మనమరుపు వెనుక మన వెండి తెరమహానుభావులు -312
312-మధ్యే వాద సినిమా మార్గదర్శి ,అంకూర్ సినీ ఫేం,పద్మభూషణ్ –శ్యాం బెనెగల్
1934లో డిసెంబర్ 14 న సికందరాబాద్ లో ప్రముఖ సిని ఫోటోగ్రాఫర్ బి.శ్రీధర్ దంపతులకు పుట్టిన శ్యాం బెనెగల్ ,చిత్రరచయిత ,దూరదర్శన్ సీరియల్స్ దర్శకుడు .నిజాం కాలేజిలోచదివి డిగ్రీ పాసయ్యాడు .ఉస్మానియా యూనివర్సిటి లో ఫిలిం సొసైటీ స్థాపించాడు .నీరా బెనెగల్ ను వివాహమాడాడు .అనేక పురస్కారాలు అందుకొన్న సృజన శీలి .అంకుర్ సినిమాతో సినీ వినీలాకాశంలో ధ్రువ నక్షత్రంగా మెరిశాడు .నిశాంత్ ,మంథన్,భూమిక చిత్రాలకు దర్శకత్వం వహించాడు .ఈ సినిమాలతో భారతీయ సినీ రంగం లో ‘మధ్యే వాద౦ ‘’ప్రవేశపెట్టిన మార్గదర్శి అంటే ‘పారలల్ సినీ పయనీర్ ‘’1940 తారవాత వచ్చిన ఫిలిం డైరెక్టర్ లలో అత్యుత్తమ దర్శకుడుగా పేరుపొందాడు .ఈ పేరు పెట్టింది సత్యజిత్ రే .1960-70లమధ్య వచ్చిన తన సినిమాలను ,తన సమకాలీనుల సినిమాలను పారలల్ సినిమాలు అని పేరు పెట్టాడు రే.మృణాల్ సేన్ డైరెక్ట్ చేసిన ‘’భువన్ షో౦,బెనెగల్ డైరెక్ట్ చేసిన అంకుర్ ఆ కోవ సినిమాలు . భారత్ ఏక్ ఖోజ్ అనే ఆయన తీసిన సీరియల్ విపరీతంగా పేరుపొందింది .
ప్రముఖ నిర్మాతదర్శకుడు గురు దత్ కు శ్యాం బెనెగల్ కజిన్ .ప్రముఖ బెంగాలీ సినీ దర్శకుడు సత్యజిత్ రే కు వీరాభిమాని .సత్యజిత్ రే,రిత్విక్ ఘటక్ ,బిమల్ రాయ్ ,మృణాల్ సేన్ ,తపన్ సిన్హా,క్వాజా అహ్మద్ అబ్బాస్ ,బుద్దదేవ దాస్ గుప్త ,,చేతనానంద్ ,గురుదత్,శాంతారాం లు పారలల్ సినిమా పయనీర్స్ .ఈకాలాన్ని భారతీయ సినీ యుగంలో స్వర్ణయుగం అంటారు .
శ్యాం బెనెగల్ 18 జాతీయ ఫిలిం అవార్డ్ లు ,ఒక ఫిలింఫేర్ అవార్డ్ ,ఒక నంది అవార్డ్ పొందాడు .2005లో దాదాసాహెబ్ ఫాల్కే అవార్డ్ అందుకొన్నాడు .1976లో పద్మశ్రీ గ్రహీత. 1991లో పద్మభూషణ్ పొందాడు . ,
బంగ్లా దేశ్ ప్రభుత్వం బంగ్లా పిత షేక్ ముజిబుల్ రెహ్మాన్ జీవిత చరిత్ర- ముజీబ్ బయోపిక్ తీయటానికి శ్యాం బెనెగల్ కు అప్పగించింది . ఈఏడాది అది విడుదల అవుతుంది .
మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -8-9-22-ఉయ్యూరు