మనమరుపు వెనుక మన వెండి తెరమహానుభావులు -304
304 త్రిపురనేని గోపీ చ౦ద్ కుమారుడు ,-మాభూమి హీరో ,ఫిదాలో ఇద్దరుకూతుళ్ళ పెళ్ళికాని తండ్రి –సాయి చ౦ద్
త్రిపురనేని సాయిచంద్ తెలుగు చలనచిత్ర నటుడు, డాక్యుమెంటరీ సినిమాల రూపకర్త.[1] రచయిత త్రిపురనేని గోపిచంద్ కుమారుడు. సంఘసంస్కర్త, హేతువాది అయిన కవిరాజు త్రిపురనేని రామస్వామి చౌదరికి మనుమడు. తెలంగాణ సాయుధ పోరాట నేపథ్యంలో ప్రసిద్ధ దర్శకుడు గౌతమ్ ఘోష్ దర్శకత్వంలో వచ్చిన మాభూమి చిత్రంతో తెలుగు చలనచిత్రరంగంలో నటుడిగా ప్రవేశించాడు. ఆ చిత్రంలో కథానాయకుడు రామయ్య పాత్రలో మరుపురాని నటనను కనబరిచాడు. ఆ తర్వాత శివ, అంకురం మొదలగు తెలుగు సినిమాల్లో నటించాడు. శివ చిత్రంలో నటి అమలకు అన్నయ్యగా నటించాడు. నటనకు దూరమై మైత్రి కమ్యూనికేషన్స్ స్థాపించి కొన్నాళ్ళపాటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సందేశాత్మక డాక్యుమెంటరీలు తీస్తూ ఢిల్లీలో గడిపారు[2]. పాతికేళ్ళ విరామం తరువాత మళ్ళీ శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన ఫిదా చిత్రంతో నటుడిగా పునఃప్రవేశం చేశాడు. నిజజీవితంలో బ్రహ్మచారి[3]గా మిగిలిపోయిన సాయిచంద్, ఫిదా చిత్రంలో ఇద్దరు కూతుళ్ళ తండ్రిగా నటించి విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు.[4]
బాల్యం, విద్యాభ్యాసం
సాయిచంద్ 1956 మార్చి 12న త్రిపురనేని గోపీచంద్, శకుంతలా దేవి దంపతులకు కర్నూలులో జన్మించాడు. ఈ దంపతులకు మొత్తం అయిదు మంది సంతానం. వీళ్ళందరిలో సాయిచంద్ చివరివాడు. తండ్రి గోపీచంద్, ఆయన తండ్రి త్రిపురనేని రామస్వామి పేరొందిన రచయితలు. సాయిచంద్ కి ఆరేళ్ళ వయసులో తండ్రి మరణించాడు. పదేళ్ళ వయసులో తల్లి కూడా మరణించింది. అప్పటి నుంచి మాతామహుడైన (తల్లికి తండ్రి) నారయ్య సమక్షంలో పెరిగాడు. చిన్నతనంలో తండ్రి రచనలు చదవడం ప్రారంభించాడు.
గోరా ప్రారంభించిన వాసవ్య పాఠశాలలో చదువుకున్నాడు. ఆ పాఠశాల నిర్వాహకురాలు, గోరా కోడలైన హేమలతా లవణం ఊయనకు తన పేరు, తండ్రి పేరు కలిసొచ్చేలా సాయిచంద్ అని పేరు మార్చింది.[5]
ఫిల్మోగ్రఫీ
సాయిచంద్ నటించిన తెలుగు చిత్రాల పాక్షిక జాబితా:
· మాభూమి (1980)
· ధర్మవడ్డీ (1982)
· పెళ్లీడు పిల్లలు (1982)
· మంచుపల్లకీ (1982)
· ఆడవాళ్లే అలిగితే (1983)
· ఈ దేశంలో ఒకరోజు (1983)
· రంగులకల (1983)
· విముక్తి కోసం (1983)
· ఈ చదువులు మాకొద్దు (1984)
· శివ (1989)
· అంకురం (1992)
· ఫిదా (2017)
· సైరా నరసింహారెడ్డి (2018)
· చెక్ (2021
· ఉప్పెన 2021
· విరాటపర్వం (2022)
· పండిత పరమేశ్వర ఐ నవల ,విశ్వనాధవారి నవలలు దాక్యు మెంటరీ లుగా తీసి చిరస్మరణీయం చేశాడు సాయి చంద్.
· సశేషం
· మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -16-7-22-ఉయ్యూరు