హాస్యానందం
29 –సందేహాలంకారాభాసం
సందేహం అనే అలంకారం ఉంది .అందులోనరస భూపాలుడిని చూసి ‘’ఇంద్రుడో ,ఉపెంద్రుడో బలీ౦ ద్రుడో ‘’అనే పద్యం ఉదాహరణగా ఇచ్చాడు అలంకార శాస్త్రవేత్త .సందేహం అనే హాస్య ప్రక్రియ కూడా అలానే ఉంటుంది అన్నారు మునిమాణిక్యం నరసింహారావు మాస్టారు .ఎప్పుడో తనదగ్గర చదువుకొన్న శిష్య పరమాణువును చూసి ఒక మాస్టారు ‘’వీడు నా దగ్గర చదువుకొన్నవాడేనా ?వాడి తమ్ముడా ?’’అని అనుమానపడతాడు .అనుకుని ఊరు కొంటె బాగానే ఉంటుంది .కాని వాడితో ‘’నా దగ్గర చాలా మంది చదువుకొన్నారు .ఒక్కొకుటుంబంలోనే నలుగయిదుగురు అన్న దమ్మలుంటారు .వాళ్ళు పెద్ద వాళ్లైన తర్వాత నన్ను కలిసి ‘నమస్కారం మాస్టారూ అంటారు ..ఆనలుగుర్లో వీడు ఎన్నో వాడో నాకు గుర్తుండదు .అప్పుడు నేను ‘’అయితే అబ్బాయీ !నువ్వు నువ్వేనా ?లేకపోతె మీ అన్నయ్యవా ?“”అంటాను. ఇదే ఒక సందేహమేగా ఈ దేహానికి వచ్చి౦ దేగా .ఒక సారి అలాంటి కవలలో ఒకడు మరణించాడు .అప్పుడు వాడిని ‘’బాబూ!మీ ఇద్దర్లో చనిపోయింది నువ్వా ?మీ అన్నయ్యా ?అని అడిగాడు .సందేహాన్ని హాస్యోత్పత్తికి ఉపయోగిస్తే ఇలాంటి పలుకు బడులు తయారౌతాయన్నారు మనిమాణిక్యం .కనుక దీన్ని సందేహాలంకార ఆభాసం అన్నారాయన .మరో ఉదాహరణ –విస్తట్లో వడ్డించిన కూర చూసి ‘’ఇది వంకాయకూరా ?దోసకాయ కూరా ??’’అంటే సందేహాలంకారం .ఈ అలంకారం అల్ప వస్తు పరంగా ఉందికనుక సందేహాలంకార ఆభాసం అంటారు మాస్టారు .
ఉత్ప్రేక్షా భాసం
ఉత్ప్రేక్ష దాదాపు అతి శయోక్తి వంటిది..మునిమాణిక్యంగారింటి ముందు ఒక ధనికుడి ఇల్లుంది .ఈయనభార్య కాంతం గారికీ, ఆయన భార్యకూ మంచి స్నేహం ..ఆవిడ రత్నాలు ,వజ్రాలు పొదిగిన ఖరీదైన ఆభరణాలు ధరించేది .కా౦త౦ గారికి ‘’అంత దృశ్యం ‘’లేదు .చిలకల పూడి గిల్ట్ నగలు పెట్టుకొనే వారీమె .ఆవిడ ఒక సారి ఈవిడను ‘ఏమండీ అవి రవ్వ దుద్దులేనా ?ముత్యాలహారం లోవి మంచి ముత్యాలేనా ?’’అని అడిగింది ఆవిడకు తెలుసు అవి కాదని .కానీ హేళన చేయాలనే ఆవిడ ఉద్దేశ్యం .ఈ సంగతి గ్రహించిన కాంతం గారు ‘’ఆ అవి మంచి ముత్యాలే .నాలుగు వేలు పోసికొన్నవి మాయముత్యాలది అవుతుందా వదినా “”అన్నారు .ఇది చూడండి వదినా .ఇది డైమ౦డ్ నెక్లెస్ అంటే మరీ లక్షల ఖరీదు కాదు .ఏదో పది వేలకే వస్తే మా వారు ఉబలాట పడితే ,మా అన్నయ్య కొన్నాడు ‘’అవతలామెకూ తెలుసు ఇందులోని మర్మం .మరో సారి ఆ షావుకారి భార్య కాంతం గారిని ‘’వదినగారూ!రత్నాలు,కెంపులు నీరు పడితే మేము కెమికల్ తో శుద్ధి చేస్తాం .మీరేం చేస్తారు?’’అని అడిగితె కా౦త౦ గారికి ఒళ్ళు మండి,తాను అబద్ధాలాడినసంగతి ఆవిడ బయట పెట్టాలని ప్రయత్నం చేస్తోందని గ్రహించి ‘’ఇవి ఖరీదైన రాళ్ళే అయినా,నీరు పట్టినా ,మాసినా ,వాటిని బాగు చేస్తూ కూర్చోం .అలాంటి వాటిని గోడవతల విసిరేసి పారేస్తాం .కొత్తవి కోనేస్తాం వదినగారూ ‘’అని మూతి మూడు వంకర్లు తిప్పి ఝాడించి చెప్పారు కాంతం గారు అని భర్త మునిమాణిక్యం ఉవాచ .
కోతలు –కోతలు కూడా ఉత్ప్రేక్షా ? అనే అనుమానం రావచ్చు .కాని తానూ వాటిని ఉత్ప్రేక్షగా మార్చి అందిస్తున్నాను అన్నారు నరసింహారావు జీ .నరస భూపాలీయం లో –నరస భూపాలుడు శత్రువులను సంహరిస్తే, వాళ్ళ భార్యలు ఏడిస్తే ఆ కన్నీటితో సముద్రాలు నిండి పొంగాయట.ఇది ఉత్ప్రేక్షాలంకారం .వాడుక భాషలో ఇది సొరకాయ కోత అంటాం .మొదటిది కావ్య గంభీరంగా ఉంటె తాను చెప్పింది హాస్యం తో రామణీయకంగా ఉంది అన్నారు .రెండిటిలోనూ జరిగింది వాక్ వ్యాపారమే అన్నారు .మనం కూడా ప్రదీప్ లాగా ‘’అంతేగామరి, అంతేగా ‘’అని తలూపాల్సి౦ దేగా .అంతేమరి .
మునిమాణిక్యం మాష్టారు గారికి కృతజ్ఞతలతో
సశేషం
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -2-9-22-ఉయ్యూరు