మనమరుపు వెనుక మన వెండి తెరమహానుభావులు -306
· 306- నేపధ్యగాయకుడు సంగీతదర్శకుడు ,ప్రపంచ వ్యాప్తంగా 6వేలకచేరీలు నిర్వహించిన ‘’స్వరమాధురి ‘స్థాపకుడు –జి ఆనంద్
· జి. ఆనంద్ తెలుగు నేపథ్య గాయకులు, సంగీత దర్శకులు. అతను నవతరం స్వర మాధురి సంస్థతో వర్ధమాన, ఔత్సాహిక గాయనీ, గాయకులకు ప్రదర్శనావకాశాలు కల్పించాడు. ప్రపంచ వ్యాప్తంగా 6,500 పైగా కచేరీలు నిర్వహించాడు[1].
జీవిత విశేషాలు
అతను శ్రీకాకుళం జిల్లాకు చెందినవాడు. అతని పూర్తిపేరు గేదెల ఆనందరావు. అతని పుట్టినజిల్లా పట్ల ప్రేమతో జిల్లాలో జరిగిన అనేక సాంస్కృతిక కార్యక్రమాలకు హాజరవుతూ ఉంటాడు. అతను అమెరికాలో 14 ప్రదర్శనలు ఇచ్చాడు. సుమారు 2,500 పాటలు పాడాడు. 150 ఆల్బమ్‌సు చేసాడు . సినిమా అవకాశాలు లేకపోయిన సందర్భంలో కూడా డబ్బింగు ఆర్టిస్టు గాను, అనేక టి.వి. సీరియల్స్ లో సంగీత దర్శకుడుగా రాణించాడు.
పండంటి కాపురం సినీమాతో గాయకుడిగా సినీ రంగ ప్రవేశం చేసిన ఆనంద్ సంగీత దర్శకుడు కుడా . స్వరమాధురిఫౌండేషన్ వ్యవస్థాపకుడైన ఆయన ఎంతో మందిని సినీ, దూరదర్శన్ రంగాలకు పరిచయం చేశాడు. అతను తన తొలి పాట “ఎన్నియల్లో.. ఎన్నీయల్లో.. ఎందాకా..” ను చిరంజీవి నటించిన సినిమాకే పాడాడు[2].
షిరిడి సాయిబాబా, తిరుపతి బాలాజీ, విష్ణుపురాణం, గాంధర్వ మాలతీయం వంటి సీరియల్ కి సంగీతం అందించారు. ఎన్నో భక్తి పాటల అల్బుమ్స్ చేసాడు.
సినిమాలు
· 1972 : పండంటి కాపురం (గాయకుడు: మొదటి పాట – కోరస్)
· 1976 : అమెరికా అమ్మాయి (గాయకుడు: ఒక వేణువు వినిపించెను అనురాగ గీతిక)
· 1977 : ఆమె కథ
· 1977 : కల్పన (గాయకుడు: దిక్కులు చూడకు రామయ్య పక్కనె ఉన్నది సీతమ్మ)
· 1977 : దాన వీర శూర కర్ణ (గాయకుడు)
· 1977 : చక్రధారి (గాయకుడు: విఠలా విఠలా పాండురంగ విఠలా)
· 1977 : బంగారక్క (గాయకుడు: దూరానా దూరానా తారాదీపం)
· 1978 : మన ఊరి పాండవులు (గాయకుడు: నల్లా నల్లని)
· 1978 : ప్రాణం ఖరీదు
· 1979 : తాయారమ్మ బంగారయ్య (1979)
· 1987 : గాంధీనగర్ రెండవ వీధి (సంగీత దర్శకుడు)
· 1987 : స్వతంత్రానికి ఊపిరి పోయండి (సంగీత దర్శకుడు)
· 1990 : రంగవల్లి (సంగీత దర్శకుడు)
ఖ్యాతి తెచ్చిన పాటలు
· ఒక వేణువు వినిపించెను అనురాగ గీతిక, (అమెరికా అమ్మాయి).
· దిక్కులు చూడకు రామయ్య పక్కనె ఉన్నది సీతమ్మ, (కల్పన).
· విఠలా విఠలా పాండురంగ విఠలా, (చక్రధారి)
· దూరానా దూరానా తారాదీపం, (బంగారక్క)
మరణం
జి. ఆనంద్ కొద్ది రోజులుగా కరోనాతో బాధపడుతుతూ సకాలంలో ఆక్సిజన్ అందక 2021 మే 6న మృతి చెందాడు.[3]
సుమారు పాతికేళ్ళ క్రితం బెజవాడ లో ఘంటసాల స్వర సప్తాహం తుమ్మలపల్లి కళా క్షేత్రం లో జరిగినప్పుడు బాలు పాల్గొన్న రోజున ఆనంద్ ,ఘంటసాల గారబ్బాయి విజయకుమార్ ,ఘంటసాలశిష్యుడు ఆయన విగ్రహస్థాపకుడు గంగాధరరావు ,లతో పాటు ఆనంద్ కూడా వచ్చి పాడాడు .అప్పుడే అతనిని చూడటం .
· సశేషం
· మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -22-7-22-ఉయ్యూరు