మరి కొందరు నిస్వార్ధ స్వాతంత్ర్య సమరయోధులు
1=శ్రీ వెన్నెటి సత్యనారాయణ
గోదావరిజిల్లా కాతేరు గ్రామవాసి బ్రాహ్మణులు శ్రీ వెన్నెటి సత్యనారాయణ .బియే పాసై రాజమండ్రి వీరేశలింగం హై స్కూల్ ఉపాధ్యాయులుగా పని చేసి ,మానేసి ప్లీడరీ చదివి పాసై ,రామ చంద్రాపురం లో న్యాయవాదిగా పని చేశారు .గాంధీజీ పిలుపు విని వృత్తివదిలేసి ,ఉద్యమాలలో పాల్గొని 1921-22లో అరెస్ట్ కాబడి జైలు శిక్ష అనుభవించి విడుదలై ,కాంగ్రెస్ లో చేరి ఉప్పు సత్యాగ్రహం లో1930 పాల్గొని రెండవసారి జైలుకు వెళ్ళారు .1932లో ముస్తఫా క్రూరానికి బలై,చెరసాలపాలై , ,విడుదలై గాంధీ గ్రామ పునర్నిర్మాణం లో చురుకుగా పాల్గొని ,గృహ పరిశ్రమలకు ,ఖద్దరు ఉత్పత్తికి పాటు పడ్డారు .డా జోశ్యుల సుబ్రహ్మణ్యం గారి తర్వాత ఈయన్నే ఎక్కువగా టార్గెట్ చేసి ముస్తఫా లాఠీలతో బాధించాడని రాజమండ్రి పురవాసులు చెప్పుకొంటారు .
2-శ్రీ నాళ౦ భీమరాజు
రాజమండ్రిలో ప్రసిద్ధ వైశ్య కులం లో జన్మించిన శ్రీ నాళం భీమరాజు గారు మహాసాహసి ,పిరికితనం అంటే ఏమిటో తెలియని ధీరుడు .1930ఉప్పు సత్యాగ్రహం లో పాల్గొని జైలుకు వెళ్లి వచ్చారు .1930 డిసెంబర్ లో జరిగిన పెద్దాపురం తోట విందుఏర్పరచిన వారిలో ఒకరు .
ఆ రోజు తోట విందు పూర్తయ్యాక మధ్యాహ్నం 2-30కి పోలీ సులు లాఠీ లతో వస్తున్నారన్నవార్త తెలిసి ,అందరూ చెదిరి పారిపోదామని భావించగా భీమరాజు ఒక్కరే పారిపోవటం పిరికి తనం పారిపోకూడదని పట్టు బట్టగా ,అరగంటలోపే పోలీసులు వచ్చి చితక బాదేశారు అందర్నీ .కోదేటి రంగా చార్యుల చెయ్యి విరగ గొట్టారు .అది మళ్ళీ అతుక్కోలేదు .1937లో చనిపోయాడు .1932లో డా సుబ్రహ్మణ్యం గారితోపాటు భీమరాజుగారినీ పోలీసులు బాదిపారేశారు .భీమరాజును అరెస్ట్ చేశారు విడుదలై ,హార్ట్ అటాక్ తో చనిపోయారు .
సశేషం
మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -27-8-22-ఉయ్యూరు —