హిందూ మహాసముద్ర౦ లోఒకటవ శతాబ్దం లో ఒంటరిగా పడవ పై ప్రయాణించిన అజ్ఞాత నావికుని చరిత్ర పెరిప్లేస్ ను తెలుగులో అవిష్కరించిన- బందరు వాస్కోడిగామా శ్రీ సిలార్ -3
డయాస్ కోరిడా దీవి సాంబ్రాణి దేశపు రాజు ‘’చరిబయాల్ ‘’ఏలుబడిలో ఉంది .బియ్యం గోధుమలు ఇండియా వస్త్రాలు ,మహిళా బానిసలను తెచ్చి తాబేలు పై చిప్పలతో వస్తుమారకం బార్టర్ సిస్టం లో వ్యాపారం చేస్తారు .స్యాగారాస్ భూభాగం దాటాక ఒమన అనే సముద్ర పాయ,,ప్రక్కన విలువైన రాతి పర్వతాలు దాటి సచాలిటిక్ సాంబ్రాణి కొనటానికి ఒక నౌకాశ్రయం మొచ్చాచేరతారు .ఇక్కడ కూడా వస్తు మారక వ్యాపారమే . సాంబ్రాణి గుట్టలు గుట్టలుగా చూసి ఆశ్చర్యపోతాం .ఎలాంటి సైనిక రక్షణా ఉండదు.దేవుడే కాపాడుతున్నట్లు ఉంటుంది .ఇక్కడినుంచి చాలాదూరం వెడితే 7దీవులు వరుసగా కనిపిస్తాయి .ఇందులో మగదీవులు ఆడ దీవులు అని ఉన్నాయి మగ దీవుల్లో మగవారుమాత్రమే ,ఉంటారు ప్రతి మార్చి నెలలో వీళ్ళు అడ దీవికి వెళ్లి అక్కడ భార్యాపిల్లలతో మూడు నెలలు గడిపిమళ్ళీ వెళ్ళిపోతారు .ఆడపిల్లలు తల్లులవద్దె పెరుగుతారు మగపిల్లలు 14వ ఏడు దాకా తల్లుల వద్ద పెరిగి ,తండ్రులను చేరతారు .భార్యలు కనటం పెంచటం తప్ప ఇంక ఏనీ చేయరు .వాళ్లకు కావాల్సినవన్నీ మగాళ్ళే అందజేస్తారు .పళ్ళు మాత్రం ఏరుతారు . చాలాదూరం వెడితే సరపిస్ దీవి వస్తుంది .ఇక్కడ అరబ్బీ మాట్లాడే దుర్మార్గ ప్రజలుంటారు. నడుముకు తాటి ఆకులు కట్టుకొంటారు .తాబేటి చిప్పలు విరివిగా లభిస్తాయి .
పర్షియాసముద్ర తీరం ఉత్తర దిశగా ప్రయాణిస్తే కళాయి దీవుల సముదాయం వస్తుంది .ఇక్కడి వారు అనాగరికులైన దుష్టులు .అబ్దుల్ రజాక్ రాసినదాన్ని బట్టి ఇక్కడ ఎండమహాతీవ్రం .ఎముకల్లోని మూలుగ మాడి,మైనంలా కరిగిపోతుంది బాకుకు బిగించిన రత్నాలు మాడి బొగ్గు అవుతాయి .అధిక వేడిలన పుట్టిన పిల్లలు గుడ్డివారుగా పుడతారు .పర్షియన్ గల్ఫ్ ముఖద్వారం లో ముత్యాల శోధన జరుగుతుంది .ఇక్కడినుంచి పర్వతాలమధ్యనుంచి ప్రయాణం చేసి పర్షియన్ గల్ఫ్ చేరతారు .ఇక్కడ అపోలోగాస్ అనే మార్కెట్ చారక్స్ స్సాసిని ,యూఫ్రేటిస్ నదుల మధ్య ఉంది .
ఒమ్మన మార్కేట్ పట్టణం .రాజకీయంగా భౌగోళికంగా పర్షియాలో ఉంది .ఇండియానుంచి రాగి ఇక్కడికి ఎగుమతి అవుతుంది .టేకు ,,బ్లాక్ వుడ్,రెడ్ వుడ్ వంటి నాణ్యమైన కలప దొరుకుతుంది .వైన్ ఖర్జూరం బానిసలు బంగారం ఇక్కడ ముఖ్యవ్యాపారం .ఇక్కడి నుంచి 7రోజులు ప్రయాణిస్తే ,ఒరారియా మార్కెట్ టౌన్ వస్తుంది .మైదాన ప్రాంతం లో రాయల్ పాలస్ ఉంటుంది .పేరు రహం బాసియా .గోధుమలు బియ్యం సారాయి ఉత్పత్తి ఎక్కువ .ఇదిదాటితే భూమి తూర్పువైపుకు వంపుతిరిగి స్కైటికా జిల్లా తీర భూమి వస్తుంది .ఇది చిత్తడి నేల. ఇక్కడేనదులలో పెద్దదైన సింధు నది అపరిమిత జలరాశితో ఇండియన్ సముద్రం అనే ఎరిత్రేనియన్ సి లోకి ప్రవహిస్తుంది .ఈ నదీ జలాలవలన సముద్రం నీరు స్వచ్చంగా ఉంటుంది .పాములు ఎక్కువ ..ఈ నది ఏడు ముఖ ద్వారాలతో సప్త సింధు గా పిలువబడుతుంది .మధ్యపాయ ఒక్కటే నౌకాయానానికి అనువైనది .తీర౦లో బార్బారికం సంతపట్టణం ఉంది .సింధు ను గ్రీకులు ఇండస్ అంటారు సింధూ లేక మస్లిన్ పూర్వం ఇండియా –యూఫ్రటిస్ ల మధ్య జరిగిన వస్త్ర వ్యాపారానికి గుర్తు అని సియూ అనే చారిత్రకుడు చెప్పాడు .బార్బరికం రేవులో ఓడల్ని లంగరు వేసి సరుకును యేటిపాయద్వారానగరం రాజుకు చేర్చుతారు .బొమ్మలు అద్దిన నారబట్టలు పగడాలు,పుష్యరాగం శిలారసం ,గాజుపాత్రలు ,వెండి ,బంగారు పల్లాలు ద్రాక్ష సారాయి దిగుమతి అవుతాయి .సింధు నదికి అవతల ఉత్తరాన భూఖ౦డం లోకి ప్రవహిస్తూ నౌకాయానానికి పనికి రాని ఒక సముద్ర పాయ ఇరినాన్ వస్తుంది.తీరంలో ఇసుకతిన్నేలు టాయి .తీరం చేరకముందే నౌకలు ఇసుకమేటలకు తగిలి బద్దలౌతాయి .సముద్రం అడుగున రాతి బండలు ప్రమాదకారులు .లంగరుకు వీలు ఉండదు .ఆకుపచ్చ సముద్ర పాములు ఇక్కడి ప్రత్యేకత .
ఇక్కడ మరో మజిలీ చేద్దాం
సశేషం
మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -20-9-22-ఉయ్యూరు —