మరో పు౦జీడు పుస్తకాలు

.మరో పు౦జీడు పుస్తకాలు ,5వ ప్రపంచసభలు డిసెంబర్ 23,24
ఇవాళ ఉదయం బెజవాడ ఐలాపురం కన్వెన్షన్ హాల్ లో కృష్ణా జిల్లా రచయితల సంఘం ఆధ్వర్యం లో 75ఏళ్ళ స్వాతంత్ర ఉత్సవాల సందర్భంగా వెలువరించిన ‘’అమృత భారతి ‘’వ్యాస సంకలనం ను జస్టిస్ శ్రీ బట్టు దేవానంద్ గారు ఆవిష్కరించారు .వేదికపై శ్రీ మండలి బుద్ధప్రసాద్ ,శ్రీ గుత్తికొండ సుబ్బారావు శ్రీ పూర్ణ చ౦ద్ ఉన్నారు .శ్రీవిహారి పుస్తకాన్ని పరిచయం చేశారు .జస్టిస్ గారు చాల నిష్కర్షగా నిర్మొహమాటంగా నేటి దేశ రాష్ట్ర పరిస్థితి వివరించారు .మనకొక రాజధాని లేదని అన్ని రాష్ట్రాలవారు ఆక్షేపిస్తుంటే యువత తల దించు కోవాల్సి వస్తోందని ఇది అత్యంత సిగ్గు చేటైన విషయమని ,దేశం లో అన్ని రంగాలలో విలువలు పతనమై పోయాయని వాటిని పునరుద్ధరించి జాతిని తల ఎత్తుకొనేట్లు చేసేబాధ్యత రాచాయితది అనీ, రచయిత అధికారానికి లొంగి పొతే వ్యవస్థను ఎవ్వరూ బాగు చేయలేరని ,ఆత్మ విశ్వాసం స్థైర్యం తో రచయిత సంఘానికి మార్గ దర్శి కావాలని కోరుతూ పోతనగారి పద్యాన్ని సందర్భానికి తగినట్లు ఉదాహరించారు. చప్పట్లు మోగించారు జనం .బుద్ధప్రసాద్ గారు మాట్లాడుతూ నిజాయితీకి, నిర్భీతికి ,విలువైన జడ్జిమెంట్ల కు ఈ జస్టిస్ గొప్ప పెరుపొందారని అందుకే వారితో పుస్తకావిష్కరణ జరిపించామని చెప్పారు .తర్వాత ఈ పుస్తకం లో వ్యాసాలురాసిన రచయితలలో హాజరైన వారికి శాలువాకప్పి ఆపుస్తకాన్నిచ్చిశ్రీ జస్టిస్ గారి చేత సత్కరింప జేశారు .సభలో ఉన్నవారందరికీ పుస్తకం అందించారు . ఆతర్వాత కృష్ణా జిల్లా రచయితల సంఘం కార్యవర్గ సమావేశం జరిగింది .ముఖ్య విషయాలు అధ్యక్ష కార్య దర్శిలు తెలియజేశారు .
5వ ప్రపంచ రచయితల మహాసభలు రెండు రోజులు ఈ డిసెంబర్ 23,24తేదీలలో శుక్ర ,శని వారాలలో విజయవాడ సిద్ధార్ధ కాలేజిలో జరుగుతాయనీ ,ఈ సారి కార్యవర్గం బాధ్యత పెంచు తున్నామని ,జీవిత సభ్యులతో సహా అందరూ ప్రవేశ రుసుం 500 రూపాయలు చెల్లించాలనీ ,స్వచ్చందంగా ముందుకు వచ్చి విరాళాలు కూడా ఇవ్వాలని కోరారు .సుబ్బారావు గారు 50,పూర్ణ 25,పుట్టి నాగలక్ష్మి 25వేలు ,నేను 10వేలు ,శ్రీలత 10వేలు ,విష్ణుప్రసాద్ 10వేలు సిలార్ 10వేలు మరికొందరు ఉదారంగా విరాళాలు అందిస్తామని హర్షధ్వానాల మధ్య తెలియజేశా౦ .ఈ సారి సభలకు ఒక ప్రత్యెక వాట్సాప్ ఫోన్ నంబర్ , ప్రత్యెక బాంక్ అకౌంట్ కూడా తీసుకొన్నామని ఆనంబర్ లతోనే అన్నీ త్రాన్సాక్షనులు జరపాలనీ ,ఉత్సాహంగా పని చేసి ఎక్కువమంది ప్రతినిధులను నమోదు చేసి సభల విజయానికి తోడ్పడమని కోరారు .
ఆతర్వాత ఐలాపురం హోటల్ లో భోజనాలు ఏర్పాటు చేశారు .చాటంత ప్లేటులో చుట్టూ అన్నీ పదార్ధాల డిప్పలు మధ్యలో అన్నం కలుపుకోవటానికి వీలు .ఐలాపురం భోజనం అన్నా టిఫిన్ అన్నా ఎప్పుడూ రొటీనే .నేను తిన్నదేమీ లేదు . జనవరి తర్వాత ఎనిమిదినెలలకు జరిగిన కార్యవర్గం .శ్రీమతి తుర్లపాటి రాజేశ్వరి దంపతులు శ్రీ సవరంమాస్టారు ,శ్రీలత ,రాధిక ,అన్నపూర్ణ ,అక్షరం ప్రభాకర్ ,రాజేష్ ,వృద్ధులు శ్రీ బందా రామారావు ,నూనె అంకమ్మారావు,భూసురపల్లి,దత్తాత్రేయ శర్మ మొదలైన వారిని చాల నెలల తర్వాత చూశాను .
నేను ఫంక్షన్ హాల్ మెట్లు ఎక్కుతు౦డ గానే పైన ఉన్న బుద్ధ ప్రసాద్ గారు ‘’దుర్గా ప్రసాద్ గారూ మీరు రాసిన ఆర్టికల్ ఇవాళ ప్రభలో చూశాను ‘’అని అభినదించారు .శ్రీ నాగసూరి రాయమని కోరిన ఆర్టికల్ అది .అమృత భారతి తోపాటు చారిత్రిక రచయిత శ్రీ సిలార్ మహమ్మద్ అందించిన – ‘’పెరిప్లస్ఆఫ్ దిఎరిత్రియన్ సి ‘’కి ఆయన చేసిన అనువాదం ,ఆయనే రాసిన కృష్ణాజిల్లా జమీందారులు ,డాక్టర్ నూనె అ౦కమ్మారావు గారి ‘’యోచన ఆలోచన’’, సరికొండ నరసింహరాజు గారిచ్చిన ‘నెత్తురు పాదాలు ‘’లయన్ శ్రీ బందా వెంకట రామారావు గారి ఇటీవలి రచన ‘’పాండవ పట్టమహిషి ద్రౌపది ‘’.ఇవన్నీ ఎప్పుడు చదవాలో ?
మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -18-9-22-ఉయ్యూరు

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in పుస్తకాలు. Bookmark the permalink.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.