త్యాగి డా.బ్రహ్మాజోస్యుల సుబ్రహ్మణ్యం -3(చివరిభాగం )
సీతానగర ఆశ్రమం గోదావరి గట్టున ఉండటం చేత వరదలకు పాములు వగైరాలు వచ్చి ఇబ్బంది పెట్టేవి .ఆశ్రమ వాసులలో మామిడి లక్ష్మీ పతి అనే సంపన్న వైశ్య కుర్రాడు ఇక్కడ ఉండగలడా అనుకొన్నారు .అతడు విలాస జీవితం వదిలేసి ఇక్కడ అతి నిరాడంబర జీవితం గడుపుతూ నిర్మాణ కార్యక్రమాలలో చాలాసహాయం చేశాడు .ఒక రోజు రాత్రి రక్త పెంజెరు కరఛి పొడలులు వస్తే ఒక కోయదోరను పిలిపించి తురాయికట్టిస్తే కొంచెం తగ్గింది .ఇంతకంటే మేలైన వైద్యం చేయిద్దామని తురాయి తీసేస్తే విషం ప్రాకి చనిపోయాడు .అందరూ విచారం లో మునిగారు. క్రమంగా కోలుకొని యదా స్థితికి వచ్చారు .
ఆశ్రమం ఉచ్చ స్థితిలో ఉండగా గాంధీ 1930 లో మళ్ళీ ఉప్పు సత్యాగ్రహం మొదలు పెట్టాడు .సుబ్రహ్మణ్యం గారు రెండవ సారి అరెస్ట్ అయ్యారు .రాజమండ్రి కడలూరు జైళ్లలోలో ఏడాది శిక్ష పూర్తీ చేసి ,మళ్ళీ ఆశ్రమానికి వచ్చారు.1932లో గాంధీ రౌండ్ టేబుల్ సమావేశానికి వెళ్లి ,తిరిగి రాగానే అరెస్ట్ చేయబడి ,కాంగ్రెస్ ప్రచారకులపై కసితో వ్యవహరించారుపోలీసులు .గోదావరిజిల్లాలో ఈ దౌష్ట్యం పరాకాష్టకు చేరింది .పెద్దాపురం లో తోట విందులో లాఠీచార్జి జరిగి కోడేటి రంగారావు చేయి విరిగింది .సర్జరీ చేసినా చెయ్యి అతుక్కోలేదు .1937లోచనిపోయాడు .బులుసు సాంబమూర్తి గారిని కాకినాడలో తీవ్రంగా కొట్టారు పోలీసులు .గాయాలు మానటానికి పదిహేను రోజులు పట్టింది .
రాజమండ్రి డిప్యూటీ పోలీస్ సూప రింటే౦డెంట్ ముస్తాఫాలీ ఖాన్ సుబ్రహ్మణ్యంగారి పై పగబట్టాడు .అహంకారి .అన్ని అధికారాలు ఉన్నాయి .రాజమండ్రి సత్యాగ్రహ ఉద్యమం సుబ్రహ్మణ్యంగారి ఆధ్వర్యం లో మహోత్సవంగా జరుగుతోంది .నాళ౦ సుబ్బరాజు గారింట్లో డాక్టర్ గారు ఉండటం గమనించి సిబ్బంది తో వచ్చి ,బయటికి పిలిపించి విచక్షణా రహితంగా లాఠీలతో కొట్టించాడు .ఎందుకో, ఎవర్ని కొడుతున్నారో పోలీసులకే తెలీదు .మోకాళ్ళు తొడలు నడుము పై కొట్టిన దెబ్బలకు పిడి గుద్దులకు లెక్కే లేదు .పాతికమంది తో కొట్టించాడు బండ బూతులు తిట్టించాడు .గాంధీని నీచంగా మాట్లాడి౦చాడు .డాక్టర్ గారిపై నేరం లేదు ఆయన దోషం లేదు .పగ ప్రతీకారం పైశాచికానందం తో పెట్రేగిపోయాడు ఖాన్ .ఒక్క లాఠీపోటు చర్మం లోనుంచి ఎముకలోకి అక్కడి నుంచి ఊపిరి తిత్తులలోకి దూసుకు పోయింది .ఎందరివో ప్రాణాలను కాపాడిన డాక్టర్ గారి ప్రాణాల పాలిటిఆశనిపాతమే అయింది . ఆ రోజు 23-12-1936వైకుంఠ ఏకాదశి .స్వాతంత్ర్య దీక్షా పరతంత్రులైన డాక్టర్ జోశ్యుల సుబ్రహ్మణ్యం గారు వైకుంఠధామం చేరారు .స్వరాజ్యం రాకపోయినాస్వారాజ్యం పొందగాలిగారు ఆ మహా త్యాగి .
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -17-8-22-ఉయ్యూరు