గ్రామీణ ప్రజల సంక్షేమం కోసం పోరాడిన అమృత బజార్ పత్రిక స్థాపకుడు,స్వాతంత్రోద్యమకారుడు -మోతీలాల్ ఘోష్ -3
నీల్ విప్లవ౦ –ఇండిగో రివోల్ట్ పై శిశిర్ కుమార్ ఘోష్’’కలిసికట్టుగా ఉంటూ రాజకీయ౦గా ఉద్యమిస్తూ నడవాల్సి ఉందని బెంగాల్ ప్రజలకు ఈ నీలి ఉద్యమమే బోధించింది .బెంగాల్ లో ఆంగ్లేయులకు తగిలిన మొదటి దెబ్బ ఇది .అతిగా చేస్తే ప్రజలు తిరగబడతారని పాలకులు మొదటి సారిగా గ్రహించారు .ఇక అణచి వేత సాగదు అని గ్రహించారు ఇంగ్లాండ్ లో ఇలాంటి అణచి వెతలే విప్లవాన్ని సృష్టించాయని గ్రహించారు .జీవచ్చవంగా అర్ధ శతాబ్దం పాటు అణగి ఉన్నబెంగాలీలను విప్లవోద్యమ సి౦హాలుగా మార్చింది అణచి వేతకు గురి చేసిన రైతుల నీల్ ఉద్యమమే .
1860లో ప్రభుత్వం కంటి తుడుపు చర్యలు మొదలెట్టింది .మొదటి సారిగా ఒక భారతీయుడిని అధికార కమీషన్ సభ్యుడిగా ‘బ్రిటిష్ –ఇండిగో ప్లా౦టర్స్’’పై విచారణకు నియమించారు .ఈ కమిషన్ ఇచ్చిన నివేదిక ఆధారంగా అందులో సూచనలు అమలు చేస్తూ క్రమంగా నీలి తోటల పెంపకం ఆపేశారు .బీహార్ లో చంపరాన్ జిల్లాలో గాంధీ నాయకత్వంలో పెద్ద సత్యాగ్రహం జరిగి 1917లో నీలి పెంపకం రద్దయింది .ఈ ఆందోళన సారధులలో ఒకరు జాన్ లార్మార్ అనే యూరోపియన్ ఉన్నాడు అంటే అవాక్కైపోతాం .
1686లో కలకత్తా లో హుగ్లీ నది ఒడ్డున జాన్ వార్నోక్ నెలకొల్పిన ఈస్ట్ ఇండియా కంపెని రాజకీయ ఆర్ధిక ,వాణిజ్య కార్యక్రమాలతో బలంగా పుంజుకొని విస్తరించి ,స్థానిక దళారుల మద్దతుతో బ్రిటిష్ వ్యాపారులు వాణిజ్యంలో విపరీతమైన సంపద పోగు చేసుకొన్నారు .స్థానిక ఏజేంట్లూ బాగా సంపాదించుకొన్నారు .తక్కువ పెట్టుబడి అధికవడ్డీ లతో అక్రమార్జన చేశారు .బ్రిటిష్ వారిద్వారా కలకత్తా లో బాగా బాగు పడింది ఈముఠా యే.జల్సారాయుళ్ళుగా ఆడంబర జీవితం గడిపారు ఈ ఏజెంట్లు .1793నాటి పర్మనెంట్ సెటిల్ మె౦ట్ల ద్వారా గొప్ప ప్రయోజనాలు పొంది ఎస్టేట్లు సంపాదించి విలాసవంతులై బ్రిటిష్ ప్రభుత్వం స్థిర పడటానికి కారకులయ్యారు .బ్రిటిష్ వారిని బలపరుస్తూ దేశం లో జరగాల్సిన సాంఘిక రాజకీయ ఆర్ధిక మార్పులను అడ్డుకున్నారు .
మొదట్లో ‘’ఫెరింగ్ –ఫిరంగీ ‘’సంస్కృతికీ ,ఆధునిక ప్రపంచ విజ్ఞానానికి దూరంగా ఉంటూ వచ్చిన వారు చదువులకు ,ఉద్యోగాలకు అవకాశాలు రావటం తో ఇంగ్లీష్ విద్యపై ఆసక్తి పెంచుకొన్నారు .కానీ కలకత్తాలో దాని చుట్టూ ప్రక్కల ఉన్న ద్వితీయ శ్రేణి ఉన్నత వర్గాలవారు చదువుల్లో వీళ్ళని వెనక్కి నెట్టేసి ముందుకు దూసుకు పోయారు.వీరే జాతిని జాగృతం చేసిన మహామహులు .మొగల్ ప్రాభవం తర్వాత 19వ శతాబ్దిలో భారతీయ సంస్కృతీ ఏమాత్రం ముందడుగు వేయలేదు .19వ శతాబ్ది మొదట్లో యూరప్ లో అమెరికాలో ప్రారంభమైన రాజకీయ సైద్ధాంతిక ఉద్యమాలగురించి ఎవరికీ పరిచయమే లేదు .ఆదేశాలలో జరిగిన భౌతిక విజ్ఞాన అభి వృద్ధి కూడా వీరికి తెలీదు .కారణం ముఖ్యంగా అక్షరాస్యత తక్కువ .అప్పుడు మనదేశం లో సంస్కృతం పర్షియన్ శాస్త్రాల అధ్యయనం దాదాపు శూన్యం .పర్షియన్ భాష ముస్లిం పాలకుల పాలనా భాషగా మాత్రమె ఉండేది .వేద,ఉపనిషత్తుల అధ్యయన విజ్ఞానం దేశం లో ఏవో కొన్ని ప్రాంతాలకే పరిమితం అయింది .సనాతన సూత్రాలను గుడ్డిగా అనుకరించటమే మతంగా చెలామణి అయింది ..నగర జీవితంలో నైతికత దిగజారి పోయింది .హిందూ మహిళలకు గౌరవం లేదు .బహు భార్యాత్వం గొప్ప ఫాషన్ అయింది .బాలికలను యువతులను పెళ్ళిళ్ళ పేరిట చరాస్తులుగా అమ్మటం విపరీతమైనది .స్త్రీలను పరదాల చాటున ఉంచటమూ లాంచనం అయింది వారికి స్వేచ్చ లేదు .సతీ సహగమనం గొప్ప ఆదర్శంగా చెలామణి అయింది .బలవంతపు సహగమనాలు పెచ్చు పెరిగి మహిళలకు శాపంగా మారింది .సహగమనం చేయని స్త్రీలు పుట్టి౦ ట్లోనో అత్తవారింట్లోనో పరాదీనపు బతుకులో కుంగి కృశించి పోయారు .భర్త ఆస్తికి భార్య న్యాయంగా వారసురాలు కాకుండా పోయింది .పిత్రార్జితం లోనూ వారికి వాటా దక్కేది కాదు .వితంతు వివాహం నిషిద్ధం అయింది .
ప్రభుత్వం దేశీయులకు ఇంగ్లీష్ చదువులు నేర్పిస్తున్నా ,ఆధునిక మానవజాతులు శాస్త్రీయ విజ్ఞానాల గురించి బోధించటం ఇష్టం లేకుండా పోయింది .దీనికి కారణాన్ని ఈస్ట్ ఇండియా కంపెని డైరెక్టర్ లియోనిల్ స్మిత్ ఇలా చెప్పాడు –‘’ఇంతవరకు మనం దేశాన్ని అనేక మతాలూ తెగలు పేరిట విడదీసి పాలించాం.విద్య పరమార్ధం ఈ వేర్పాటుకు స్వస్తి చెప్పటమే .మహామ్మదీయుల్ని హిందూ వ్యతిరేకుల్ని చేశాం .మతాలమధ్య ,కులాల మధ్య చిచ్చు రాజేశాం.విద్యద్వారా వారి మేధస్సు భావనా పటిమ పెంచటం అంటే ,వాళ్ళ బలాన్ని గుర్తి౦చేట్లు చేయటమే .అది మనకే ప్రమాదం ‘’అని చెప్పాడు .
అయినా,సబార్ది నెట్ హోదాలో ఇండియన్లకు అవకాశాలు ఇవ్వాల్సి రావటంతో ఇంగ్లీష్ విద్యా బోధనా కేంద్రాలను అతి తక్కువగానైనా ఏర్పాటు చేయటానికి బ్రిటిష్ పాలనా వ్యాపారులు అయిష్టంగానే అంగీకరించక తప్పలేదు .చతుష్పదులు మక్తాబ్ లకు సబ్సిడీ ,సౌకర్యాలు కలిగిస్తూ ,అప్పటి సంప్రదాయ విద్య నేర్పటమే పాలకుల ఆలోచన ..దీనితోపాటు మిషనరీలు ,కొందరు ప్రైవేట్ వ్యక్తులు కలకత్తాలోనూ పరిసర ప్రాంతాలలో స్కూళ్ళు ఏర్పాటు చేశారు .ప్రైవేట్ వ్యక్తులలో డేవిడ్ హేర్ అనే ఆంగ్లేయుడు ,రాజా రామమోహన రాయ్ లాంటి వారున్నారు .భారత ఆధునిక యుగారంభకుడు రామమోహన రాయ్ .మతప్రసక్తిలేని సార్వజనిక విద్య బోధించటానికి మొదటి కాలేజి కలకత్తాలో 1917లో ప్రారంభమైంది .ఆనగర ప్రముఖ భారతీయుల విరాలాళాతోనే దీన్ని స్థాపించారు .బొంబాయి మద్రాస్ లలో కూడా ఇంగ్లీష్ విద్య వ్యాప్తి చెందింది .
సశేషం
మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -5-7-22-ఉయ్యూరు