చేతిలో 5 మహత్తర గ్రంధాలు
కిందటివారం సికందరాబాద్ లో తిరుమలగిరి లో నాగార్జున యూని వర్సిటి రిటైర్డ్ లైబ్రేరియన్ ,సరస భారతి కి అత్యంత ఆత్మీయులు శ్రీ సుంకర కోటేశ్వర రావు గారిని కలిసినప్పుడు వారు ఎంతో ఆత్మీయంగా శ్రీ కొత్త వెంకటేశ్వర రావు గారు అత్యంత శ్రద్ధా నిష్టలతో రచించిన -ఆముక్తమాల్యద -సాహిత్య ఆధ్యాత్మిక సమీక్ష అనే 330పేజీల ఉద్గ్రంధాన్ని బహూకరించారు .ఉయ్యూరు వచ్చి ఒకసారి దాన్ని త్రిప్పి చూస్తె కొత్త కోణం లో రాయల వారి హృదయాన్ని ఆవిష్కరించారు రచయిత అని పించింది .దీన్ని సరసభారతి సాహితీబందువులకు ప్రత్యక్ష ప్రసారంగా అందించాలనే ఊహ ఇప్పుడే కలిగింది .
అలాగే ఆకాశవాణి మాజీ సంచాలకులు శ్రీ నాగసూరి వేణు గోపాల్ ‘నాగ సూరి అకాడెమి ఆఫ్ మీడియా అండ్ సైన్స్ ”ద్వారా ఆయన సంపాదకత్వం లోప్రచురించిన లబ్ధ ప్రతిష్టితులైన వివిధ రంగాలకు చెందిన వ్తక్తులు రాసిన వ్యాసాల సంకలనం ”గాంధీయే మార్గం ”అనే రెండు భాగాల పుస్తకాలు , వేణుగోపాల్ స్వయంగా రాసిన -అసలైన విప్లవవాది ,సిసలైన సిద్ధాంత కర్త -గాంధీజీ ,తోపాటు ఆయనే చలన చిత్ర పోకడలను విశ్లేషిస్తూ రాసిన -అల్లాఉద్దీన్ సినిమాద్భుతం పుస్తకం నాకు ఆదరంగా పోస్ట్ లో పంపారు .అన్నీ విలువైనవే .ఓపికగా ఎప్పుడో చదివి అభిప్రాయం రాయాలి -దుర్గా ప్రసాద్ -14-9-22,