గ్రామీణ ప్రజల సంక్షేమం కోసం పోరాడిన అమృత బజార్ పత్రిక స్థాపకుడు,స్వాతంత్రోద్యమకారుడు -మోతీలాల్ ఘోష్-11
పత్రిక మార్పులకు కారణాలు -2
బ్రిటిష్ లిబరల్స్ చెప్పీ మాటలు నిజమే నని సురెంద్రనాద్ నమ్మాడు .విదేశీ ప్రభుత్వం పై అంతటి నమ్మకం ఉంచరాదని గ్రహించలేకపోయాడు.బ్రిటన్ లో టోరీ పార్టీ ఓడిపోవటం తో లార్డ్ లిట్టన్ పదవి ముగిసింది .లార్డ్ రిప్పన్ వచ్చాడు .రాగానే వెర్నాక్యులర్ చట్టం1861లో రద్దు చేశాడు .ప్రజలలో సురేంద్ర పలుకుబడి బాగా ఉంది .1878లో ఘోష్ సోదరులు’’ ఆనంద బజార్ ‘’అనే మతప్రాతిపాదిక బెంగాలీ వార పత్రిక ప్రారంభించారు .1922లో సురేష్ చంద్ర మజుందార్ ,,ఫ్రఫుల్లకుమార్ సర్కార్ లు దీన్ని దినపత్రికగా మార్ఛి విశేష ప్రాచుర్యం కలిగించారు .
నమ్మిన వారికి గుణపాఠం
విషయజ్ఞుడు రాజకీయజ్ఞుడు అయిన రిప్పన్ స్థానిక స్వపరిపాలన ప్రవేశపెట్టాడు .ఇది రాజకీయ ప్రజావివేచనకు తోడ్పడింది .జిల్లాబోర్డులేర్పడి బోర్డ్ అధ్యక్షుడికి అధికారాలు వచ్చాయి .అన్నిరకాల అధికారాలు ఆయనకిందే ఉండేవి .స్థానిక బోర్డులు ఏర్పరచి జిల్లా బోర్డు లకింద పని చేసేట్లు చేశారు .పట్టణ మునిసిపాలిటీలకు మెజార్టీ సభ్యులు ఎన్నుకోనేవారు .స్థిరపడ్డాక అనధికారులు అధ్యక్షులయ్యారు .రిప్పన్ భారతీయ విద్యా కమీషన్ ఏర్పాటు చేసి ,దాని తీర్మానాలను అమలు చేశాడు .’’పాలకుడు నిజాయితీ పరుడు అయినా ,విదేశీపాలన నిజాయితీగా సాగే వీలు లేదు ‘’అని చెప్పిన అమృతబజార్ పత్రికమాట నిజమై రిప్పన్ విఫలమయ్యాడు .యూరోపియన్ల గర్జన ఎక్కువై ,1883లో ఆయన డార్జిలింగ్ నుంచి వస్తుంటే వైస్రాయ్ భవనం గేటు వద్ద ఆయన్ను బండబూతులు తిట్టారు .దీనిపై పరమానంద దత్’’ఆంగ్లో ఇండియన్లు పెద్ద కుట్ర పన్ని ,ప్రభుత్వ చట్టాన్ని రద్దు చేయకపోతే , సెంట్రీల దాడి చేసి ,వైశ్రాయిని చాంద్ పాల్ ఘాట్ వద్ద స్టీమర్ లోకి బలవంతంగా ఎక్కించి ,గుడ్ హాప్ అగ్రం మీదుగా ఇంగ్లాండ్ కు తరలించాలని ప్లాన్ ‘’అని రాశాడు .బ్రిటన్ గవర్నమెంట్ జోక్యం చేసుకొని జిల్లా మేజిస్ట్రేట్ ,సెషన్స్ జడ్జి ల అధికారాలను ప్రకటించటం తో వివాదం సమసిపోయింది .తర్వాత చేసిన చట్టం లో యూరోపియన్ అధికారుల అధికారాలు పెంచారు .అన్ని రాయితీలు వారికి లభించాయి .
చట్టం ముందు అందరూ సమానులే అనే రోజు వస్తుందని భావించిన ఇండియన్ లకు ఈ ‘’ఇల్బర్ట్ బిల్ ‘’ఆశనిపాతం అయింది .అయితే మోతీలాల్ అమృతబజార్ పత్రిక ఒక గట్టి గుణ పాఠం నేర్చుకొన్నారు .ఒక కేసులో సాలగ్రామ వివాదం లో దాన్ని కోర్టులో ప్రవేశపెట్టాలన్న జస్టిస్ నోరిస్ న్యాయమూర్తి పదవికి అనర్హుడు అని ది బెంగాలీ పత్రికలో సురేంద్ర వ్యాసం రాస్తే ,రెండు నెలలు శిక్ష పడితే హిందువులు ఆయనకు పూర్తీ మద్దతు ప్రదర్శించి ఆగ్రహంతో ఊగిపోయి తీవ్ర నిరసనలు చేయాటం తో ఆయన కీర్తి మరింత పెరిగింది .1883లో విడుదలకాగానే డిసెంబర్ లో కలకత్తాలో ఇండియన్ అసోసియేషన్ అఖిలభారత జాతీయ సభ జరూపగా ,భారత మిత్రుడు w.s.బ్లాంట్ ‘’ఇది జాతీయ పార్లమెంట్ ఆవిర్భావానికి మొదటి మెట్టు ‘’అన్నాడు .1870లోనే శిశిర్ కుమార్ ‘’జాతీయ పార్లమెంట్ ‘’ను సూచించాడు .1885లో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ స్థాపన తర్వాత కాన్ఫరెన్స్ అందులో విలీనమైంది .అమృత౦ దీన్ని బలపరచింది .1884లో సెంట్రల్ ఇండియా గవర్నర్ జనరల్ ఏజెంట్ సర్ లేపెలో గ్రిఫిన్ అక్రమాలను పత్రిక బయట పెట్టింది .ఆరోపణలు రుజువై రాజీనామా చేసి ,వెళ్ళియాడు .
1889లో మరోస్కూప్ బయటికి లాగింది పత్రిక .కాశ్మీర్ మహారాజు ను గద్దె దించటానికి వెనకున్న కారణాన్ని తెలిపే విదేశాంగ శాఖ రహస్యపత్రాన్ని బయటపెట్టి ప్రభుత్వాన్ని ఇరుకున పడేసింది .గిల్గిత్ ప్రాంత ఆక్రమణ ఇందులో ముఖ్యమని చెప్పింది .దేశంలో తీవ్రలజడి జరిగి ప్రజాగ్రహం ఉప్పెన అవగా గత్యంతరం లేక మళ్ళీ రాజును కాశ్మీర్ గద్దె నెక్కించారు .ఇంతకల్లోలం లోనూ పత్రికకు ఇబ్బందికలగలేదు .అప్పటికి అధికార రహస్య చట్టం లెదు కనుక పత్రిక జోలికి రాలేకపోయింది ప్రభుత్వం .బెంగాల్లో బెంగాలీ, అమృత బజార్ పత్రికలూ అగ్రస్థానం లో ఉన్నాయి .ప్రాంతీయ పత్రికలూ జాతీయోద్యమానికి కొమ్ము కాశాయి .బెంగాలీ పత్రికలలో బంగబాసి -1881,సంజిబాని -1883,హితబాది 1891 విశేష ప్రచారం పొందాయి ..మొదటిది హిందూధర్మాన్ని రెండోది బ్రహ్మసమాజాన్ని ,మూడోది హిందూ సంస్కరణ వాదాన్ని బలపరిచేవి .మహారాష్ట్రలో హిందూ ప్రకాష్ ,మహారాట్ట,కేసరి ,కాల్ పత్రికలూ బొంబాయ్ లో బొంబాయి సమాచార్ ,జయ్-ఇ-జయ్ షెడ్,,రాస్త్ గుప్తార్ ,మద్రాస్ లో దిహిందూ ,స్వదేశీమిత్రన్ ,ఉత్తరాభారత్ లో దిట్రిబ్యూన్ పత్రికలూ జనజాగృతిచేసేవి .1890లో కేసరి మహారాట్ట పత్రిలకు ఎడిటర్ గా ఉన్న బాలగంగాధర తిలక్ తన గురువు అమృతబజార్ పత్రకా సంపాదకుడు శిశిర్ కుమార్ అని గర్వంగా చెప్పుకొన్నాడు –‘’ఆయనను తండ్రిగా నేనుభావిస్తా .ఆయన నన్నుకుమారుడిగా భావిస్తారు ‘’అని రాశాడు తిలక్ 1917లో.
విద్యావంతులైన దేశీయులను విశ్వాసం లోకి తీసుకోవాలని రిప్పన్ ,మరికొందరు భావించి ముగ్గురు అధికారులు ఏవో హ్యూమ్ ,సర్ డబ్ల్యు వెడర్ బర్న్ ,డబ్ల్యు ఎస్ బ్లంట్ లు ముందుకొచ్చి అఖిలభారత వ్యవస్థ ఏర్పాటుకు సూచించి,1883లో హ్యూమ్ దేశంలోని దేశంలోని అత్యున్నత విద్యావంతులుగా ఎంపికైన మేధావులకు ఒక బహిరంగ లేఖ రాస్తూ –‘’మీకూ మీదేశానికి మరింత అధిక స్వాతంత్ర్యాన్ని ,నిష్పాక్షిక పాలనా వ్యవస్థను ,పాలనలో విస్తృత భాగ స్వామ్యాన్నీ సాధించటానికి పోరాటం చేయండి .కార్యాచరణ ఎలా ఉండాలో ఆలోచించండి .ఆత్మత్యాగం స్వార్ధ రాహిత్యం తిరుగులేని మార్గాలు ‘’అన్నాడు .ఆతర్వాత రిప్పన్ స్థానం లో వచ్చిన లార్డ్ డఫ్రిన్ ఈ మేధావుల సమావేశాన్ని 1885 డిసెంబర్ లో బొంబాయి లో జరిపాడు .అప్పుడే భారత జాతీయ కాంగ్రెస్ ఆవిర్భవించింది .కలకత్తాకు చెందిన ప్రముఖ బారిస్టర్, సంస్థ అధ్యక్షుడు డబ్ల్యు సి బెనర్జీ తోపాటు ‘’దిఇండియన్ మిర్రర్ ,నబ బిభాకర్ పత్రిక సంపాదకులు మాత్రమె బెంగాల్ నుంచి ఆ సభకు హాజరయ్యారు .ఆహ్వానం వచ్చినా ,తీరికలేక సురెంద్రనాద్ బెనర్జీ వెళ్ళలేదు .ఇంకెవరినీ ఆహ్వానించినట్లు లేదు .
సశేషం
మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -17-7-22-ఉయ్యూరు