హరిజనోద్ధరణ చేసిన రాజమండ్రి మున్సిపల్ చైర్మన్ ,జాతీయ సత్యాగ్రహి,ఉత్తమ ప్రజాసేవకులు డా. శ్రీ పాలకొడేటి గురు మూర్తి -2(చివరిభాగం
ఇందులో మొదటి భాగం చదివిన శ్రీమతి క్రష్ణమయిగారు వెంటనే స్పందించి అమెరికా నుంచి మెయిల్ లో తాను పాలకొడేటి గురుమూర్తిగారికి మనవరాలు అంటేకుమారుని కుమార్తెఅని తెలియ జేశారు .ఈమె నాకు ఎలా పరిచయం అంటారా ?ఆమె భర్త ప్రఖ్యాత అణుశాస్త్రవేత్త ,117వ మూలకం టేన్నిస్సిన్(Tn)ను ఆవిష్కరించిన మహా శాస్త్రవేత్త శ్రీ ఆకునూరి వెంకట రామయ్య గారిపై నాతొ మా మైనేని గోపాల కృష్ణగారు ‘’అణుశాస్త్ర వేత్త డా .ఆకునూరి వెంకట రామయ్య ‘’పుస్తకం రాయించి సరసభారతి తరఫున ప్రచురించారు .ఆసమయం లో రామయ్యగారితో, ఈమె గారితో ఎన్నో సార్లు ఫోన్ లో మాట్లాడి విషయ సేకరణ చేశాను .ఇప్పటికే తరచుగా ఫోన్ చేసి ఆదంపతులు మాట్లాడే సౌజన్యమూర్తులు ఆ దంపతులు .మన సరసభారతి ని ఆమె రోజూ చదువుతారు .శ్రీ సువర్చలాంజనేయ స్వామి దేవాలయం కార్యక్రమాలు చూస్తారు ,స్పందిస్తారు .ఇంకో విషయం నేను రామయ్య గారిపై రాసిన పుస్తకం అమెరికాలో టెన్నిసీ రాష్ట్రం లో రామయ్య గారింట్లోనూ ,స్పాన్సర్ శ్రీ మైనేని గారుండే అలబామా రాష్ట్రం లోని హ౦ట్స్ విల్ దగ్గరున్న మాడిసన్ కౌంటి లోను ,మూడవసారి ఉయ్యూరులో సరసభారతి ఉగాది వేడుకలలో రామయ్య దంపతుల బంధుగణం సమక్షం లో శాసన మాండలి సభ్యులు శ్రీ వై.వి.బి. రాజేంద్ర ప్రసాద్ ఆవిష్కరించి హాట్రిక్ సాధించారు .అంతేనా ?ఈ సంవత్సరం సరసభారతి సాహితీ పుష్కరోత్సవం మా సహస్ర చంద్ర మాసోత్సవం నాడు 27-6-22 సోమవారం శ్రీ మైనేని దంపతులు ఆపుస్తకానికి ఇంగ్లీష్ అనువాదం చేయించి Nuclear Scinntist ’’Dr.Akunuri Venkataramayya ప్రచురించగా నాలుగో సారి రాజేంద్ర ఆవిష్కరించి అరుదైన రికార్డ్ సృష్టించారు .
శ్రీమతి కృష్ణ మయి గారు మెయిల్ లో తెలియ జేసిన విషయాలు –తనమూడవ ఏట తాతగారు గురు మూర్తిగారు మరణి౦చారని ,కనుక తనకు వారితో ప్రత్యక్ష పరిచయం లేదని ,ఆయనకు స్వంత ఇల్లు కూడా లేదని ,కస్టపడి సంపాదించి రాజమండ్రిలో స్వగృహం నిర్మించుకోన్నారని ,కో ఆపరేటివ్ బాంక్ ను రాజమండ్రిలో స్థాపించిన ఘనత వారిదే అని చెప్పారు .ఆ బ్యాంక్ వజ్రోత్సవ అంటే 75 వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించి ఫాదర్ డా.రాం బాబు గారిచే సన్మాన౦చినపుడు తానుకూడా హాజరయ్యానని తెలియజేశారు .పేపర్ వార్తలనుబట్టి గురుమూర్తిగారి 1884లో జన్మించారనీ ,ఆంధ్ర దేశం లో సర్దార్ వల్లభాయ్ పటేల్ వంటి దిట్ట గా గుర్తి౦పు పొందారని ,మునిసిపల్ చైర్మన్ గా ఆదర్శ వంతగా పరిపాలించారని ,స్వాతంత్ర్య ఉద్యమం లో పాల్గొని జైలుకు వెళ్ళారని ,హరిజన సీవ లో తరించారనీ ,రాజమండ్రిలో మొట్టమొదటిసారిగా ఆయుర్వేద మునిసిపల్ ఆస్పత్రి నిర్మించినఘనత తాతగారిదే అని చెప్పారు .తాతగారి ఫోటో కూడా పంపి వ్యాసానికి నిండుదనం చేకూర్చారు