గ్రామీణ ప్రజల సంక్షేమం కోసం పోరాడిన అమృత బజార్ పత్రిక స్థాపకుడు,స్వాతంత్రోద్యమకారుడు -మోతీలాల్ ఘోష్ -4
లార్డ్ మెకాలే ,ఆయన సహచరులు 1835లో ప్రవేశపెట్టిన విద్యా పద్ధతిలో రెండు లోపాలున్నాయి. 1-దేశీయ భాషల అధ్యయనం పూర్తిగా విస్మరించ బడింది .2-గ్రామీణులకు ఆధునిక విద్య నేర్చే అవకాశం లేదు .దీన్ని సరిదిద్దటానికే ప్రైవేట్ వ్యక్తులు రంగంలోకి దిగాల్సి వచ్చింది .రామ మోహన్ రాయ్ ,ఈశ్వర చంద్ర విద్యా సాగర్ లవలన బెంగాలీ సాహిత్యం వృద్ధి చెందింది .విద్యా ,సాహిత్యాభి వృద్ధికి బెంగాల్ దేశం వీరికి ఎంతో రుణ పడి ఉంది .విలియం కెరీ ,జాషువా మార్ష్ మాన్ మిషనరీలు కూడా గొప్ప సేవ చేశారు .1800లో బెంగాలీ లో కొద్ది పేజీలతో ఒక మిషనరీ పత్రిక ప్రారంభించాడు .1844 ఇంగ్లీష్ పూర్తిగా వాడుకలోకి వచ్చేసింది .ఇంగ్లీష్ పరిజ్ఞానామ్ వలన కొత్త మేధావి వర్గం ఏర్పడింది .ఈ వర్గం సాంప్రదాయిక పంథాకే కట్టుబడి ఉంది .పట్టణ వర్గం తిరస్కరించింది .1857లో కలకత్తా బొంబాయ్ మద్రాస్ లలో యూని వర్సిటీలేర్పడ్డాయి ..అప్పుడే మొదటి స్వాతంత్ర్య సంగ్రామం అనే సిపాయీ తిరుగుబాటు జరిగింది .దేశీయులు పూర్తిగా ఆంగ్లేయులకు విదేయులైపోతారనే భయం ఎక్కువైంది .బ్రిటన్ లో ఆశలు మోసులేత్తాయి.క్రమంగా మిషనరీలపై వ్యతి రేకత పెరిగింది .పురాతన సంస్కృతిని పరిరక్షి౦చు కోవాలన్న జిజ్ఞాస బాగా పెరిగింది .రాజకీయార్ధిక మత ప్రతిఘటనకు బీజాలు వేసింది రామమోహన్ రాయ్ .ఇది సంస్కృతికి సబంధించింది అనికూడా గ్రహించాడు .సకల మత సారాన్ని మొట్టమొదటగా అధ్యయనం చేసింది ఆయనే .తాత్విక స్థాయిలో సర్వమత ఐక్యతకు నాంది పలికాడు .ఆధ్యాత్మిక మానవతా వాదం తో పాశ్చాత్య భౌతిక వాదాన్ని ఎదుర్కొన్నాడు .స్వామి వివేకానంద ,రవీంద్రనాథ టాగూర్ గాంధీ ,సర్వే పల్లి రాదా కృష్ణలు ఆధ్యాత్మిక మానవతా వాదాన్ని ముందుకు తీసుకు వెళ్ళారు .రాయ్ కాలం లోనే ఇదే ఆధునిక భారతీయ వివేచనకు మూలం అయింది .దీనికి ఆధునిక శాస్త్ర విజ్ఞానం జోడిస్తేనే దేశ భవిష్యత్తు ఉంటుందని రాయ్ భావించగా వివేకానంద బలపరచాడు .రాయ్ భారత సమాజం లోని అసమానతలు ముందుగా గుర్తించాడు .ప్రభుత్వం దేశ సమైక్యతకు భంగం కలిగించటమూ గమనించాడు .వసుదైకకుటుంబ భావన వ్యాప్తికావాలని ఆశించాడు .అందుకే ముందుగా సతీ సహగమనం ను వ్యతిరేకించాడు .మహిళా విమోచన స్త్రీలకూ ఆస్తిహక్కు కోసం బహుభార్యాత్వ నిషేధం బాల్య వివాహాల నిషేధాలను వితంతు వివాహాలను బలపరచాడు .
దేశం లో జర్నలిజం అభి వృద్ధికి పాటు పడిన మొదటి వ్యక్తీ రాయ్ .బెంగాలీలో ‘’సంబాద్ కౌముది -1821,పర్షియన్ లో ‘’మిరాత్ ఉల్-అక్బర్ ‘’1822 స్థాపించాడు .ఈ రెండు పత్రికలలో దేశ విదేశీయ వ్యవహారాలూ నిష్పాక్షిక జాతీయ వాదంతో వ్యాఖ్యానించాడు.అనేక సంస్కృత పవిత్ర గ్రంథాలు అనువదించాడు .’’వేదాంత సూత్ర ‘’,ఉపనిషత్ లను బెంగాలీలోకి అనువదించాడు .బెంగాలీ వచనానికి కొత్తరూపు ,దీప్తి కలిగించాడు .జాతీయవాద పత్రికా రంగానికి ఊపిరులూదాడు .పత్రికా స్వేచ్చకు ప్రభుత్వం సెన్సార్ విధిస్తే రద్దు కోసం పిటీషన్ పెట్టి ప్రీవీ కౌన్సిల్ దాకా వెళ్ళాడు .ఆ పిటీషన్ పత్రికా స్వాతత్రానికి ప్రమాణ పత్రం .సెన్సార్ షిప్ ను నిరశిస్తూ పర్షియన్ పత్రికను మూసేశాడు .సెన్సార్ ఆర్డినెన్స్ రద్దు కోసం భారతీయ మేధావి వర్గంతో భారీ రాలీ జరిపాడు రాయ్ .
హిందూ సమాజ నైతికతను పునరుద్ధరించటం లో కృత కృత్యుడు అయినా ,ఆయన సంస్కరణలు హిందూ సమాజం వ్యతిరేకించింది .ఆయన్ను వెలి వేసి ,జీవితాంతం ఏదో ఒక కేసులో ఇరికిస్తూనే ఉంది .అయినా ఆయసనాతన చాందసులను లక్ష్యపెట్టలేదు .1830లో ఆయన బ్రహ్మ సమాజ సభ్యులను కూడా వెలేశారు .19లో బ్రహ్మసమాజ వర్గానికి ,సనాతన చాందస వర్గానికి వాడ ప్రతివాదాలు జరుగుతూనే ఉన్నాయి .
హిందూ పునరుజ్జీ వన ఉద్యమం సంస్కరణ ఉద్యమ౦గా సాగింది .శ్రీరామకృష్ణ పరమహంస వసుధైక అస్తిత్వాన్ని ప్రపంచమంతా చాటారు .అన్ని పద్ధతులూ ఒకే దేవుని చేరుతాయని బోధించారు .అన్నిమత విశ్వాసాలు గొప్పవే .మానవ సేవే మాధవ సేవ .ఆయన శిష్యుడు స్వామి వివేకానంద మానవతా విలువలకు అంకితమై దీన జనోద్ధరణకు కంకబం కట్టుకొని ‘రామకృష్ణా మిషన్ ‘’ద్వారా గొప్ప కృషి చేశాడు .రాజకీయోద్యమం లో నిర్భీకత ,,క్రమ శిక్షణ ,స్వార్ధ రాహిత్యం ,అంకితంగా పని చేసే దీక్ష లను పాదుకొల్పిన మహోన్నత వ్యక్తీ స్వామి కానండుడే .దేశం ఆయనకు ఎంతో రుణపడి ఉంది .ప్రాక్ ,పశ్చిమ దేశాలలోని మంచి లక్షణాలను మేళవింపు దేశానికి అవసరమని ఉద్ఘాటించాడు .దీనివల్లనే నూతన సంస్కృతీ ఉద్భవం జరుగుతుందని ఆశించాడు .’’భారతీయ మత సూత్రాలతో ఐరోపా సమాజ వ్యవస్థ నిర్మిద్దాం ‘’అని ఎలుగెత్తి చాటాడు .జనాలకు హక్కులగురించి తెలియజేసి ,జాతీయతాభావం పురిగొల్పి సమైక్యపరచాలని సందేశమిచ్చాడు .రాయ్ సందేశం’’ వివేకా నంద వాణిద్వారా ప్రతిధ్వనించింది .దీనివలన దేశం ఆశ్చరంగా చైతన్య శిఖరారోహణం చేసింది .ఈ శతాబ్ది ప్రత్యెక వ్యక్తి స్వామి వివేకానంద .ఆయనవలన విద్యావంతులలో జాతీయతా భావం బాగా పెరిగింది .
సశేషం
మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -6-7-22-ఉయ్యూరు