శ్రీ కోట గురు వరేణ్యుల గురు పూజోత్సవం
బ్రహ్మశ్రీ కోట సూర్యనారాయణ శాస్త్రి గారి గురు పూజోత్సవం 5-9-22సోమవారం ఉపాధ్యాయ దినోత్సవం నాడు సరసభారతి 167వ కార్యక్రమ౦గా నిర్వహింపబడుతుంది .శ్రీ గురుపుత్రులు శ్రీ కోట చంద్ర శేఖర శాస్త్రి శ్రీ కోట సీతారామాంజనేయులు శ్రీ కోట రామ కృష్ణ ,శ్రీ కోట గాయత్రి ప్రసాద్ గార్లు తమ తలిదండ్రులు కీ శే .కోట సూర్యనారాయణ శాస్స్త్రి శ్రీమతి సీతమ్మ గారల పేరిట ఏర్పాటు చేయబడిన స్మారక నగదు పురస్కారం -ఉయ్యూరులో ని హై స్కూల్స్ లో చదివి 2022మార్చి s.s.c . పరీక్షలలో అత్యధిక మార్కులు సాధించి కాలేజీ లో చేరి ఇంటర్ చచదువుతున్న పేద బ్రాహ్మణ విద్యార్ధినికి ,,విద్యార్ధికి గురుపుత్రుల చేత అంద జేయబడును .
అలాగే అత్యధిక మార్కులు సాధించిన ఒక బిసి విద్యార్ధికి లేక విద్యార్ధినికి ,ఒక sc విద్యార్ధిని లేక విద్యార్ధికి శ్రీ మైనేని గోపాలకృష్ణ ,శ్రీమతి సత్యవతి (అమెరికా )దంపతులు ఏర్పాటు చేసిన కోట గురు వరేణ్యుల స్మారక నగదు పురస్కారం సరసభారతి ద్వారా అందజేయబడును .
మరియు ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ఇద్దరు ఉపాధ్యాయులకు సన్మానం చేయబడును .
వేదిక ,సమయం ,విద్యార్ధినీ విద్యార్దులపెర్లు వగైరా తర్వాత తెలియ జేయబడుతాయి .అందరూ ఆహ్వానితులే . -గబ్బిట దుర్గా ప్రసాద్ -సరసభారతి అధ్యక్షులు -10-8-22-ఉయ్యూరు