ప్రముఖ బెంగాలీ కవి -జీవనానంద దాస్ -4(చివరిభాగం )
అనువాదకుల అవస్థలు
అనువాదకుడు కవి ఆత్మను నూటికి నూరు శాతం ఆవిష్కరించటం అసాధ్యం.అందుకే అనువాదకుడు కుందుర్తి ఆ యదార్ధాన్ని చెప్పి బెంగాలీ కవి అయిన జీవనానంద దాస్ కవితలను బెత్తెడు ఎడంగా అనువాదం చేసి తెలుగు దనం తేవటానికి కృషి చేశానని చెప్పాడు .బెంగాలీనుంచి ఇంగ్లీష్ అనువాదం పొందిన కవితలను ఆధారంగా తెలుగు అనువాదం చేశాడు .ఆధునిక భాషకు దగ్గరగా ఉండేట్లు జాగ్రత్త పడ్డాడు .కానీ బెంగాలీలో ఉన్న ఛందస్సౌన్దర్యం శబ్దలయ తూగు ఊపు భావాలపోహలింపు ఇంగ్లీష్ లోనూ ,అలానే తెలుగులోనూ వచ్చి ఉండక పొవచ్చు అని నిజాయితీగా చెప్పాడు కుందుర్తి .
‘’సముద్రపు తీరాన ఉప్పు కుప్పలమీద –కోరికల కన్నీళ్లు దళసరి మంచు కార్చటం ‘’,’’చెట్లకు వ్రేలాడుతున్న అరుణ ఫలజాతుల ప్రతిబింబాలు –ఏటి నీటిలో చూసుకొంటూ పొలాలు మురిసిపోవటం ‘’-‘రుత్వంతాల లో నదుల నీటిప్రవాహాల గుసగుసల సాంకేతికాలు –పుడమితల్లి పంట కూతురు పెరగటం ‘’. ఇలాటివి అనువాదాలకు లోన్గానివే అయినా ,మాతృకకు దగ్గర గా ఉండేట్లు తెలిగీకరించాడు .’’దేశ దేశాల సరిహద్దు రేఖలు కలిసే చోట –రాబందులు రాజ్యం చేస్తూ ఎగురు తున్నాయి ‘’-‘మృత్యువంటే బెదిరి పారిపోయే అల్పజాతి పక్షులు -తెల్లమొగాలతో దిగాలుగా ఉంటె –ఎత్తైన గుడి గోపురాలమీద రాబందులు ప్రదక్షిణాలు చేస్తూ –మృత్యువుతో రెక్కల కరచాలనం చేస్తూ ఆకాశమంతా ఆవరించాయి .’’’’మరణ శయ్య ప్రక్క టేబుల్ మీద –సగం తిని శల్యావశిష్టమైన –నారింజ పండులా నన్ను మళ్ళీ భూమ్మీదకు రానివ్వండి ‘’,’’పగలల్లా రైళ్ళు కార్లుట్రాములు సరీ సృపాల్లా జరజరా పాకి –అలసిపోయి బడలిపోయి నిద్రాలోక నిశీధంలో కలిసిపోతాయి ‘’,’’చంద్రబింబం రాలిపడి నీటిలో మునిగి పోయి౦దిక్కడే ‘’,
‘’పంచమిచంద్రుడు అస్తమించగానే –నిశ్శబ్దకాంత పరిగెత్తుకొచ్చి –ఒంటెలాపొడుగ్గా కిటికీలోంచి తలదూర్చి –ఒంటరిగా ఉన్న తాతగారిని ‘’మళ్ళీ లేవద్దు జీవితాన్ని తెలుసుకొనే బాధ తీరిపోయింది ‘’అని మెల్లగా చెవిలో ఊదింది ‘’,’’జీవితం ఒక పొడుగాటి వస్త్రం –మధ్యలో అతుకుల్లేవు –కాలం మాత్రం పందెంలో పరిగెత్తుకొంటూ వచ్చి –తేనే తుట్టేపట్టిన చోటే వాలింది-దారిద్ర్యబాధకు లొంగని దేహం పై వాలింది –ఆ ఏనుగు బతికినా చచ్చినా పది వేలే ‘’
తిలక్ అమృతం కురిసిన రాత్రికవిత రాస్తే దాస్ ‘’వానకురిసిన రాత్రి ‘’కవిత రాశాడు .కుందుర్తి నగరంలో వానకవిత రాసినట్లు నాకు గుర్తు .నింగిలో ఎగిరే గాలిపటం సందడి కవికి ‘’ఆమెకండ్లు గుర్తుకు వస్తాయట ‘’.’’ఎప్పుడో ఒకప్పుడు మళ్ళీ ఈ వంగ దేశానికి వస్తాను –నదీతీరాల విశ్రమిస్తూ ,వరిపోలాలుపర్యటిస్తూ పక్షిగా వస్తానేమో –మనిషిగా రాకపోవచ్చు ‘’అని ఆశాభావం వ్యక్తం చేశాడు జీవనానంద దాస్ .
మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -8-9-22-ఉయ్యూరు