మనం మరచిపోయిన ఆధునిక రాయల సీమ కవీశ్వరులు -9
· 26-తెలుగు ,హిందీ కవి అనువాదకుడు లెక్చరర్ ,క్రీడా శిర్దేశ్వర ,సాయి శతకకర్త –శ్రీ దావూద్ సాహెబ్ షేక్
· దావూద్ సాహెబ్ షేక్ తెలుగు రచయిత. ఆయన కర్నూలు ఉస్మానియా కళాశాలలో తెలుగు- హిందీ పండితులుగా విద్యాబోధన చేస్తూనే తెలుగు భాషాభివృద్ధి ధ్యేయంగా పలు కార్యక్రమాలను నిర్వహించారు. తెలుగులోకి పలు ఇతర బాషా గ్రంథాలను అనువదించి ప్రచురించారు. చివరి దశ వరకు తెలుగులో రచనలు గావించారు.
జీవిత విశేషాలు
దావూద్ సాహెబ్ షేక్ కర్నూలు జిల్లా చిట్వేలు గ్రామములో ఖాదర్‌బి, సుల్తాన్ సాహెబ్ దంపతులకు జూలై 1 1916 న జన్మించారు. చిన్న నాటనే తల్లిదండ్రుల్ని కోల్పోయి, జీవనయానంలో బ్రతుకు తెరువుకై నెల్లూరు చేరుకొన్నారు. అక్కడ రూపాయిన్నర పెట్టుబడితో ట్రంకురోడ్డులో పెట్టుకొన్న కిళ్లీ కొట్టు తెలుగు సాహిత్యం పట్ల అతనిలో తొలి బీజాంకురం వేసింది. అలనాటి సుప్రసిద్ధ నెల్లూరు కవులు మరుపూరు కోదండరామిరెడ్డి, పిలకా గణపతిశాస్త్రి, బెజవాడ గోపాలరెడ్డి, రేవురు సుబ్బారావు, జక్కా సుధాకరం వంటి వుద్దండులు ప్రతి సాయంత్రం ‘సాహిత్య తాంబూల సేవన మంజూషా” (కిళ్లీ కొట్టుకి కవులు పెట్టుకున్న ముద్దు పేరు) వద్దకి చేరటం, తమతమ పద్య రచనా పఠనం గావించటం దావూదు కవిలో సాంప్రదాయక పద్యరచన పట్ల ఆసక్తిని పెంచిన విషయాలు. తనకు తొలి ఆడబిడ్డ పుట్టిన పిదప ఆయన ఆనాటి సంస్కృతాంధ్ర పండితులైన దుర్భా సుబ్రహ్మణ్యశర్మ గారిని ఆశ్రయించి తన 22వ యేట విద్యాభ్యాసానికి వొడిగట్టారు. అప్పటి పండిత వర్గం శర్మగారి వద్దకు చేరి ‘సాయిబుకు సంస్కృతం నేర్పుతున్నావటగా! ఇక రాళ్లదెబ్బలకు సిద్ధంగా వుండు’ అంటూ అవహేళన చేశారట. అయితే సంస్కృతాంధ్ర భాషల్లో మదరాసు విశ్వవిద్యాలయం ద్వారా విద్వాన్ పట్టా పుచ్చుకొని వుత్తరోత్తరా నంద్యాల పురపాలక పాఠశాలలో తెలుగు పండితుడుగా చేరిన పిదప తన తొలి మాసం వేతనాన్ని గురువుగారి పాదపద్మాలకి గురుదక్షిణగా మనియార్డరు ద్వారా సమర్పించుకున్నారు దావూదు కవి. ఆ మనియార్డరు చేతపుచ్చుకుని తనను దెప్పి పొడిచిన పండిత మిత్రుల్ని సమావేశపరచి ‘ఇదుగోనండీ! నా సాయిబు శిష్యుడు విసిరిన తొలి రాయి’ అంటూ దాన్ని అందరికీ చూపి పొంగిపోయారట దుర్భా సుబ్రహ్మణ్యశర్మ గారు. ఆ గురు శిష్యుల ఆత్మబలం అటువంటిది [1]. పిదప కర్నూలు ఉస్మానియా కళాశాలలో దాదాపు 30 సంవత్సరాలు తెలుగు- హిందీ పండితులుగా విద్యాబోధన గావించారు. అరబిక్, ఉర్దూ, తెలుగు భాషల్లో మంచి విద్వత్తును సంపాదించిన ఆయన తెలుగు భాషాభివృద్ధి ధ్యేయంగా పలు కార్యక్రమాలను నిర్వహించారు. తెలుగులోకి పలు ఇతర బాషా గ్రంథాలను అనువదించి ప్రచురించారు. ఈయన రచనలపై తెలుగులో రెండు, ఉర్దూలో ఒక పి.హెచ్.డి. పరిశోధనలు జరిగాయి. చివరి దశ వరకు తెలుగులో రచనలు గావించారు. ఈయన 1994లో మరణించాడు.
రచనావ్యాసంగము
- చిత్త పరివర్తనము
- దాసీపన్నా (1956)
- రసూల్ ప్రభువు శతకము
- సంస్కార ప్రయాణము (1957)
- సూఫి సూక్తులు
- సంత్‌వాణి
- అల్లా మాలిక్ శతకము
- సఖుడ (శతకం)
- క్రీడాషిర్డీశ్వరము
- సాయి శతకము
- సాయిబాబా దండకము
- సాయిబాబా చరిత్రము (కావ్యము)
- అభినవ తిక్కన కవితా సమీక్ష (వచనం)
- నాగూర్ ఖాదర్ వలీ చరిత్రము
- ఆజాదు చరిత్రము
- ఆదర్శము (నవల)
- అబ్దుల్ ఖాదర్ జీలాని
- గౌసుల్ ఆజం దస్తగిరి దివ్య చరిత్ర (వచనం)
- చంద్ర వదన మోహియార్ (ఖండ కావ్యము)
- కదిరి సమాధి గాథ
27-నేత్ర వైద్యుడు ,సాహిత్య పోషకుడు ,నవలా నాటక కదా రచయితా –శ్రీ గుంటుపల్లి రాదా కృష్ణమూర్తి
· గుంటుపల్లి రాధాకృష్ణమూర్తి కళాభిమాని, సాహిత్య పోషకుడు, రచయిత, ప్రముఖ నేత్రవైద్యుడు. ఆంధ్రప్రభ సచిత్ర వారపత్రికలో వైద్యవిజ్ఙానం శీర్షిక ద్వారా ఇతడు పాఠకులకు చిరపరిచితుడు[1].
బాల్యం
ఇతడు గుంటూరు జిల్లా, లోని నరసరావు పేట గ్రామంలో నందవరీక నియోగి కుటుంబంలో 1930, మార్చి 25న తేదీన జన్మించాడు. ఇతని తండ్రి గుంటుపల్లి శ్రీనివాసరావు కవి. అతడు రుక్మిణీ కళ్యాణము, జానకీ పరిణయము మొదలైన కావ్యాలను వ్రాశాడు. రాధాకృష్ణమూర్తి తన అన్న గుంటుపల్లి శ్రీరామమూర్తి వద్ద మద్రాసులో పెరిగి పెద్దయ్యాడు.
విద్య, ఉద్యోగం
ఇతడు మద్రాసులోని పచ్చయప్ప కళాశాలలో చదివి 1949లో బి.ఎస్.సి పట్టాను పొందాడు. తరువాత మద్రాసులోని వైద్యకళాశాలలో 1954లో ఎం.బి.బి.ఎస్. డిగ్రీని, 1956లో ఆఫ్తాల్మాలజీలో డిప్లొమాను సంపాదించాడు. 1961లో ఎం.ఎస్. పట్టాను సాధించాడు. 1956లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వైద్యశాఖలో అసిస్టెంట్ సివిల్ సర్జన్‌గా ఉద్యోగం ప్రారంభించాడు. కర్నూలు, వరంగల్లు వైద్య కళాశాలలో అసిస్టెంట్ ప్రొఫెసర్ ఆఫ్ ఆఫ్తాల్మాలజీగా పనిచేశాడు. 1965లో అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రికి నేత్రవైద్యుడిగా బదిలీ అయ్యాడు. తరువాత ప్రభుత్వ ఉద్యోగానికి రాజీనామా చేసి అనంతపురంలో స్వంత నేత్రవైద్యశాలను స్థాపించి పేరు ప్రఖ్యాతులు పొందాడు. అనేక గ్రామాలు, పట్టణాలలో నేత్ర శిబిరాలు నిర్వహించి రమారమి లక్ష మందికి కంటి శుక్లాల ఉచిత శస్త్ర చికిత్సలు చేశారు.రోటరీ అంతర్జాతీయ సంస్థలో జిల్లా గవర్నరుగా సామాజిక సేవ చేశారు.జస్టిస్ ఆవుల సాంబశివరావు గారిచే నేత్రదాత బిరుదు అందుకున్నారు.
రచనలు
ఇతడు మద్రాసులో ఎస్.ఎస్.ఎల్.సి చదువుతున్నప్పుడే తెలుగు ఉపాధ్యాయుడు గరిమెళ్ల సత్యగోదావరిశర్మ వల్ల ఆంధ్రసాహిత్యం పట్ల మమకారం ఏర్పడింది. ఇతని తొలి రచన సుదినం 1946లో ఆంధ్రమహిళ మాసపత్రికలో అచ్చయ్యింది. అది మొదలు ఇతడు చిత్రగుప్త, నవజీవన, ఆనందవాణి, జయశ్రీ, కిన్నెర, ఆంధ్రప్రభ, ఆంధ్రజ్యోతి, ఆంధ్ర విద్యార్థి మొదలైన పత్రికలలో కథానిక[2]లు, వ్యాసాలు, నాటికలు, పద్యాలు, గేయాలు, శీర్షికలు వరుసగా ప్రకటించాడు. ఆంధ్రప్రభ సచిత్ర వారపత్రికలో ఇతడు నిర్వహించిన వైద్యవిజ్ఞానము, తెలుగు కలాలు శీర్షికలు పాఠకుల మెప్పును పొందాయి. “గుంటుపల్లి సూక్తి గురుడ వినర” అనే మకుటంతో 200 పద్యాలను వ్రాశాడు.
ఇతని రచనలలో కొన్ని:
నవలలు
· గెలుపు
· ప్రకాశము – ప్రేమ
· చక్కని చుక్కలు
· సిస్టర్ సుమతి
· అన్వేషణ
నాటకాలు/నాటికలు
· ఓట్లవేట
· టోకరా
· ప్రేయసి
· వన్‌టూత్రీ
· మరో జవహర్
ఇతర గ్రంథాలు
· చందమామ యాత్ర
· హాస్యకుసుమాలు
· హక్కులు – విధులు[3]
· కళ్లను కాపాడుకోండి[4]
· విజ్ఞాన విశారదులు (5 భాగాలు)
· ఆరోగ్యమే మహాభాగ్యము
· సంఘజీవనము
· జ్ఞానపంచమి
· విజ్ఞానం
· వైద్యవిజ్ఞానము[5] (ఆంధ్రప్రభ ఫీచర్)
కథలు
· కుబేరపుష్పకము
· మనసు మలుపుల్లో
· లాటరీచీటీ
· షష్టాష్టకం
· దోమతెర తగాదా
· అనందం
· అలవాటు
· ఆమె త్యాగం
· ఉద్యోగం సద్యోగం
· 28-పుట్టపర్తి వారి శిష్యుడు ,నటుడు ,రెవెన్యు ఇన్స్పెక్టర్ ,కవి సుధాకర ,గాన కలాధర –శ్రీ ఎస్.రాజన్నకవి
· యస్.రాజన్నకవి పండితులు[1],[2] చిన్నజమాలప్ప, సాలమ్మ దంపతులకు
…