గ్రామీణ ప్రజల సంక్షేమం కోసం పోరాడిన అమృత బజార్ పత్రిక స్థాపకుడు,స్వాతంత్రోద్యమకారుడు -మోతీలాల్ ఘోష్-7
మోతీలాల్ ఘోష్ బాల్యం విద్య
28-10-1847 న మోతీలాల్ ఘోష్ బెంగాల్ లోని పాలువా –మగురా అనే ఉన్నతకాయస్త మధ్యతరగతి కుటుంబం లో జన్మించాడు. తల్లిపేరు అమృతమయీ పేరిట ఆ గ్రామం ‘’అమృత బజార్ ‘’గా మారింది .తండ్రి హరినారాయణ ఘోష్ జేస్సూర్ పట్టణం లో ప్లీడర్ .యుగాలక్రితం ఉన్న రాజప్రతినిధి పేర ఆ పట్టణం కు ఆ పేరువచ్చింది .ఆనాటి ఒక భూస్వామి ఆరాజ్యాన్ని అక్బర్ కలిపేసుకో బోతుంటే సేనలతో పోరాడినందుకు ఆపేరు .మరో పౌరుషం గల రాజు సీతారాం ఆస్థానం కూడా అక్కడే ఉంది.యితడు స్వతంత్ర ప్రతిపత్తికోసం ప్రయత్నించి విఫలుడయ్యాడు .మోతీలాల్ పుట్టినప్పుడు ఈ జిల్లాకు చాలా ప్రాముఖ్యం ఉంది .ఇది ఇండిగో భారీఉత్పత్తి కేంద్రం కూడా .తాడిచెట్లనుంచి చక్కర ,బెల్లం ఉత్పత్తి చేసేవారు .దీని సరిహద్దు సుందర్బన్ అవతల బంగాళాఖాతం ఉంది .ఇవన్నీ వారి బాగా పండే బంగారు భూములు .ప్రభుత్వ ఉప్పు కర్మాగారాలు కూడా ఎక్కువే .ఈజిల్లా ఎగువ ప్రాంతాలలో శతాబ్దాలక్రితంనుంచి గ్రామలేర్పరచుకొని గ్రామస్తులున్నారు .వీరు దిగువ ప్రాంతాలలో వరి పండించే వారు .అందువల్ల దేశీయ పరిశ్రమలు క్షీణించినా ఆప్రభావం ఇక్కడ లేదు .వీరి అవసరాలు చిన్నవి నిరాడంబరులు కూడా .1915లో తన వృద్ధాప్యం లో మోతీలాల్ గత స్మృతులను నేమరేసుకొంటూ ‘’నేటి ఘోరాలకు అతీతంగా ఆనాడు జీవితం ఆదర్శంగా గడిచింది .ఆయన స్వగ్రామం బ్రిటీష్ వారు ‘’కబోదాక్ ‘’గా పిలచిన కలాక్షి నది చాలా ప్రసిద్ధమైంది .ఇక్కడ ఆయనబాల్యం ఉల్లాసంగా గడిచింది .
తండ్రి ఎనిమిదిమంది సంతానంలో నాలుగోవాడు మోతీలాల్ ..పెద్దన్న బసంతకుమార్ మంచి జ్ఞాని .తనవిజ్ఞానాన్ని తమ్ములకు అందించేవాడు .వారికి జర్నలిజం లో ఆసక్తి కలగటానికి ఆయనే కారణం .1862లో ఆయన ‘’అమృత ప్రభాహిని ‘’అనే సంస్కృత పత్రికపెట్టి ,పక్షపత్రికగా నడుపుతూ ,సైన్స్ సాహిత్యం ,పరిశ్రమలు వ్యవసాయం మొదలైన వాటిపై విలువైన సమాచారం అందించాడు .ప్రారంభించిన కొద్దికాలానికే ఆయన చనిపోవటంతో పత్రిక ఆగిపోయింది ..రెండవ అన్న హేమంతకుమార్ కలకత్తా వైద్య కళాశాలలో డాక్టరీ చదువుతూ తండ్రి 1864లో చనిపోవటంతో ఆర్దికంగా కుటుంబం దెబ్బతినటం వలన డిగ్రీ తీసుకోకుండా చదువు విరమించాడు .మూడవ అన్న శశి కుమార్ ప్రఖ్యాత జర్నలిస్ట్ గా విశేష కీర్తి పొందాడు .మోతీలాల్ ను తీర్చి దిద్దాడు వీరి తమ్ముడు హీరాలాల్ చిన్నప్పుడే చనిపోయాడు రాం లాల్ కూడా కొద్దికాలమే బతికాడు అందరికంటే చిన్నవాడు గోలప్ లాల్ పత్రికా సంపాదకత్వ బాధ్యతలను మోతీలాల్ తర్వాత చేబట్టి పత్రికా సంపాదకత్వ సంప్రదాయం నిలబెట్టాడు .మోతీలాల్ పెద్దన్నగారి దగ్గరే మొదటి పాఠాలు నేర్చాడు స్థానిక పాఠాశాలలో అన్ని తరగతులు చదివి ,హైస్కూల్ విద్యకు నడియాజిల్లా కేంద్రమైన కృష్ణ ఘర్ వెళ్ళాడు .ఆజిల్లా నీలిపంటకే కాక ,మిషనరీలకూ ,సనాతన సంస్కృత ఇతిహాస గ్రంధ అధ్యయనానికీ కేంద్రం .అర్ధ –భూస్వామ్య సంపన్నులైన నాడియా మహారాజ సంపన్న కుటుంబాలకు నిలయం కూడా .మహారాజా కృష్ణ చంద్ర పేరిట ఆపేరోచ్చింది .ప్లాసీ యుద్ధంలో ఈయన బ్రిటిష్ వారిని సమర్ధించాడు .విద్య విజ్ఞానాలను బాగా పోషించాడు .ఇంగ్లీష్ ఇక్కడ బాగా వ్యాప్తి చెందింది .1860లో బ్రహ్మ సమాజానికి చెందిన నాయకులు బ్రహ్మర్షి దేవేంద్రనాధ టాగూర్ ,కేశవ చంద్ర సేన్ లు సందర్శించారు .వారి ఉపన్యాసాలు హిందూ యువతను ఆకర్షించి బ్రహ్మసమాజ సంస్థ ఏర్పడింది .మోతీలాల్ కూడా చేరాడు .సంఘ సంస్కరణలను బలపరచాడు .హిందూమత ప్రాతిపదికను మాత్రం అన్నల్లాగానే వదులుకోలేదు .
ప్రవేశ పరీక్ష పాసై స్థానిక కాలేజిలో ఆర్ట్స్ కోర్సు లో చేరాడు మోతీలాల్ .కాలేజీ శలవలకు ఇంటికి నడిచే వెళ్ళేవాడు తిరిగి అలానే వచ్చేవాడు .రానుపోను 160కిలోమీటర్లు .రైలు బస్ సౌకర్యాలు అప్పుడు లేవు .తండ్ర మరణంతో వచ్చిన ఆర్దికసమస్యల వలన ఫైనల్ పరీక్ష రాయలేకపోయాడు .అదే జిల్లాలో పిల్ జంగా అనే ఊరిలో కొత్తగా పెట్టిన నఇంగ్లీష్ హైస్కూల్ హెడ్ మాస్టర్ గా చేరిపని చేశాడు .ఆరోగ్యం దెబ్బతిని స్వగ్రామం చేరాడు .అన్నగార్లు ప్రారంభించిన ఉన్నత పాఠశాల బాలికల పాఠశాల ,వయోజన మహిళా పాఠశాల వ్యవహారాలు చూశాడు .అగ్రామ అగ్రవర్ణ నాయకులు వీరి సంస్కరణలను దుయ్యబట్టారు .సోదరులు హరిసభ ,బ్రహ్మ సభలు పెట్టి వారి వాదాలను తిప్పికొట్టారు .తర్వాత వీరు వైష్ణవం స్వీకరించారు .
సోదరుడు భాస్కరకుమార్ అకాల మరణం నాటికి హేమంతకుమార్ శశికుమార్ లు ఆదాయం పన్ను డిప్యూటీ కలెక్టర్లుగా ప్రభుత్వోద్యోగాలలో ఉన్నారు .అయినా ప్రజా చైతన్యం కోసం జర్నలిజం చేబట్టారు .1867లో రాజీనామా చేసి ,బెంగాలీలో ‘’అమృత బజార్ ‘’పత్రిక నడపటానికి నిర్ణయింఛి స్వగ్రామం చేరారు ఆశతాబ్దం లో అదొక సంచలనమే అయింది .
అమృతబజార్ పత్రిక ఆవిర్భావం
20-2-1868న అమృత బజార్ పత్రిక విడుదల చేశారు .ఇది ముగురన్నదమ్ముల ముద్దు చెల్లెలు .ఒక గ్రామం నుంచి వెలువడిన పత్రిక .ఎలా మొదలు పెట్టారో మోతీలాల్ ఇలా చెప్పాడు –‘’కలకత్తా దగ్గర ఒక వ్యాపారి ప్రింటింగ్ కోసం యంత్ర పరికరం కొని వ్యాపారం లో విఫలుడై ,చనిపోగా ,ఆయనభార్య వాటిని అమ్మేయాలనుకోగా అప్పుడు అన్నలుకొని జేస్సూర్ లోని చిన్న గ్రామ అమృతబజార్ కు తెచ్చారు .వాటిలో విలువైన ప్రింటింగ్ ప్రెస్ అయిన ‘’బెలీన్ ప్రెస్ ‘’ఉంది .ఖరీదు 32రూపాయలు .ఊళ్ళో ఉన్న వడ్రంగి సాయంతో దాన్ని బిగించారు .అరిగిపోయిన టైపులతో కేసులను స్టాండ్ మీద అమర్చారు .ఇలాగా ఒక కుగ్రామంలో అమృతబజార్ పత్రిక ముద్రణాలయం ఏర్పడింది ‘’అని చెప్పాడు .
తర్వాత కలకత్తా వెళ్లి ముద్రణ విధానం నేర్చుకొన్నారు .పత్రిక మొదలెట్టాక స్టిక్కులు చేతిలోపట్టుకొని,తమ రచనలు తామే టైప్ చేసుకొంటూ ప్రతులు తామే ముద్రించేవారు .గ్రామంలో కొందరికి కంపోజింగ్ ,ముద్రణా నేర్పినా సోదరులు అన్నిపనులు తామే చేసుకొనేవారు .స్టిక్ లు చేతిలోపట్టుకోవటం ,ముద్రణకు యంత్రం తిప్పటం ,రోలర్స్ టైపులు ఎక్కించటం ,కాగితం ,మాట్రి స్ లు తయారు చేయటం అంతా యజమానులే చూసుకోనేవారు .కాగితం తయారు చేయటంలో విఫలం అయినా నాణ్యమైన ఇంకు తయారు చేసుకొన్నారు .వారపత్రికగా దాని సైజు 2 ½ క్రౌన్ సైజ్ .అమృతం అంటే అమృతమూ తేనే ,బజార్ అంటే మార్కెట్ .ఈ మూదూకలిస్తే తేనే ను పంచి ఇచ్చే పత్రిక అని అర్ధం .అమృతం అంటే విషం కూడా కనుక అమృతాన్నీ విషాన్నీ కూడా ఇచ్చే పత్రిక .రుజు దృష్టి ఉన్నవారికి అమృతం ,వక్ర దృష్టి ఉన్నవారికి విషం పంచి పెడుతుందని యజమానులమనోభావం .రాసేదీ గుద్దేదీ వాళ్ళే కనుక కొంతకాలానికే సర్క్యులేషన్ 500దాకా పెరిగింది పత్రిక .ప్రచారం ప్రజలలో బాగా వ్యాపించి ,ప్రభుత్వం దాన్ని నిశితంగా పరిశీలించటం మొదలెట్టింది .త్వరలోనే పత్రికపై కత్తి కట్టింది .
సశేషం
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -11-7-22-ఉయ్యూరు