హిందూ మహాసముద్ర౦ లోఒకటవ శతాబ్దం లో ఒంటరిగా పడవ పై ప్రయాణించిన అజ్ఞాత నావికుని చరిత్ర పెరిప్లేస్ ను తెలుగులో అవిష్కరించిన- బందరు వాస్కోడిగామా శ్రీ సిలార్ -1
రోమన్ జాతీయుడు ఈజిప్ట్ వాసి ,గ్రీకు సాహసిక నావికుడు ,ఒక సాధారణ వ్యాపారి క్రీ శ 1వ శతాబ్దం లో హిందూ మహాసముద్రంలో టాప్ లేని ఓపెన్ బోట్ లో వాణిజ్యసరుకుతోసాహసంగా ప్రయాణించగా అతని యాత్రా వ్యాపార విషయాలను గ్రంధస్తం చేసిన కైఫీయత్తుపేరే ‘’పెరిప్లస్. ‘’.నావికుడి పేరూ రచయిత పేరు లేని గ్రంథం .ఆనాటిఆచార వ్యవహారాలను ప్రజల జీవన పరిస్థితులను ప్రపంచానికి తెలియపరచి న తోలి చరిత్రకారుడు పెరిప్లస్ గ్రంధ కర్త .గ్రీకులో రాసిన దీన్ని 1912లో విల్ఫ్రెడ్ హెచ్ స్కాఫ్ ఇంగ్లీష్ లోకి అనువదిస్తే ఆత్మీయుడు బందరు సాహితీ మిత్రుల మార్గదర్శి జనాబ్ సిలార్ మహమ్మద్ గారు ఈ ఏడాది మార్చిలో తెలుగులొకిఅనువది౦చి అందించిన తాజా పుస్తకం ఇది .దీన్ని కోరుకొల్లు జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ శ్రీమతి పామర్తి( నారగాని ) లీలావతి గారికి అంకితమిచ్చారు .
అజ్ఞాత రచయిత ,చరిత్రకారుడు పెరిప్లస్ గ్రంధ కర్త ‘’పెరిప్లస్ ఆఫ్ దిఎరైత్రియన్ సీ’’పుస్తకం రాశాడు .అ నాడు ఇండియానుంచి విలువైన జాతి రంగురాళ్ళు ,కలప సుగంధ ద్రవ్యాలు ముఖ్యంగా దాల్చిన చెక్క వగైరా మళ్ళీపంపిణీ చేయబడి ,నైలుకు .మధ్యధరా ప్రాంతాలకు రవాణా అయ్యేవి .ఇండియాలో జరిగిన భౌగోళిక మార్పు వల్లసింధునది డెల్టా భూభాగం పశ్చిమ దిక్కుకు మారటం ,కచ్ ప్రాంతపు హార్బర్లు మెరక అవటం ,ఆసియా ప్రజలపై దాడులు వలన హిందూ సముద్రంపై వ్యాపారం మందగించింది .ఆరబ్బులస్వాదీనం లో ఉన్న ‘’గార్డా వ్యూయి ‘’స్వతంతం పొంది ,వ్యాపారాలకు మార్కెట్ ఏర్పడింది .అప్పుడే అబిసీనియా దేశపు సేవలలో ఉన్న పేరు తెలియని రోమన్ ఒకడు ఇండియాకు ఓపెన్ పడవ పై సముద్రయానం సాగించాడు .అనుకూల వాతావరణం లో కొన్ని నెలలు విదేశాల్లో వ్యాపారం ముగించి ,అక్కడి సరుకులతో అనుభవాలతో స్వేదేశం చేరాడు .కొలంబస్ తో పాటు పేర్కొన తగిన హిప్పలస్ అనే సాహస యాత్రికుడు క్రీశ 47లో ఎరైత్రియన్ అంటే ఇండియన్ ఓషన్ లో అడ్డంగా ప్రయాణించి ,ఇండియాలో వివిధ ఋతువులలో సముద్ర వాతావరణం లో మార్పులు ఉండటం గమనించాడు .ఇండియాకు ఇతడే మార్గం కనిపెట్టినవాడు .ఇవి తర్వాతి నావికులకు మార్గ దర్శకాలయ్యాయి .చరిత్రకారుడు ప్లీనీ అతడిని విశేషంగా శ్లాఘించాడు .ఉజ్జయిని రాజు ,శాలివాహన శత కర్త కతియవార్ క్రీశ 78లో శక సంవత్సరం ప్రారంభించాడు .కనుక ఈ పుస్తకరచన దానికి ముందే జరిగిఉండాలి .ఇండియాకు రోముకు జరిగిన వ్యాపారాన్నే పెరిప్లస్ చెప్పింది . క్రీశ 64లో రోము పాలకుడు నీరో. జులై 19నుంచి 25వరకు 7రోజులపాటు రొం తగలబడి,10జిల్లాలు అగ్నికి పూర్తిగా ఆహుతయ్యాయి .ప్లినీకొంతవరకు దీన్ని చరిత్రలో పొందుపరచాడు .ఈ సంఘటనకు ముందే పెరిప్లస్ రచన జరిగి ఉండాలి కనుక చరిత్రలో నమోదుకాలేదు .కాబట్టి పెరిప్లస్ రచనాకాలం క్రీ శ 62వేసవి తర్వాత ,క్రీ శ 58వేసవికి ముందు అని మల్లగుల్లాలు పడి చరిత్రకారులు నిర్ధారించారు .రోమన్ల కాలం లో అనేక రచనలు కు పెరిప్లస్ అనే పేరు వాడారు .హిందూ దేశపు హిందూ మహాసముద్రం ,అందులో కలిసే ఎర్ర సముద్రం ,పర్షియన్ గల్ఫ్ లకు గ్రీకులు రోమన్లు ‘’ఎరైత్రియన్ సి ‘’పేరు వాడారు . సిలార్ గారికి ధన్యవాదాలు తెలుపుతూ ,ఇక మీరూ, నేనూ కలిసి ఆ అజ్ఞాత నావికుడితో ప్రయాణం చేస్తూ విషయాలు తెలుసుకొందామా ?
ఆకాలం లో చేపల ఆవుదూడల మా౦స భక్షకుల తెగలను ఇచ్ టయోఫాగి, అగ్రియో ఫాగి ,మొచ్చోఫాగి అని పిలిచేవారు .ఇప్పుడు ‘’బిషారిన్స్ ‘’అంటున్నారు .సూబియా రాజ్యపు చివరి రాజధాని మేరోయి క్రీ పూ 520లో రాజకీయ కేంద్రంగా మారి పెరిప్లస్ రచనాకాలం తర్వాత ఎడారి తెగలు సూడాన్ నీగ్రోల దండయాత్రలో రాజ్యం ముక్కలు చెక్కలై ,మేరోయి నైలు నదీ భాగ మై ,ఆరవ యేటిపాయ దిగువన సారవంతమైన ఆధునిక బెగారావియా ఏర్పడింది .బైరైన్స్ నౌకాశ్రయం నుంచి నాల్గు వేల స్టాడియాల దూరం లో ఒక చిన్న సంతమార్కెట్ పట్టణం టోలమయాన్ వస్తుంది .ఇక్కడ తెలుపు రంగు డిప్పలున్న తాబేళ్లున్నాయి .ఏనుగు దంతాలు ఉన్నాయి .నౌకాశ్రయం లేదు. చిన్న పడవలలోనే ప్రయాణమంతా.
సెప్టెంబర్ మొదటివారం లో ఎర్ర సముద్రం దాటితే అడ్డంగా ప్రయాణించటానికి వీలైన గాలులు వీస్తూ ప్రయాణం హాయి కలిగిస్తుంది .టోలెమయాన్ -టోకేరా డెల్టా లో దక్షిణ భాగం .దీన్ని ప్రాకారాల రక్షణ దుర్గ౦గా కట్టారు .దీనికి దగ్గర నూబియన్ అడవిలో ఏనుగులు ఎక్కువ .పూర్వకాలం నుంచి దీనికి దారి ఉంది .వేటగాళ్ళ కేంద్రమైన టోలేమయాన్ కు దిగువన దూరం లో అడులిన్ ఓడరేవు ఉంది .ఇది గల్ఫ్ కు తలభాగంగా ఉంటుంది .లంకప్రాంతాల్లో ఏనుగుల్ని ఖడ్గ మృగాలను బతికి ఉండగానేచంపుతారు .అలలాయి సముద్ర తీరం లో చేపలను తినేవారు తాబేటి చిప్పల్ని అమ్ముతారు .ఇక్కడికి ఎనిమిది వందల స్టాడియాల దూరంలో లోతైన బే-అఖాతం ఉంది .ఇక్కడ అరుదైన ఒన్ సియాన్ రాయి ఉత్పత్తి చేస్తారు .
సశేషం
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -19-9-22-ఉయ్యూరు