గ్రామీణ ప్రజల సంక్షేమం కోసం పోరాడిన అమృత బజార్ పత్రిక స్థాపకుడు,స్వాతంత్రోద్యమకారుడు -మోతీలాల్ ఘోష్-20
1913లోబెంగాల్ విద్యా శాఖకు ఇంగ్లాండ్ నుంచి కొత్త డైరెక్టర్ ను దిగుమతి చేశారు .అబ్దుల్ రసూల్ ,అబ్దుల్లా అల్మామున్ ఘరావర్తి ,కేపి జమాస్వాల్ అనే ముగ్గురు మేధావుల్ని యూని వర్సిటి లెక్చరర్స్ గా ప్రభుత్వ సమ్మతి తో తిరస్కరించారు .దీనిపై అమృత బజార్ పత్రిక ‘’యూనివర్సిటి పై బ్రిటిష్ అధికారుల పెత్తనం పెంచుతున్నారు .దీనివలన మన పిల్లల విద్యకు విఘాతం కలుగుతుంది .’’అని ప్రజాభిప్రాయాన్ని మన్నించి రాశాడు మోతీలాల్ .టౌన్ హాల్ లో జరిగిన పెద్ద సభకు అన్ని వర్గాల మేధావులు ,ప్రజలు హాజరై ప్రభుత్వ విధానం పై దుమ్మెత్తి పోశారు .బెంగాల్ ను విభజించాలనే ఇంకా పట్టుదలతో ఉండటం సిగ్గు చేటు ‘అన్నారు .మోతీ లాల్ ఈ సభలో చాలా ఘాటుగా విమర్శించినా ,ఆయనపై ఎలాంటి చర్య తీసుకోలేదు .ఆయన తన ప్రసంగం లో ‘’బిడ్డ తల్లిపై కాకుండా బిడ్డపై ఎక్కువ ప్రేమ కనబరచే స్త్రీని మంత్రగత్తె అంటారు .మనపిల్లలకు మన జాతీయతే సంరక్షణ .విదేశీయులకు ప్రేమాదరాలు ఉండవు ‘’అన్నాడు. కార్ని చెల్ అన్నిటికీ అడ్డు పడి వాళ్ళ ఆటలు సాగనివ్వలేదు .
1913లో బెంగాల్ దుఖదాయిని దామోదర్ నదికి విపరీతంగా వరదలు వచ్చాయి .హుగ్లీ ,మిడ్నాపూర్ జిల్లాలు పూర్తిగా మునిగిపోయాయి .ప్రజలు సహాయార్ధం ముందుకు దూకారు .భారీగా నిధులు సేకరించి అందించారు .కార్మిచెల్,ప్రధాన న్యాయ మూర్తి అధ్యక్షతన ఒక సహాయ సంఘం ఏర్పడింది .దీనిలో మెంబర్ అయిన మోతీలాల్ హృదయాలు కరిగెట్లు ప్రజలకు విజ్ఞప్తి చేశాడు –‘’ప్రజలు లక్ష రూపాయన నిధి సేకరిస్తే ,ప్రభుత్వం మరో తొమ్మిది లక్షలు అందిస్తుందని ఆశించ వచ్చా?ప్రజాభిప్రాయం సేకరించి ముందుకు కదలండి .అందరూ ఒప్పుకొంటారు ఎవ్వరూ అభ్యంతరం చెప్పరు’’అన్నాడు .దేశం నలుమూలల నుంచి భారీగా ఆర్ధిక ఆర్దికేతర సాయం లభించింది .రామకృష్ణా మిషన్ ,అజ్ఞాత ఉద్యమ నాయకులు ప్రజలకు విశిష్టమైన సేవలందించి అభినందనలు పొందారు .అజ్ఞాత వాలంటీర్లు గా చాలామంది యువకులు చేరారు .ఈ వరద బాధితులను ఒడ్డున పడేసిన ఘనత అంతా యువతదే .
మోతీలాల్ ను అనేక సాంస్కృతిక రంగాలు కూడా ఆహ్వానించాయి .చిన్నప్పటి నుంచీ సంగీతం పై మక్కువ ఉండటం వలన సంగీత కచేరీలకు హాజరయ్యేవాడు .శాస్త్రీయ ద్రుపద ,ఖయాల్ ,వైష్ణవ పదావళి కీర్తనలంటే ఆయనకు మహా ఇష్టం .భారతీయ ఆట కబాడీ ఇష్టం .
మొదటి ప్రపంచ యుద్ధం
మహా యుద్ధం అని పిలువబడిన మొదటి ప్రపంచ యుద్ధం 4-8-1914న ప్రారంభమవగా భారత్ బ్రిటిష్ పక్షాన నిలిచింది .ఈ కష్ట సమయంలో ప్రభుత్వానికి సాయం చేస్తే తర్వాత అది మనకు మేలు చేస్తుందని ‘’యోజేరేట్లు’’అంటే అతివాదులు ,మితవాదులు కాని వారు భావించారు .బెంగాల్ ఉన్నత వర్గ ముస్లిం లు పూర్తిగా ప్రభుత్వాన్ని సమర్ధించారు .మధ్యతరగతి ముస్లిం లు నమ్మలేదు .అబ్దుల్ కలాం ఆజాద్ ,మహమ్మదాలీ ,షిబ్లినో మొనీలు కాంగ్రెస్ వైపు వచ్చారు .1913లండన్ ఒడంబడికతో ముస్లిం లు ప్రభుత్వానికి దూరమయ్యారు .జాతీయోద్యమం పట్ల మరింత విధేయత కనపరచాలని మహామ్మాదాలీ జిన్నా ప్రకటించాడు .
ఇరకాటం లో ఉన్న పరప్రభుత్వానికి మరింత ఇబ్బందులు కలిగించాలని విప్లవ వర్గం భావించింది .విదేశీ ప్రభుత్వాన్ని పడగొట్టి తిరుగుబాటుచేయటానికి ఆయుధాలు డబ్బూ సమకూర్చటానికి జర్మన్ ప్రభుత్వంతో ,యూరప్ ,అమెరికాలలోని ఆవర్గ ప్రతినిధులు ఒప్పందాలు కుదుర్చుకొన్నారు .ఈ తిరుగుబాటులో భారతీయ సైన్యానికి కూడా కొంత ప్రమేయం కల్పించాలని భావించారు .బెంగాలీలను ఎక్కువ సంఖ్యలో సైన్యం లో చేర్చాలని భారతీయ రాజకీయ తీవ్రవాద వర్గం భావించింది .అజ్ఞాత నాయకులు సమర్ధించారు కూడా .దీనికి మోతీలాల్ కీలక పాత్ర పోషించాడు .గాంధీలాగానే మోతీలాల్ కూడా నమ్మాడని మోతీలాల్ జీవితచరిత్ర రాసిన ఆయనమనవడు పి.దత్తా చెప్పాడు .పరిస్థితి గ్రహించిన బిపిన్ చంద్రపాల్ ‘’బ్రిటిష్ ప్రభుత్వానికి ,ప్రజాహక్కుల కు మధ్య రాజీ కుదిరే అవకాశమే లేదు ‘అని తేల్చి చెప్పాడు .
1915మార్చిలో కొత్త రక్షణ చట్టం తెచ్చింది ప్రభుత్వం .దీన్నిబట్టి ప్రభుత్వం ఎవరినైనా ఎప్పుడైనా అరెస్ట్ చేయవచ్చు .దీనిపై దేశం లో నిరసనలు తీవ్రమయ్యాయి .అమెరికాలో పని చేస్తున్న జెక్ విప్లవకారులని అక్కడి భారతీయ విప్లవకారులు తరిమేశారు .ఆయుధాలతో వస్తున్న రెండు నౌకలను అటకాయించటం ,ప్రభుత్వం పంజాబు బెంగాల్ లలో భయాన్దోలనలుసృష్టించటం జరిగింది .విప్లవకారుల సానుభూతి పరులు అనే నెపం తో వేలాది మందిని అరెస్ట్ చేశారు .మహాయుద్ధం తీవ్రమైన కొద్దీ సైన్యం ఎక్కువ కావాల్సి వచ్చింది .మొదట బెంగాలీ అంబులెన్స్ దళం తర్వాత ,బెంగాలీ రెజిమెంట్ ఏర్పాటయ్యాయి .అధిక సంఖ్యలో బెంగాలీ యువకులు సైన్యం లో చేరటానికి మోతీలాల్ తీవ్ర కృషి చేశాడు . సశేషం
మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -10-8-22-ఉయ్యూరు