సహాయ నిరాకరణ ,ఉప్పు సత్యాగ్రహనాయకుడు ,గోదావరిజిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు ,,కేంద్ర అసెంబ్లీ , స్టేట్ కౌన్సిల్ కి ,కాకినాడ లోక్ సభ స్థానానికి ఎన్నికై న ,కేంద్ర ఆహారశాకః ఉపమంత్రి -మొసలికంటి తిరుమలరావు
–మొసలికంటి తిరుమలరావు (జనవరి 29, 1901 – 1970) ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధులు, పార్లమెంటు సభ్యులు.
దస్త్రం:Mosalikanti tirumala rao.gif
మొసలికంటి తిరుమలరావు
జననం
వీరు తూర్పు గోదావరి జిల్లా పిఠాపురంలో 1901, జనవరి 29[1] న శాయన్న పంతులు దంపతులకు జన్మించారు.
వీరు 1921 లో మహాత్మా గాంధీ పిలుపు నందుకొని కాలేజీ చదువులకు వదలి సహాయ నిరాకరణ ఉద్యమంలో పాల్గొన్నారు. 1930లో ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొన్నందుకు ఏడాది కఠినశిక్ష విధించారు. రాజమండ్రి, చెన్నై, వెల్లూరు జైల్లలో ఆ శిక్ష అనుభవించారు. 1931లో శాసనోల్లంఘనోద్యమంలో పాల్గొని మరొక ఆరు నెలలు జైలు శిక్ష అనుభవించారు. వీరు 1940 వ్యక్తి సత్యాగ్రహంలోను, 1942 క్విట్ ఇండియా ఉద్యమంలో కూడా పాల్గొని కఠిన శిక్షలను అనుభవించారు.
వీరు తూర్పు గోదావరి కాంగ్రెసు అధ్యక్షలుగా రెండు పర్యాయాలు ఎన్నికయ్యారు. 1937 నుండి 1940 వరకు కేంద్ర అసెంబ్లీ సభ్యులుగాను, 1945-1947 లో స్టేట్ కౌన్సిల్ సభ్యులుగాను, 1948-1950 లలో రాజ్యాంగ సభ సభ్యులుగాను, 1950-1952లో తాత్కాలిక ప్రభుత్వం సభ్యులుగా ఉన్నారు.
వీరు 1957, 1962, 1967 సాధారణ ఎన్నికలలో 2వ, 3వ, 4వ లోక్‌సభలకు కాకినాడ లోక్‌సభ నియోజకవర్గం[2] నుండి ఎన్నికై కేంద్ర వ్యవసాయ, ఆహార శాఖ ఉపమంత్రిగా పనిచేశారు.
మరణం
వీరు 1970 సంవత్సరంలో 70వ ఏట పరమపదించారు.
మీ -గబ్బిట దుర్గాప్రసాద్ -13-8-22-ఉయ్యూరు