సరోజినీ నాయుడు భర్త ,,నిజాం సైన్య వైద్యాధికారి ,వైద్య సంఘ ఉపాధ్యక్షుడు –డా.ముత్యాల గోవింద రాజులు నాయుడు
ముత్యాల గోవిందరాజులు నాయుడు గారి పూర్వీకులు మద్రాసుకు చెందిన బలిజనాయుడు సైనిక కుటుంబీకులు. నాయుడు గారు హైదరాబాదుకు చెందిన ప్రసిద్ధ వైద్యుడు, సరోజిని నాయుడు భర్త. గోవిందరాజులు నాయుడు 1868లో హైదరాబాదులో జన్మించాడు. మద్రాసు క్రైస్తవ కళాశాల, మద్రాసు వైద్య కళాశాలల్లో చదువుకుని ఉన్నత చదువులకై ఎడిన్‌బరో విశ్వవిద్యాలయానికి వెళ్ళాడు. హైదరాబాదుకు తిరిగివచ్చి 1892లో నిజాం సైన్యంలో వైద్యాధికారిగా నియమితుడయ్యాడు. హైదరాబాదు వైద్య కళాశాలలో ఉపన్యాకుడిగానూ, హైదరాబాదు వైద్య సంఘానికి ఉపాధ్యక్షుడిగాను పనిచేశాడు. లాన్సెట్ వంటి పత్రికలో అనేక వ్యాసాలు వ్రాశాడు.[1]
2-త్రిభాషా నటుడు ,,న్యాయవాది నాటక సంగీత కళాపరిషత్ సభ్యుడు –దాడి గోవిందరాజులు నాయుడు
దాడి గోవిందరాజులు నాయుడు (ఆగష్టు 27, 1909 – డిసెంబర్ 25, 1970) ఈయన తెలుగు, ఇంగ్లీష్, హిందీ నాటకాలలో స్త్రీ పురుష పాత్రధారి, న్యాయవాది, ఆంధ్ర నాటక కళా పరిషత్తు, ఆంధ్ర నాటక సంగీత అకాడమి సభ్యులు.
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -17-8-22-ఉయ్యూరు