సహస్ర చంద్రదర్శనం, సరసభారతి సాహితీ పుష్కరోత్సవం తో వారం రోజులు సందడే సందడి -5(చివరి భాగం )
ఈ సందడి లోపు జూన్ 5 ఆదివారం మా మనవడు చరణ్ ఉపనయనం అయిన 16 రోజుల పండుగనాడు మా శ్రీ సువర్చలాన్జనేయ స్వామి దేవాలయం లో మేమిద్దరం వెళ్లి ఉదయం ప్రత్యెక పూజ చేయించి చక్రపొంగలి పులిహోర ప్రసాదాలు చేయించి నైవేద్యం పెట్టి౦చాము.అలాగే జూన్ 18 శనివారం మా అమ్మాయి చి. సౌ .విజయలక్ష్మి ,అల్లుడు శ్రీ సా౦బావధాని గార్ల 29 వ మారేజీ డే సందర్భంగా నేను మనవడు అబ్బాయి రమణ ఉదయం వెళ్లి శ్రీ సువర్చలాన్జనేయస్వామికి ప్రత్యెక పూజ చేయించి ,స్వామికి గారెల దండ వేయించాం . ఆతర్వాత అల్లుడు ఒక 15 రోజులు ఇండియాలో గడపటానికి అమెరికా నుంచి వచ్చి ,వొత్తిడి పనుల్లో బిజీ గా ఉంటూ కొన్ని గంటలు ఉయ్యూరులో మాబ్బాయి జాగృతిఆఫీస్ లో ,మా ఇంట్లో ఒక అరగంట ఉండి మర్నాడు కాకినాడ వెళ్లి ,ఆతర్వాత అమెరికాలోని షార్లెట్ కు జూన్ 27 చేరాడు .
జూన్ 27 న ఉదయాన్నే లేచి అన్ని పనులు పూర్తి చేసి స్నాన సంధ్యా పూజాదికాలు పూర్తీ చేశాను .ప్పటికే బదరీనాద్ గారి కుటుంబం షిర్డీ నుంచి ఉయ్యూరు వస్తే హోటల్ లో రూమ్ బుక్ చేసి ఉంచాం . మా అబ్బాయి శర్మ ,మనవడు హర్ష ఉదయం 8కి వచ్చారు .సుమారు ఉదయం 9 కి శ్రీ కెవి సుబ్రహ్మణ్యమ గారు ఫ్లైట్ లో దిగి మా ఇంటికి పాలపర్తి (మద్దెల)వెంకట్రామయ్యగారబ్బాయితో వచ్ఛి మా ఇద్దరికీ నూతనవస్త్రాలు అందించి ఆశీస్సులు పొందారు . భోజనానికి రమ్మంటే ముందే పాలపర్తి వారింట్లో బుక్కయ్యానన్నారు .కాసేపట్లో శ్రీ మతి భవానీ ,శ్రీ రాంబాబు దంపతులు వచ్చి మా ఇద్దరికీ పళ్ళతో సహా బట్టలు పెట్టి ఆశీస్సు లందుకొన్నారు .మా అన్నయ్యగారబ్బాయి రాంబాబు వచ్చి శుభా కాంక్షలు తెలిపి స్వీట్ పాకెట్ ఇచ్చాడు .ఆతర్వాత బదరీ దంపతులు వారితో వచ్చిన మరొక ఆవిడ శ్రీమతి సాయి సుబ్రహ్మణ్యేశ్వరి మా ఆహ్వానం పై మా ఇంటికి వచ్చారు .వీరికి సరసభారతి పుస్తకాలు ఒక 25 ఇచ్చాము .వారిద్దరికీ జాకెట్లు పసుపు కుంకుమ తాంబూలాలు ఇచ్చండి మా ఆవిడ .సాయి గారికి గబ్బిట వారితో ,గాడేపల్లి వారితో బంధుత్వం ఉంది .కాసేపట్లో హైదరాబాద్ నుంచి బెజవాడవచ్చి కనకదుర్గ అమ్మ వారిని, మాచవరం శ్రీ ఆంజనేయస్వామి వారిని దర్శించుకొని ఛి గాడేపల్లి రామ కృష్ణారావు శ్రీమతి వల్లి దంపతులు వచ్చారు .ఈదంపతులు మాకు నూతన వస్త్రాలు అందిస్తే ,ఆమెకు మా శ్రీమతి చీర జాకెట్ ,వగైరా ఇచ్చి ఆమె అత్తగారు శ్రీమతి శాంతమ్మ(మా రెండవ బావగారు శ్రీ వివేకానంద్ గారి చెల్లెలు )గారికీ చీర జాకెట్ అందజేయమని ఇచ్చింది . ఇక్కడికి వచ్చిన వారంతా ఒకరికొకరు బంధువులే కాని ఇక్కడే మొదటిసారి చూసుకోవటం .వీరి తర్వాత జాగృతి సంస్థ కు చెందిన శ్రీమతి రాజీవి, స్టాఫ్ నాకు ఇష్టమైన మైసూర్ పాక్ ను మా కోడలు మహేశ్వరి చేస్తే తీసుకువచ్చిందరికి పెట్టి ,మాకు నమస్కారాలు చేసి ఆశీర్వాదాలు పొందారు . తిధులప్రకారం నా పుట్టినరోజు నాడు మా అమ్మ తప్పకుండా మైసూర్ పాక్ చేసి పెట్టేది .తర్వాత మాఆవిడా చేస్తోంది .కానీ మొన్న 20 వ తేదీ పనుల వత్తిడి వలనా ,అలసట వలన చేయలేకపోయింది .ఇవాళ ఉదయమే ఆరి౦టికే చేసి నాతొ దేవుడికి నైవేద్యం పెట్టించి ,అందరికి తినిపించింది .మల్లికాంబ గారుకూడా మా కోరిక పై వచ్చారు .ఇంతమంది మా ఇంట్లో అతిధులు రావటం మాకు పరమానందంగా ఉంది .మా ఆవిడ పొంగి పోయి పరవశం చెందింది. .
అందరికి మా పై అంతస్తు హాలు లో భోజనాలు ఏర్పాటు చేశాం .కూర్చోగలిగిన వారు కింద ,లేని వారు కుర్చీలలో కూర్చుని భోజనం చేశారు .మామిడికాయపప్పు వంకాయ కూర సొరకాయ కూటు,ముక్కల ఆవకాయ ,పులిహోర సాంబారు పెరుగు వగైరాలతో భోజనం. అందరూ తృప్తిగా భోజనం చేశారు . ఇక్కడ ఒక విషయం చెప్పాలి .2014 సరసభారతి ఉగాది వేడుకలకు ప్రపంచ ప్రసిద్ధ ఈల విద్వాంసులు శ్రీ కొమరవోలు శివ ప్రసాద్ గారిని ఆహ్వానించి రెండు గంటలు రోటరీ ఆడిటోరియం లో కచేరీ చేయించాం .ఆయన తో 6 గురు వచ్చారు. వారందరికీ మా ఇంట్లోనే భోజనం .మా హాల్ లోనే డైనింగ్ బల్లలు కుర్చీలు వేసి భోజనం పెట్టాం .వంట అంతా మా ఆవిడ అమెరికానుంచి వచ్చిన మా అమ్మాయి , చేశారు మా ఇద్దరబ్బాయిలు కోడళ్ళు హైదరాబాద్ నుంచి పిల్లలతో సహా వచ్చారు .ఇలా భోజనాలు వండి వడ్డించి పెట్టటం మా ఆవిడకు చాలా ఇష్టం .ఆ తర్వాత ఉగాదులకు శ్రీ రామడుగు వెంకటేశ్వర శర్మ ,శ్రీ చక్రాల రాజారావు గారు కుటుంబం ,శ్రీ నోరి సుబ్రహ్మణ్య శాస్త్రి గారు శిష్యుడు ,వీరితో పాటు వచ్చిన ఆవిడశ్రీమతి కమలాకర్ భారతి ,ఆతర్వాత శ్రీ రామయ్య గారి పుస్తకావిష్కరణకు హైదరాబాద్ నుంచి వచ్చిన ఆయన బావమరది, భార్య లకు కూడా ఇలాగె పగలు మా ఇంట్లోనే విందు ఏర్పాటుచేశాం .ఇలాంటి వాటికి మా ఇంటి ఆడపడుచు లాంటి మల్లికా౦బగారు వచ్చి మాకు గొప్ప సహకారమందిస్తారు .అలాగే శివలక్ష్మి దంపతులు కుమార్తె బిందు కూడా .ఈసారికూడా ఆవిడా ,మాకోడళ్లు రాణి,మహేశ్వరి తణుకావిడా ,వల్లీ వడ్డన లో చక్కని సహకారం అందించారు .
మేము భోజనాలు చేసి కిందకు దిగేసరికి గుంటూరు నుంచి డా .మైలవరపు లలిత కుమారి శ్రీ రామ శేషు దంపతులు ,కుమారి గారి తల్లిగారు వచ్చారు .ఆహ్వానం పలికి వారు భోజనం చేసి వచ్చామని చెబితే, వారికీ స్వీటు పులిహోర పెట్టి సంతృప్తి చెందాం .లలితకుమారి దంపతులు మా ఇద్దరికీ నూతన వస్త్రాలు అందించి ఇటీవలే ఆమె రంగనాధ రామాయణం రాసి,ఆవిష్కరి౦పజేసిన పుస్తకం ఇచ్చారు .నా ‘’సాహితీ ఫాన్ రామ శేషు గారికి నేను శాలువా కప్పిసత్కరిస్తే , ,మా శ్రీమతి ఆయన అత్తగారికి చీరే జాకెట్ పెట్టగా ఇద్దరం ఆమెగారికి నమస్కరి౦చి ఆశీస్సులు పొందాం.అప్పటికే సమయం రెండు దాటగా అందరికి కాఫీ ఇచ్చే ఏర్పాటు చేశాం .రాంబాబు భార్య వల్లి ఈ పని చక్కగా చేసి సంతోషం కలిగించింది .ఈలోపు ఫోన్లలో మెసేజ్ లద్వారా శుభా కాంక్షల వర్షం కురుస్తూనే ఉంది నేను మధ్యాహ్నం 3కు టిప్ టాప్ గా తయారై కారులో లైబ్రరీదగ్గరున్న ఫంక్షన్ జరిగే రాజుగారి బిల్డింగ్ దగ్గరకు చేరుకొన్నాను .ఇంటి దగ్గర భవానిగార్కి ,మల్లికామ్బగారికి ,మనోహరి గరికి మా శ్రీమతి చీరా సారే పెట్టి నెమ్మదిగా అందరితో కలిసి కోడళ్ళతో సభకు వచ్చింది , ఇంత మంది సహృదయుల శుభా కాంక్షలు ,ఆశీస్సులతో మేము ‘’సరసభారతి సాహితీ పుష్కరోత్సవ సభకు చేరుకొన్నాం ‘’అక్కడ బ్రహ్మర్షి వంటి అన్నదానం వారల ,అవధానుల ,కవి పండితుల పద్య, కవితా శీస్సులతో ,మంచిమాటలతో అక్కడకూడా పురస్కార గ్రహీతలు మమ్మల్ని సత్కరించి ఆశీస్సులు పొందటం తో ఆనందం తో సంతృప్తి తో తడిసి ముద్దయ్యాం .ఈ అనుభవం గొప్పది .ఇంతకంటే మహదానందం ఉండదు .సభకు శ్రీ పూర్ణచంద్ గారు వచ్చి నాకు తన ‘’పూర్ణ చంద్రోదయం ‘’ఇవ్వటంతో నాకు సాహితీ శక్తి సామర్ధ్యాలు పెరిగినట్లయింది. ‘’ పద్మ భూషణ్ గుర్రం జాషువా స్మారకకలా పరిషత్ –దుగ్గిరాల నిర్వాహకులు డా పి.యోహాన్ గారు విచ్చేసి సంస్థ తరఫున ప్రచురించిన ‘’రజతోత్సవ ప్రత్యెక సంచికను ‘’అందించి ఈసారి జాషువా పురస్కారం నాకు అండ జేయబోతున్నట్లు వేదికపై ప్రకటించటం అశ్వగంధ, చ్యవన ప్రాస సేవించిన ఆనందాను భూతి కలిగింది . వారికి మేము చేసిన సత్కారాన్ని స్వీకరించినందుకు ధన్యవాదాలు ఇంతకంటే ఎక్కువ రాస్తే మీరు జీర్ణించుకోలేరు .ఇంతగా విశేషంగా మాసహస్ర చంద్ర మాసోత్సవం సరసభారతి 165వ కార్యక్రమగా జరిపిన ‘’సరసభారతి సాహితీ పుష్కరోత్సవం లకు విచ్చేసి ఆశీర్వ దించి , అభినదించి ఆనందించి ‘’సందడే సందడిగా ‘’గా అనుభూతి కలిగించిన వారందరికీ పేరుపేరునా కృతజ్ఞతలు తెలుపుకొంటూ సెలవు తీసుకొంటున్నాను .
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -1-7-22-ఉయ్యూరు