హిందూ మహాసముద్ర౦ లోఒకటవ శతాబ్దం లో ఒంటరిగా పడవ పై ప్రయాణించిన అజ్ఞాత నావికుని చరిత్ర పెరిప్లేస్ ను తెలుగులో అవిష్కరించిన- బందరు వాస్కోడిగామా శ్రీ సిలార్ -2

హిందూ మహాసముద్ర౦ లోఒకటవ శతాబ్దం లో ఒంటరిగా పడవ పై ప్రయాణించిన అజ్ఞాత నావికుని చరిత్ర పెరిప్లేస్ ను తెలుగులో అవిష్కరించిన- బందరు వాస్కోడిగామా శ్రీ సిలార్ -2
అడులిన్ వద్ద ఈ దేశాలకు ఈజిప్ట్ నుంచి బేర్ బేర్ ప్రజలకోసం కుట్టని బట్టలు ఆర్సినోయ్ నుంచి ధనికులకు విలువైన బట్టలు తక్కువ ఖరీదు గడియారాలు రెండు అంచులకు జాలర్ కుట్టిన నారబట్టఉత్తరీయాలు ,మంచి అద్దాలు ముక్కలుగా కత్తిరించిన ఇత్తడి ,రాగిషీట్లు ,ముంజేతి కంకణాలు కాళ్ళ అందెలు యుద్ధ పరికరాలు వేట బల్లాలు కోసం ఇనుము దిగుమతి అవుతాయి .రాగిపాత్రలు ,నాణాలు ఇటలీ నుంచి ద్రాక్ష సారాయి బంగారు వెండి పళ్ళాలు,సైనికుల పై వస్త్రాలు ,పల్చని చర్మ కోట్లు కూడా ఈ రేవులో దిగుమతి అవుతాయి .ఇండియా ఇనుము ,ఉక్కు ,నూలు బట్టలు పెద్ద పన్నా సగమ టోగాన్ వస్త్రాలు ,చర్మ కోట్లు ,లక్క దిగుమతి అవుతాయి .డయోస్పోలిస్ అంటే ఈజిప్ట్ రాజధాని దేవుని నగరంగా పిలువబడుతుంది .మొనాఖి అంటే మల్లు బట్టలు .
అరేబియా గల్ఫ్ ఇక్కడ తూర్పుకు తిరిగి ,అవాలిటేస్ దగ్గర సన్నగా మారుతుంది .ఇలా పోతుంటే బేర్ బేర్ దేశ సంత పట్టణాలు ఒకదాని తర్వాత ఒకటి తగుల్తాయి .ఈప్రజలకోసం రెడీమేడ్ డ్రెస్సులు గోదుమలు,ద్రాక్షసారాయి దిగుమతి అవుతాయి .ఈ ప్రజలు తాము కట్టుకొనే చెక్క తెప్పలమీద ఆవలి తీరం లోని ,ఒకేలిస్ ,ముజ పట్టణాలకు స్పైసేస్ ,దంతాలు తాబేటి చిప్పలు సువాసనకల బంక ఎగుమతి చేస్తారు .అవాలిటేస్ దాటితే మలావ్ అనే మరో మార్కెట్ పట్టణం వస్తుంది .ఇక్కడ సముద్రం లో ఓడలు లంగరు వేసే రోడ్ స్టేడ్ ఉంది .బంగారం వెండి ఇక్కడికి దిగుమతి అవుతాయి. సువాసన బంక మైరా సాంబ్రాణి ,జాజి జాపత్రి అరేబియాకు ఎగుమతి అవుతాయి .మాలో దాటితే మరో సంతపట్టణం ముండుస్ వస్తుంది .లంగరు వేసే వీలు ఎక్కువ .పైన చెప్పిన సరుకులన్నీ ఇక్కడ దిగుమతి అవుతాయి .ఇక్కడి వ్యాపారస్తులు తగాదా కోర్లు.మనం వ్యాపారం చేయం కనుక మనకు ఫికర్ నై భాయీ ఔర్ బెహనోం .
దీనినుంచి తూర్పుగా వెడితే మూడు రోజులతర్వాత మోసైల్లుం చేరతారు .ఇక్కడా పై సరుకులతోపాటు వెండి పళ్ళాలు కొద్దిగా ఇనుము గాజు దిగుమతి అవుతాయి .ఇక్కడి నుంచి దాల్చిన చెక్క అంటే లవంగపు పట్ట భారీగా ఎగుమతి అవుతుంది .ఇక్కడినుంచి రెండు రోజులు ప్రయాణం చేస్తే చిన్న నైలు నది అనే యేరు ,నీటి ఊటలు పొన్న చెట్లు మీదుగా కేఫ్ ఎలిఫెంట్ చేర్తారు .తీరం ఇక్కడ ఒక శాఖగా చీలి ఎలిఫెంటా నది అకాన్నే అనే పొన్న చెట్ల తోపు వస్తాయి .సాంబ్రాణి, దంతం మైరా ఎగుమతి అవుతాయి .ఇక్కడినుంచి సముద్రం దక్షిణంగా మలుపు తిరిగిన చోట బేర్ బేర్ తీరం చివరహైలాండ్ వస్తుంది .ఇక్కడ అరుదుగా తుఫాన్లు వస్తాయి .అందుకే స్థానికులు టబెయి అనే సముద్రం లో మెరక ప్రాంతానికి రక్షణ కోసం వెడతారు .టబేయి దాటాక పానోగ్రామం ,అక్కడి నుంచి సముద్ర యానం చేస్తే ఒపోన్ అనే మార్కెట్ సంత పట్టణం వస్తుంది .ఇక్కడ దాల్చిన చెక్క భారీగా ఉత్పత్తి అవుతుంది .ఈజిప్ట్ బానిసలతో పాటు నాణ్యమైన తాబేటి చిప్పలు లభిస్తాయి .
ఈజిప్ట్ నుంచి దూరం లో ఉన్న ఈజిప్ట్ లో ఎపిఫీ గా పిలువబడే జులై లో సముద్ర ప్రయాణం చేస్తారు .సాంప్రదాయ బద్ధంగా నిర్మించిన ఓడలు సముద్రం మీద అడ్డం గా అరికా ,బారే గాజా లనుండి అక్కడ ఉత్పత్తి అయ్యే గోధుమ బియ్యం,వెన్న, నువ్వుల నూనె నూలు బట్టలు, నడుం బెల్ట్ లు సచ్చారి అని పిలువబడే వెదురు తోపుల్లో లభించే తేనే ను సంతకు తెస్తారు .ఇక్కడి రాజు స్వతంత్రుడు .పట్టణ ప్రముఖుడు ఒకరు పాలనా వ్యవహారాలూ చూస్తాడు .ఇక్కడి నుంచి సముద్ర తీరం దక్షిణానికి వంపు తిరిగిన చోటు అజానియా భూభాగం తగుల్తుంది .ఇక్కడి నుంచి ఆరు రోజులు ప్రయాణిస్తే ఏడు నదులు ,పైరాలియా దీవులు ,దాటి ,ఔసాటిక్ తీరంలో ఒక పగలు ఒక రాత్రి ప్రయాణిస్తే అడవులతో ఉండే మెనుడియాన్ దీవి వస్తుంది .ఈ దీవిలో అనేక నదులు ,పక్షులు మెట్ట తాబేళ్లు ,మొసళ్ళు ఉంటాయి .చేపల మావులతో తాబెళ్ళను పడతారు .రెండు రోజుల ప్రయాణం తర్వాత రేప్టాసంతపట్టణ౦వస్తుంది .కొబ్బరి నారతో బిగి౦ప బడిన ఈ పట్టణం రాఫ్తా గా పిలువబడుతోంది .దంతాలు ఎక్కువగా దొరుకుతాయి ఇది దొంగల దీవి. మఫారిక్ తెగ ముఖ్యుడు దీని పాలకుడు రాజుకు లోబడి ముజా ప్రజలు ఓడలను అరబ్బు కెప్టెన్ లతో బెరాలాడి వ్యాపారానికి పంపిస్తారు వీళ్ళు స్థానికులతో వివాహాలు చేసుకొంటారు .ముజ మార్కెట్ లో ఇనుప బల్లాలు ,గొడ్డళ్ళు బాకులు ,కత్తులు,కొబ్బరినూనె, గాజు సామాను ఎగుమతి అయి సారాయి గోధుమలు దిగుమతి అవుతాయి.
బెర్ నెస్ కు కుడివైపు భూఖండానికిచివర అజానియా మార్కెట్ తగుల్తుంది .ఇది దాటితే అప్పటి వరకు ఎవరూ అధిగమించని సముద్రం పడమరకు వంపు తిరిగి కనిపిస్తుంది .నావికులకు పెద్దగా పరిచయం లేని ఇధియోపియా ,లిబియా ,ఆఫ్రికా ల మీదుగా ప్రయాణిస్తే ఆ దారి పశ్చిమ సముద్ర౦ లో కలుస్తుంది .మస్సేల్ నుంచి మూడు రోజులు ప్రయాణం చేస్తే చుట్టూప్రాకారాలతో ఉన్న వైట్ విలేజ్ హార్బర్ వస్తుంది .నబ టేయాన్స్ లకు రాజైన మలిఖాస్ పాలన లో ఇది ఉంది .అరేబియా చిన్న నౌకలకు స్థావరం. రాజప్రతినిధి సుంకం వసూలు చేస్తాడు . .దీనికి చాలా దూరం లో దిగువున ఇండియన్ సముద్రపు సరిహద్దుగా అరేబియా దేశం ఉంది .ఇక్కడి గిరిజనులు వాళ్ళ స్వంత భాష మాట్లాడతారు .కొండగుహల్లో చేపలు తినేవారు ,లోతట్టు ప్రాంతాలలో రెండు భాషలు మాట్లాడే దుర్మార్గ ప్రజలుంటారు .సముద్రంలో ప్రయాణించే వారిని దోచుకొని బతుకుతారు .ఓడలు బ్రద్దలై నిర్వాసితులైన జనాన్ని వీళ్ళు పట్టుకొని బానిసలుగా మార్చి అరబ్బు రాజులు ,ముఖ్యులకు అమ్మితే వారు వీరిని ఖైదీలను చేసి ‘’కారనైట్స్’’గా పిలుస్తారు .అరేబియా తీరం వెంట సముద్రయానం భయానకం .కొండరాళ్ళు తగిలి షిప్ రెక్ అవచ్చు .వీటిని దాటి బరంట్ ఐలాండ్ చేరి ,హమ్మయ్య అని ఊపిరి పీల్చుకొని అక్కడ ఒంటెలు గుర్రాలు,గొర్రెలను మేపే శాంతియుతులైన సంచార జాతి ప్రజలతో కలిసి ఉంటారు .
ఇక్కడి నుంచి గల్ఫ్ పాదం కుఎడమ వైపు సముద్ర తీరాన ముజ పట్టణం వస్తుంది .ఇది చట్టప్రకారం ఏర్పడిందే .అరబ్బీ ఓడవ్యాపారులతో సముద్ర ప్రయాణీకులతో సందడిగా ఉంటుంది .నిరంతరం లావా దేవీలతో బిజీ బిజీగా ఉంటుంది. ఇక్కడ నుంచి చాలా దూరం లో ఉన్న బారి గాజా తో వ్యాపారం చేస్తారు .ఇక్కడినుంచి బయల్దేరితే సవా నగరం వస్తుంది .దీని ప్రభువు ఖోలే బస్ .ఇక్కడికి తొమ్మిది రోజుల ప్రయాణ దూరం లో సఫర్ అనే రాజధాని వస్తుంది .ఇక్కడి రెండు తెగలను పాలించే చారిబయాల్ రాజు ఉంటాడు .అంటే దైవ ఆశీర్వాదమున్నవాడు అని అర్ధం యితడు ఖరీదైన బహుమతులు చక్రవర్తికి అందిస్తూ ,రాయబారులను పంపిస్తూ అతనితో సఖ్యత తో ఉంటాడు .ముజ హార్బర్ లో ఎరుపు నీలం కలిసిన సన్న, ,ముతక వస్త్రాలు ,అరేబియా స్టైల్ బట్టలు ,జుబ్బాలు ,నూలు ,బంగారం తో నేసిన ఎ౦బ్రాయిడరి వస్త్రాలు కుంకుమపువ్వు ,రంగు మస్లిన్స్ ,దుప్పట్లు ,సువాసన ఆయింట్ మెంట్లు ,గోధుమలు దిగుమతి అవుతాయి .రాజులకోసం గుర్రాలు కంచరగాడిదలు, వెండి బంగారు పాలిష్ ఉన్న పాత్రలు ,ముజలో ఉత్పత్తి అయి ఎగుమతి అవుతాయి గ్రీకు మాసం ధోట్ లో అంటే సెప్టెంబర్ లో నౌకాయానం సుఖకరం .
ముజకు చాలా దూరం లో అవలిటిక్ గల్ఫ్ దగ్గర బెర్ బెర్ ల దేశం అరేబియా తీరాన ఉంది .ఇక్కడ పెద్దగా పొడవులేని కాలువ ఇరుకు దారిగుండా ప్రవహించి ,పెద్ద అలలల్తో పర్వత గాలులతో ఉప్పొంగుతూ ప్రవహిస్తుంది .తీరానికి దగ్గర ఒసేలిస్ అనే అరబ్బు గ్రామం ఉంది .లంగరు వేసే వీలుంది .పర్షియన్ గల్ఫ్ కు వెళ్ళే నౌకలు లంగరు వేసే మొదటి స్థావరం ఇది .ఇది దాటి చాలాదూరం వెడితే యుడేమా అరేబియా గ్రామం వస్తుంది ఇది చారిబయాల్ రాజ్యం లోనిది ఇక్కడి నీరు మంచి రుచిగా తాగటానికి వీలుగా ఉంటుంది .ఇది బే కు ముఖద్వారం .ఇండియా ఈజిప్ట్ దేశాల కార్గో నౌకలకు దారి ఇచ్చేదికనుక దీన్ని యుడేమా అరేబియా అన్నారు .అలెగ్జాండ్రియా రేవు దారి ఇస్తున్నట్లు ఇది గేట్ వే గా ఉంటుంది అన్నమాట ..దీని రాజధాని సబ్బాధ .అరేబియా బట్టలు ,శిలారసం అంటే స్టోరాక్స్,బంగారు వెండి పళ్ళాలు, గుర్రాలు బొమ్మలు దిగుమతి అవుతాయి ఇక్కడ ఉత్పత్తి అయ్యే సాంబ్రాణి, కలబంద ఎగుమతి అవుతాయి .
ఇక్కడి నుంచి ముందుకు వెడితే సచలిటస్ అనే లోతైన సముద్రశాఖ అడ్డంగా ప్రవహిస్తుంది. దట్టమైన అడవులు మేఘాలు ,పొగ తో ఎత్తైన పర్వత ప్రాంతాల చెట్ల మధ్య నాణ్యమైన సాంబ్రాణి లభిస్తుంది .సాంబ్రాణి చెట్లు పొట్టిగా ఉంటాయి .ఈజిప్ట్ చెట్లు కొద్దికొద్దిగా బ౦కక కార్చి నట్లు ,ఇక్కడి చెట్ల బెరడు పై చుక్కలు చుక్కలుగా ద్రవరూపం లో సాంబ్రాణి కారి ఘనీభవిస్తుంది .శిక్షకుగురైన ఖైదీలచే సాంబ్రాణి సేకరిస్తారు ..వాతావరణం అనారోగ్యకారణం .
స్యాగరాస్ అనే ఈ భూభాగం బే కు కుడివైపు సముద్రం లోకి చొచ్చుకొని పోతుంది .ఇక్కడ ఒక దుర్గం నౌకాశ్రయం ఉన్నాయి కేప్ కు వ్యతిరేక దిశలో ఒక దీవి ఉందిడయాన్ కోయిడా దీవి విశాలంగా ఎడారిగా సముద్ర జలాలతో చిత్తడి నేలగా ఉంటుంది .ఇక్కడ పాకే జీవులు ఎక్కువ .వీటి కొవ్వు కరగబెట్టి వంటనూనె గా వాడుకొంటారు. పండ్లు ఉండవు. ద్రాక్ష పెరగదు .ప్రజలు చాలాతక్కువ. స్థానికులు ఉండరు .వ్యాపారనిమిత్తం వచ్చిన వారే ఉంటారు .ఇక్కడ వ్యాపారం లో స్థిరపడిన వారు అరేబియా –ఇండియా గ్రీసు మిశ్రమజాతి వారు .తెల్ల తాబేళ్లు, మామూలు తాబేళ్లు ఉంటాయి .తాబేళ్ల వేట ఎక్కువ. తాబేళ్ల డిప్పలు కోసి చిన్న సైజు పళ్ళాలు రొట్టెల పాత్రలు చేసి ఎక్కువ ఖరీదుకు అమ్ముతారు .ఇక్కడ రస సింధూరం అంటే రెడ్ సల్ఫైడ్ ఆఫ్ మెర్క్యురి అంటే సినబార్ ఇండియాలో లాగానే దొరుకుతుంది .

మహా ప్రయాణం లో అలసిపోయాం కనుక కాసేపు విశ్రమిద్దాం మిత్రులారా .
సశేషం
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -19-9-22-ఉయ్యూరు

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in పుస్తకాలు, సమీక్ష and tagged . Bookmark the permalink.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.