హిందూ మహాసముద్ర౦ లోఒకటవ శతాబ్దం లో ఒంటరిగా పడవ పై ప్రయాణించిన అజ్ఞాత నావికుని చరిత్ర పెరిప్లేస్ ను తెలుగులో అవిష్కరించిన- బందరు వాస్కోడిగామా శ్రీ సిలార్ –(చివరి భాగం )

హిందూ మహాసముద్ర౦ లోఒకటవ శతాబ్దం లో ఒంటరిగా పడవ పై ప్రయాణించిన అజ్ఞాత నావికుని చరిత్ర పెరిప్లేస్ ను తెలుగులో అవిష్కరించిన- బందరు వాస్కోడిగామా శ్రీ సిలార్ –(చివరి భాగం )
బరాకా అఖాతం దాటాక,ఇండియాకు –నమ్బనుస్ రాజ్య ప్రారంభం లో బరై గాజా ,ఆరికా దేశం తీరం ఉంది .మైదానప్రాంతం లో స్కైటికా ను ఆనుకొని ఉన్న ఈ భాభాగం అబిరియా గా పిలువబడుతోంది .ఈ తీరాన్ని సైరాష్ట్రెన్అంటారు అంటే సౌరాష్ట్ర అవచ్చు .అంటే గుజరాత్ .ఇది సారవంతం గోధుమలు బియ్యం నువ్వులు వెన్న నూలు ,ముతక ఇండియన్ వస్త్రాలు లభిస్తాయి ఇక్కడి పశువులు పచ్చిక బాగా మేసి బాగా పాలిస్తాయి .ప్రజలు పొడుగ్గా నల్లగా ఉంటారు .రాజధాని మిన్నగర నుంచి నూలు వస్త్రాలు వస్తాయి .ఇక్కడ అలేగ్జాండర్ దండ యాత్ర గుర్తులు ,పూర్వపు ప్రార్ధనా మందిరాలు ,కోట గోడలు నీటి బావులు చూడచ్చు .నామ్బనుస్ అంటే శకరాజ్య పాలకుడు ‘’సహపణ’’కావచ్చు.
అష్ట కంప్రకు 3వేల స్టాడియాల దూరం లో ని పాపిక దాటాక ,మరొక సింధు శాఖ –గల్ఫ్ వస్తుంది .ఇక్కడ బయోన్స్ దీవి ,దాని ముఖద్వారం వద్ద మయాస్ నది కనిపిస్తాయి .ఇక్క డ అడ్డంగా ప్రయాణం చేయాల్సిందే. బయోన్స్ కు ఎదురుగా నమ్మడస్ నది ఉంది .ఇదే నర్మదానది .దీన్నే పెరిప్లస్ రచయిత నమ్మ డస్ అన్నాడు .గల్ఫ్ ఇరుకుగా ఉండటం వలన సముద్రయానం కష్టం .పాపిక గా పిలువబదేఅష్ట కంప్ర కు ముందు భాగం ఎడమవైపు సముద్రం లోకి చొచ్చుకొని పోయి అలలతాకిడి ఎక్కువై లంగరు వేసిన పడవల తాళ్ళు తెగిపోతాయి .అందుకని స్థానిక రాజు నియమించిన మత్స్యకారులు తమ పడవల్లో సైరాష్ట్రెన్ అంటే సూరత్ వరకు దారి చూపిస్తారు .
ఇండియా మొత్తం మీద సముద్రపు అటు పోట్లు గురయ్యే అనేక నదులున్నాయి .బైరేగాజవడ్డ పోట్లు మరీ ఎక్కువ .అనుభవం లేని నావికులకు కష్టమే .నిలువుగా ప్రయాణిస్తే నౌకలు అడ్డం తిరిగి నీటిలో ఇరుక్కుపోయి బ్రద్దలై పోతాయి .బైరై గాజా కు లోపల ఉన్న బుసేఫలుస్ అలెగ్జాండ్రియా లో అరట్టి,అరచ్చోసి ,గండ్రాయి పోక్లాయిస్ తెగలు జీవిస్తారు .యుద్ధ ప్రియులైన బాక్ట్రేయిన్లురాజు కు లోబడి ఉంటారు .అలేగ్జాండర్ డమరిక దక్షిణ ఇండియా తప్ప అన్ని ప్రాంతాలను గంగానది వరకు ఆక్రమించాడు .గ్రీకులైన ద్రాచ్మే ప్రజలు ఇప్పటికీఅక్కడే ఉంటున్నారు .అలేగ్జాండర్ తర్వాత గ్రీసును పాలించిన అపోలో డోటస్,,మీనం డర్ ల శిలా విగ్రహాలున్నాయి .అరచ్చోసి అంటే కాందహార్ .ఈ బెలూఫస్ నగరమే జీలం నగరం అన్నాడు విన్సెంట్ స్మిత్ .అలేగ్జాండర్ కు అత్యంత ప్రియమైన గుర్రం పేరే బుసాఫెలాస్ .అది ఇక్కడే చనిపోతే దానిపేరనగరం నిర్మించాడు .మినాండర్ ను అలేగ్జాండర్ గా పొరబడ్డాడు పెరిప్లస్ రచయిత .అపోలో డ్రోటస్ తమ్ముడు మిలాండర్ సౌరాష్ట్ర పశ్చిమ తీరాన్ని ఆక్రమించి మధుర చిత్తోడ్ ,పాటలీ పుత్రాలను లోబరచుకొని మళ్ళీ స్వదేశం బాక్ట్రియా వెళ్ళిపోయాడు .బౌద్ధంలోకి మారి మిలిందుడు అయ్యాడు .మిలింద ప్రశ్నలు మిలింద పన్హా బౌద్ధ సాహిత్యాలే . ఇక్కడినుంచి తూర్పుకు వెడితే ఒకప్పటి రాజధాని ఒజేన్ వస్తుంది. ఇక్కడి నుంచి సరుకు రవాణా అవుతుంది .ఇందులో గో మేధికం ,గురువింద రత్నాలు ,రవ సేల్లాలు మల్లు గుడ్డలు జటామాంసి లు దిగుమతి అవుతాయి .ఆధునిక ఉజ్జెయిన్ అప్పటి పేరు ఒజేన్ .దీని ఆనుకొని ఉన్నదే సిప్రా నది .ఫోర్ గ్రేట్పవర్స్ ఆఫ్ ఇండియాలో అవంతీ రాజ్యం ఒకటి .బుద్ధుడి ముఖ్య శిష్యుడు కాచానా ఇక్కడే ఉజ్జయినిలో పుట్టాడు .జటామాంసి హిమాలయ ప్రాంతమొక్క. సువాసన నూనెల తయారీలో వాడతారు .
ఒజేన్ పట్టణానికి ,ఇటలి ,లోడేషియా,అరేబియా దేశాలకు రాగి తగరం ,సీసం పగడం ,పుష్యరాగం ,అన్నిరకాల వస్త్రాలు నడుం బెల్ట్ లు అద్దాలు కంటి సుర్మా,వెండి బంగారు నాణాలు ,ఆయింట్ మెంట్లు ఒజేన్ మార్కెట్ కు దిగుమతి అవుతాయి .
బైర్గాజా దాటాక వచ్చేదాన్ని ‘’దచ్చిన బదేశ్ ‘’అంటారు .అంటే దక్షిణ దేశం .ఇక్కడ పెద్ద పర్వతాలు ,ఎడార్లు క్రూరమృగాలు ,కోతులతో గంగానది వరకు కనిపిస్తాయి .ఇక్కడి నుంచి 20 రోజులు ప్రయాణిస్తే పైధాన్,మరో పది రోజులు ప్రయాణం లో తగర అనే రెండు సంత పట్టణాలు వస్తాయి .కురువింద రత్నాలు ఇక్కడ ప్రత్యేకం .పైధాన్ అంటే ప్రతిష్టానపురం .పులమావి రాజధాని అని టోలమీ చెప్పాడు .వస్త్ర పరిశ్రమకు కేంద్రం .
ఇవి దాటి వెడితే సుప్పార ,కల్లియాన నగర భారీ సంతలు వస్తాయి .లంగరుకు వీలుపడదు .సుప్పార అంటే బొంబాయి దగ్గరున్న సోపారా ఒకప్పటి కొంకణ రాజధాని .కల్లియాన అంటే కళ్యాణ్ నగరమే .కళ్యాణ్ దాటాక సేమైల్లా ,మండగోరా వగైరా పట్నాలు.ఇక్కడి కేనేటి దీవులలోసముద్ర దొంగలుంటారు .మండగోరాంటే,సావిత్రీ నది ముఖద్వారం లో ఉన్న బంకోట్ నగరం .ఇది మత్స్యకార గ్రామం .పూర్వం వ్యాపార కేంద్రం. కలప రవాణా జరిగేది .సేరె బోత్రా రాజ్యం లో ఉన్న టైన్ డిన్ గ్రామం .సరుకు ఉన్న ఒడలతో కిటకిట లాడుతుంది .దీనికి దగ్గరలోని సెల్ సిండా పాండ్య రాష్ట్ర భాగమే .
రక్షణ ఉన్న రహదారులతో ,స్థానికంగా నిర్మించిన ద్రావిడ దేశపు ఒడలలో సౌత్ ఇండియాలోనే కాక ,పర్షియన్ గల్ఫ్ ,అరేబియా ,ఆఫ్రికా దేశాల సముద్రతీరాలలో వ్యాపారం గొప్పగా సాగేది .సరుకులమార్పిడితో పాటు భావాల మార్పిడీ జరిగేది .ఇదంతా క్రీపూ 5వ శతాబ్దికే జరిగిందని బౌద్ధ వాజ్మయం ద్వారా తెలుస్తోంది .12వ శతాబ్ది తుడేలా నివాసి బెంజమిన్ చేర అనబడే కేరళ తీర సముద్ర వ్యాపారం గురించి ,స్థానికరాజు వ్యాపార సరుకులకు కల్పించిన రక్షణ గురించి ‘’సూర్యారాధకుల దేశానికి మొదట్లో ఉన్న ఖులం అంటే క్విలన్ 7రోజుల ప్రయాణ దూరం .వీరు కుష్ కుమారులు నల్లగా ఉంటారు నక్షత్రజ్ఞానం ఉన్నవారు నిజాయితీ పరులు .రాజు కార్యదర్శులు వచ్చి ,వ్యాపారుల పేర్లు నమోదు చేసుకొని రాజు వద్దకు తీసుకు వెళ్లితే వారి సరుకులకు రాజు రక్షణ కల్పించటం ఇక్కడ ఆచారం.పాండ్యరాజ్యం ప్రస్తుత తిరునల్వేలి దాకా ఉండేది .రాజధాని కొరకే నుంచి మధురకు మార్చబడింది .
నదీ తీరం లో బకారే అనే మరో ప్రాంతం ఉంది ఇక్కడ పాములెక్కువ .నల్లగా ఎర్ర కళ్ళతో ఉంటాయి .అలేప్పీ రేవు నిర్మాణం కావటంతో పోరకాడ్ రేవు ప్రభావం తగ్గింది .పోర్చుగీసులు తర్వాత డచ్ వారు ఇక్కడ ఆవాసాలేర్పరచుకొన్నారు అని ట్రావర్నియర్ యత్రికుడు పోర్కా పేర్కొన్నాడు .మిరియాలు ,మల బాత్రుం కొనుగోలుకు రాజులు మార్కెట్ పట్టణాలకు పెద్ద ఓడల్ని పంపి ,నాణాలు ,టోపాజ్ ,అద్దకం బట్టలు అంటిమొని అనే కళ్ళమందు సుర్మా ,పగడం ,సిందూరం అంటే రియాల్గర్ ఒర్పిమేంట్ గోధుమలు దిగుమతి చేసుకొంటారు. కొత్తనారా జిల్లాలో మాత్రమె లభించే మిరియాలు ఇక్కడి నుంచి ఎగుమతి అవుతాయి .ముత్యాలు సిల్క్ బట్టలు జటామాంసి ,రంగు రాళ్ళు వజ్రాలు నీలాలు తాబేటి చిప్పలు భారీగా ఎగుమతి చేస్తారు రోము దేశపు మేలిమి బంగారు నాణాలు వస్తు మార్పిడి కింద ఇచ్చేవారు .మన చేతి రుమాళ్ళు రోమన్ చక్రవర్తికి పూర్వమే విపరీతంగా అమ్ముడయ్యేవి .బంగారు నాణాలు మన దక్షిణదేశ రేవు పట్నాలైన పెనుగంచిప్రోలు ఘంటసాల ,విజయవాడలోని విద్యాధరాపురం దగ్గర త్రవ్వకాలలో బయట పడ్డాయి .2002లో నందిగామ తాలూకా పెనుగంచిప్రోలులో పెద్దింటమ్మ గుడి సత్రంపునాదులు తవ్వుతుంటే మట్టి కుండల్లో 59బంగారు రోమునాణాలు దొరికాయి .నికోలాకో౦టీ చెప్పినట్లు ‘’ఇండియన్ వజ్రాలు పర్వతాలమీద లోయలలోకి మాంసం ముద్దలు విసరటం వలన దొరుకుతాయి .ఇక్కడ విష సర్పాల భయం వలన జనం అక్కడికి వెళ్లరుకాబట్టి ‘’.
సముద్రపు గాలుల మీద హిప్పాలాస్ పరిశోధన సుమారు 45ఏళ్ళు రోముకు ఓడ వ్యాపారం లో కొత్తశకం ప్రారంభమైంది .పెరిప్లస్ కాలం లో మలక్కా మలబార్ సొమాలి, సౌత్ అరేబియా ఆడులిన్,బెరినైస్ రేవులలో సరుకులు చేతులు మారేవి .బకారే దాటాక ముదురు ఎరుపు రంగు పర్వతాలున్న బాలిటా, ,తర్వాత వరాలియా జిల్లా కనిపిస్తాయి.ఇక్కడ మంచి హార్బర్ ఉంది దీనితర్వాత కొమరి అంటే కేపాఫ్ కొమరిన్ కన్యాకుమారి నౌకాశ్రయం ఉంది .జీవితాన్ని ప్రశాంతంగా గడపటానికి సముద్ర స్నానాలు చేస్తూ ,బ్రహ్మ చర్యం పాటి౦చాలనుకొనె పురుషులు స్త్రీలు ఇక్కడికి వస్తారు .కొమరి పడమర కొల్చి అంటే కొచ్చిన్ దాకా వ్యాపించింది .పెరల్ ఫిషరీ కి కేంద్రం . పాండ్యరాజ్యభాగం ..దీనితర్వాత లోతట్టున ఆర్గారు పట్టణం ఉంది .ఏరిన ముత్యాలు ఇక్కడికి మాత్రమె చేరుస్తారు .రవ సేల్లాలు మజ్లిన్స్ ఇక్కడ నుండి ఎగుమతి అవుతాయి .దక్షిణ ద్రావిడులు చురుకైన వ్యాపారులు .శ్రీలంకలో వలస రాజ్య స్థాపకులు ,లంకీయులతో తగాదాలున్నా పెరల్ ఫిషరీస్ ను లంక వాయవ్య తీరంవరకు రాజ్యం విస్తరింప జేశారు .ఇక్కడున్న మహేంద్ర పర్వతం నుంచి దూకి హనుమాన్ లంకలో సీతమ్మను చూశాడు .పెరిప్లస్ కాలానికి పాండ్య చేర చోళ రాజ్యాలలో చోళ రాజ్యం బహు సంపన్నమైనది కూడా .చేర మండలం నుంచే కోరమండలం పదం వచ్చింది సారసీనులు మాబార్ అన్నారు అదే మలబార్ అయింది .అంటే రేవు పట్టణం .
డమరిక మరియు ఉత్తరం నుండి ఓడలు వచ్చే ఈ దేశ మార్కెట్ పట్టణాలు ,హార్బర్లు వరుసగా కామర ,పొడుక ,సోపట్మా .’సంగారగా అనే చెక్క దుంగలు పేర్చి నిర్మించిన అతి పొడవైన పెద్ద ఓడలు ,కరిసే మరియు గంగానది వరకు ప్రయాణించే కోలండియాపెద్ద ఓడలు ఉంటాయి ,వరాలియాకు వెళ్ళాల్సిన సరుకును ఇక్కడే దింపుతారు .బెంగాల్ నుంచి ఇక్కడికి ఓడలు వచ్చేవి .రఘుమహారాజు అయోధ్యనుంచి బయల్దేరి తూర్పు ముఖంగా సముద్రందాకా వెళ్లి తమ స్వంత నౌకలబలం మీద నమ్మకం ఉన్న బెంగాలీలను జయించాడని కాళిదాసు రఘు వంశం లో రాశాడట ..పెరిప్లేస్ చెప్పిన కమరను ఇప్పుడు కరికాల్ అంటారు .సుపట్న అంటే మంచి పట్నం .ఇదే మద్రాస్ .కొల౦డియా ఓడలు మలబారులో తయారవుతాయి .ఈ తీరరేవుల్లో ఓడలు సరుకులతో నిండి అవి గాలికి రెక్కలు కట్టుకొన్నట్లు నీటిపై తేలుతూ వెడుతూ వస్తుంటే బహు అందంగా ఉంటాయి అని వర్ణించారు .
సోపట్మా దాటాక ప్రవాహం తూర్పుకు మళ్ళి ,పడమరగా వలేసి ముండు దీవి వస్తుంది .దీన్ని తాప్రబాన్ అనే వారు .సముద్ర దక్షిణభాగం క్రమగా పడమరకు మారి ఎదురుగా ఉండే అజానియా తీరం చేర్తుంది. ఇక్కడ ముత్యాలు రంగురాళ్ళు మస్లిన్ ఉత్పత్తి అవుతాయి .శ్రీలంకను మొదటవలస దేశంగా చేసుకొన్న విజయ్ అనేరాజు తానుకాలు పెట్టిన ప్రదేశానికి తాప్రబ అంటే తామ్రపర్ణి అని పేరు పెట్టాడు .అంటే రాగిలాగా ఎర్రగా ఉండేది. గంగానదిముఖద్వారం వద్ద ఉన్న ఓడరేవు తామ్రావిప్తి అశోకుని గిర్నార్ శాసనం లో పాళీ భాషలో టాంబ పన్ని అని ఉంది లంకకు వైదికనామం రావణ లంక .లంకలో ఆదిమకాలం లో మనుష్యులు లేరని అదృశ్య శక్తుల ,నాగుల అధీనంలో దేశం ఉండేదని అప్పుడే వివిధ దేశాలతో వ్యాపారాలు జరిగాయని ,అదృష్యశాక్తులు కనబడకుండా ఉండేవి వ్యాపారం అరిగినప్పుడు వస్తువుల ఖరీదును తెలిసేట్లు చేస్తూ ఉంటె వ్యాపారులు దానికి తగిన డబ్బు అక్కడ పెట్టి తీసుకు వెళ్ళేవారని చైనా యాత్రికుడు ఫాహియాన్ రాశాడు .మెక్సికో లో కూడా ఇలానేజరిగేది
ఈ తీరం చుట్టి చాలాదూరం వెడితే మసాలియా మైదానం వస్తుంది ఎక్కడ మస్లిన్ వస్త్రాలు భారీగా ఉత్పత్తి చేస్తారు .ఇక్కడినుంచి ఒక సముద్రపాయ దాటితే దోసరినిక్ ఉత్పత్తిగా చెప్పే ఏనుగుదంతాలు దొరికే దోసరెన్ వస్తుంది .ఇక్కడినుంచి ప్రవాహం ఉత్తరానికి సాగుతుంది ఇక్కడ అనేక ఆటవిక తెగలున్నాయి .బాగా అనాగరికులు .మగవాళ్ళ ముక్కు చదునుగా ఉంటుంది .బార్గిసి తెగ ప్రజల ముఖాలు గుర్రాన్ని పోలిన పొడవైన ముఖాలు కలిగి ఉంటారు .వీరు నరమాంస భక్షకులు .టోలమీచెప్పిన మైసోలియా అంటే కృష్ణా నది సంస్కృతంలో మౌసల మసాలియాగా మారింది. అదే మచిలీ పట్నం మసాలియా అనే బందరు లో నౌకలు లంగరుకు అనువైనది .ఇక్కడినుంచి పెగూ సయాం , ,అరకాన్ బెంగాల్ ,కొచ్చిన్ చైనా ,మక్కా మడగాస్కర్ ,సుమత్రా మనిలా దీవులకు రెగ్యులర్ గా ఓడలు సరుకులతో నడిచేవి అని టవర్నయిర్ రాశాడు .మసాలియాలో చేనేత వస్త్రాల ఉత్పత్తి ఎక్కువ అని పెరిప్లస్ లో ఉంది. కుంచెలతో రంగులు అద్దేవారని టవర్నియర్ రాశాడు .డోసరెన్ అంటే ఆధునిక ఒరిస్సా .ఇండియాకు పవిత్రభూమిగాచేప్పబడింది .డోసరిన్ అంటే మహానది .ఇది ఏనుగు దంతాలకు ప్రసిద్ధి .సిక్కిం మొరుంగ్ ప్రాంతంలోనిభోటో తెగను కిరాతకులు అంటారు .చాలాకాలంస్వంతరాజ్యం ఏలారు .భూటాన్ పేరుతొ భోటా ఉంది .బార్గిసి ని విష్ణుపురాణం లో కిరాతకులన్నారు యుద్ధ ప్రియులు .
ఇక్కడి కిరాతకుల పాలిబడ కుండా ముందుకు వెడితే ,సముద్రప్రవాహం తూర్పుకు మారి,కుడివైపుకు ప్రయాణిస్తే ఎడమవైపు గంగానదిదర్శనమిస్తుంది .దీని చివర క్రిసే భూమి దగ్గరలో తూర్పులో నైలునదిలాగా ప్రవహించే గంగానది ,దాని ఒడ్డున మార్కెట్ పట్టణం ఉంది. ఇక్కడి నుంచే జటామాంసి మల బాత్రుం ముత్యాలు ఎగుమతి అవుతాయి. బంగారు గనులు కూడా ఉన్నాయి .కల్టీస్ అనే బంగారునాణాలు చలామణిలో ఉంటాయి ఈ నదికి ఎదురుగా ఉన్నదీవిలో జనం ఉంటారు .సూర్యుడు ఉదయించే చివరి దీవి ఇదే .మలక్కా పీఠభూమినే కిసే అంటారు .
ఇది దాటి ఉత్తరంగా వెడితే దినే నగరం ఉంది ఇక్కడికి బాక్ట్రియానుంచి బైరై గాజా వరకు ప్రజలు కాలినడకన సిల్కుదారం సిల్కు బట్టలు మోసుకోస్తారు. అవి డమరిక కు ఎగుమతి అవుతాయి .చైనావ్యాపారం సింధునది ముఖద్వారం వరకే .చైనా యాత్రికుడు ఫాహియాన్ తామ్రలిప్తిలో రెండేళ్ళు గడిపి అక్కడినుంచి పెద్ద సబురు అంటే వ్యాపార ఓడ ఎక్కి నైరుతిదిశగా ప్రయాణించి సింహళం చేరాడు .
ప్రతి సంవత్సరం దిస్ భూభాగానికి దాని సరిహద్దులనుండిపొడవైన చదునైన ముఖాలున్న శాంతియుత జీవితం గడిపే పూర్తీ అనాగరక బిసటేప్రజలు వస్తారు .ఆకుపచ్చని ద్రాక్ష తీగ ఆకుల్లాంటి ఆకులు మడతబెట్టి న బుట్టల్ని మోస్తూ భార్యా పిల్లలతో వస్తారు ఆ ఆకుల్ని భూమిపై పరచి అక్కడే చాలాకాలం విందు వినోదాలతోగడిపి మళ్ళీ స్వంత ఊళ్లకు వెడతారు .వాళ్ళు వెళ్ళాక స్థాకులు ఆ చాపలను సేకరించుకొంటారు .వాళ్ళు నారతో అల్లిన జడ లనుండి ఆకులు ఏర్తారు దాన్ని పెట్రి అంటే పత్రీ అంటారు .ఆకుల్ని పొరలుగా పేర్చి బంతులుగా చుట్టి చాపల నారతో పిండుతారు .పెద్ద ఆకుల్తో చేసినవి మలబాత్రుం అంటారు .బిసటే ప్రజలు టిబెట్ బర్మా లకు చెందినవారు .ఆధునిక కుకి ,చిన్ నాగ్ తెగలకు అనుబంధ తెగలు .చెట్లు ,పాముల్ని పూజిస్తారు .
ఈ ప్రదేశందాటి అక్కడి అత్యధిక శీతల వాతావరణం లో శీతాకాల ఋతువులలో సముద్ర ప్రయాణం కుదరదు .దైవీ శక్తి ప్రభావం వల్లనే ముందుకు వెళ్ళగలరు .సిక్కిం దాటాక ప్రయాణం ప్రాణా౦తకమె .
కనుక మనం కూడా ముందుకు పోకుండా ఆ దైవీ శక్తులను నమ్మి’’ పీచే మూడ్’’ అవుదాం .నాతొ ఇంతదాకా ప్రయాణం చేసిన వారందరికీ ధన్యవాదాలు .
ఒరిజినల్ లోని పేరాలలో 66పేరాలను మాత్రమె సిలార్ గారు గ్రంధ విస్తరణ భయంతో అనువదించారు .ప్రతిపేరా అనువాదం తర్వాత వివరణలు ఇస్తూ ఆపెరాలోని మనుష్యుల ప్రదేశాల పేర్లు ఈ కాలం లో ఏయే పేర్లతో పిలుస్తున్నారో వస్తువుల పేర్లు ఎలామారాయోవాటికి ఎందుకు ఉపయోగిస్తారో ,సవివరంగా ఎనక్డోట్స్ తో సహా అందించారు .గోదారిలో రాదారి పడవలో పిల్లగాలులపై కమ్మ తెమ్మెరాలలో సాగే హాయైన ప్రయాణం లా సాగింది రచన .హాట్సాఫ్ టు జనాబ్ సిలార్ సార్ .వీరు ఇదివరకే తరతరాల బందరుచరిత్ర ,కృష్ణాజిల్లా చరిత్ర ,మచిలీ పట్నం సర్వస్వంది,విసీమ సర్వస్వం, కృష్ణా జిల్లా జమీందారులు గ్రంథాలు రాసి విఖ్యాతులైనవారు. ఆ అనుభవంతో దీన్ని సునాయాసంగా రాశారు .మనకెవ్వరికీ తెలీని ఒకటవ శతాబ్ది చరిత్ర ను అందించిన సిలార్ గారు మిక్కిలి అభినందనేయులు .మన సాహితీ బన్ధువులకుఏ విషయాలన్నీ తెలియజేయాలని ఇంత వివరంగా ఇంతటి సుదీర్ఘంగా రాశాను .మనసారా ‘’బందర్ వాస్కోడగామా’’ ,’’బందర్ చరిత్ర చతురానన’’ జనాబ్ మహమ్మద్ సిలార్ గారిని అభినందిస్తూ శుభాశీస్సుల౦దిస్తున్నాను
మీ- గబ్బిట దుర్గా ప్రసాద్ -21-9-22-ఉయ్యూరు .

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in పుస్తకాలు, సమీక్ష and tagged . Bookmark the permalink.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.