘’ల గురించి కధలు గాధలుగా చెప్పుకొనేవారు .తగిన అధికారాలు లేక మేజిస్ట్రేట్లు, పోలీసులు అచేతనులయ్యారు .ప్రజలు దుస్థితి కి తలవొగ్గారు .పాలకుల చర్యలు ప్రజల్ని మరింత సంక్షోభాపెత్తాయి .తప్పుడు సమాచారాలతో భారీగా అరెస్ట్ లు జరిగాయి .బందిపోట్లతో పాటు పోలీసుల పీడా కూడా జనాలను కుంగదీసింది .బ్రిటిష్ పాలన అంతం అయేదాకా ఈ పరిస్థితి ఉంది .దేశభాషలు ఆచారాలు సంప్రదాయాలు ,సామాజిక వ్యవస్థ తెలీని బ్రిటిష్ అధికారులు ,ప్రాపకం సంపాదించిన వారి సాయంతో మరింత అన్యాయాలు చేయించారు .మోకాళ్ళ మెదడు లోని ట్యూబ్ లైట్లు వెలిగి ,పాలన ,న్యాయ వ్యవస్థ,బాధ్యతాయుత పదవులలో విషయజ్ఞులైన సమర్ధులైన భారతీయులను నియమించాలి అని బ్రిటిష్ అధికారులు గుర్తించారు .కానీ తక్కువ జీతాలతో నియమించారు .ఈ పరిణామ తో భారత్ లో ఆంగ్లేయ విద్య కు నాంది పలికారు .భారతీయ ప్రభుత్వ సిబ్బందికి విషయ పరిజ్ఞానం అందించటమే వారి ముఖ్యోద్దేశం .కంపెని వాణిజ్య విధానాలతో దేశీయ పరిశ్రమలైన స్పిన్నింగ్ డైయింగ్ ,నూలు ,పట్టు పరిశ్రమలు బాగా దెబ్బ తిన్నాయి .ఇదే అదనుగా బ్రిటిష్ వస్తువులు దేశీయులపై రుద్దటం మొదలు పెట్టారు .కొద్దికాలం లోనే దేశీయ వస్త్రాల ఉత్పత్తి దారులకు ,వారి పట్టు ,నూలు బట్టలకు స్థానం లేకుండా పోయింది ..దేశీ వస్త్రాలపై 67శాతం పన్ను విధించటం వలన ,యంత్ర వస్త్రాల తయారీ ధాటికి తట్టుకోలేక అదృశ్యమయ్యాయి .నూలు విదేశాలకు ఎగుమతి అయ్యేది .వీటన్నిటితో భారత దేశం ఉత్పాదక స్థాయి నుంచి పతనం చెంది ,కేవలం వ్యావసాయక దేశంగా మారిపోయింది .నూలు వస్త్రాల ఎగుమతులు విపరీతంగా పెరిగిపోయాయి .
గుత్తాదిపత్యంతో అక్రమ లాభాలు ఆర్జిస్తూ,,చార్జీలపేరుతో దేశాన్ని కొల్లగొట్టింది కంపెని ప్రభుత్వం .బ్రిటన్ కు చెల్లించాల్సిన వడ్డీ పై వడ్డీ ,రైల్వే మిలిటరీ చార్జీలపై వడ్డీ ముక్కు పిండి వసూలు చేశారు .దేశీయ రాజులపైన ,ఆఫ్ఘనిస్తాన్ చైనా బర్మా నేపాల్ పై యుద్ధాల పైనా అయిన ఖర్చులు మననుండే గుంజుకొన్నారు .1858లో ఈస్ట్ ఇండియా కంపెని పాలనను బ్రిటిష్ సింహాసనానికి ధారాదత్తం చేశాక ,మన దేశపు రుణ భారం పేరిట 15కోట్లు బ్రిటిష్ రాజ్యం ముక్కు పిండి వసూలు చేసింది .1857 సిపాయి తిరుగుబాటు ఖర్చు,1867 అబిసీనియా పై యుద్ధం ఖర్చూ కూడా రాబట్టుకొన్నారు .1900 నాటికి మన రుణ భారం 2కోట్ల 40లక్షలు .
దేశంలో పండిన ఆహార ధాన్యాలు విదేశాలకు ఎగుమతి చేయటం తో పేదరికం తీవ్ర స్థాయికి చేరింది .తరచుగా కరువులు ,మహామారి1770-19౦౦ మధ్య 22సార్లు వ్యాప్తి వలనఆకలి బాధతో కోట్లాది జనం మలమలమాడి నశించారు .కరువు తాండవమాడే కాలం లోనూ పన్నులు పెంచి పీడించారు .1866-67 ఘోర కరువుకాలం లోకూడా ,అంతకు ముందు ఎప్పుడూ లేనంత ఎక్కువగా ఆహారధాన్యాలు ఇండియానుంచి ఎగుమతి చేసి జనం చావుకు కారకులయ్యారు .
ఉన్న ఒకే ఒక ఆదాయ వనరు వ్యవసాయం పైన కూడా అధికపన్నులు వసూలు చేసి రైతుల నడ్డి విరగగొట్టారు .దేశం భూకమత౦ గా మారి ,దేశం లో పండింది ఏదైనా తమదే అనే నిర్ణయానికి వచ్చారు .రైతులు ,కూలీలు పొట్టగడవక బంది పోట్లుగా మారారు .1793లో సుంకాలు లేవీల వసూలు అధికారం లాండ్ లార్డ్ లనబడే బడా ధనికభూస్వాములకు అప్పగించారు .వసూలు చేసినదానిలోసి౦హభాగం అంటే 90శాతం ప్రభుత్వానికి అప్పగించాలని షరతు పెట్టారు .దీనితో భూస్వాములు సాధికార రెవిన్యు ఏజెంట్లయ్యారు .వాళ్ళు రైతులపై అదనపు పన్ను వసూలు చేసి విలాసాలకు ఉపయోగించుకొన్నారు .ఇలా సింహాసనానికి సొమ్ము దోచిపెట్టారు భూస్వాములు .అక్రమ పన్నులలో తలపన్ను అంటే ‘’పోన్ టాక్స్’’ఒకటి .మనుషులుపశువులు పై ఈ టాక్స్ వసూలు చేసి భూస్వాములు తమ బొక్కసాలు నింపుకున్నారు బొర్రలు పెంచుకొన్నారు .తిండి గిజలు ,జనుము కొని బ్రిటిష్ దొరలతో నీలి అంటే ఇండిగోతోటల పెంపకం దారులతో కుమ్మక్కై ,కౌలు రైతుల్ని పీడిస్తూ అంతులేని అధికారం చెలాయించారు .బక్కరైతులు బిక్క చచ్చి న్యాయ పోరాటం కూడా చేయలేక శక్తి హీనులైపోయారు .తెల్లదొరల రక్షణలో ఉంటూ ,అనాగరకంగా రైతులను అణగదొక్కుతూ బలవంతంగా నీలి పండించేవారు .దీన్ని తక్కువ ధరకే కొని ఎక్కువధరకు అమ్మి విపరీతంగా లాభాలు పొంది,రైతులకడుపులు కొట్టి నిర్భాగ్యుల్ని చేసి తాము ఆధునిక కుబేరులయ్యారు బొర్రా సాబ్ లయ్యారు .
భారత దేశంలో నీలి విప్లవం ‘’ఇండిగో రివోల్ట్ ‘’తో జాతీయ ఉద్యమానికి నాంది పలికింది .జర్మన్ శాస్త్ర వేత్తలు1880లో సింధటిక్ రంగులు కనిపెట్టే దాకా నీలి రంగు రాజ్యమేలింది .బెంగాల్ లో సుమారు 400 ఇండిగో కర్మాగారాలు ఉండేవి .నీలి పండించని రైతులపై భూస్వాములు ఏదో ఒక సాకుతో కక్ష తీర్చుకొనేవారు .ఆక్రమ నిర్బంధం తో చాలామంది రైతులు మరణించారు .1810లో వచ్చిన సర్క్యులర్ దాకా అంటే బెంగాల్ ప్రజలు ఎదురు తిరిగేదాకా సుమారు అర్ధ శతాబ్దం నీలి రైతులపై అణచి వేతకొనసాగింది .1860లో ‘’ఇండిగో డిస్టర్బెంస్ ‘’అనే తిరుగుబాటు వచ్చాక బ్రిటిష్ నీలి పెంపక దార్లను తన్ని తరిమేశారు .నీలి పెంపకాన్ని ఎదిరించి బ్రిటిష్ వారి ఇళ్ళ పైనా నీలి ఫాక్టరీలపైనా ప్రజలు దాడులు చేశారు .బడుగు రైతుల ఈ తిరుగు బాటును పత్రికలూ బాగా సమర్ధించాయి .జెస్సోర్ జిల్లలో శిశిర్ కుమార్ ఘోష్ ,ఆయన తమ్ముడు మోతీ లాల్ ఘోష్ లు నీలి రైతుల ఆందోళనకు మద్దతు పలికారు .దీన బంధు మిశ్రా రాసిన .’’నీల్ దర్పణ్’’-మిర్రర్ ఆఫ్ ఇండిగో నాటకం వాడవాడలా ప్రదర్శింఛి రైతు ఉద్యమానికి తిరుగులేని బలం చేకూర్చారు .ప్రజల్లో బ్రిటిషర్లపై అసహ్యం కలిగింది. మైఖేల్ మధుసూదన దత్ ఈ నాటకాన్ని ఇంగ్లీష్ లోకి అనువదించి ‘రివరెండ్ జే లాంగ్ ‘అనే మారు పేరుతొ ప్రచురించాడు .ప్రభుత్వం ప్రాసిక్యూట్ చేసి వెయ్యిరూపాయల జరిమానా , నెల రోజులు జైలు శిక్ష వధించింది .
సశేషం
మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -25-6-22-ఉయ్యూరు